నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

3, ఏప్రిల్ 2022, ఆదివారం

Parallel Universe

అది 1981 సంవత్సరం మండువేసవి. గుంటూరు జిల్లాలో వింజనంపాడు అనే ఒక కుగ్రామం. ఊరి చెరువుగట్టు మీద కూర్చుని ఒక నడివయసు ఆయనా ఒక 17 ఏళ్ల అబ్బాయీ మాట్లాడుకుంటున్నారు.
కొద్దిరోజుల క్రితమే చనిపోయిన అబ్బాయి నాన్నకు కర్మకాండ జరపడం అప్పుడే అయిపోయింది.
అబ్బాయి బీ ఎస్సీ ఫిజిక్స్  చదువుతున్నాడు. నడివయసు మనిషేమోమద్రాస్ ఐఐటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా  పనిచేస్తున్నాడు. అబ్బాయి నేనే. ఆయనేమో మా మేనమామ.
అప్పట్లో నా ఫిజిక్స్ పరిజ్ఞానం అంతంత మాత్రమే. అందులోనూ నర్సరావుపేట కాలేజీలో, జస్ట్ డిగ్రీ చదివేవాడికి సబ్జెక్ట్ లోతుపాతులు ఏం తెలుస్తుంది? న్యూటన్స్  లా, థర్మోడైనమిక్ సూత్రాలు, ఐన్ స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రాధమిక అంశాలు, హైసెన్ బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపుల్, ఇంకా మరికొన్ని క్వాంటం ఫిజిక్స్ సూత్రాలు --  ఇంతవరకే నా పరిజ్ఞానం ఉండేది.
చిన్నపిల్లలకు చాలా విచిత్రమైన ఆలోచనలొస్తూ ఉంటాయి. చాలావరకూ సైన్సు ఆవిష్కరణలన్నీ  అంతకు చాలాముందే చిన్నపిల్లలు ఊహించిన ఊహలే. నేటి స్పెస్ ట్రావెలూ, గ్రహాంతరయానమూ నూరేళ్లక్రితం వచ్చిన సైన్స్ ఫిక్షన్ సాహిత్యమేపైగా, నేనప్పటికే  వేదాంతం, యోగం, బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం ఇలా పుస్తకం దొరికితే పుస్తకాన్ని నమిలేస్తూ ఉండేవాడిని. అందుకని, ఆత్మలు, లోకాలు, మొదలైన విషయాలు మా సంభాషణలలో చాలా మామూలుగా నడుస్తూ ఉండేవి.
రోజున జరిగిన కర్మకాండ మీద సంభాషణ మొదలైంది. జీవుడు, సూక్ష్మలోకాలు అంటూ మొదలైన అది క్వాంటం ఫిజిక్స్ మీదకు, పారలెల్ యూనివర్స్ మీదకు మళ్లింది. అప్పటికే ఫిజిక్స్ లో ఉద్దంఢుడైన మా మేనమామతో సబ్జెక్ట్ మాట్లాడాలంటే భయమే అయినా, కుర్రతనపు ఉత్సాహంలో ఇలా అన్నాను.
'మన విశ్వంలాగే ఇంకో విశ్వం మనకు సమాంతరంగా నడుస్తూ ఉంటే, అది కాలంలో వెనక్కు నడవాలి కదా ! అప్పుడే అది మన విశ్వాన్ని బేలన్స్ చేయగలుగుతుంది. న్యూటన్స్ లా ప్రకారం బేలన్స్ ఉండాలి కదా సృష్టిలో. అలాంటప్పుడు, ఒక టైంకి మొదలైన రెండు సమాంతర విశ్వాలు, ఒకే వైపు  ప్రయాణిస్తూ ఉంటే అది బేలన్స్ ఎలా అవుతుంది? కాబట్టి ఒకటి టైం లో ముందుకు పోతుంటే, ఇంకొకటి టైంలో వెనుకకు పోవాలిఇలాంటి రీసెర్చి క్వాంటం ఫిజిక్స్ లో ఏదైనా జరుగుతోందా ఇప్పుడు?'
ఆయన నవ్వేశాడు.
'ఒరేయ్ ! ఇలాంటి థియరీలు కుప్పలున్నాయి. రీసెర్చి కూడా జరుగుతోంది. అసలు ఇంకొక పారలెల్  యూనివర్స్ ఉందనేదే ఇంతవరకూ రుజువుల్లేవు. పైగా అది టైం లో వెనక్కు పోతుందానీ పిచ్చి ఊహలూ నువ్వూనూ? న్యూటన్ నియమాలను క్వాంటం ఫిజిక్స్ కి  అప్లై చేస్తున్నావా? నీ మొఖం !' అని తేలిగ్గా తీసిపారేశాడు.
'అదికాదు మామయ్యా ! న్యూటోనియన్ ఫిజిక్స్ అయినా, క్వాంటం ఫిజిక్స్ అయినా, సృష్టి మొత్తంలో బేలన్స్ ఉండాల్సిందే కదా. లేకపోతే యూనివర్స్ నిలబడదు కదా' అని నేనన్నాను.
నా మాటల్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు.
ఇది జరిగి 41 ఏళ్లయింది. నేనీ సంఘటనను మర్చేపోయాను.
మొన్నీమధ్యన, అంటే మార్చ్ 21 The Independant  లో  ఒక సైన్స్ న్యూస్  చూస్తుంటే ఇలా ఉంది.
Scientists believe there could be an anti universe next to ours, where time runs backwards. 
A wild theory suggests there may be an "anti-universe" that runs backwards in time before the Big Bang. 
The concept, explained in a paper accepted for publication in the journal Annals of Physics, suggests that the reason for this universe is because there are fundamental symmetries in nature – such as charge, parity, and time. This fundamental symmetry is known as CPT symmetry.
Physical interactions generally obey these symmetries, but physisists have never observed a violation of these laws of nature simultaneously. The researchers posit that while this symmetry applies to interactions, it could also apply to the entire universe.
As such, to preserve this symmetry, there could be a mirror-image cosmos to balance our own.
The consequences to this universe existing could explain dark matter. There are currently three known types of neutrino: electron-neutrinos, muon-neutrinos and tau-neutrinos, all of which spin in the same leftwards direction. Physicists have wondered if there might be right-spinning neutrinos, but have never detected them.
దీనిని చదివినప్పుడు, మా మేనమామకూ నాకూ ఎప్పుడో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. పారలెల్ యూనివర్స్ ఉందో లేదో ప్రస్తుతం సైన్సుగానీ, ఇంకొకరు గానీ నాకు చెప్పనక్కరలేదు. అది ఉందని నాకిప్పుడు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే 40 ఏళ్లలో, మావాళ్లకీ నన్నెరిగిన వాళ్ళకీ తెలియకుండా, నాలో ఎంతో జరిగిందిగంగలో నీరు చాలా  ప్రవహించింది.
అప్పుడు కాబట్టి అలా మాట్లాడాను. ఇప్పుడాయన బ్రతికున్నట్లైతే ఇంకోలా మాట్లాడేవాడిని. 2017 లో ఆయన చనిపోయి వేరే యూనివర్స్ కి వెళ్ళిపోయాడు. అంతకుముందు పదేళ్ల క్రితమే నాతో మాట్లాడటం మానేశాడు. విధంగా నాతో అకారణశత్రుత్వాలు పెంచుకుని నాతో మాట్లాడటం మానేసినవాళ్లు చాలామందున్నారు. వారిలో ఈయనొకడు.
పారలెల్ యూనివర్స్  ఉంది సరే. అయితే ఏంటితెలుసుకున్నారు. అయితే ఏంటి? అక్కడకు ఎలా పోవాలో తెలుసుకుని, అక్కడ కూడా భూకబ్జాలు చేద్దామనా? లేక అక్కడ వాళ్ళను కూడా లొంగదీసుకుని బానిసలుగా మార్చి వాడుకుందామనా? లేక అక్కడకూడా కులాలు, మతాలు, వర్గవిభేదాలు సృష్టిద్దామనా? లేక అక్కడ కూడా డబ్బులు ఎరవేసి మతాలు  మారుద్దామనా?
మధ్యయుగాలలోఓడ ప్రయాణంతో కొత్త ఖండాలు కనుక్కుని వాటిని ఆక్రమించినట్లుగా, ఇప్పుడు భూమి సరిపోక కొత్త లోకాలు  కావలసి వచ్చాయా? అనడుగుతాను.
మన విశ్వానికి సమాంతరవిశ్వం ఖచ్చితంగా ఉంది. ఒకటికాదు. అనంతసృష్టిలో అలాంటివి చాలా ఉన్నాయి. నీ స్వార్ధపూరిత దృష్టి మారనంతవరకూ ఎన్ని విశ్వాలుంటే ఏం లాభం? నువ్వు నువ్వులాగే ఉంటే, ఛస్తే తప్ప అక్కడకు పోలేవు. విశ్వపు సరిహద్దులూ, అక్కడి రూల్సూ నిన్ను లోపలకు రానివ్వవు.
అది ఎలా ఉంటుందో చూడాలంటే రాకెట్ అక్కర్లేదు. ధ్యానం చాలు. సాధన చాలు. రాకెట్లో అక్కడకు పోవడం సాధ్యం కాదు. ఎందుకంటే అవి ఈ ప్లేన్ లో లేవు. భౌతికరాకెట్ ఈ భౌతికప్లేన్ దాటి బయటకు పోలేదు. డైమెన్షన్స్ కి అడ్డుగా ఉన్న ఎనర్జీ ఫీల్డ్స్ ని రాకెట్ దాటలేదు.
ఇతర డైమెన్షన్స్ లో ఉన్న లోకాలను ఊరకే చూడటమే కాదు, వాటిలోకి పోవడం కూడా సాధ్యమేమనం ఊహించలేనన్ని విచిత్రాలు సృష్టిలో లెక్కలేనన్ని ఉన్నాయి. మన భూమిలాంటి భూములు సృష్టిలో 18,000 ఉన్నాయని మెహర్ బాబా అన్నారు. ఆయనకెలా తెలిసింది? రాకెట్లో అక్కడకెళ్లారు?
ధ్యానసాధనలో లోతులు అందుకుంటే అనేక లోకాలను చూడవచ్చు. సూక్ష్మదేహంతో అక్కడకు వెళ్ళవచ్చు కూడా. ఇవన్నీ అబద్దాలు కావు. అచ్చమైన నిజాలే. రంగంలో పరిశ్రమ చేస్తే తప్ప అర్ధంకాని నిజాలు.
పారలెల్ యూనివర్స్ అబద్దం కాదు. నిజమే. అయితే, అదెక్కడో లేదు. మనపక్కనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనలోనే ఉంటుంది. మనం నిద్రపోయేటప్పుడు మెళకువను వదలి కలల ప్రపంచంలోకి ఎలా వెళతాం? అదీ అంతే. తలుపులోనుంచి అవతలకు అడుగుపెట్టే కిటుకు తెలియాలి. అంతే. ఆ తలుపులు మనలోనే ఉంటాయి. బయట ఉండవు.
ధ్యానసాధనలో లోతులు తెలిస్తే అలాంటి కిటుకులు చాలా తెలుస్తాయి. అయితే, జీవితంలో మన ప్రయారిటీలను మార్చుకుని, కష్టపడి సాధన చేయవలసి ఉంటుంది. ఎంతసేపూ డబ్బు, స్వార్ధం, సుఖాలు అని బ్రతికితే ఇవి పిచ్చిభ్రమలు గానే కనిపిస్తాయి !
పారలెల్ యూనివర్స్ ని సైన్స్ ఇంకా ఊహిస్తోంది. యోగులకు అనుభవంలో అదెప్పుడో తెలుసు !