ఒకప్రక్కన ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు విజయసంబరాలు జరుపుకుంటుంటే, ఇంకోప్రక్కన అమెరికాను ప్రకృతి కాటేసింది. ఏంటి ఈ దుశ్శకునం? అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలై, అందరిచేతా ఛీ కొట్టించుకుంటున్న అమెరికా, ప్రకృతి చేతిలో కూడా తన్నులు తినాలా? ఏంటి దీనర్ధం?
ఈ సమయంలో ఉచ్ఛకేతువు జలతత్త్వరాశి అయిన వృశ్చికం 11 వ డిగ్రీమీద సంచరించాడు. మిధునంలో ఇది ఖచ్చితంగా న్యూయార్క్ ను సూచించే డిగ్రీ. షష్టాష్టక దృష్టి వల్ల, అందుకే అక్కడ అంత విధ్వంసం జరిగింది. ఈ సమయంలో మిధునరాశికి డబల్ పాపార్గళం పట్టి ఉండటాన్ని గమనించవచ్చు.
న్యూయార్క్, న్యూజెర్సీలలో ఎమర్జెన్సీ విధించారు. పదిలక్షలమంది కరెంటు లేని రోజులను గడిపారు. న్యూయార్క్ నగరాన్ని వరదనీరు ముంచెత్తింది. సెల్లార్ గదుల్లో అద్దెకున్న చిన్న ఉద్యోగస్తులు దాదాపు 50 మంది, తప్పించుకునే మార్గం లేక నీటిలో మునిగి చనిపోయారు. వెంటిలేషన్ లేని సెల్లారు గదుల్లో జెనరేటర్ పెట్టుకుని దాని పొగకు ఊపిరాడక కొంతమంది చనిపోయారు. వరదనీటిలో నడుచుకుంటూ పోతున్న ఒకరిద్దరిని, నీళ్లలో కొట్టుకొచ్చిన మొసళ్ళు తినేశాయి. ఇవన్నీ జరిగింది ఎక్కడో అడవిలోనో, పల్లెటూళ్లలోనో, పేదదేశాల లోనో కాదు. సాక్షాత్తు న్యూయార్క్ మహానగరంలో !
కూపాలు, గుంతలు, సెల్లార్లు మొదలైనవన్నీ వృశ్చికరాశి అధీనంలో ఉంటాయి. అది జలతత్వరాశి. కనుకనే సెల్లార్లలోకి వరదనీరు దూసుకొచ్చి అంతమందిని చంపేసింది. ఇక, మొసలి అంటే మకరరాశి. అందులో ఉండవలసిన శని వక్రించి ధనుస్సులో కొచ్చాడు. కుంభంలో ఉన్న గురువు వక్రించి మకరంలోకి నీచస్థితిలోకి వచ్చాడు. మొసళ్ళు న్యూయార్క్ నగరంలోకి ప్రవేశించి మనుషులను తినడం వింతగా లేదూ మరి?
దీనివల్ల అమెరికాకు జరిగిన నష్టం, జస్ట్ 50 బిలియన్ డాలర్లని అంచనా. అంటే మన లెక్కల్లో, కేవలం 3 లక్షల 65 వేల కోట్ల రూపాయలు. చాలా చిన్న మొత్తం కదా !
నలభై ఏళ్లుగా పాకిస్తాన్ కు వంతపాడి, తాలిబాన్లను పుట్టించి, పోషించి, ఇంతమంది చావులకు కారణమై, చివరకు వేలాదిమంది తమవాళ్ల చావులకు కూడా కారణమై, ఇప్పుడు అర్ధాంతరంగా అన్నీ వదిలేసి పారిపోయి, ఇన్ని లక్షలమందిని ముంచేసి, వాళ్ళ అగచాట్లకు, శాపనార్ధాలకు కారణమైన పాపం ఊరకే ఎలా పోతుంది మరి?
చేసేటప్పుడు నవ్వుతూ చేసి, ఏడ్చేటప్పుడు ఏడుస్తూ ఏడవడమంటే ఇదే మరి ! సోకాల్డ్ మేధావుల ఫారిన్ పాలసీల నిర్వాకం ఇలా ఉంటుంది ! గ్రహించండి !