Pages - Menu

Pages

9, ఏప్రిల్ 2022, శనివారం

ఎలర్జీ

శిష్యుడికి బయట డస్ట్ ఎలర్జీ

గురువుకి లోపల మిస్ట్ ఎలర్జీ

శిష్యురాలికి స్కిన్ ఎలర్జీ

గురువుగారికి జెర్కిన్ ఎలర్జీ


శిష్యురాలికి హస్బెండ్ ఎలర్జీ

గురువుగారికి వీకెండ్ ఎలర్జీ

శిష్యురాలికి ఇల్లంటే ఎలర్జీ

గురువుగారికి ఒళ్ళంతా ఎలర్జీ


శిష్యుడికి సమ్మర్ హీటంటే ఎలర్జీ

గురువుకి  కారు సీటంటే ఎలర్జీ 

శిష్యురాలికి నట్స్ అంటే ఎలర్జీ

గురువుగారికి హట్స్ అంటే ఎలర్జీ


శిష్యురాలికి స్వీట్లంటే ఎలర్జీ

గురువుగారికి ఫైట్లంటే ఎలర్జీ

శిష్యుడికి వైఫంటే ఎలర్జీ

గురువుకు లైఫంటేనే ఎలర్జీ


శిష్యురాలికి మౌనమంటే ఎలర్జీ

గురువుగారికి ధ్యానమంటే ఎలర్జీ

శిష్యుడికేమో మగువలంటే ఎలర్జీ

గురువుకేమో మనుషులంటేనే ఎలర్జీ