Pages - Menu

Pages

15, ఏప్రిల్ 2022, శుక్రవారం

బృహస్పతి మీనప్రవేశం - ఫలితాలు

నిన్న 14 వ తేదీన గురువుగారు కుంభరాశిని వదలి మీనరాశిలోకి అడుగుపెట్టారు. ఏడాదిపాటు అక్కడే ఉంటారు. ఈ గోచారఫలితాలు ఎలా ఉంటాయో ఇక్కడ చదువుకోండి.

మేషం

ఖర్చులు పెరుగుతాయి. ఎడమకంటికి బాధలొస్తాయి. ఆస్పత్రిలో చేరవలసి వస్తుంది లేదా ఆస్పత్రిని సందర్శిస్తారు. కాళ్ళవాపులు, నొప్పులు కలుగుతాయి. స్దానచలనం ఉంటుంది.

వృషభం 

లాభాలు కలుగుతాయి. ఏడాదినుంచీ స్తంభించిపోయిన ఫైనాన్స్ కదులుతుంది. అన్నలకు అక్కలకు మంచికాలం. ఎడమచెవి సమస్యలు వస్తాయి. పిక్కల నొప్పులు తలెత్తుతాయి. దీర్ఘరోగాలు పెరుగుతాయి.

మిధునం

ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తివ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది. తండ్రికి మంచి జరుగుతుంది. మోకాళ్ళరోగాలు పెరుగుతాయి. వాటికి కీళ్ల మార్పిడి జరుగుతుంది.

కర్కాటకం 

దూరదేశాలకు వెళతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెద్దలకు గురువులకు మంచి జరుగుతుంది. కాళ్ల రోగాలు మొదలౌతాయి.

సింహం

పిత్రార్జితం కలసి వస్తుంది. ఖర్చులూ అదే విధంగా పెరుగుతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. వివాహేతర సంబంధాలు మొదలౌతాయి. సుఖరోగాల ప్రమాదం పొంచివుంది. 

కన్య

పెళ్లి అవుతుంది. జీవితభాగస్వామికి మంచికాలం మొదలౌతుంది. బిజినెస్ కలసి వస్తుంది. దూరదేశాలకు వెళతారు. షుగర్ వ్యాధి తలెత్తుతుంది, ఇప్పటికే ఉన్నవాళ్లకు పెరుగుతుంది.

తుల

రోగాలు, ముఖ్యంగా పొత్తికడుపు సంబంధిత రోగాలు పెరుగుతాయి. శత్రుబాధ ఎక్కువౌతుంది. అప్పులు చెయ్యవలసి వస్తుంది.

వృశ్చికం

సంతానానికి మంచికాలం మొదలౌతుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది. ఆలోచనలలో విశాలత్వం పెరుగుతుంది. షేర్ మార్కెట్, ఇతర పెట్టుబడులతో లాభం వస్తుంది. ఆకలి పెరుగుతుంది. జీర్ణకోశరోగాలు ఎక్కువౌతాయి.

ధనుస్సు

మానసిక పరిధి పెరుగుతుంది. కోపతాపాలు తగ్గుతాయి. తల్లికి మంచికాలం. గృహసౌఖ్యం  బాగుంటుంది. చదువూ సంధ్యలలో రాణిస్తారు. గుండెజబ్బు తలెత్తుతుంది.

మకరం

మాటకారితనం ఎక్కువౌతుంది. సమాజసంబంధాలు మెరుగుపడతాయి. తమ్ముళ్లకు చెల్లెళ్లకు మంచికాలం మొదలౌతుంది. మానసికధైర్యం పెరుగుతుంది. ఆయాసం, ఊపిరితిత్తుల రోగాలు పెరుగుతాయి. బీపీ మొదలౌతుంది.

కుంభం

మాటలు ఎక్కువౌతాయి. వంటల మీద, తిండిమీద దృష్టి పెరుగుతుంది. కుడికంటికి బాధలొస్తాయి. ధనప్రాప్తి కలుగుతుంది. గృహసౌఖ్యం బాగుంటుంది.

మీనం

జీవశక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మికచింతన ఉధృతమౌతుంది. అధికారం చెలాయించే ధోరణి పెరుగుతుంది. స్వార్ధచింతన తగ్గుతుంది. ధనప్రాప్తి ఉంటుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. తలనొప్పులు మొదలౌతాయి.

ఈ ఫలితాలు ఆయా రాశులకు, లగ్నాలకు కూడా కలుగుతాయి. రెంటినీ కలుపుకుని చూస్తే ఇంకా బాగా సరిపోతాయి. వ్యక్తిగత జాతకాన్ని కూడా కలుపుకుని చూస్తే 100% సరిపోతాయి.