Pages - Menu

Pages

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

లోకకల్యాణం - ఆత్మకల్యాణం

ఉదయాన్నే చూస్తే చెన్నై నుంచి కోటపాటి కాల్ కనిపించింది. నేనేదో పనిలో ఉండి చూసుకోలేదు. తను నా పాతమిత్రుడు, అప్పుడప్పుడూ ఫోన్ చేస్తూఉంటాడు. గుంటూరులో ఉండగా అప్పుడప్పుడూ వస్తూ ఉండేవాడు. కమ్మవారైనప్పటికీ ఆధ్యాత్మికచింతన ఎక్కువ. పెళ్లిచేసుకోకుండా ఆధ్యాత్మిక జీవితానికి అంకితం అయిపోయాడు. మంత్రతంత్రాలలో, జ్యోతిష్యంలో బాగా ప్రవేశం ఉన్నవాడు. చెన్నైలో చిన్నసైజు గురువు. రాజమాత గారి భక్తుడు.

నేనే ఫోన్ చేసి, 'బాగున్నారా? చాలాకాలమైంది. ఏంటి ఫోన్ చేశారు?' అంటూ అడిగా.

నన్ను 'అన్నా'అంటాడు

'బానే ఉన్నా అన్నామీరు రాసింది చదివా. రాబోయే 14 ఏళ్లలో లోకం ఎలా ఉంటుందో రాశారు. కానీ అప్పుడే మొదలైపోయింది. చాలా ఘోరంగా ఉంది లోకంఅన్నాడు

అవును. గుంటూరులో 13 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసి తెలంగాణా ఆంధ్రాలలో తిప్పుతూ 80 మంది ఆర్నెల్లుగా రేప్ చేస్తున్నారు. వాళ్లందరినీ అరెస్ట్ చేశారు. వారిలో ఒకడు లండన్లో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ . వాడినీ ఇప్పుడు అరెస్ట్ చెయ్యబోతున్నారు. వీళ్ళలో పొలిటికల్ మనుషులూ, వ్యాపారస్తులూ, ఉద్యోగస్తులూ, స్వామీజీల భక్తులూ అందరూ ఉన్నారట. ఇలా ఉంది లోకం. మళ్ళీ అందరూ నీతులు చెప్పేవాళ్ళే. స్వామీజీల భక్తులేఅన్నా.

ఆయనకు చాలా కోపం వచ్చింది.

ఘోరం అన్నా. నాయాళ్లని పట్టుకొని ఇరగ్గొట్టాలి. అంత చిన్నమ్మాయి దగ్గర ఏముంటుందన్నా పాపం? మాటకొస్తే అసలు ఆడదాని ఒంట్లో ఏముందన్నా? కొంచం ఆలోచిస్తే అక్కడేమీ లేదు. లోకంలో ఎదవలందరూ ఏదేదో ఊహించుకోని చావడమేగాని ఏముందక్కడ కొంచం ఆలోచిస్తే?’ అన్నాడు కోపంగా.

నేనెప్పుడూ చెప్పేది అదే. లోకమంతా ఊహల్లో బ్రతుకుతోంది. వాస్తవం మీద కాదుఅన్నాను.

ఇక్కడకూడా అంతే ఉందన్నా. ఏదన్నా బస్సులో రైల్లో ప్రయాణం చేద్దామంటే ఎవరి పొడా నాకు గిట్టడం లేదు. ఎవరు తాకినా తట్టుకోలేకపోతున్నా ఒళ్ళు మంటలొస్తోందిఅన్నాడు.

అది సహజమే. సాధనామార్గంలో అలాంటి స్థితి కలుగుతుంది నేనూ అందుకే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణం మానేశాను. సినిమా హాల్స్ కి పోవడం మానేశాను. జనం ఎక్కువగా ఉంటె అక్కడకు పోవడం మానేశాను. ఫంక్షన్స్ మానేశాను. క్యాబ్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మనుషుల లోక్లాస్ 'ఆరా' లు చాలా ఇబ్బంది పెడతాయి. ఇలా జరుగుతుంది. తప్పదు.' అన్నాను.

మధ్యన ఒక బ్రాహ్మలబ్బాయి కలిశాడు. చిన్నోడే. మంచి పద్ధతైనవాడు, మంచి కళగలిగిన మొహం. చానా రోజులకి కనిపించి, ‘అన్నా బాగున్నావాఅంటూ వచ్చి పట్టుకున్నాడు. అప్పుడేమీ అనిపించలా. కానీ రాత్రికి నాలో కామం చెలరేగిందన్నా. ఏందిరా కత ఇట్టా ఉందని మర్నాడు పొద్దున్నే ఫోన్ చేసి, ‘ఏందిరా? నిన్న నన్ను తాకినప్పుడు ఏమాలోచిస్తున్నావురా?’ అనడిగా.

అప్పుడేమీ లేదన్నా. కానీ నాలో కోరికలు పోలేదన్నా. బాగా ఎక్కువగా ఉన్నాయిఅన్నాడా అబ్బాయి. ఊరకే వాడు నన్ను తాకడంతో వాడి మైండు నాకు సోకింది. రాత్రంతా శానా బాధ పెట్టింది. మనుషులు చూడన్నా ఎట్టా ఉండారో?’ అన్నాడు.

అంతే రవీ. బ్రాహ్మల అబ్బాయైనంతమాత్రాన కోరికలెలా పోతాయి? నెయ్యి తిని ఇంకా ఎక్కువౌతాయి. ఇలా జరగడం నిజమే. అందుకనే, సాధనాపరులు ఎవరినీ తాకరు. వేరేవాళ్లని అనవసరంగా తాకనివ్వరుమడి ఆచారం అనేవి ఇలాగే పుట్టాయి. అయితే కాలక్రమంలో అవి ప్రాణంలేని తంతులుగా మారిపోయాయి. మీరు ఫీలైంది సహజమే. ఇది జరుగుతుంది.  అందుకే అనవసరంగా ఎవరినీ తాకకండి, వాళ్ళని తాకనివ్వకండిఅన్నాను.

మామూలు మనుషులే ఇట్లా ఉన్నారని అనుకుంటే తప్పే అన్నా. స్వాములోర్లు కూడా అంతే ఉన్నారుఅన్నాడు.

అవును. అందరూ వేషగాళ్లే. ఆశ్రమాలన్నీ బిజినెస్ హౌసులే. వాళ్ళని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిఅన్నా.

మీరు అవధూతల గురించి రాశారే. అలాంటాయన ఒకాయన్ని చూశా మధ్యనఅన్నాడు.

ఎక్కడ చెన్నైలోనా?’ అన్నా.

అవును. బస్టాండ్ దగ్గర కనిపించాడు. ఒక గోనె పట్టా కట్టుకుని చింపిరి జుట్టుతో ఉన్నాడు. చూస్తే కొంచం కళ కనిపించింది. దగ్గరకెళ్ళి, ‘టీ తాగుతారాఅన్నా మర్యాదగా.

నేనడిగానా నిన్ను?అన్నాడు రివర్స్ లో. సామాన్యంగా అడ్డుక్కునేవాడెవడూ అలా అనడు. ఇంకా ఇవ్వమంటాడు. కానీ ఆయన అలా అన్నాడు.

అప్పుడేం చేశావు?’ అన్నా.

పోనీ డబ్బులు ఉంచుకోఅంటూ కొంచం డబ్బులివ్వబోయా. దానికాయన, ‘నీ దేవుడికిచ్చుకో. ఆయన్నుంచి నాకొస్తాయిలే అవసరమైనప్పుడు. గాలే నా తిండి. నాకు తిండెందుకు?అన్నాడు.

అతను నిజమైన సాధువేఅన్నాను.

అంతేకాదు. అతనింకో మాటన్నాడన్నా, ‘అమ్మ ఇస్తేనే నాకు పని. అప్పుడే చేస్తా. లేదంటే ఈ ప్రపంచంలో నాకేం పనిలేదు. ఇంకో ఏడాది తర్వాత నీకంతా బాగుంటుందిలే పోఅన్నాడు. మీరు రాసినది చదివితే అదే గుర్తొచ్చింది. ఆయన సరిగ్గా అదే మాటన్నాడుఅన్నాడు.

అంతే. అవధూతలలాగే ఉంటారుఅన్నాను.

వాళ్ళు చాలామంది ఉన్నారా?’ అడిగాడు కోటపాటి.

ఉంటారు. కానీ బయటపడరు. బయటపడి ప్రచారం చేసుకునేవారిలో ఎక్కువమంది దొంగలేఅన్నాను.

మరి లోకం ఇలా అధ్వాన్నమై పోతుంటే, వాళ్ళు బయటకు వచ్చి సాయం చెయ్యాలి గదన్నా? ఇట్లా దాక్కోనుంటే ఎట్లా?’ అన్నాడు.

బాగా అర్ధం చేసుకో రవీ. గోదారికి వరదొచ్చిందనుకో. మనం అడ్డం నిలబడితే ఏమౌతుంది. మనమూ దాంట్లో కొట్టుకుపోతాం. వరద పోయేదాకా ఆగాలి. తరువాత నువ్వు చేయవలసింది చెయ్యాలి. అవునా కాదా?’ అడిగాను.

అవునుఅన్నాడు.

అలాగే, ప్రస్తుతం లోకుల గ్లోబల్ ఖర్మ చాలా అధ్వాన్నంగా ఉంది. ఎక్కడ చూసినా ధనమదం, అహంకారం, గర్వం, కామం తాండవిస్తున్నాయి. పరిస్థితిలో మహనీయుడూ అడ్డురాడు. ఎవడికీ మన సాయం అవసరంలేదు. ఒకళ్ళ సమస్యలు తీరుద్దామని నువ్వు అనుకోకు. లోకం ఇలా పోవలసిందే. లోకులు వారి ఖర్మను  వారు అనుభవించవలసిందే. నువ్వు చెప్పినా నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా మనుషులు వినరు. ఇదింతేఅన్నా.

అంటే, ఒక తరం నాశనం అవ్వాలన్నమాటఅన్నాడు.

అవును. ఒకటో రెండో తరాలు పూర్తిగా నాశనమైనాక, అప్పుడు మనుషుల్లో మళ్ళీ మంచితనం, నిదానం, మానవత్వం మొదలౌతాయి. అప్పుడు చెప్పినా ఎవరైనా వింటారు. ప్రస్తుతం పరిస్థితి లేదు. కలిప్రభావం అంత ఘోరంగా ఉంది. అందుకని అవధూతలు, మహనీయులు ఎవరూ బయటకు రారుఅన్నాను.

పాపం లోకాన్ని ఉద్ధరిద్దామన్న ధోరణి రవికి చాలా ఎక్కువ.

అది కాదన్నా మరి లోకకల్యాణం జరిగేదెలా?’ అన్నాడు.

ప్రస్తుతం కావలసింది లోకకల్యాణం కాదు, ఆత్మకల్యాణం. ముందు మనం బాగుపడాలి. అంటే, ముందు మనం సాధనచేసి దైవత్వాన్ని పొందాలి. తరువాత లోకాన్ని ఉద్ధరిద్దాం. లోకాన్ని వదిలేయ్. ముందు నీ సంగతి నువ్వు చూసుకో.’ అన్నాను.

అందుకేన్నా మధ్య ఎవరికీ రెమెడీలు చెప్పడం లేదు. మొన్నొకాయన, ‘ఎవరైనా మంచి గురువును చూపించన్నాఅనడిగితే నీ బ్లాగ్ చదవమని చెప్పా. చదివి చాలా బాగుందని అన్నాడు. ‘చాలా కరెక్ట్ గా చెబుతున్నాడు ఈయనఅన్నాడుఅన్నాడు రవి.

సరే మంచిదేఅన్నా.

'ఇంకో అబ్బాయున్నాడు. అతను చండీ ఉపాసకుడు. ఎంత జపం చేసినా ఏమీ ఫలితం కనపడటం లేదు' అన్నాడు. నేను చూస్తే చండీదేవి అతని పక్కనే కనిపించింది. 'ఒరే నీ పక్కనే ఉందిరా అమ్మ' అన్నాను. నాకు కనపడటం లేదన్నా అంటాడు. నిరంతరం జపం చెయ్యి. జపం పెంచు' అనే చెప్పాను ఆ అబ్బాయికి. ఇది కరెక్టేనా?' అడిగాడు. కోటపాటి.

'విను. చాలామంది జపం చేస్తారు. దేవతలు వస్తారు కూడా. కానీ వీళ్ళ గుండె తలుపులు మూసి ఉంటాయి. దేవత లోనికి రాలేదు. ఇంటిబయట ఒకరు మనకోసం నిలబడి ఉన్నారనుకో. మనమేమో వాళ్ళను పిలుస్తూనే ఉంటాం గాని తలుపులు తెరవము. ఇదీ అంతే. కావలసింది మరింత జపం కాదు. మరింత ఆత్మార్పణం. జపంతో ఏమీ జరగదు. కావలసినవి హృదయశుద్ధి, ఆత్మార్పణలు' అన్నాను.

'సరే అర్ధమైంది. అతనికి అదే చెబుతాను' అన్నాడు.

'మంచిది' అన్నాను.

మన ఆశ్రమం ఆగస్టులో అని రాశావు. ఆగస్టులో వచ్చి అక్కడుంటావా? నేనూ వస్తా మన ఆశ్రమానికిఅన్నాడు.

ఆగస్టులో రాను. అమెరికా పోతున్నాను. అమెరికా శిష్యులు చాలామంది ఎదురుచూస్తున్నారు నాకోసం. వాళ్లలో కొందరు అమెరికన్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా చూచుకోవాలి కదా? అందుకని ఆర్నెల్లు వాళ్లకు అందుబాటులో ఉంటా. అక్కడ సాధనా రిట్రీట్స్ జరుగుతాయి. నా సాధనామార్గంలో వాళ్లకు దీక్షలిచ్చి యోగరహస్యాలు నేర్పించి సాధన చేయిస్తాను. ఆ తరువాత, జనవరిలో వెనక్కొచ్చి ఆశ్రమంలో ఉంటా. ఈలోపల మనవాళ్ళు ఆశ్రమం సంగతి చూసుకుంటూ దానిని డెవలప్ చేస్తూ ఉంటారుఅన్నాను.

అవునన్నా. అమెరికా వాళ్ళు నమ్మారంటే ప్రాణం ఇస్తారు. మనవాళ్లకు నమ్మకం తక్కువఅన్నాడు.

నిజమే. మనవాళ్లకు అనుమానాలు, ఆశలు, భయాలు, తీరని కోరికలు ఎక్కువ. తెల్లవాడికి అంతగా ఉండవు. అన్నీ తీరిపోయి ఉంటాయి. అందుకని వాళ్ళు నమ్మారంటే ప్రాణం పెడతారు. అయితే నమ్మేదాకా వాళ్ళతోనూ కష్టమేఅన్నా నవ్వుతూ.

సరేన్నా. అయితే ఆశ్రమం ప్రారంభోత్సవానికి పిలువు. వస్టాఅన్నాడు.

ప్రారంభోత్సవం ఏమీ ఉండదు. సింపుల్ గా మొదలౌతుంది. ఎప్పుడు మొదలైందో బ్లాగులో రాస్తా. నీకు ఫోన్ చేసి చెబుతాలే. అప్పుడు రాఅన్నా.

సరేన్నా. ఉంటామరిఅని ఫోన్ కట్ చేశాడు కోటపాటి.