దేశగోచారాలలో, గురువు, శని, రాహుకేతువులు, యురేనస్ లు ప్రధానపాత్రలు పోషిస్తాయి. 2001 నుంచి ఇరవై ఏళ్లపాటు ఆఫ్గనిస్తాన్ ను నాటో దళాల, ఇంకా చెప్పాలంటే అమెరికా దళాల సహకారంతో పాలించిన ప్రభుత్వం ఆగస్టు 15, 2021 న కూలిపోయింది. అయితే, దీనికి పావులు చాలా ముందునుంచే కదలడం ప్రారంభమయ్యాయి. ఆ సమయానికి మేజర్ గ్రహాల పరిస్థితి ఇలా ఉంది.
శని - మకరం; గురువు - కుంభం; రాహుకేతువులు - వృషభ - వృశ్చికాలు; యురేనస్ - మేషం
వీరిలో శని, 24 మే 2021 నుండి వక్రించడం మొదలుపెట్టాడు. గురువు, 21 జూన్ నుండి వక్రించడం మొదలుపెట్టాడు. ఈ మార్పులవల్ల, అమెరికా బలగాలు త్వరగా వెళ్లిపోవడం, తాలిబాన్ బలగాలు వేగంగా ముందుకు కదిలి కాబూల్ ను ఆక్రమించడం జరిగిపోయింది. దీనిని గమనిద్దాం.
Planet |
7-10-2001 |
15-8-2021 |
Rahu |
Mithuna 7 |
Vrisha 12 |
Jupiter |
Mithuna 21 |
Kumbha 3 R |
Saturn |
Vrisha 20 R |
Makara 15 R |
Uranus |
Makara 27 |
Mesha 20 |
దాదాపుగా 20 ఏళ్ల పాటు అమెరికా, అఫ్ఘానిస్తాన్ను పరోక్షంగా పాలించింది. ఇది రాహుకేతువులు రాశిచక్రాన్ని ఒక ఆవృత్తి చేసి వచ్చే సమయం. 2001 లో మిధునంలో ఉన్న రాహువు, 2021 కల్లా వృషభంలోకి వచ్చేశాడు. కనుక ఇది ఖచ్చితంగా రాహుకేతువుల ప్రభావమే. ఈలోపల, గురువు ఒకటిన్నర ఆవృత్తిని పూర్తిచేశాడు. శని ఎనిమిది రాశులను దాటాడు.
నిజానికి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వెనుకకు వెళ్లిపోవడానికి డిసెంబర్ 2020 లోనే బీజాలు పడ్డాయి. 17-12-2020 న శని గురువులిద్దరూ మకరరాశిలో 5 వ డిగ్రీమీద ఖచ్చితమైన యుతిలో ఉన్నారు. ఆనాటినుంచే, ఈ డ్రామాకు రంగం సిద్ధం కావడం మొదలైంది. మకరం నుండి ఆఫ్ఘనిస్తాన్ కు సూచికైన ధనుస్సు ద్వాదశంలో ఉండటంతో, లోకానికి తెలియకుండా రహస్యంగా ఈ పని జరుగుతూ వచ్చింది.
ఫిబ్రవరి 29 న దోహాలో జరిగిన చర్చలలో తాలిబాన్, అమెరికాలు ఒక ఒప్పందానికి వచ్చి, సంతకాలు చేశాయి. డిసెంబర్లో మొదలైన ప్లాన్ ఫిబ్రవరికి ఒక కొలిక్కి వచ్చింది. ఆ సమయానికి కుజ కేతువులిద్దరూ ధనూరాశిలో, ఆఫ్ఘనిస్తాన్ డిగ్రీలకు దగ్గరగా ఉండటాన్ని గమనించవచ్చు. ఇది మతపరమైన విధ్వంసానికి సూచన. అప్పటినుంచే, ఆఫ్ఘనిస్తాన్ కు దుర్దశ మొదలైంది. ఇస్లాం రూపంలో అది మళ్ళీ అనాగరిక, ఆటవిక, రాతియుగానికి వెళ్లిపోవడం మొదలైంది.
ధనుస్సు, పాకిస్తాన్ కు సూచికైన మేషానికి నవమంలో ఉండటంతో, అర్ధంలేని మతపిచ్చికి, దుర్మార్గానికి, దుష్టత్వానికి వంతపాడటం పాకిస్తాన్ వంతైంది. వెరసి, ప్రపంచదేశాలకు, ముఖ్యంగా అమెరికా, ఇండియాలకు ప్రమాదఘంటికలు మ్రోగడం మొదలైంది.
(ఇంకా ఉంది)