1970 దశకంలో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. 1973 లో, 1979 లో ఇది తీవ్రరూపం దాల్చింది. మళ్ళీ ఇప్పుడు బ్రిటన్ లో తీవ్రమైన పెట్రోల్ కొరత వచ్చిపడింది.
అయితే, అప్పటికీ ఇప్పటికీ తేడాలున్నాయి. అప్పుడొచ్చింది ప్రపంచవ్యాప్త కొరత అయితే, ఇప్పుడొచ్చింది బ్రిటన్ వరకే. అప్పుడు ఆయిల్ లేక కొఱతైతే, ఇప్పుడు బ్రిటన్ లో ట్రక్కు డ్రైవర్లు లేని కొరత.
1973 సంక్షోభం
1979 సంక్షోభం
2021 సంక్షోభం
ఇప్పుడు ప్రపంచవ్యాప్త సంక్షోభం కాదు. ఒక్క బ్రిటన్ కే వచ్చింది. దీని కారణాలేంటి?
1. యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ తప్పుకోవడం (బ్రెగ్జిట్) తో దాదాపు 2 లక్షలమంది కార్మికులు బ్రిటన్ ను వదలి వెళ్లిపోయారు. వీరిలో రెండు మూడు వేలమంది ట్రక్కు డ్రైవర్లు కూడా ఉన్నారు. ట్రక్కులు నడిపేవారు లేక ఆయిల్ సప్లై ఆగింది.
2. కరోనా దెబ్బ కూడా దీనికి కారణం. పాత తరం ట్రక్కు డ్రైవర్లు రిటైర్ అవుతున్నారు. క్రొత్త వాళ్లకు లైసెన్సులు ఇవ్వాలంటే కరోనా అడ్డుకుంటోంది. ఈ లోపల సంక్షోభం ముదురుతోంది.
ఈ కొరత వల్ల, బ్రిటన్ లో పెట్రోల్ బంకుల దగ్గర అల్లర్లు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దొరకదేమోనన్న భయంతో జనం ఎగబడి పెట్రోల్ కొనేస్తున్నారు. అలా కొనద్దని, బ్రిటన్ ప్రధానమంత్రి మొత్తుకుంటున్నాడు. అయినా ఎవరూ వినడం లేదు. పరిస్థితి గందరగోళంగా ఉంది. జనాన్ని అదుపు చెయ్యడానికి, సైన్యాన్ని రంగంలోకి దించే పరిస్థితి వచ్చేసింది.
బ్రిటన్ కు మేషరాశి సూచిక. ప్రస్తుతం యురేనస్ మేషం 19 డిగ్రీలలో ఉన్నాడు. వృశ్చికంలో కేతువే ఉన్నాడు. ఇద్దరికీ షష్టాష్టక దృష్టి ఉంది. అందుకే ప్రస్తుతం ఒక్క బ్రిటన్ లోనే ఈ సంక్షోభం తలెత్తింది.
అర్ధమౌతోందా, గ్రహస్థితులు దేశదేశాలను ఎలా ప్రభావితం చేస్తాయో? మనుషుల బ్రతుకులను ఎలా నిర్దేశిస్తాయో?