తమిళనాడు లోని కూనూర్ దగ్గర జరిగిన IAF హెలికాఫ్టర్ కూలుడులో భారత రక్షణదళాల ముఖ్యాధికారి జనరల్ బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్ మరణించారు. ఆయనతో బాటు, ఆయన భార్యా, ఇతర ఆర్మీ స్టాఫ్ 11 మంది చనిపోయారు. వరుణ్ సింగ్ అనే ఒక్క ఆఫీసర్ మాత్రం బ్రతికి బయటపడ్డాడు.
వీరంతా ఉదయాన్నే ఢిల్లీ నుంచి విమానంలో సూళూర్ కు వచ్చారు. అక్కడనుండి మధ్యాన్నం 11. 50 కి హెలీకాఫ్టర్ లో బయలుదేరి వెల్లింగ్ టన్ మిలటరీ కాలేజీకి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ సంఘటనతో యావత్ భారతదేశం మొత్తం బాధతో కృంగిపోతున్నది. ఎందుకంటే, పాకిస్తాన్, చైనాల కుతంత్రాలను సమర్ధవంతంగా త్రిప్పి కొట్టడంలో జనరల్ రావత్ ఎంతో పేరుగాంచాడు. ఈ మధ్యనే కాశ్మీర్ లో జరిగిన ఆపరేషన్ ను కూడా ఎంతో సమర్ధవంతంగా నిర్వహించాడు. చాలా సమర్ధుడైన, ధైర్యవంతుడైన, దేశభక్త ఆఫీసర్ ఈయన. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన సంఘటన.
గ్రహచారం ఎలా ఉంది?
జ్యోతిష్యపరంగా చూస్తే, ప్రస్తుతం యురేనస్ - శనుల మధ్యన ఖచ్చితమైన కేంద్రదృష్టి ఏర్పడుతున్నది. కొద్దిరోజుల క్రితం వ్రాసిన పోస్ట్ లో ఈ గ్రహయోగం గురించి వ్రాస్తూ ఇది జరుపబోయే విధ్వంసం ఘోరంగా ఉంటుందని వ్రాశాను. ఓమైక్రాన్ కోణంలో దానిని వ్రాశినప్పటికీ, అది ఇండియాను సూచించే మకరరాశిలో జరుగుతున్నది గనుక, ఇండియాకు ఈ విధమైన పెద్ద దెబ్బ తగిలింది.
విమానప్రమాదాలలో వాయుతత్వ రాశుల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది? ప్రస్తుత చక్రంలో ఇదెలా ఉందో వివరిస్తాను వినండి.
శనియొక్క దశమ దృష్టి వాయుతత్వరాశియైన తుల మీదుంది. యురేనస్ సప్తమదృష్టి కూడా దీనిమీదే ఉంది. ఈ తులా రాశి, భారతదేశానికి సూచికయైన మకరానికి దశమస్థానం అయింది. కనుక దక్షిణభారతదేశంలో వాయుయాన ప్రమాదం జరిగింది. ఇది ఖచ్చితంగా శని, యురేనస్ ల ప్రభావమే.
రావత్ గారి జాతకం చూద్దాం.
పట్టుదలకు సూచకమైన మకరరాశి అయింది. శ్రవణానక్షత్రం ఈయన యొక్క నక్షత్రం. సప్తమాధిపతి చంద్రుడు లగ్నంలో ఉండటమూ, చంద్రుడు నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉండటమూ చూస్తుంటే, ఈయన భార్య అదృష్టజాతకురాలని తెలుస్తున్నది. కాబట్టే, భర్తతో బాటు ఒకేసారి చనిపోయింది. బ్రతుకులోనూ, చావులోనూ భర్తకు తోడుగా ఉన్నది. ఈమె ఉత్తరప్రదేశ్ లోని ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. ఖచ్చితంగా ఈమె అదృష్టజాతకురాలే. ఎందుకంటే, ఏ హిందూస్త్రీ అయినా దీనినే కోరుకుంటుంది కాబట్టి.
లగ్నంలో ఉన్న ఉఛ్చకుజుని వల్ల చిన్నవయసులోనే సైన్యంలో చేరి CDS గా ఈయన ఎదిగాడు. చంద్రమంగళ యోగం వల్లా, అందులోనూ కుజుని ఉచ్చస్థితివల్లా, మహా పట్టుదలగల సమర్ధుడైన ఆర్మీ ఆఫీసర్ అయ్యాడు. కానీ చివరకు ఇలా చనిపోయాడు. బాధాకరం !
ప్రమాదసమయంలో గోచారశని, ఖచ్చితమైన డిగ్రీ కలయికతో జననకాల చంద్రుని మీద సంచరించాడు. జననకాల చంద్రుడూ, గోచార శనీ ఇద్దరూ 15 వ డిగ్రీ మీదే ఉన్నట్లు గమనించండి. అంటే, మారకాధిపతి నక్షత్రం. గోచార చంద్రుడు 17 వ డిగ్రీ మీదున్నాడు. ఇది ఖచ్చితమైన చెడుయోగం, ఇంకా చెప్పాలంటే మారకయోగం. ఈ సమయంలో ఈయనస్సలు ప్రయాణం చెయ్యకూడదు. కానీ చేశాడు. సమయం వచ్చినపుడు అలా తోసుకుపోతుంది. ఆపడం కష్టం. ఎవరైనా చెప్పినా కూడా, అలాంటి సమయంలో ఎవరూ వినరు.
దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా?
నిన్నటి చక్రాన్ని గమనించండి. కుట్రలకు, కుతంత్రాలకు సూచిక అయిన వృశ్చికంలో నాలుగు గ్రహాలున్నాయి. అవి, రవి, బుధ, కుజ, ఉచ్చ కేతువులు. వృశ్చికం చైనాకు సూచిక. ఈ నాలుగు గ్రహాలను రాహువు చూస్తున్నాడు. రాహువు దృష్టి మకరం ఉన్న శని, చంద్రులమీద ఉన్నది. నాలుగు గ్రహాలు సూచిస్తున్నట్లు, ఒక గుంపుగా వీరందరూ మరణించారు. కనుక, ఈ సంఘటనలో శత్రుదేశాల పాత్ర లేదు అని చెప్పలేం.
ముఖ్యంగా, పాకిస్తాన్ చైనాలకు సింహస్వప్నమయ్యాడు జనరల్ రావత్. లడాఖ్ లో చైనా ఆటలనూ, కాశ్మీర్లో పాకిస్తాన్ ఆటలనూ త్రిప్పికొడుతున్నాడు. సైన్యంలో ఎంతో ధైర్యాన్ని నింపుతున్నాడు. అలాంటి మనిషిని అడ్డు తొలగించుకోవడానికి ఈ దేశాలు ఏమయినా చేయవచ్చు. చైనా దగ్గర అత్యాధునిక టెక్నాలజీ ఉంది. భూమి చుట్టూ నాలుగు సార్లు తిరిగి, ఎంచుకున్న ప్రదేశాన్ని సరిగ్గా కొట్టగలిగే మిసైల్ ను ఈమధ్యనే విజయవంతంగా ప్రయోగించింది చైనా. కాశ్మీర్లో పాకిస్తాన్ ఆటలను సైన్యం త్రిప్పికొడుతోంది. కనుక ఈ రెండు దేశాలూ మన దేశంలో విధ్వంసాన్ని సృష్టించాలని చూస్తూనే ఉంటాయి. వాటికి అనుకూలమైన పరిస్థితులు కూడా మన దేశంలో బాగా ఉన్నాయి. డబ్బుకు అమ్ముడుపోయే మనుషులు, దేశద్రోహులు మన దేశంలో అడుగడుగునా ఉన్నారు. చెప్పలేం, ఏదైనా జరిగి ఉండవచ్చు.
ఇది ఖచ్చితంగా కుట్ర ఫలితమే అని జ్యోతిష్యశాస్త్రం చెబుతున్నది. కామన్ సెన్స్ ఏమంటున్నదో చూద్దాం.
సాక్షులేమి చెబుతున్నారు?
కూలిపోక ముందు, ఈ హెలికాఫ్టర్ ఒక ఇంటి పైభాగాన్ని ఢీకొట్టింది. హెలికాఫ్టర్ లోనుంచి, మంటలలో కాలిపోతూ ఇద్దరు ముగ్గురు బయటకు పడిపోవడాన్ని గ్రామస్థులు చూచారు. అంటే ఏమిటి? పడిపోయిన తర్వాత హెలికాఫ్టర్ కాలిపోలేదు. ముందే ఆకాశంలో కాలిపోతూ క్రిందపడింది. అంటే ఏం జరిగి ఉంటుంది? లోపలే ఏదో ప్రేలుడు జరిగి ఉంటుంది. అంటే, ఈ పదముగ్గురిలోనే ఎవరైనా ఆత్మాహుతి దళపు తీవ్రవాదులున్నారా? తమను తాము పేల్చేసుకుని, ఇంతమంది చావుకు కారకులయ్యారా? లేక ఇంటిని కొట్టుకున్న హెలికాఫ్టర్ ఇంధన ట్యాంక్ అంటుకుందా? అపుడు లోపల మంటలు చెలరేగాయా? అసలు, అనుభవజ్ఞుడైన వింగ్ కమాండర్ నడుపుతున్న హెలికాఫ్టర్ ఇంటినెందుకు కొట్టుకుంటుంది? దానినెలా నడపాలో అతనికి అనుభవం లేదా? ఒకవేళ లేకపోతే, అలాంటి అనుభవం లేనివాడిని, ఇంత ముఖ్యమైన వ్యక్తి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ పైలట్ గా ఎలా నియమిస్తారు? ఎవరు నియమించారు? చనిపోయిన 13 మంది వ్యక్తిగత జీవితాలేంటి? ఎవరెవరితో వీరికి కాంటాక్ట్స్ ఉన్నాయి? ఎవరెవరితో వీళ్ళు ఈ మధ్యలో ఫోన్లో మాట్లాడారు? మొదలైన వన్నీ విచారణ చేయించాలి.
ఒకవేళ, పొగమంచు వల్ల ఇలా జరిగింది? అంటే, పొగమంచు ఉన్నపుడు, హెలికాఫ్టర్ ను ఎలా నడపాలో వింగ్ కమాండర్ పైలట్ కు తెలియదా? లోపల రాడార్, GPS లు ఉండవా? వాతావరణం కళ్ళకు కనిపించడం లేదా? ఎంత ఎత్తులో ఎగరాలో పైలట్ కు తెలీదా? అతనికి ట్రెయినింగ్ లేదా? అన్నీ ప్రశ్నలే.
లేదా, హెలికాఫ్టర్ కండిషన్ బాగాలేదా? అలా అయితే, అలాంటి హెలికాఫ్టర్ ను కండెమ్ చెయ్యకుండా, ఇంకా ఎందుకు దానిని వాడుతున్నారు? మోడీగారు కూడా ఇదే హెలికాఫ్టర్ లో వెడుతూ ఉంటారని అంటున్నారు. అదెంత ప్రమాదం? ఇలాంటి విషయాలలో కక్కుర్తి అవసరమా?
మూడే కారణాలు
ఈ సంఘటన మొత్తాన్నీ జల్లెడ పడితే, మూడే కారణాలు కనిపిస్తున్నాయి.
1. హెలికాఫ్టర్ లోపం. ఇదే కారణమైతే, ఈ క్రింది అనుబంధ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
A. పాతబడిన హెలికాఫ్టర్ ఎందుకు వాడుతున్నారు?
B. పాతబడకపోతే, మెయింటెనెన్స్ సరిగా ఎందుకు చేయడం లేదు?
2. పైలట్ లోపం. ఇది కారణమైతే, ఈ ప్రశ్నలు తలెత్తుతాయి.
A, అలాంటి పైలట్ ను ఎవరు ఈ ప్రయాణానికి వేశారు? వారి చరిత్ర, వారి కాంటాక్ట్స్ ఏమిటి? వారికి తీవ్రవాదులతో సంబంధాలున్నాయా?
B. సరియైన ట్రెయినింగ్ పైలట్ కు ఎందుకు ఇవ్వలేదు? అతను వింగ్ కమాండర్ ఎలా అయ్యాడు?
3. కుట్ర కోణం. ఇది కారణమైతే, ఈ ప్రశ్నలు తలెత్తుతాయి.
A. ఇంటలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి?
B. CDS పరిస్థితే ఇలా ఉంటే, ఇక ఆర్మీలో సామాన్య జవాన్ పరిస్థితేంటి?
పైమూడు కారణాలకూ ఎవరు బాధ్యత వహిస్తారు? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఇలాంటి అల్పకారణాలకూ, జరిగిన నష్టానికి ఏమైనా పోలిక ఉందా? అంత అనుభవజ్ఞుడైన ఆఫీసర్ ను ఈ విధంగా కోల్పోవడం దేశానికి ఎంత నష్టం?
ఇప్పుడు మనమేం చెయ్యాలి?
1. పాతబడిన హెలికాఫ్టర్లు, విమానాలను అర్జంటుగా ఇప్పుడైనా అటకెక్కించాలి.
2. మోడీ, రాజనాధ్ సింగ్, అమిత్ షా, యోగి ఆదిత్యనాధ్ లకు భద్రతను ఇంకా కట్టుదిట్టం చేయాలి. ఇలాంటి వాహనాలలో వాళ్ళసలు ప్రయాణించకూడదు.
3. ముస్లిం తీవ్రవాద స్లీపర్ సెల్స్ ను, వారి సపోర్టర్స్ ను నిర్దాక్షిణ్యంగా ఏరి పారెయ్యాలి.
అన్నింటినీ మించి, ఈ ప్రమాదంలో బ్రతికిన ఒకే ఒక్క ఆఫీసర్, వరుణ్ సింగ్ ను ఎలాంటి వైద్యమైనా చేసి బ్రతికించాలి. అతడి ప్రాణాలకు గట్టి రక్షణ కల్పించాలి. ఎందుకంటే, హెలికాఫ్టర్ లో ఏం జరిగిందో చెప్పగల ఏకైక వ్యక్తి అతనొక్కడే కాబట్టి.
ఇప్పుడిప్పుడే మన దేశం నిలదొక్కుకుంటూ, ప్రపంచదేశాల సమక్షంలో గర్వంగా నిలబడుతున్నది. మనం బలహీనపడకూడదు. ఇది బాధాకరమే, కానీ శత్రువుల కుట్రలకు మనం బలికాకూడదు. ఈ కుట్రను ఛేదించాలి. దోషులను శిక్షించాలి. మన దేశం ముందుకే నడవాలి.
దేశభక్తి గల భారతీయులుగా, జనరల్ రావత్ ఆత్మకు, ఆయన భార్య ఆత్మకు, ఆయన సహచరుల ఆత్మలకు శాంతి కలగాలని మనమందరం ఈశ్వరుని ప్రార్ధిద్దాం.