ఆ రోజున గురువు ధనూరాశి 14 వ డిగ్రీమీదున్నాడు. రాహువు కన్య 14 వ డిగ్రీ మీదుంటూ, గురువుతో ఖచ్చితమైన కేంద్రదృష్టిలో ఉన్నాడు. గురువు శుక్రనక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు నీచకుజునితో కలసి కర్కాటకంలో ఉన్నాడు. రాహువు సూర్యుని మ్రింగడానికి సిద్ధంగా ఉన్నాడు. కేతువు, గురువును సూచిస్తూ, చంద్రునితో కలసి సూడో గజకేసరీ యోగంలో మీనంలో ఉన్నాడు. బుద్ధికారకుడైన బుధుడు తీవ్రమైన అర్గలదోషానికి గురై, వక్రశనితో సూటిగా చూడబడుతున్నాడు. ధనూరాశిలో కాబూల్ డిగ్రీలమీదున్న గురువు, రాహుకేతువులతో ఖచ్చితమైన అర్గలదోషానికి గురయ్యాడు.
ఈ మొత్తం గ్రహస్థితిని డీకోడ్ చేస్తే, ఏమర్ధమౌతుంది?
ఆఫ్ఘనిస్తాన్ లోని కుహనా మతశక్తులకు బలం పెరుగుతుంది. కాబూల్ డిగ్రీ, ధనుస్సు 11 నుండి 14 మధ్యలో ఉంటుందని కొందరు లొకేషనల్ జ్యోతిశ్శాస్త్రవేత్తల అంచనా. దానిని గురువు ఆక్రమించడం, రాహుకేతువులు దానిని అర్గలదోషంలో బంధించడం వల్ల, దుష్ట తాలిబాన్ చేతిలోకి కాబూల్ వెళ్లిపోతుందన్న సూచన, ఆరోజున బలాతిబలంగా కనిపిస్తున్నది.
గోచారంలో గురుఛండాలయోగంలోనూ, నీచశుక్రుని స్థితిలోనూ, గురుశుక్రుల సంబంధం కలిగి గురుబలం తగ్గినపుడూ, ఇస్లామిక్ రాక్షసమూకలు పెట్రేగిపోయి, సాటిమానవుల మీద అరాచకాలు దౌర్జన్యాలూ చేయడాన్ని, చరిత్రలో మనం ఎన్నిసార్లయినా గమనించవచ్చు..
ఖచ్చితంగా ఆరోజున అదే జరిగింది !
(ఇంకా ఉంది)