Pages - Menu

Pages

30, మే 2022, సోమవారం

ఈ అమావాస్య గిఫ్ట్ - నేపాల్ విమాన ప్రమాదం - జ్యోతిష్య విశ్లేషణ

ఈరోజు అమావాస్య. నిన్న ఆదివారం ఉదయం 9 55 ప్రాంతంలో నేపాల్ లో 'తారా ఎయిర్ వేస్' అనే ప్రయివేట్ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన విమానం కూలిపోయింది. పోఖారా అనే టూరిస్ట్ సిటీ నుండి ఇంకొక టూరిస్ట్ ప్రాంతమైన జోమ్సంకు బయలుదేరిన ఈ విమానం 12 నిముషాలలోనే కొండలలోని కోవాంగ్ అనే పల్లెటూరి దగ్గరగా కూలిపోయింది. సాధారణంగా ఈ ప్రయాణం 20 నిముషాలే పడుతుంది. 9.55  AM కి బయలుదేరిన ఈ విమానం 12 నిముషాల తర్వాత 10.07 కి కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. అప్పటినుంచీ విమానం అడ్రస్ లేదు. కొండలు, మంచుల వల్ల విమానం కూలిపోయిన ప్రదేశానికి అధికారులు వెంటనే చేరలేకపోయారు. ప్రస్తుతం చేరుకున్నారు. అందులో ఉన్న 22 మంది ప్రయాణీకుల శరీరాలు గుర్తుపట్టలేనివిధంగా ముక్కలైపోయాయి. 

జ్యోతిష్య పరంగా చూద్దాం.

ప్రస్తుతం కుంభరాశి నుండి వృషభరాశి వరకూ గ్రహాలన్నీ గుమిగూడి ఉన్నాయి. ఏదో దుర్ఘటన జరిగినప్పుడు జనం గుంపులుగా గుమిగూడి చూచినట్టు ఈ దృశ్యం ఉన్నది. గత వారం నుంచీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని దుర్ఘటనలకూ ప్రస్తుతం ఖగోళంలో ఉన్న ఈ గ్రహస్థితే కారణం.

కుజుడు, గురువు దాదాపుగా ఒకే డిగ్రీమీద ఉంటూ, శపితయోగంలో బందీలై ఉన్నారు.  వారిమీద శని, ప్లూటో, శుక్ర, బుధుల ప్రభావాలున్నాయి. అందుకనే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దుర్ఘటనలు గత వారం నుంచీ జరుగుతున్నాయి. అవన్నీ వివరించడం నా ఉద్దేశ్యం కాదు.

మేషరాశి కొండకోనలను సూచిస్తుంది, అదేవిధంగా నేపాల్ దేశాన్ని కూడా సూచిస్తుంది. ప్రస్తుతం మేషరాశి తీవ్రమైన అర్గలదోషంతో ఉన్నది. అందులోనే, చంద్రుడు రాహుగ్రస్తుడై, విమానాలకు సూచకుడైన శుక్రునితో కలసి అర్గళంలో ఉన్నాడు. మరణానికి కారకుడైన యముడు (ప్లూటో) యొక్క కేంద్రదృష్టి వీరిపైన ఉన్నది. నవాంశచక్రంలో, నీచరాహువుతో కూడి ఉన్న చంద్రుడిని వక్రబుధుడు కలుస్తున్నాడు. అంటే, యాంత్రికప్రమాదం సూచింపబడుతున్నది. లెక్క సరిపోయిందనుకుంటాను.

ఈ విమానంలో 22 మంది ప్రయాణీకులున్నారు. రూట్ నంబర్ 4 అవుతున్నది. 2, 4 అనే అంకెలు రాహుకేతువులకు సూచికలు. వీళ్ళు నవాంశలో నీచస్తితులలో ఉన్నారు. 4 అంకెను సూచించే కేతువు ఒంటరివాడుగా తులలో దూరంగా ఉన్నాడు. అందుకే, ఎక్కడో కొండల్లో విమానం కూలిపోయింది. ప్లూటో (మరణం) యొక్క కేంద్రదృష్టి ఈయనమీద కూడా ఉన్నది. 24 గంటలు గడిచిన తర్వాత కూడా శవాలు కొండలలో దిక్కులేకుండా పడి ఉన్నాయి. ఇలాంటి చావులకు కేతువే కారకుడు. ఈ గ్రహయోగాలన్నీ కలసి ఈ భయంకర విమానప్రమాదానికి కారణమైనాయి.

సూక్ష్మవిషయాలను స్పష్టంగా చూపించే షష్ట్యంశ (D-60) చక్రాన్ని గమనిద్దాం.

9.55 కి ఆ ప్రాంతపు షష్ట్యంశ చక్రం ఇలా ఉంది. లగ్నాధిపతి గురువు బాధకుడు బుధునితో కలసి అస్తమయయోగంలో ఉన్నాడు. అంటే, చావు మూడబోతున్నదని అర్ధం. విమానానికి కారకుడైన శుక్రుడు నీచకేతువుతో కలసి, విమానం ధ్వంసం అవుతుందని సూచిస్తున్నాడు. కర్మ కారకుడైన శని, నేపాల్ ను సూచించే మారకరాశి మేషంలో నీచస్థితిలో ఉన్నాడు. ఈ విమానం చాలా చెడుఘడియలలో బయలుదేరింది. 

షష్ట్యంశచక్రంలోని లగ్నం ప్రతి రెండు నిముషాలకు మారిపోతూ ఉంటుంది. 9.57AM కి ఇది మేషలగ్నమైంది. అంటే, నీచశని మీదకు వచ్చింది. ప్రమాదం వేగంగా దగ్గరవడం మొదలుపెట్టింది.

9.59AM కి నీచకేతు, శుక్రుల (విమానవిధ్వంసయోగం) తో కూడిన వృషభలగ్నమైంది. విమానంలో యాంత్రికలోపాలు తలెత్తి ఉంటాయి.

10.07AM కి సింహలగ్నమైంది. అక్కడే వక్రప్లూటో (మరణం) ఉన్నాడు. ప్లూటో, గురుబుధులనూ, సూర్యకుజులనూ ఆచ్ఛాదిస్తున్నాడు. వక్రబుధ, వక్రప్లూటోల వల్ల పైలట్ బుద్ధి వక్రిస్తుంది. అంటే, జడ్జ్ మెంట్ లోపిస్తుంది. జీవకారకుడైన గురువును మరణకారకుడైన ప్లూటో ఆచ్ఛాదించడం వల్ల మరణం వరిస్తుంది. సూర్య కుజులపై ప్లూటో ఆచ్చాదన భయంకరమైన యాక్సిడెంట్ ను ఇస్తుంది. ఖచ్చితంగా ఇవే యోగాలు, షష్ట్యంశ (D-60) చక్రంలో ఉండటాన్ని చూడవచ్చు.

ఈ పాయింట్స్ అన్నిటినీ అన్వయం చేసుకోండి. నేనక్కర్లేదు, మీరే చెప్పగలుగుతారు ఏం జరిగి ఉంటుందో?

ప్రస్తుతం అమెరికానుండి, మిడిల్ ఈస్ట్ నుండి, యూరోప్ నుండి, ఇండియానుండి, శ్రీలంక వరకూ ప్రతిచోటా జరుగుతున్న దుర్ఘటనలన్నిటికీ ఈ చార్ట్ లో కనిపిస్తున్న గ్రహయోగాలే కారణం. ఇవి ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధంగా ప్రభావాన్ని చూపిస్తాయి.

మొత్తం మీద ఈ అమావాస్య, ప్రపంచానికి ఈ బహుమతిని ఇచ్చింది !

29, మే 2022, ఆదివారం

'సర్వసార ఉపనిషత్' - మా క్రొత్త పుస్తకం విడుదల


కృష్ణ యజుర్వేదాంతర్గతమైన 'సర్వసార ఉపనిషత్' ను మా 43 వ పుస్తకంగా నేడు విడుదల చేస్తున్నాము. పేరుకు తగినట్లే ఇది అన్ని ఉపనిషత్తుల సారమై యున్నది. దీనికి, 'సర్వసారోపనిషత్, సర్వోపనిషత్, సర్వోపనిషత్సారము' అని వేర్వేరు పేర్లున్నాయి.

నిత్యజీవితంలో మనం -- జ్ఞానం, అజ్ఞానం, బంధం, మోక్షం, పంచకోశములు, జీవుడు, ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మము అనే పదాలను చాలా సాధారణంగా వాడేస్తూ ఉంటాము. కానీ వాటి అర్ధాలేమిటో మనకు తెలియవు. తెలుసని అనుకుంటాం గాని, నిజానికి వీటి అసలైన అర్ధాలు మనకు తెలియవు. అవి సరిగా అర్ధమైతే గాని, వేదాంతము అర్ధం కాదు. వేదాంతమంటే ఉపనిషత్తులలో చెప్పబడిన జ్ఞానభాగం.

ఉపనిషత్తులు 108 ఉన్నాయి గాని, వాటిలో ప్రామాణికములైనవి పది ఉపనిషత్తులే. ఆదిశంకరులు వీటికి భాష్యం వ్రాశారు. వేలాది ఏళ్ల కాలగమనంలో ఎన్నో కొత్తకొత్త ఉపనిషత్తులు పుడుతూ వచ్చాయి. వాటిల్లో కొన్ని, పది ఉపనిషత్తులలోని కొన్ని విషయములను తీసుకుని వివరిస్తూ వచ్చాయి. చిన్నవైన ఈ ఉపనిషత్తులను  సామాన్యోపనిషత్తులంటారు. వాటిలో ఇది ఒకటి.

దీనిని కూడా ఉచితపుస్తకంగా విడుదల చేస్తున్నాము. Google Play Books నుండి దీనిని ఇక్కడనుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ పుస్తకం తయారు కావడానికి ఎంతో శ్రమించి అతి తక్కువకాలంలో దీని టైప్ సెట్టింగ్, డీటీపీ వర్క్ చేసిన నా శిష్యురాలు అఖిలకు. అద్భుతమైన ముఖచిత్రాన్ని చిత్రించి ఇచ్చిన శిష్యుడు ప్రవీణ్ కు, సంస్థ కార్యక్రమాలలో మాకందరికీ వెన్నుదన్నుగా నిలుస్తున్న నా శ్రీమతి సరళాదేవికి కృతజ్ఞతలు. ఆశీస్సులు.

ఉపనిషత్తులలోని ఈ అద్భుతమైన జ్ఞానాన్ని చదివి అర్ధం చేసుకోండి. అసలైన హిందూమతం యొక్క స్థాయి ఏమిటో, అదేం చెప్పిందో గ్రహించండి. అలా అర్ధం చేసుకున్న విషయాలను మీమీ జీవితాలలో ఆచరించడానికి ప్రయత్నించండి. అప్పుడే ఈ దేశంలో పుట్టినదానికి సార్ధకత ఉంటుంది.

ఈ దేశంలో పుట్టి, అద్భుతమైన ఈ దేశపు ప్రాచీనవిజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతే, దానిని అందిపుచ్చుకోలేకపోతే, అంతకంటే దురదృష్టం ఇంకేమీ ఉండదు మరి !

మా ఇతర పుస్తకాలలాగే దీనిని కూడా ఆదరిస్తారు కదూ !

25, మే 2022, బుధవారం

టెక్సాస్ స్కూల్ షూటింగ్ - జ్యోతిష్య విశ్లేషణ

నిన్న అంటే, 24 మే 2022 న ఉదయం 11.32 ప్రాంతంలో టెక్సాస్ లో షూటింగ్ జరిగింది. షూటింగ్ అంటే సీన్మా షూటింగ్ అనుకునేరు. అదికాదు. గన్ షూటింగ్. ఒక 18 ఏళ్ల అబ్బాయి తుపాకీతో కాల్పులు జరిపి 22 మందిని  చంపేశాడు. వాళ్లలో 19 మంది చిన్నచిన్నపిల్లలు. ఇద్దరు పెద్దవాళ్లున్నారు. ఒక పోలీసు కూడా ఉన్నాడు. చివరికి అతన్ని కూడా  పోలీసులు కాల్చేశారు.

అమెరికా అంతా గగ్గోలెత్తింది. గన్ కల్చర్ కు ముగింపు  పలకాలని జో బైడెన్ తో సహా అందరూ  తీర్మానించారు. చర్చిలలో ప్రార్ధనలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించారు. కానీ ఏమీ చెయ్యరు. ఏమంటే, గన్ లాబీ చాలా గట్టిది. అది వాళ్ళ వ్యాపారం మరి !

హంతకుడికి ఈ మధ్యనే పట్టుమని పదిహేడు నిండాయి. వెంటనే రెండు గన్స్  కొనుక్కున్నాడు. కార్టూన్ కేరక్టర్ లాగా వేషం వేసుకున్నాడు. యుద్దానికి వెళ్ళేవాడిలాగా తయారయ్యాడు. తుపాకీ ని టెస్ట్ చెయ్యాలికదా? ముందు ఇంట్లో ఉన్న మామ్మను సరదాగా డిష్యుం అంటూ కాల్చి పారేశాడు.  గన్ పనిచేస్తోందని నిశ్చయించుకున్నాక, నింపాదిగా దగ్గర్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ కొచ్చి 19 మంది పిల్లల్ని  కాల్చి పారేశాడు. అడ్డొచ్చిన పోలీసుని కాల్చేశాడు. ఒక టీచర్ని కాల్చేశాడు. ఎదురుకాల్పులలో చనిపోయాడు.

గ్రహాలేమంటున్నాయో చూద్దాం.

షూటింగ్ జరిగిన యువాల్డీ అనే ఊళ్ళో ఆ సమయానికి  కర్కాటకలగ్నం 15 డిగ్రీ ఉదయిస్తోంది. అసలు ఇలాంటి సంఘటనలకు కుజరాహువులు కారకులౌతారు. ఈ చక్రంలో కుజుడు చంద్రగురువులతో కలసి ఉంటూ మతపరమైన రాక్షసత్వాన్ని సూచిస్తున్నాడు. పైగా, రాహుశనుల మధ్యన అర్గలబందీ అయ్యాడు. ఇది చాలా భయంకరమైన క్రూరయోగం. ఈ కుజుని చతుర్ధదృష్టి అమెరికాను సూచించే మిధునరాశి  మీదుంది. చిన్నపిల్లలకు సూచకుడైన బుధుడు వక్రిగా మారి, అస్తంగతుడై, ప్లుటోతో ఖచ్చితమైన దృష్టితో చూడబడుతున్నాడు. పైగా, కుజుడు సూచించే దక్షిణపు గేట్ లోనుంచి హంతకుడు స్కూల్లోకి అడుగుపెట్టాడు.

ఇంకేం కావాలి? 20 ఏళ్లలో జరగని ఘోరం జరిగింది. పాపం ఈ స్కూల్లో చదువుకునే పిల్లల్లో  చాలామంది పేదవాళ్ళైన హిస్పానిక్ పిల్లలే.

అమెరికాలో ఉన్న రేసిజానికి, మానసికరోగాలకు, చిన్నవయసులోనే పిల్లలలో పుట్టే పెడబుద్ధులకు ఈ సంఘటన అద్దం పడుతోంది. టెక్సాస్ రాష్ట్రంలో గన్స్ విరివిగా చాకోలెట్ల మాదిరి అమ్ముతారు. ఓరిగాన్ లో పెట్టిన ఓషో ఆశ్రమానికి కావలసిన తుపాకులను కూడా, షీలా మనుషులు టెక్సాస్ నుండే కొనుక్కున్నారు. పైగా శాంతిని ప్రబోధించే క్రైస్తవమతం కూడా అక్కడ చాలా ఎక్కువ. మరి పిల్లలకి ఇదేనా నేర్పించేది? ప్రతీ ఆదివారం చర్చిలలో ఊరకే మాయదారి శాంతివచనాలు పలకడమేనా? లేక ఇప్పుడైనా నిజాయితీగా ఈ గన్ కల్చర్ కు ముగింపు పలుకుతారా? ఏమో చూద్దాం !

22, మే 2022, ఆదివారం

'ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్' - మా క్రొత్తపుస్తకం విడుదల

'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' నుండి వెలువడుతున్న 42 వ పుస్తకంగా 'ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్' ఈరోజున విడుదలౌతున్నది. ఇది అధర్వణ వేదమునకు అనుబంధమైనది.

అందరూ ప్రతిపూటా చేసే అతిమామూలు పనియైన 'భోజనం చేయడాన్ని' వైదికసాధనగా మలచుకుని, దానిద్వారా అత్యుత్తమమైన బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందాలన్న సులభమైన సాధనామార్గం ఇందులో చెప్పబడింది.

యోగశాస్త్రంలో, తంత్రశాస్త్రంలో చెప్పబడిన సాధనలను అందరూ చేయవచ్చు, చేయలేకపోవచ్చు. కానీ, దీనిలో చెప్పబడిన సాధన చాలా సులభమైనది. ఎవరైనా దీనిని చేయవచ్చు. ఫలితాన్ని మీరే చూడవచ్చు.

విశ్వమంతా ప్రాణమయమని, ఆ ప్రాణమే బ్రహ్మమనిన దివ్యానుభవాన్ని వేదఋషులు పొందారు. సరియైన భావనతో చేస్తే, దీనిని బాహ్యయజ్ఞంతోనూ అందుకోవచ్చు. అంతకంటే సులభమైన మార్గమేమంటే, మనం ఆహారాన్ని తీసుకోవడాన్నే సాధనగా మార్చుకుని కూడా ఈ స్థితిని పొందవచ్చు. దీనికే 'ప్రాణాగ్నిహోత్ర విద్య' యని పేరున్నది. ఆ విద్య ఈ ఉపనిషత్తులో చెప్పబడింది. దీనికి నా సులభమైన వివరణను, వ్యాఖ్యానాన్ని ఈ పుస్తకంలో మీరు చూడవచ్చు.

'వేదాలలో ఏముందో తెలీకుండా బ్రాహ్మణులు దాచిపెట్టారు' అనే మాటను కొంతమంది అనడం నా చిన్నప్పటినుంచీ నేను వింటున్నాను. అది నిజమో కాదో ప్రస్తుతానికి ప్రక్కన ఉంచుదాం. ఈ నిందను దూరం చేయడానికి నావంతుగా నేను చేస్తున్న చిన్న ప్రయత్నంలో, 'వేదాలలో ఏముంది? ఏయే రహస్యసాధనలు వాటిలో ఉన్నాయి?' అనే విషయాలను నా పుస్తకాలలో తేటతెల్లంగా, స్పష్టంగా వ్రాస్తూ వస్తున్నాను. కులాలతో సంబంధం లేకుండా వీటిని నా శిష్యులకు ఉపదేశిస్తున్నాను.

నేడు, వేదోపనిషత్తుల విజ్ఞానమంతా, కులాలతో సంబంధం లేకుండా అందరికీ, ప్రింట్ లో అందుబాటులో ఉంది. చదివి, అర్ధం చేసుకుని, ఆచరించేవారు మాత్రమే కావాలి. ఇప్పుడేమీ దాపరికం లేదుకదా ! ఆచరించండి మరి.

మాది ధార్మికసంస్థయేగాని వ్యాపారసంస్థ కాదు. కనుక, మా సంస్థనుండి కొన్ని ఉచిత పుస్తకాలను కూడా క్రమం తప్పకుడా అందరికీ అందించాలని సంకల్పించాం. ఈ ప్రక్రియలో భాగమే ఈ ఉచితపుస్తకం. దీనిని మీరు google play books నుండి ఉచితంగా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

దీనికి వ్యాఖ్యానాన్ని వ్రాసింది నేనే అయినా, ఈ పుస్తకం వెలుగు చూడటానికి ఎంతో శ్రమించి టైప్ సెట్టింగ్, డీటీపీ వర్క్ చేసిన నా శిష్యురాలు అఖిలకు. అద్భుతమైన ముఖచిత్రాన్ని చిత్రించి ఇచ్చిన శిష్యుడు ప్రవీణ్ కు, మాకందరికీ నిరంతరం అండగా నిలుస్తున్న నా శ్రీమతి సరళాదేవికి కృతజ్ఞతలు. ఆశీస్సులు.

నా శిష్యురాలు శ్రీలలిత చేతులమీదుగా ఈ పుస్తకం విడుదల అవుతున్నది.

మన సనాతనధర్మంలో ఉన్న విజ్ఞానసంపదను చదవండి. అర్ధం చేసుకోండి. ఆచరించండి.  ధన్యులు కండి. ఈ దేశంలో పుట్టడం ఎంతో గొప్ప అదృష్టం. మన దేశపు విజ్ఞానం అత్యద్భుతం. అమూల్యం. భారతీయులుగా, హిందువులుగా పుట్టిన అందరూ ఈ విజ్ణానానికి అర్హులే. దీనికి కులంతో సంబంధం లేదు. శ్రద్ధ ఒక్కటే అర్హత.

'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్' 'శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది' అంటూ భగవద్గీత చెబుతోంది !

మా మిగతా గ్రంధాలను ఆదరించినట్లే దీనిని కూడా ఆదరిస్తారు కదూ !


20, మే 2022, శుక్రవారం

సెప్టెంబర్ 2 ని భారతదేశమంతటా 'బ్లాక్ డే' గా పాటించాలి

సెప్టెంబర్ 2 ని భారతదేశమంతటా 'బ్లాక్ డే' గా పాటించాలి' అని హిందువులందరూ శపథం చేయాలి. ఆరోజున ఉపవాసం ఉండి, జపధ్యానాలలో, పూజలలో, ఈశ్వరాభిషేకాలలో, నమకచమక రుద్రపారాయణాలలో కాలం గడపాలి. 'నీ భవ్యమైన ఆలయాన్ని కాపాడుకోలేకపోయిన మా చేతగానితనాన్ని క్షమించు' అని రోదిస్తూ ఈశ్వరుని ఎదుట సాగిలపడి మ్రొక్కాలి.

కారణం? ఆ రోజున అంటే, 2 సెప్టెంబర్ 1669 న, నీచాతినీచుడు ఔరంగజేబు ఆదేశానుసారం కాశీవిశ్వనాధ మందిరం దారుణంగా కూలగొట్టబడింది. అడ్డొచ్చిన వందలాది బ్రాహ్మణులను కాశీవీధులలో నరికేశారు. కాశీవీధులు రక్తంతో తడిశాయి.  ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ ఎంతో భక్తితో స్మరించుకునే కాశీవిశ్వనాధుని ఆలయానికి ఆరోజున పట్టిన దురవస్థను నిరసనగా అసలు 75 ఏళ్లనుండే దీనిని ఇండియా మొత్తం హిందువులందరూ పాటించవలసిన అవసరం ఉన్నది. కానీ, హిందూసమాజంలో జాగృతి లేకపోవడంతో ఆ పని జరుగలేదు. నేడు అది వస్తున్నది.  కనుక ఈ ఏడాదినుంచే దీనిని పాటించవలసిన అవసరం ఉంది.

ఆరోజున తిధి భాద్రపద శుక్లసప్తమి. అంటే, వినాయకచవితి నుంచి నాలుగో రోజు. చేతనైతే తిథిని పాటించండి. చేతకాకపోతే కనీసం డేట్ ని పాటించండి.

ముస్లిములు చేసిన ఈ దారుణాన్ని తలచుకున్న ఏ హిందువైనా సరే ఆ రోజున తిండి తినలేడు. శాంతిగా ఉండలేడు. నిద్రపోలేడు. ఒకప్పుడు రాక్షసమనస్తత్వం కలిగిన సుల్తానులు ఈ దేశాన్ని పాలించారు. అప్పుడు సాగింది. ఇప్పుడు కూడా ఏంటి ఈ దారుణం? ఈ మచ్చను తుడిచివేయకుండా ఇంకా ఇలాగే ఉంచడం సమంజసమా?  జ్ఞానవాపి మసీదును వెంటనే అక్కడనుండి తొలగించి, ఔరంగజేబు చేసిన ఈ దుర్మార్గపు రాక్షసకృత్యాన్ని సరిదిద్దేవరకూ ఈ దీక్షను దేశవ్యాప్తంగా హిందువులందరూ కొనసాగించాలి.

అసలేం జరిగింది?

1669 వ సంవత్సరంలో, ఢిల్లీ సుల్తానుల పాలనలో ఉన్న అన్ని ప్రాంతాలలోనూ, దేశవ్యాప్తంగా వేలాది దేవాలయాలను కూలగొట్టారు. దీనికి రుజువులు సాకీ ముసాయిద్ ఖాన్ అనేవాడు పర్షియన్ భాషలో వ్రాసిన 'మాసిరి ఆలంగిరి' అనే పుసకంలో ఉన్నాయి. ఇది ఔరంగజేబు పాలనపై వ్రాయబడిన పుస్తకం. ఇందులో సగం, ఔరంగజేబు బ్రతికి ఉన్న సమయంలో వ్రాయబడితే, మిగిలిన సగం అతను చనిపోయిన తర్వాత వ్రాయబడింది. దీనిని ప్రముఖ చరిత్రకారుడు పండిత జదునాథ్ సర్కార్ అనువదించాడు. ఈ అనువాదం మనకు స్వతంత్రం రాకముందు, బ్రిటిష్ పాలనాకాలంలోనే జరిగింది.

ఆ పుస్తకంలో ఇలా ఉంది.

8 ఏప్రిల్ 1669 న ఔరంగజేబు గాడికి వాడి తొత్తు, హిందూమత ద్రోహి, అయిన ముస్లిం గవర్నర్ ఎవడో ఇలా లిఖితపూర్వకంగా కంప్లెయింట్ చేశాడు.

'తట్టా, ముల్తాన్, బెనారస్ ప్రాంతాలలోని బ్రాహ్మణ హిందువులు (ఇస్లాంను నమ్మనివాళ్ళు) వాళ్ళ పవిత్రగ్రంధాలను బోధిస్తున్నారు. ఎంతో దూరాలనుండి హిందూ ముస్లిం జిజ్ఞాసువులు వచ్చి వాటిని నేర్చుకుంటున్నారు'. 

ఇస్లాంను ఇండియాలో స్థాపించాలని కంకణం కట్టుకున్న ఔరంగజేబు వెంటనే, ఆయా రాష్ట్రాలలోని దేవాలయాలను కూలగొట్టమని, ఆయా బ్రాహ్మణ ఆచార్యుల బోధనలను, వాళ్ళు బోధిస్తున్న తంతులను వెంటనే ఆపించమని, వాళ్ళను అణగద్రొక్కమని తన గవర్నర్లను ఆజ్ఞాపించాడు.

ఆ ఆజ్ఞానుసారం, బెనారస్ లోని విశ్వనాధాలయాన్ని 2 సెప్టెంబర్ 1669 న కూలగొట్టారు.   

ఇలాంటి దారుణాతి దారుణం జరిగిన రోజున ఖచ్చితంగా గ్రహస్థితి కూడా అంత దారుణంగానే ఉండాలి. కనుక, ఆ రోజున గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం.

ఆ రోజున కాశీలో ఉన్న గ్రహస్థితిని పైన ఉన్న చక్రంలో చూడండి. అనుకున్నట్లుగానే, దారుణాతి దారుణంగా ఉంది. ఆయా గ్రహస్తితులను ఇక్కడ వివరిస్తా చూడండి.

ఏకాకిగా మారిన దేవగురువు

దేవగురువు బృహస్పతి. ఈయననే మామూలు భాషలో గురుగ్రహం అంటున్నాం. ఆ గురువు ఆ రోజున ఒంటరిగ్రహంగా మిధునంలో ఉన్నాడు. అంటే, ధర్మం ఒంటరిదయ్యింది.

శుక్రవారానికి ఇస్లాంకూ ఉన్న సంబంధం

దేవతల గురువు బృహస్పతి ఎలాగో, రాక్షసుల గురువు శుక్రుడు అలాగ. ఈయనను శుక్రగ్రహం అంటున్నాం. రాక్షసులంటే సినిమాలలో చూపించినట్లు కోరలు కొమ్ములు పెట్టుకుని ఉండరు. వేదాలను ద్వేషిస్తూ, హిందూదేశపు సంస్కృతికి విరోధులైన వాళ్ళే రాక్షసులు. మన దేశాన్ని కొల్లగొట్టి, దేవాలయాలు ధ్వంసం చేసి, స్త్రీలను రేపులు చేసి, మన గ్రంధాలను తగలబెట్టి, నానా అరాచకాలు చేసిన ఢిల్లీ సుల్తాన్ లు, ఇతర ముస్లిం పాలకులు అందరూ నీచాతినీచులైన రాక్షసులే. ఎందుకంటే, రాక్షసులే అలాంటి పనులు చేస్తారు. అందులోనూ, రాక్షసుడు అంటే అర్ధం తెలుసా మీకు? అది సంస్కృత పదం. సంస్కృతంలో 'రాక్షస' అంటే, 'ఏది తినాలి, ఏది తినకూడదు అనిన విచక్షణ లేకుండా, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అనే విచక్షణ లేకుండా, విధ్వంసచర్యలు చేస్తూ, హింసకు పాల్పడేవాడు' అని అర్ధం. మరి, సుల్తానుల కాలంలో ముస్లిములు చేసినవి అవే పనులు గనుక వాళ్ళు రాక్షసులే.

అందుకే, శుక్రవారపు ప్రార్థనలను వాళ్ళు చేస్తారు. అరబిక్ భాషలో 'షుక్ర్' అంటే కృతజ్ఞత అని అర్ధం. అంటే, దౌర్జన్యంగా వేరే దేశాలలోకి దూరి, అక్కడి సంస్కృతులను, దేవాలయాలను ధ్వంసం చేస్తూ, నానా అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలు, హత్యలు చేస్తూ, హాయిగా సిగ్గులేకుండా బ్రతుకుతూ  ఉండే అవకాశాన్ని ఇచ్చినందుకు, వాళ్ళ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని ప్రార్ధన చేసే ప్రత్యేకమైన రోజే శుక్రవారం. అందుకే శుక్రవారం నాడు వాళ్ళ ప్రత్యేక ప్రార్ధన ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లో గాని, పాకిస్తాన్ లో గాని, చివరకు అమెరికాలోగాని, వాళ్ళు చేసే బాంబు పేలుళ్లు, అల్లర్లు అన్నీ శుక్రవారం ప్రార్ధనల తర్వాతే జరుగుతాయి. ఆ రోజున వాళ్ళలా రెచ్చగొట్టబడతారన్నమాట. అదన్నమాట, శుక్రాచార్యుడికీ, శుక్రవారానికి, వీళ్లకూ ఉన్న సంబంధం.

సెప్టెంబర్ కూ ముస్లిం టెర్రరిజానికీ సంబంధం

చూడండి మరి, ఆ రోజున శుక్రుడు నీచస్థితిలో ఉన్నాడు. ప్రతి ఏడాదిలోనూ, సెప్టెంబర్ నెలలో శుక్రుడు నీచస్థితిలోకి వస్తాడు. శుక్రుడు నీచస్తితిలో ఉన్న ప్రతిసారీ అంటే, ప్రతి సెప్టెంబర్ నెలలోనూ, వీళ్లకు పిచ్చి లేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు చేసిన విధ్వంసాలన్నీ దాదాపుగా సెప్టెంబర్ లోనే జరిగాయి. ఉదాహరణకు అమెరికాలో ట్విన్ టవర్స్ ధ్వంసం కూడా 11 సెప్టెంబర్ 2001 నే జరిగింది. ఆఫ్ కోర్స్ ఆరోజు మంగళవారం అనుకోండి. కానీ దానికి ప్లాన్ అంతకు ముందరి శుక్రవారం నాడే జరిగింది.

మనస్సుకు సూచకుడైన చంద్రుని నీచస్థితి

అంతేకాదు, 2 సెప్టెంబర్ 1669 నాడు చంద్రుడు కూడా నీచస్థితిలో ఉన్నాడు. ఆరోజున అనూరాధా నక్షత్రం అయింది. ఈ నక్షత్రం స్వార్ధపరత్వానికి, దురుసు మనస్తత్వానికి, కుట్రలకూ సూచిక అన్నవిషయం జ్యోతిష్యజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. సామాన్యంగా అలాంటిరోజున నీచమైన, స్వార్ధపూరితమైన సంకల్పాలు మనసులో తలెత్తడం సహజం. అందుకే ఆ రోజున కాశీ విశ్వనాధాలయం కూలగొట్టబడింది.

భయంకరమైన సిగ్నేచర్ యోగం

అన్నింటికంటే ముఖ్యమైన యోగం, నీచశుక్ర - నీచచంద్ర - నెప్ట్యూన్ లు 7 వ డిగ్రీమీద ఉంటూ, ఒకరికొకరు ఖచ్చితమైన దృష్టిలో ఉన్నారు. ఈ యోగం ఏమి చెబుతున్నది?

నెప్ట్యూన్ మత్తుకు, మొండితనానికి, మాఫియా ధోరణులకు కారకుడు. నీచశుక్రుడు రాక్షసులను సూచిస్తాడు. నీచ చంద్రుడు, నీచమైన ఆలోచనలను సూచిస్తాడు. శుక్రుని నుంచి చంద్రుడు మూడవ ఇంట్లో ఉన్నాడు. చంద్రుని నుంచి నెప్ట్యూన్ మూడవ ఇంట్లో ఉన్నాడు. ఇవన్నీ ఒకదానికొకటి విక్రమస్థానాలు. అంటే, మతిలేని రాక్షసత్వంతో కూడిన దౌర్జన్యానికి సూచనలు. నెప్ట్యూన్ నుంచి శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు. ఇది రాక్షసమతమైన ఇస్లాం పెడధోరణులను సూచిస్తున్నది. ఈ మూడూ కలిస్తే ఏమౌతుంది. సారాయి త్రాగిన సుల్తాన్ సైనికులు రాక్షసులలాగా చెలరేగిపోయి, విశ్వనాధుని భవ్యమైన, సుందరమైన శిల్పకళతో కూడిన ఆలయాన్ని రాక్షసంగా కూలగొట్టారు. అడ్డొచ్చిన అమాయకులను నరికేశారు. దీనికి అనుగుణమైన గ్రహయోగం ఆనాడు ఉన్నది.

కపట యోగం

అదే విధంగా,కుజబుధులు ఒకే ఒక్క డిగ్రీ దగ్గరగా సింహరాశిలో కలసి ఉన్నారు. ఈ యోగం ఏమిస్తుంది? ఎన్నో గత పోస్టులలో వ్రాశాను, నా జ్యోతిష్యపుస్తకాలలో కూడా వ్రాశాను. ఈ యోగం 'కపటయోగం' అనబడుతుంది. హిపోక్రసీని, అహంకారపూరిత ప్రవర్తననీ తీవ్రంగా పెంచుతుంది. అదేగా ఆ రోజున జరిగింది మరి ! 'నాకు నచ్చని మతాలను ధ్వంసం చెయ్యండి. దేవాలయాలను కూలగొట్టండి. అడ్డొచ్చినవాళ్లను చంపండి' అని ఔరంగజేబు ఆజ్ఞాపించడం హిపోక్రసీకి, దురహంకారానికి పరాకాష్ట కాదా? చెప్పండి ! 

దేవగురువు నిస్సహాయ స్థితి

ఇప్పుడు దేవతల గురువైన గురువు పరిస్థితి ఎలా ఉందొ చూద్దాం.
  • ఈయనకు భయంకరమైన అర్గళం పట్టింది. ఎలాగో వివరిస్థా వినండి.
  • 3-11 భావాలలో, రవి, బుధ, కుజ - రాహువులచేత అర్గళం పట్టింది.
  • 5-9 భావాలలో శని, యురేనస్ - కేతువులచేత అర్గళం పట్టింది.
  • 6-8 భావాలలో చంద్ర - నెప్త్యూన్ల చేత అర్గళం పట్టింది. 
  • స్వయానా గురువుతో కలసి మరణానికి కారకుడైన ప్లూటో ఉన్నాడు.
ఈ విధంగా, అన్నివైపులనుంచీ దేవగురువు బందీ అయిపోయాడు. నిస్సహాయుడయ్యాడు. శక్తిహీనుడయ్యాడు. అలాంటి రాక్షసఘడియ ఆరోజున ఉన్నది. అందుకే ఆ రోజున రాక్షసుల చేతులలో దేవతల ఆలయం కూలగొట్టబడింది.

నా రెండు ప్రశ్నలు

ఎక్కడో అరేబియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ల నుంచి మన దేశానికి దండెత్తి వచ్చి, దౌర్జన్యంతో మన దేశాన్ని ఆక్రమించి, మన దేవాలయాలను, మన శిల్పాలను, మన గ్రంధాలను, మన మతాన్ని, మన సంస్కృతిని ధ్వంసం చేయడానికి వీళ్లెవరు? ఈ పరమనీచుడు ఔరంగజేబుగాడు మన దేశాన్ని 50 ఏళ్ళు పాలించాడు. ఇది మన చేతగానితనమా కాదా? ఇదొక ప్రశ్న

1669 లో ఈ ఘోరమైన చర్య జరిగితే, 353 ఏళ్ళు గడిచినా కూడా ఈనాటికీ భారతీయులు ఈ చారిత్రిక తప్పిదాన్ని సరిచేసుకోలేక పోవడానికి కారకులెవరు? ఇదికూడా మన చేతగానితనమా కాదా? లేక ఇప్పటిదాకా పాలించిన రాజకీయపార్టీల మోసమా? అనేది రెండో ప్రశ్న.

హిందూసమాజం ముందున్న కొన్ని ప్రశ్నలు

ఈనాటికీ, గతకాలపు పరాయి పాలకుల దుష్టదుర్మార్గపు ఆనవాళ్లను ఇలా మనమధ్య ఉంచాల్సిందేనా? ఈ అరాచకపు గుర్తులను ప్రతిరోజూ చూస్తూ కాశీపౌరులు బ్రతకాల్సిందేనా? హిందువులలో చైతన్యం రావలసిన అవసరం లేదా? అయితే, మనం హింసకు ప్రతిహింసను కోరుకునేవాళ్ళం కాము. హింసా దౌర్జన్యమూ తప్పని మనమంటాము. కానీ, జరిగిన తప్పిదం సరిచేయబడాలి కదా. మూడువందల ఏళ్ళుగా రోదిస్తున్న భరతమాత ఆత్మ శాంతించాలి. ఆ దిశగా, న్యాయపరంగా పోరాడి, ఈ తప్పిదాన్ని సరిచేయవలసిన అవసరం ఉన్నది.

భారతదేశపు ముస్లిములు ఈ మంచి ప్రయత్నాన్ని విధిగా సపోర్ట్ చెయ్యాలి. ఎందుకంటే ఇది చారిత్రక తప్పిదం కనుక. చేసిన తప్పును దిద్దుకోవాలి గనుక.

కాదంటారా?

18, మే 2022, బుధవారం

'జ్ఞానవాపి' మసీదెలా అవుతుంది? బుద్దుందా అసలు?

కాశీలోని విశ్వనాధాలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞానవాపిమసీదులో శివలింగం బయటపడింది. ఈ విషయం తెలుసుకోవడానికి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళు పట్టింది. అదికాదు విచిత్రం. అసలైన విచిత్రం వేరే ఉంది.

జ్ఞానవాపి అంటే, 'జ్ఞానజలం కలిగిన బావి' అని అర్ధం. ఇది కాశీవిశ్వనాధాలయ ఆలయ కాంప్లెక్స్ లోనే ఉంటుంది, ఈ మసీదుకు ఒక పక్కన ప్రాచీన విశ్వనాధాలయ గోడలే ఉంటాయి. సుల్తానుల కాలంలో, ఆలయాన్ని ఆక్రమించి, కూలగొట్టి, దానిలో ఉన్న పవిత్రమైన జలంతో కూడిన బావిని మాత్రం అట్లాగే ఉంచి, దానిని కబ్జా చేసి మసీదు కట్టుకున్నారు. ఈ విషయం చిన్నపిల్లోడైనా చెప్పగలడు. అది ఖచ్చితంగా శివాలయమే.  

అయితే, ఈ మసీదును తొలగించి, సుల్తానులు చేసిన ఘోరమైన నేరాన్ని తుడిచివేసి, మన శివాలయాన్ని మనం సొంతం చేసుకోవడానికి ఒక చట్టం అడ్డొస్తున్నది. అది మళ్ళీ మనం రాసుకున్న చట్టమే. అదే Places of worship Act - 1991.

ఈ చట్టం ప్రకారం, 14 ఆగస్టు 1947 న ఏది ఉందో దానిని కదిలించకూడదు. మార్చకూడదు. ఆరోజున  దేవాలయం ఉంటే, ఎప్పటికీ దేవాలయంగానే ఉండాలి. ఆ రోజున మసీదై ఉంటే, అది అంతకు ముందున్న దేవాలయాన్ని కూలగొట్టి కట్టినదైనా సరే, దానిని మసీదుగానే పరిగణించాలి. భలే ఉంది కదూ !

ఇది కరెక్ట్ చట్టమైతే, మరి ఇదే సూత్రం మతమార్పిడికి వర్తించదా? 14 ఆగస్టు 1947 న హిందువుగా ఉంటే, ఎప్పటికీ హిందువుగానే ఉండాలి. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా ఇదే రూలు. మతాలు మారకూడదు' అని చట్టం ఎందుకు రాదు?

దేవాలయాలకు ఒక న్యాయమూ, మతమార్పిడికి ఇంకొక న్యాయమా? అసలిది న్యాయమేనా? న్యాయమంటే ఇలాగే ఉంటుందా?

ఈ చట్టం రూపొందినప్పుడు ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటినుంచీ ఏం చేస్తూ వచ్చింది.? కాశ్మీర్ ను రావణకాష్టం చేసింది.  అమాయకులైన కాశ్మీర్ పండిట్లను లక్షలాదిగా ముస్లిములు చంపుతుంటే చూస్తూ ఊరుకుంది. చైనాకు లక్షలాది చదరపు కిలోమీటర్ల భారతభూభాగాన్ని ధారాదత్తం చేసింది. మహారాష్ట్రలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ను, ఇంకా ఇతర ముస్లిం టెర్రరిస్ట్ గ్యాంగులను పెంచి పోషించింది. యూనివర్సిటీలలో మతవిషాలను నూరిపోసింది. మతమార్పిళ్లకు దన్ను కాచింది. పాస్టర్లు హిందూమతాన్ని, హిందూదేవతలను ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే, మతాలు మారుస్తుంటే, వాళ్లకు FCRA రూపంలో ఫారిన్ ఫండ్స్ అందించింది. ముస్లిం టెర్రరిస్టులు అరాచకాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంది. వెరసి మన దేశాన్ని సర్వనాశనం చేసేసింది.  ఇదన్నమాట 50 ఏళ్లపాటు మనం ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వపు ఘనత !

1947 లో మనకు స్వతంత్రం వస్తే, 1991 దాకా ఊరుకుని, 44 ఏళ్ల తర్వాత హడావుడిగా Places of worship Act - 1991 ను తేవలసిన అవసరం ఏమిటి? అయోధ్య, మధుర, కాశీ, కుతుబ్ మినార్ ఇంకా వేలాదిచోట్ల దేవాలయాలను ముస్లిములు కూలగొట్టి, ఆక్రమించి, వాటిని మసీదులుగా మార్చినట్లు చరిత్ర చెబుతున్నది, ఆర్కియాలజీ రుజువులు కనిపిస్తున్నాయి. ఇవి మెజారిటీ హిందూ మనోభావాలను  దెబ్బతీస్తున్నాయి. వాటిని చూచిన ప్రతిసారీ, హిందువుల రక్తం ఉడికిపోతున్నది. ఈ చారిత్రక తప్పిదాలను సరిచేయవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదా? మరి అదేం చేసింది? అగ్నికి ఆజ్యం పోసింది. పైగా ఇలాంటి చట్టాన్ని తెచ్చి ఈనాడు సమస్యను ఇంకా జటిలం చేసి కూచుంది. ప్రభుత్వం ఉండేది సమస్యలు తీర్చడానికా, ఇంకా పెంచడానికా? కంచె చేను మెయ్యడం అంటే ఇదేనా కాదా?

Places of worship Act - 1991 తో హిందువులకే దెబ్బ. దీనిని ఒప్పుకున్నామంటే ఏమిటి అర్ధం? 14 ఆగస్టు 1947 వరకూ మన దేశంలో జరిగిన ఘోరాలన్నిటినీ మనం ఆమోదించి ఒప్పుకున్నట్టు అయింది. దీనిని ఆమోదించింది ఎవరు? కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఎంపీలు. ఈ చట్టం ఆమోదింపబడినప్పుడు, హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకుని ఈ పనిని చేశారా? లేకపోతే, మైనారిటీలను దువ్వడానికి భరతమాత పరువూ మర్యాదల్ని అమ్ముకున్నారా? వీళ్ళు ప్రజాప్రతినిధులా? సిగ్గుందా అసలు?

ఇప్పుడు, 2022లో, Anti Conversion Bill రాకుండా ఉంటే ఎవరికీ నష్టం? మళ్ళీ హిందువులకే నష్టం. ఎందుకని? మతమార్పిళ్ళతో దేశ డెమోగ్రఫీ మారిపోతున్నది గనుక. ప్రతిమత మార్పిడీ, మతవిద్వేషాన్ని రెచ్చగొట్టడమే. అమాయకులైన హిందూనిమ్నకులాలలో  హిందూమతం పైన విద్వేషాన్ని నింపడమే. ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగితే, త్వరలో ఈ దేశం సివిల్ వార్ వచ్చే దిశగా ప్రయాణిస్తున్నది. మరి, ఈ బిల్లును రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? మళ్ళీ అదే కాంగ్రెస్, దాని భజనపార్టీలు. అసలీ దేశంలోని మెజారిటీలైన హిందువుల ప్రయోజనాలకు అనుగుణంగా ఒక్క చట్టమూ రాదా? ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాపాలకులు చేయవలసింది ఇదేనా? వీళ్ళు ప్రజా రక్షకులా లేక ప్రజా భక్షకులా?

'జ్ఞానవాపి మసీదు' అనే పేరే, 'ఇల్లీగల్ సంతానం' అన్నట్లు, వినడానికి చాలా అసహ్యంగా ఉంది, అదొక అపభ్రంశ పదం. అదొక చారిత్రిక తప్పిదం. అక్కడున్న మసీదును వెంటనే తొలగించి, దానిని తిరిగి కాశీ విశ్వనాధ మందిరంలో కలపాలి. ఇది హిందువుల డిమాండ్ !

ఈ పరిస్థితిలో, ఒవైసీ వంటి మతోన్మాదులు కల్పించుకుని అర్ధంలేని స్టేట్ మెంట్లు ఇస్తూ, ప్రజలలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అక్కడేదో తన పర్సనల్ ప్రాపర్టీ పోగొట్టుకున్న రీతిలో ఒవైసీ మాట్లాడుతున్నాడు. మన దేవాలయాల్ని ఆక్రమించి కూలగొట్టింది వాళ్ళు. ఇప్పుడు ఖాళీ చెయ్యమంటే, ఇదేం వాగుడు?

మరిప్పుడు ముస్లిములు ఏం చెయ్యాలి?

నేనే గనుక ఈ మతిలేని ముస్లిముల లీడర్ని అయితే, వాళ్ళకి ఇలా చెబుతాను.

'ఇతరమతాల స్థలాల మీద మసీదును కట్టకూడదని, అలా కట్టిన మసీదులో అల్లా ఉండదని ఇస్లాం చెబుతున్నది. కనుక, మనంతట మనమే గౌరవంగా జ్ఞానవాపి స్థలాన్ని, హిందువులకు అప్పగిద్దాం.  దానిని బదులుగా, ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకుని అక్కడ మన మసీదును ఇంకా మంచిగా కట్టుకుందాం. దుబాయ్ నుంచి, సౌదీ నుంచి అక్రమ ఫండ్స్ ఎలాగూ మనకు బోలెడన్ని వస్తాయి. అక్కడిదాకా ఎందుకు? ఇండియా మొత్తం మీద టాక్స్ కట్టకుండా రోడ్లమీద పండ్ల వ్యాపారాలు చేస్తున్న మనవాళ్లంతా ఆ బ్లాక్ మనీలో 1% ఇస్తేచాలు, ఆ ప్లేస్ లో బ్రహ్మాండమైన మసీదును కట్టుకోవచ్చు. అలా కట్టుకుందాం. జ్ఞానవాపిని వదిలేద్దాం' అని నేనంటాను.

సమస్య పరిష్కారమై పోయింది ! ఇలా చేస్తే, ముస్లిమ్స్ అన్నా, ఇస్లాం అన్నా, హిందువులలో గౌరవమూ ప్రేమా పెరుగుతాయి. ముస్లిమ్స్ మీదున్న టెర్రరిస్టులు అనే ముద్ర ఒక్క దెబ్బతో మాయమై పోతుంది.

ఇలా విశాలమైన దృష్టిలో ముస్లిం లీడర్స్ ఎందుకు ఆలోచించరు? దీనివల్ల వాళ్లకు పోయేదేముంది? 'ఇస్లాం అంటే శాంతి, అది, ఇది' అంటూ వాళ్ళు చెప్పే నీతులు ప్రాక్టికల్ గా ఆచరించి చూపిస్తే ఎంత బాగుంటుంది? వాళ్లిలా ఎందుకు చెయ్యలేరు?

అది విశ్వనాధ ఆలయమే అని అందరికి తెలుసు. గుడి గోడలే సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.  గుడి ఆవరణలోనే మసీదు ఉంది. ఇంకా పట్టుదలలెందుకు? గొడవలెందుకు? ప్రభుత్వమే ఇంకొక చోట స్థలాన్నిస్తుంది. అక్కడ మసీదు కట్టుకోండి. ఎవరొద్దన్నారు? హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఉంటే మీకేమొస్తుంది?

వక్ఫ్ బోర్డులు, ముస్లిం లీడర్స్ ఈ కోణంలో ఎందుకు ఆలోచించరు? మీ తాతముత్తాతలు చేసిన ఘోరమైన నేరాన్ని మీరెందుకు సరిదిద్దుకోలేరు? ఇలా చేస్తే మీకేంటి నష్టం?

ఆలోచించండి మరి !

17, మే 2022, మంగళవారం

రాహుల్ భట్ హత్య - వైష్ణవదేవి బస్సు ప్రేలుడు

కాశ్మీర్లో రాహుల్ భట్ హత్య జరిగింది. ఇతను PM ప్యాకేజి ఉద్యోగి. ఆఫీసులో ఇతన్ని పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపేశారు. ఏమిటి ఇతను చేసిన నేరం? కాశ్మీర్ వాడై ఉండి, కాశ్మీర్లో ఉద్యోగం చెయ్యడం. దీనికి ముస్లింహంతకులు చెప్పే లాజిక్ - 'కాశ్మీర్ మాది. ముస్లిములు కానివాళ్ళందరూ నాన్ లోకల్స్. కాబట్టి వాళ్ళిక్కడ ఉండకూడదు. కాశ్మీర్ డెమోగ్రఫీ ని మార్చకూడదు. ఇక్కడకొస్తే చంపేస్తాం'.

ఇది చదివినప్పుడు నాకు నవ్వొచ్చింది. కారణమేమంటే, అసలు ముస్లిమ్స్ కాశ్మీర్ కు ఎక్కడనుంచి వొచ్చారు? వాళ్ళు లోకల్స్ ఎలా అవుతారు? ఎక్కడో నార్త్ వెస్ట్ నుండి, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల నుండి మన దేశానికి వచ్చి 1100 ఏళ్ల నుంచీ కాశ్మీర్లో చెదపురుగుల లాగా పెరిగిపోయి, 'ఇప్పుడు కాశ్మీర్ మాదే, వేరేవాడు ఇక్కడకు రాకూడదు, వస్తే చంపుతాం' అంటే అదేం లాజిక్? దౌర్జన్యంతో బ్రతకడం  ఒక్కటేనా వీళ్లకు అల్లా నేర్పించింది? 'ముందు మంచివాడిలా నటిస్తూ అడుగుపెట్టు, తర్వాత జనాభాని కనేసి, ఈ దేశం మాదే అనేయ్' ఇదేనా మహమ్మద్ బోధించిన నీతి?

ఈ ప్రమాదకరమైన ప్లాన్ తో ముందుముందు ఇండియాలోని ప్రతి రాష్ట్రం ఏమి కాబోతోంది మరి? 

వైష్ణవదేవి యాత్రకు వెళుతున్న బస్సును బాంబులతో పేల్చేశారు మళ్ళీ అదే ముస్లిం హంతకులు. పాతికేళ్ల క్రితం మా స్నేహితుడు సందీప్ కుమార్ భట్టాచార్య శ్రీనగర్ లో జరిగిన బాంబు దాడిలో చనిపోయాడు. అప్పుడతనికి 30 ఏళ్ళు మాత్రమే. అతను చేసిన నేరమల్లా, కుటుంబంతో కలసి కాశ్మీర్ యాత్రకు వెళ్లడమే. టీ త్రాగడం కోసం అక్కడి లాల్ చౌక్ లో వీళ్ళ బస్సు ఆగింది. ఆగిఉన్న బస్సులోకి బాంబు విసిరారు ముస్లిం హంతకులు. బస్సు పేలిపోయింది. కొంతమంది చనిపోయారు. మిగిలిన వాళ్ళు తీవ్రగాయాలతో బయటపడ్డారు. సందీప్ స్పాట్లో చనిపోయాడు. కుటుంబసభ్యులు బ్రతికారు. ఎంత నరకం? చిన్నపిల్లలతో అతని భార్య ఎంత నరకం చూసి ఉంటుంది?

ఇదా ఇస్లామంటే? ఈ రకంగా అమాయకులను హత్యలు చెయ్యమని ఇస్లాం చెప్పిందా? ఒకవేళ ఇలాంటి బోధనలను చేస్తుంటే, అలాంటి రాక్షసమతాన్ని వెంటనే మనదేశంలో నిషేధించాలి. అసలీ ఇస్లాం, క్రైస్తవమతాలు ఏ దేశంలో అడుగుపెడితే ఆ దేశాన్ని సర్వనాశనం చేశాయి. అక్కడి లోకల్ భాషలనూ, సంస్కృతులనూ, మతాలనూ, ఆచారాలనూ, సంప్రదాయాలనూ అన్నింటినీ తుడిచిపెట్టేశాయి. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.

అయితే ఇస్లాం అనేది దౌర్జన్యంతో, హింసతో, కుట్రలతో, హత్యలతో ఈ పనిని చేస్తే, క్రైస్తవమనేది నయగారాలతో, మాయమాటలతో, కులవిద్వేషాలను రెచ్చగొడుతూ, అబద్దాలను నూరిపోస్తూ, డబ్బులు ఎరగా వేసి, చాపకింద నీరులాగా విద్య, వైద్యం అనే రెండుదారులలో తన పనిని చేసుకుంటూ వస్తున్నది. ప్రపంచదేశాలలో ఎన్నో సంస్కృతులు, భాషలు ఈ రెండు మతాల కాళ్లక్రింద నలిగి నామరూపాలు లేకుండా చనిపోయాయి.

క్రైస్తవకుట్రలకు, ఇస్లామిక్ దేశాల దౌర్జన్యాలకు, లొంగకుండా ధైర్యంగా నిలబడిన ఒకే ఒక దేశం ఇజ్రాయెల్. ఇస్లాం అరాచకాలను ధైర్యంగా ఎదుర్కుంటున్న ఒకే ఒక దేశం ఇండియా. అందుకనే ఈ రెండుదేశాలూ ఫ్రెండ్స్ అయ్యాయి.

ముందు, అమాయకుల లాగా, వ్యాపారం కోసమని అడుగుపెట్టడం. మెల్లిగా అన్నీ ఆక్రమించి దోచుకోవడం ఒక మతం చేస్తే, యుద్ధాలు, హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలతో ఇంకో మతం మన దేశంలో అడుగుపెట్టి ఆక్రమించింది. మనకు స్వతంత్రం వచ్చి, 75 ఏళ్ళైనా, నిజంగా చెప్పాలంటే నిజమైన స్వాతంత్య్రం మనకింకా రాలేదు.

కాశ్మీర్ వాళ్ళైన పండిట్లు కాశ్మీర్లో ఉంటే డెమోగ్రఫీ మారిపోతుంది. బయటనుంచి వచ్చిన ముస్లిములు పండిట్లను చంపవచ్చు. అది తప్పు కాదు. ఈ విధంగా ఒక రాష్ట్రం డెమోగ్రఫీ మారిపోయే పనైతే, ప్రతి మతమార్పిడితోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, డెమోగ్రఫీ ఎంతగా మారిపోతున్నది? మరి మతమార్పిడిని నిరోధించవలసిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. లేకపోతే కొంతకాలానికి దేశమే ప్రమాదంలో పడుతుంది.

మనకు పట్టుకున్న దరిద్రాలలో ఇంకొకటి చిల్లులగంప లాంటి రాజ్యాంగం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రాజ్యాంగాలనూ కాపీ కొట్టి తయారుచేసుకున్న ఘనత వహించిన రాజ్యాంగం మనది. మన రాజ్యాంగాన్ని మన దేశపరిస్థితులకు అనుగుణంగా రాసుకోవాలి. అంతేగాని, అవసరం లేకపోయినా సరే, ప్రపంచంలోని రాజ్యాంగాలనన్నింటినీ కాపీ కొట్టి ఒక సాంబార్ తయారు చెయ్యకూడదు. కానీ మనం అదే చేసుకున్నాం. అభివృద్ధిని అడుగడుగునా ఎలా అడ్డుకోవచ్చో, దేహద్రోహశక్తులను ఎలా సపోర్ట్ చేయవచ్చో, ప్రతిమంచిపనికీ ఎలా అడ్డుపడవచ్చో, రీసెర్చి చేసి మరీ దానిని రాసుకున్నాం. మరి పరిస్థితి ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది మరి !

మన టీవీచానల్స్ కూడా, లోకల్ రొచ్చుగుంట పాలిటిక్స్ ని, యూట్యూబర్స్ కొట్టుకోవడాన్ని, ఒకళ్ళపైన మరొకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడాన్ని, రోడ్లమీద అరుచుకున్నట్లు అరుచుకునే 'డిబేట్స్' నో చూపించే బదులు, ఇలాంటి అతిముఖ్యమైన  న్యూస్ ను, దేశభద్రతకు ముందుముందు పెనుముప్పుగా మారబోతున్న ఇలాంటి ముఖ్యమైన అంశాలను విశ్లేషించే ప్రోగ్రాం ఒక్కటీ చెయ్యడం లేదు. చేసే ధైర్యం కూడా వాటికి లేదు. మన ఛత్రపతి శివాజీ మీద సినిమా తీసుకోవాలంటే వణుకు పుట్టి చచ్చే స్థితిలో ఉన్నాం, మన దేశంలో మనం ! అదీ సంగతి !

మొదటినుంచీ మన దేశం నాశనమౌతూ వచ్చింది బయటవాళ్ళతో కాదు, లోపలి శత్రువులతోనే. శ్రీకృష్ణుడి కాలం కంటే ముందునుంచీ మనదేశం విదేశీ దండయాత్రలకు గురౌతూనే ఉంది. ఆయన్ను కూడా, గ్రీకులు, రోమన్లు, పరిషియా వాళ్ళు, చైనావాళ్ళు ఈ విధంగా అనేక జాతులవాళ్ళు దాడి చేశారు. అయితే అప్పట్లో వీళ్లందరినీ వేరే వేరే పేర్లతో  పిలిచారు. అప్పట్లో కూడా కొంతమంది దేశద్రోహులే లోపలనుంచి వాళ్లకు సపోర్ట్ చేశారు. ఇదంతా భాగవతంలో భారతంలో రికార్డ్ చేయబడి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. విచిత్రమేమంటే, వేలాది ఏళ్ళు గడిచినా, ఇప్పటికీ అదే చరిత్ర కొనసాగుతూ ఉంది.

రావణకాష్టం లాంటి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?

నాకు తెలిసి మూడు పరిష్కారాలున్నాయి. 

ఒకటి - అంతశ్శత్రువులను ఏరి పారెయ్యాలి. ఇక్కడ ఉంటూ, శత్రుదేశాలను సపోర్ట్ చేసేవాళ్లను, ఇజ్రాయెల్ ఎలా చేస్తుందో అలా ఎరెయ్యాలి.

రెండు - రాజ్యాంగాన్ని మార్చి, భారతదేశాన్ని హిందూదేశంగా డిక్లేర్ చెయ్యాలి. హిందూదేశంలో ఎవరికీ ఏ విధమైన  భయమూ ఉండదు.  కారణమేమంటే, మనం మతాలు మార్చము. ఇతర మతస్తులను చంపము. ఇదెలా కుదురుతుంది అంటారా? ఒకప్పుడు ప్రజాస్వామ్య దేశమైన బాంగ్లాదేశ్ ఇప్పుడు ఇస్లామిక్ దేశంగా డిక్లేర్ చేసుకోలేదా? ఇదీ అంతే. భారతదేశం ఎప్పటినుంచో హిందూదేశమే. కానీ రాజ్యాంగాన్ని ఇంకో విధంగా రాసి మనకు అంటగట్టారు. అదే మనకు పట్టిన దరిద్రం. ముందు ఈ దరిద్రం వదలాలి.

మూడు - మతమార్పిళ్లను నిరోధించాలి. మతం మారినవాడికి ఓటుహక్కును తీసెయ్యాలి. ప్రభుత్వరాయితీలు కట్ చేయాలి. అదేవిధంగా, హిందూ కులం పేరుతో రిజర్వేషన్ అనుభవిస్తూ, క్రైస్తవమతంలోకి మారితే, లేదా అనుసరిస్తే, ఆ రిజర్వేషన్ని వెంటనే కేన్సిల్ చేయాలి. ఆ ఉద్యోగాల నుండి అలాంటి వారిని వెంటనే డిస్మిస్ చెయ్యాలి.

'లివ్ అండ్ లెట్ లివ్' అనేది మన పాలసీ. 'లివ్ బై కిల్లింగ్ అదర్స్' అనేది వాళ్ళ పాలసీ. అలాంటప్పుడు, కలిసి బ్రతకడం ఎందుకు? ఎవరి దేశాలకు వాళ్ళు పోయి హాయిగా బ్రతకవచ్చు.

ఇంకో నావెల్ ఐడియా చెబుతా.

మన దేశజనాభాలో అందరికీ DNA టెస్ట్ చేయించాలి. ఎవరి జీన్స్ ఏ దేశానివైతే, ఆ దేశానికి వాళ్ళు పోయి అక్కడ బ్రతకాలి. అరేబియా జీన్స్ ఉంటే అరేబియా దేశానికి పోవాలి. ఆఫ్రికా జీన్స్ ఉంటే ఆఫ్రికాకు పోవాలి. ఇండియా జీన్స్ ఉంటే ఇండియాలో ఉండాలి.  అప్పుడు సమస్య తీరిపోతుంది. అక్కడ వాళ్ళు లోకల్స్ అవుతారు కదా మరి !

అయితే, ఇది చెప్పుకున్నంత తేలికనా? అంటే, కాదు. జరిగే పని కూడా కాదు. మరేం చెయ్యాలి?

ప్రస్తుతానికి మతమార్పిడి నిరోధకచట్టం వెంటనే రావాలి. హిందువులందరూ దానిని సపోర్ట్ చెయ్యాలి. డిమాండ్ చెయ్యాలి. ఇవన్నీ జరగాలంటే, బీజేపీని 100% అందరూ సపోర్ట్ చెయ్యాలి. అన్ని రాష్ట్రాలలో బీజేపీనే అధికారంలోకి రావాలి. చట్టసభలలో అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి. అప్పుడే ఈ దేశం రక్షింపబడుతుంది. లేదంటే ముందుముందు మనదేశం ఏమౌతుందో ఎవరికివారే తేలికగా ఊహించుకోవచ్చు. 

16, మే 2022, సోమవారం

'A Hymn To Goddess Tara' - E Book released today

ఈరోజు వైశాఖపౌర్ణమి. బుద్ధుని జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. బుద్ధభగవానుని అమితంగా ఇష్టపడే నేను ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యతనిస్తాను.

మూడేళ్ల క్రితం 2019 లో ఇదే రోజున జిల్లెళ్ళమూడి నుండి 'ధర్మపదం' పుస్తకాన్ని విడుదల చేశాము. నేడు ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నాము.

ఇంతకుముందు చెప్పినట్లుగా, 'తారాస్త్రోత్రం' ఆంగ్ల అనువాదం 'A Hymn To Goddess Tara' అనే పేరుతో అందుబాటులోకి వస్తున్నది.

ఇంగ్లీష్ మాత్రమే తెలిసినవారికీ లేదా, ఇంగ్లీష్ లో చదవడాన్ని ఇష్టపడేవారికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఆంగ్లభాషలో ప్రచురింపబడటం ద్వారా ఈ పుస్తకం ఇప్పుడు అంతర్జాతీయ పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. యూరప్, అమెరికాల నుంచి చాలాకాలం నుంచీ దీనికోసం ఎదురుచూస్తూ, నాకు మెయిల్స్ ఇస్తున్న కొంతమంది తెల్లవాళ్ళకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడటమే గాక, తంత్రసాధన గురించిన రహస్యాలను మరింతగా వారికి అందుబాటులోకి తెస్తుంది.

సంస్కృత శ్లోకాలను తెలుగుపద్యాలను ఆంగ్లభాషలోకి మార్చడం కుదరకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, ఇరవై ఏడు సంస్కృతశ్లోకాలను మాత్రం యధాతధంగా ఉంచి, మిగతా వివరణభాగాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేయడం జరిగింది.

ఇది నా కలం నుంచి వెలువడుతున్న 41 వ పుస్తకం. ఈ పుస్తకం రూపుదిద్దుకోవడంలో ప్రధాన పాత్రధారులైన నా శిష్యురాలు అఖిలకు, ముఖచిత్రకారుడు శిష్యుడు ప్రవీణ్ కు, నా శ్రీమతి సరళాదేవికి కృతజ్ఞతలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం google play books నుండి ఇక్కడ లభిస్తుంది. 'తారాస్తోత్రం' తెలుగు పుస్తకం కంటే ఎక్కువగా పాఠకులు దీనిని ఆదరిస్తారని భావిస్తున్నాం.

11, మే 2022, బుధవారం

The Great Oom (Pierre Bernard/Perry Baker) - జాతక విశ్లేషణ

అమెరికాలో ఈనాడు యోగా అనేది అందరికీ తెలుసు. నేటికీ అసలైన యోగాభ్యాసమూ దాని లోతుపాతులూ తెలిసినవాళ్ళు తక్కువే అయినా, యోగా అంటే కనీసం ఆసనాలు ప్రాణాయామంగా అందరికీ తెలుసు.

అసలీ యోగా అనేది అమెరికాలో ఎప్పుడడుగు పెట్టింది? అంటే, 1893 లో వివేకానందస్వామి అక్కడకు వెళ్ళినప్పటినుండి అని చాలామంది అంటారు. కానీ అంతకు చాలాముందే అక్కడ యోగా అడుగుపెట్టింది. ఇది పియర్ ఆర్నాల్డ్ బెర్నార్డ్ అనే వ్యక్తితో జరిగకపోయినా కనీసం అతనివల్ల పాపులర్ అయిందని ప్రస్తుతం అందరూ నమ్ముతున్నారు.

ఈయన 31 అక్టోబర్ 1875 న అయోవా రాష్ట్రంలోని లియోన్ అనే ఊరిలో పుట్టాడు. ఈయన అసలు పేరు పియర్ ఆర్నాల్డ్ బేకర్. పియర్ అనేది ఫ్రెంచ్ పేరు గనుక ఈయన పూర్వీకులు ఫ్రెంచ్ వాళ్ళై ఉండవచ్చు. పెరిగి పెద్దయిన తర్వాత ఈయన ది గ్రేట్ ఓం, అమ్ని పోటెంట్ ఓం, ఓం ది మెగ్నిఫిషేంట్ అనే పేర్లతో పిలవబడ్డాడు.

1880 ప్రాంతాలలో నెబ్రాస్కా రాష్ట్రంలోని లింకన్ అనే ఊరిలో ఈయనొక భారతీయ యోగిని కలిశాడు. ఆ యోగి పేరు సిల్వాయిస్ హమాటి. ఇప్పటికి రికార్డ్ అయినంతవరకూ ఇతని వల్లనే హఠయోగా అనేది అమెరికాలో అడుగుపెట్టింది. ఇతను సిరియన్ మూలాలున్న భారతీయుడు. బెంగాల్ రాష్ట్రంలో ఇతను ఉండేవాడు. అక్కడ కాళీ ఉపాసనను, హఠయోగాన్ని, తంత్రాన్ని నేర్చుకున్నాడు.  ఈయన గురువు పేరు మహీధరుడని తెలుస్తున్నది. స్వామి రామతీర్థగారు కూడా మహీధరుడు తంత్రయోగంలో నిష్ణాతుడైన యోగి అని చెప్పారు. అప్పట్లో రామతీర్ధస్వామి ఒప్పుకున్న మరొక తాంత్రికయోగి పేరు స్వామి జ్ఞానానంద. ఈ మహీధరయోగి అనే ఆయన హమాటిని చేరదీసి ఏడేళ్ల వయసు నుండి ఇరవై మూడేళ్ళ వయసు వచ్చేవరకూ అంటే పదహారేళ్ళ పాటు అతనికి సాధనను నేర్పించాడు.  

ఈనాడు లక్షలాది మంది భారతీయులు అమెరికా మూలమూలలా ఉన్నారు. కానీ 1880 ప్రాంతాలలో అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు 800 కంటే తక్కువే ఉండేవారు. వారిలో ఇతనొకడు. అసలితను అమెరికాకు ఎందుకొచ్చాడు? అంటే, ఏదో ప్రదర్శనలిచ్చే ట్రూపులో సభ్యుడిగానో, గాలికి తిరుగుతూనే అతను అమెరికాకు వచ్చాడని అంటారు. అప్పటికే ఇతను హఠయోగం, తంత్రయోగాలలో నిపుణుడు. చిన్నవయసునుండే, అంటే దాదాపు అయిదేళ్ల వయసు నుండే బెర్నార్డ్ కు యోగాభ్యాసంలో శిక్షణనిచ్చాడు సిల్వాయిస్. ఇది నిజం కాకపోవచ్చు. అయితే, కొన్నేళ్లపాటైనా, ఆ శిక్షణలో రాటుదేలిన బెర్నార్డ్ 1898 జనవరిలో శాన్ ప్రాన్సిస్కోలో ఒక డాక్టర్ల బృందం ఎదురుగా ఒక  డెమో ఇచ్చాడు.

అందులో బెర్నార్డ్, 'కాళీముద్ర' అనే క్రియను ప్రదర్శించాడు. ఈ ముద్రలో ఏం జరుగుతుంది? ఊపిరిని బంధించడం ద్వారా, గుండె కొట్టుకోవడాన్ని దాదాపు ఆపేసి, ఒక విధమైన ట్రాన్స్ లోకి వెళతారు. ప్రాణంపోకపోయినా దాదాపు శవంలాగా అవుతారు.  అప్పుడు ఆ వ్యక్తి శరీరాన్ని సూదులతో గుచ్చినా, చివరకు కత్తితో కోసినా కూడా అతనికి ఏమీ నొప్పి తెలియదు. స్వయానా కొంతమంది డాక్టర్లు ఇతని చెవితమ్మెలకు, ముక్కుకు, పెదవులకు, చెంపలకు సూదులు గుచ్చి చూశారు. ఇతనిలో చలనం లేదు. ఈ డెమో చూసిన అమెరికన్ డాక్టర్లు నిర్ఘాంతపోయారు. ఇది అమెరికన్ మెడికల్ హిస్టరీలో రికార్డ్ కాబడిన సంఘటన. ఆ తరువాత, ఇచ్చానుసారం తన గుండెను కొట్టుకోవడం ఆపేసిన యోగిగా మళ్ళీ స్వామీ రామా ప్రసిద్ధికెక్కాడు.  స్వామి రామా ఈ  డెమోను 1970 లో మళ్ళీ అమెరికన్ డాక్టర్ల బృందం ముందు చూపించాడు.

కాళీముద్ర లాంటివి తంత్రయోగంలో  చాలా చిన్న క్రియలే అయినప్పటికీ, చూచేవాళ్లకు మాత్రం దిగ్భ్రాంతి కలుగుతుంది. భారతదేశంలో మహారాజుల ఎదుట గారడీ చేసేవాళ్ళు ఇలాంటి విద్యలను పాతకాలంలో ప్రదర్శించేవారు. ఒక గుంతను తవ్వి అందులో ఈ క్రియ తెలిసినవారిని పాతిపెడతారు. చుట్టూ రాజభటులు కాపలా ఉంటారు. 40 రోజుల తర్వాత మట్టి తవ్వితే ఆ మనిషి నవ్వుతూ లేచి బయటకొస్తాడు. పాతకాలంలో ఇది చాలామంది మహారాజుల ఎదుట ప్రదర్శింపబడిన విద్యయే. అంతమాత్రం చేత ఆ మనిషి ఒక మహనీయుడూ, మహాయోగీ  కాడు, కాలేడు. కుమ్భకాన్ని సాధిస్తే దీనిని చెయ్యవచ్చు. ఇదొక గారడీ లాంటిది.

యోగ-తంత్రాలలో ఉన్నతస్థాయిలైన సవికల్ప, నిర్వికల్పసమాధి స్థితులను  చవిచూసినవారు ఇలాంటి ప్రదర్శనలను చిల్లరపనులుగా భావిస్తారు. శ్రీరామకృష్ణుల వంటి మహనీయులు ఇలాంటి ప్రదర్శనలను అసహ్యించుకునేవారు. అయితే, యోగం నిజమే, తంత్రక్రియలు నిజాలే, మన శరీరంలోని ఇన్ వాలంటరీ సిస్టం ను కూడా మనం అదుపు చేయవచ్చు అన్న విషయాన్ని ఇలాంటి యోగప్రదర్శనలు  లోకానికి తిరుగులేకుండా నిరూపిస్తాయి. ఇది సైన్సుకు అంతుబట్టని విషయం.

ఈ విషయాన్ని ప్రముఖంగా వెల్లడి చేస్తూ 'న్యూ యార్క్ టైమ్స్' పత్రిక తన జనవరి 29, 1898 సంచిక ముఖచిత్రంగా పియర్ బెర్నార్డ్ ఫోటోను ప్రచురించింది.

బెర్నార్డ్, 1905 లో 'తాంత్రిక్ ఆర్డర్ ఆఫ్ అమెరికా' ను స్థాపించాడు. అయితే అది ఎక్కువకాలం పాటు బ్రతకలేదు. 1910 లో New York Sanskrit College ని స్థాపించాడు.వేలాది సంస్కృత గ్రంధాలను సేకరించి ఇక్కడ ఉంచాడు. చాలామంది రీసెర్చి స్కాలర్లకు అది రిఫరెన్స్ లైబ్రరీగా ఉపయోగపడింది. 1918 లో క్లివ్ ల్యాండ్, ఫిలడెల్ఫియా, చికాగో, న్యూయార్క్ లలో తాంత్రిక్ క్లినిక్స్ ను మొదలుపెట్టాడు.  ఈ విధంగా ఎదుగుతున్న ఇతనికి గట్టి దెబ్బ 1910 లో తగిలింది.

తమ ఇష్టానికి వ్యతిరేకంగా తమను బంధించాడని, తన శక్తులతో తమను అదుపులో పెట్టుకున్నాడని ఇద్దరు టీనేజీ శిష్యురాళ్ళు 1910 లో ఇతని మీద కేసు పెట్టారు. ఇతనికి పరిచయమైన ఏ అమ్మాయైనా సరే, ఇతని ఆకర్షణనుండి తప్పుకోలేదని, ఇతనొక అద్భుతమైన వ్యక్తని వాళ్ళన్నారు. సెక్స్ పరమైన ఆరోపణలు కూడా ఇందులో ఉన్నాయి. దానిలో ఇతని పరువు పోవడమే గాక, సందు దొరికిందని భావించిన క్రైస్తవ మిషనరీలు యోగా మీద బురద చల్లఁడం మొదలుపెట్టారు. ఇది సైతాన్ కల్ట్ అంటూ ప్రచారం చేసి ఇతని పరువు తీశారు. కానీ ఆ తరువాత ఆ అమ్మాయిలు కేసును ఉపసంహరించుకోవడంతో ఇతను గట్టెక్కాడు.

ఈ కేసుతో ఇతని పరువు పోయినా మళ్ళీ పుంజుకొని యోగా, తంత్రాలకు మంచి ప్రచారం కల్పించాడు. 1931 లో న్యూయార్క్ దగ్గరలో హడ్సన్ నదితీరంలో ఇతనికి 200 ఎకరాల ఆశ్రమం ఉండేది. కనీసం 400 మంది ఉన్నత కుటుంబాలకు చెందిన ధనికవర్గం ఇతని శిష్యులుగా ఉండేవారు. వీళ్ళలో సెనేటర్లు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ డీలర్లు, సినిమా స్టార్స్, బాక్సర్లు, అధ్లెట్లు, క్రైస్తవ ఫాదర్లు ఇలాంటి ప్రముఖులందరూ ఉండేవారు. ఈనాడు కొంతమంది కార్పొరేట్ గురువుల జీవనశైలికంటే విలాసవంతమైన జీవితాన్ని అప్పట్లోనే బెర్నార్డ్ గడిపేవాడు.

అప్పట్లో ఇతని శిష్యురాలైన ఇడా రోల్ఫ్ తరువాత 'రోల్ఫింగ్' అనే ఒక సంస్థను మొదలుపెట్టింది. దీనికి అమెరికాలో నేటికీ మంచి పేరుంది. బాడీ ఎలైన్ మెంట్ ను సరిదిద్దడం, కూర్చునే తీరును, నడిచే తీరును సరిదిద్దడం ద్వారా, చాలా నొప్పులను వీళ్ళు తగ్గిస్తారు. ఈ విద్యను ఈమె, బెర్నార్డ్ దగ్గర హఠయోగ శిక్షణలోనే నేర్చుకుంది.

నేడు అమెరికాలో అందరికీ తెలిసిన రోల్ఫింగ్, కీనీసియాలజీ మొదలైన వ్యాయమపద్ధతులకు మూలం మన హఠయోగమే.

ఇతని కజిన్ సిస్టర్ ఓరా రే బేకర్ అనే ఆమె, భారతీయ సూఫీ గురువైన ఇనాయత్ ఖాన్ భార్య అయింది. సంస్కృత కాలేజీని చూడటానికి వచ్చిన ఇనాయత్ ఖాన్ ను తన సిస్టర్ కు హిందూస్తానీ సంగీతాన్ని నేర్పమని బెర్నార్డ్ కోరాడు. ఇనాయత్ ఖాన్ ఉత్తరభారతదేశంలోని సంగీత ఘనాపాఠీల కుటుంబానికి చెందినవాడు. సంగీత పాఠాలు ప్రేమపాఠాలయ్యాయి. వీళ్లిద్దరి ప్రేమను బెర్నార్డ్ ఒప్పుకోలేదు. ఇనాయత్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. బెర్నార్డ్ టేబుల్ మీద కాగితాలలో వెదికి ఇనాయత్ అడ్రస్ పట్టుకున్న ఓరా, ఓడనెక్కి ఒంటరిగా లండన్ కు ప్రయాణం చేసి అక్కడ ఇనాయత్ ను కలుసుకుంది. లండన్లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇనాయత్ ఖాన్ గురించి, నవీన సూఫీ సాంప్రదాయాల గురించి, మెహర్ బాబాతో వీరి సంబంధాల గురించి ఇంకో పోస్ట్ లో వ్రాస్తాను.

ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, 1880 ప్రాంతాలలోనే అమెరికాలో యోగా, తంత్రాలు అడుగుపెట్టాయని చెప్పడమే నా ఉద్దేశ్యం.

ఇప్పుడితన్ని జాతకం పరిశీలిద్దాం.

ఇతనిది అనూరాధా నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులకు కొంచం ఆధ్యాత్మిక చింతన ఉంటే, రహస్యవిద్యలైన యోగం, తంత్రం మొదలైన దారులలో తప్పకుండా నడుస్తారు. ఇది వృశ్చికరాశి గనుక, రహస్యవిద్యలతో వీరికి పరిచయాలు ఉంటాయి. గ్రహయోగాలు అనుకూలిస్తే వీరు యోగమార్గంలో ఉన్నతిని సాధిస్తారు. అదే ఇతని జాతకంలో జరిగింది.

తృతీయంలో శనికుజుల యోగాన్ని చూడవచ్చు. ఇది ఇతని జాతకంలో ఒక ముఖ్యమైన యోగం. శని విక్రమాధిపతిగా స్వస్థానంలో ఉంటూ అమితమైన ధైర్యాన్నిస్తాడు. అంతేగాక క్రమశిక్షణతో కూడిన సాధననిస్తాడు. కుజునికి ఇది ఉచ్ఛస్థానం. కనుక ఈ యోగం మొండి పట్టుదలతోకూడిన కఠోరసాధననిస్తుంది. ఇదే యోగం నవమస్థానాన్ని కూడా  చూస్తున్నందువలన, ఆధ్యాత్మికపరమైన రహస్య సాధనామార్గాలలో నడిపిస్తుంది. మకరరాశి గనుక  భారతీయ ఆధ్యాత్మిక చింతనలను ఇది ఇస్తుంది.

పంచమంలో గురుక్షేత్రంలోని రాహువు వల్ల, పరాయిమతానికి చెందిన రహస్య సాధనల భావజాలం ఒంటపడుతుంది.  ఈ క్రమంలో పరువును పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. 

ద్వాదశంలో నీచరవి, బుధ, శుక్ర, గురువుల సన్యాసయోగాన్ని చూడవచ్చు. ఇది మళ్ళీ రహస్యసాధనలను సూచిస్తుంది. ఈయనకు పెళ్లి అయినప్పటికీ, జీవితాన్నంతా యోగ, తంత్రసాధనలలోనే గడిపాడు. ఆ క్రమంలో స్త్రీలతో కలసి సెక్స్ పరమైన వామాచార తంత్రసాధనలు చేసేవాడని పుకార్లున్నాయి. అది నిజమేనని ఈ యోగం చెబుతున్నది.

1898 జనవరిలో 'కాళీముద్ర' డెమో ఇచ్చిన సమయంలో శనీశ్వరుడు వృశ్చికంలోనే ఉన్నాడు. గురువు కన్యలో ఉన్నాడు. జననకాల చంద్రుని మీద గోచారశని సంచారం వల్ల యోగ-తంత్రాల మహత్యాన్ని లోకానికి నిరూపించే డెమో ఇచ్చాడు.

1910 లో ఇతనిమీద టీనేజీ అమ్మాయిల కేసు నడిచినప్పుడు శనీశ్వరుడు మేషంలో ఉన్నాడు. గురువు కన్యలో ఉన్నాడు. శత్రుస్థానంలో శని నీచత్వం వల్ల కోర్టు కేసును ఎదుర్కొన్నాడు, కానీ లాభస్థానంలో ఉన్న గురువు ఇతన్ని కాపాడాడు. మోపబడిన నేరాలు డ్రాప్ అయ్యాయి.

1955 సెప్టెంబర్ లో ఈయన చనిపోయినపుడు, రాహుకేతువులు వృశ్చిక వృషభాలలో నీచస్తితులలో ఉన్నారు. గురువు నవమంలో ఉచ్చస్థితిలో ఉంటూ యోగిక్ ట్రాన్స్ లో ఈయన దేహాన్ని వదిలేసినట్లు చూపుతున్నాడు. కనుక ఇది యౌగిక మరణమేగాని మామూలు చావు కాదు. 23 ఏళ్ల వయసులో గుండెను ఆపడం డెమో ఇచ్చిన వ్యక్తి 80 ఏళ్ల వయసులో మామూలుగా అందరిలాగా ఎలా చనిపోతాడు? అయితే, ఇతని కోరికలు తీరలేదని, వాంఛలు చావలేదని, సంస్కారనాశనం జరగలేదని, మరణ సమయంలో  నీచస్థితులలో ఉన్న రాహుకేతువులు చెబుతున్నాయి. ఆసనాలు ప్రాణాయామాల వరకేగాని, ఉన్నతస్థాయి ఉపాసనలు ఈయనకు తెలీదని, వాటినీయన చెయ్యలేదని, కేవలం యోగాను ఒక బిజినెస్ గా మాత్రమే మార్చుకున్నాడని ఈ చార్ట్ చెబుతున్నది. 

80 ఏళ్ళు బ్రతికిన ఈయన 1955 లో న్యూయార్క్ లో చనిపోయాడు. ఏదేమైనా,  ఒక అమెరికన్ అయ్యుండి జీవితాంతం యోగ-- తంత్రాలను అభ్యాసం చేసి, ఎన్నో ఒడిదుడుకులకు లోనై, ఎంతో ఎదురుదాడిని ఎదుర్కొని, పరువు పోగొట్టుకున్నా కూడా, వదలకుండా వాటిని ప్రచారం చేసినవారిలో ముఖ్యునిగా ఈయనను మనం మరచిపోకూడదు.

దోశా ఫౌండేషన్

మొన్న సాయంత్రం బ్రేక్ ఫాస్ట్ టైంలో శ్రీమతి ఒక మాటంది.

అదేంటి? బ్రేక్ ఫాస్ట్ అనేది ఉదయం కాకుండా సాయంత్రం కూడా ఉంటుందా? అని చచ్చుప్రశ్న అడక్కండి. ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడే ఉంటుంది. విషయం లోకి రండి.

'మా అత్త ప్రస్తుతం కోయంబత్తూర్ లో ఉంది'.

మింగుతున్న దోశముక్క నా గొంతుకు అడ్డం పడింది.

తలమీద కొట్టుకుంటూ, 'అదేంటి ఆమె డల్లాస్ లో కదా ఉండేది?' అన్నాను.

'అవును. డల్లాస్ నుంచి వచ్చి మొన్నటిదాకా హైదరాబాద్ లోనే ఉంది. ఇప్పుడు కుర్తాళం మీదుగా కోయంబత్తూర్ చేరుకుంది' అన్నది.

'అక్కణ్ణించి ఇంకా కిందకెళితే కన్యాకుమారి వస్తుంది. ఇంకా ముందుకు పోతే శ్రీలంక వస్తుంది. కొంపదీసి అక్కడకు కూడా పోతుందేమో? శ్రీలంకంతా గందరగోళంగా ఉంది. అక్కడికెళ్లొద్దని చెప్పు ఫోన్ చేసి' అన్నా ఇంకో దోశముక్కను తాపీగా నములుతూ.

శ్రీమతికి కోపం వచ్చింది.

'దేన్నీ సరిగా తీసుకోరా మీరసలు?' అంటూ గొంతు పెంచింది.

'సరిగానే తీసుకుంటున్నా చెట్నీతో కలిపి. ఇంకో దోశ వెయ్యి' అన్నా నవ్వుతూ.

'అదికాదు నేనంటున్నది మా అత్త సంగతి' అంది తగ్గి.

'సరే చెప్పు' అన్నా ఇంకో దోశ ముక్కని నోట్లో పెట్టుకోబోతూ.

'ప్రస్తుతం ఆమె 'ఈశా ఫౌండేషన్' ఆశ్రమంలో ఉంది' అంది శ్రీమతి.

ఈసారి నవ్వుతో కొరబోయింది నాకు.

నవ్వీ నవ్వీ ఆపి, తలమీద మళ్ళీ చరుచుకుని, 'ఏం మన 'దోశా ఫౌండేషన్' నచ్చలేదా?' అడిగా.

'అంటే?' అంది తను.

'రోజూ దోశలొద్దంటే వినవు నువ్వు. ఆమె మనింటికి వచ్చినరోజు కూడా దోశలే పెట్టావు. చూశావా ఆమెకి 'దోశా ఫౌండేషన్' అంటేనే విరక్తి కలిగింది. ఈశా ఫౌండేషన్ వైపు చూపు మళ్లింది. అందుకే అప్పుడప్పుడూ ఇడ్లీ చెయ్యమని నీకు చేప్పేది' అన్నా నవ్వుతూ.

'ఏ అప్పుడు 'ఇడ్లీ ఫౌండేషన్' కు పోతుందా?' అడిగింది ఎగతాళిగా.

దానికి సమాధానం చెప్పకుండా సీరియస్ గా ఆలోచిస్తూ, 'గణపతి, కులపతి, దళపతి' అన్నా.

'అవేంటి కొత్త మంత్రాలా?' అంది శ్రీమతి అయోమయంగా.

'మంత్రాలూ కాదు చింతకాయపచ్చడీ కాదు. ఎప్పుడూ నీకదే గోల. కాస్త లౌకికంలోకి రా. ఇరవై ఏళ్ళనాడు గణపతి సచ్చిదానంద భక్తురాలు కదూ ఈమె?' అడిగా ఆలోచిస్తూ.

'అవును. వీర భక్తురాలు. ఆయన్ని తెగ ఫాలో అయ్యేది' అన్నది.

అందుకే ఫస్ట్ గణపతి అన్నా. తర్వాత సిద్దేశ్వరానంద భక్తురాలైంది కదూ? అందుకే కులపతి అన్నా.  మూడోది దళపతి. అంటే, తమిళతంబి. లెక్క సరిపోలా?' అన్నా.

'ప్రస్తుతం కూడా ముందు కుర్తాళం వెళ్లి, తీర్ధం తీసుకుని అక్కణ్ణించి కోయంబత్తూర్ చేరుకుంది' అన్నది.

'అదేంటి తీర్ధం తీసుకుంటే మోక్షం రావాలే? రాలేదా? అయినా తీర్ధం కోసం అంతదూరం పోవాలా? ఇక్కడ హైదరాబాద్లో దొరకదా?' అడిగా అనుమానంగా.

'ఆ తీర్ధం కాదు' అంది కోపంగా.

'ఓహో కుర్తాళం తీర్ధం స్పెషలేమో? అవున్లే అడివి మూలికలన్నీ కలుపుతారేమో దాంట్లో?' అన్నా.

'అదేమో తెలీదు. ఇంకా కొంతమంది లేడీస్ బ్యాచ్ కూడా ఆమెతో ఉన్నారు. అందరూ కలసి ఇప్పుడు కోయంబత్తూరులో ఉన్నారు' అంది. 

'ఓహో ఆడంగుల అరవదేశయాత్రనా? రొంబ సాంబారు. అవున్లే మంత్రం తంత్రం అన్నీ కలిస్తేనే కదా మోక్షం? ట్రై చేస్తే మంచిదే' అన్నా తాపీగా దోశ నములుతూ.

'అక్కడామెకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారట' అన్నది.

'ఈమె వీఐపీ కాదు కదా? ఎందుకిస్తున్నారో?' అడిగాను.

'ఏమో మరి' అన్నది

'నేచెప్తా విను. డల్లాస్ లో ఉంటానని చెప్పి, డాలర్స్ కురిపిస్తే వీఐపీ ఏం ఖర్మ? దాని బాబులాంటి ట్రీట్మెంటిస్తారు. వాళ్ళక్కావలసింది ఇలాంటి బకరాలేగా మరి' అన్నా.

'ఎందుకలా?' అడిగింది.

'చెప్తా విను' అంటూ దోశకు ఫౌండేషన్ వెయ్యడం ఆపి, అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన ఫోజులో చెప్పడం మొదలెట్టా.

'ఇదొక సింబియాసిస్ అన్నమాట ! స్వాములకేమో డాలర్లు కావాలి. అమెరికాలో బ్రాంచి పెట్టడానికి మీ అత్తలాంటి ఏజంట్లు కావాలి. మీ అత్తలాంటి వాళ్ళకేమో అమెరికాలో వాళ్ళ సర్కిల్లో లోకల్ గురువులుగా చెలామణీ కావాలన్న దురద ఉంటుంది.  అందుకని ఒక ఇండియా ఫ్రాంచైసీ కావాలి. కాబట్టి ఇద్దరికిద్దరూ సరిపోతారు. ఇంతే దేవరహస్యం' అన్నా.

'అవునా?' అంది ఆశ్చర్యపోతూ.

'అవును. ఇంతకుముందు మన పంచవటిలో కూడా కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళూ అమెరికాలో లోకల్ గురువులే. నువ్వు గమనించావా లేదో వాళ్ళూ బ్రాహ్మలే. ఈ బ్రాహ్మలకి ఇదొక జబ్బు. పంచాంగాలు, మంత్రాలూ, పూజలని చెప్పి ఎదుటివాళ్ళ దగ్గర, ముఖ్యంగా అమాయకులైన ఇతరకులాల భక్తుల దగ్గర పోజు కొట్టడం వీళ్లకున్న నయంకాని దీర్ఘజబ్బులలో ఒకటి. ఈ బ్రాహ్మణ రుబాబు భరించలేకే నిమ్నకులాలు మతాలు మారేది. అసలు క్రైస్తవం ఇంతగా ఎదగడానికి ఇన్ డైరెక్ట్ గా నీరు పోసింది మీవాళ్లే.

ఉదాహరణకు, మన ఇండియాలో కూడా చూడు. అపార్ట్ మెంట్ లోని ఆడంగులంతా కలిసి 'లలితాసహస్రనామ బ్యాచ్' అని ఒకటి పెడతారు. లేదా 'విష్ణుసహస్రనామ బ్యాచ్' అని పెడతారు. అందులోకూడా మన ఆడంగులే లీడర్లుగా ఉంటారు. పండగలని, పబ్బాలని, తిధులని, నోములని ఉన్నవీ లేనివీ చెప్పి ఆ గ్రూపుమీద అజమాయిషీ చేస్తుంటారు. పాపం అమాయకులైన ఇతరకులాల ఆడవాళ్ళు వీళ్ళ మాటలన్నీ నమ్ముతుంటారు. మన రుబాబు సాగుతూ ఉంటుంది. మనవాళ్ళు మొగయినా ఆడైనా, అమెరికా పోయినా, అంటార్కిటికా పోయినా సరే, ఈ జాడ్యం మాత్రం వదలదు. 

అందుకని అక్కడ బ్రాంచీ పెట్టాలంటే ఇక్కడనుంచి ఒక స్వాములోరి సరిటిఫికేట్ కావాలి. ఊరకే మంచిమాటలు చెబితే ఎవరు వింటారు? మంత్రాలూ, మహత్యాలూ కావాలి, లేదా సోషల్ స్టేటస్ కావాలి. ప్రస్తుతం 'ఈశా' అంటే ఒక స్టేటస్ సింబల్ గా చాలామంది అమాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలు అందులో ఉన్నారు కాబట్టి. అమెరికాలో దాని బ్రాంచి అయితే తేలికగా సక్సెస్ అవుతుంది.

ఇంతా చేస్తే, ముందుగా సరియైన దారిలో సాధనచేసి అనుభవాన్ని పొందుదామని మాత్రం ఎవరికీ ఉండదు. 'ఇన్ స్టెంట్ గా గురువులైపోవాలి, వేరేవాళ్లకు బోధించాలి' ఇదే దురద ఎక్కడ చూసినా. ఇలాంటి దురదగాళ్ళకు, దురదగొండాకు స్వాములోర్లే తగులుకుంటారు. ఉన్న దురదను వదిలిస్తారు.

ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్సూ,  బిజినెస్సూ మాత్రమే. మీ అత్తలాంటి వాళ్ళకేమో ఐడెంటిటీ క్రైసిస్సు. మన స్వాములోర్లకేమో మంచి బిజినెస్సు. అయినా,  మీ అత్తకు ఈ రెండు రోగాలూ ఇంత ఎక్కువగా ఉన్నాయని నాకు తెలీదు సుమీ' అన్నా ఆశ్చర్యాన్ని నటిస్తూ.

'ఇంతుందా దీనివెనుక? ఆమ్మో' అంది శ్రీమతి.

'అవును, చాలా ఉంటుంది కధ. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి. ఎవరి కర్మ వారిది. సరేగాని, ఇంకో దోశ పడేయ్ ఇటు. పొద్దున యోగా కొంచం ఎక్కువైంది. అందుకే 'దోశా ఫౌండేషన్' సరిపోలేదు' అన్నా.

'తిండిబోతు రామన్న' అని విసుక్కుంటూ వంటింట్లోకి దారితీసింది శ్రీమతి.

నేను ప్లేట్లో ఉన్న దోశకు మంచి ఫౌండేషన్ వెయ్యడం మొదలుపెట్టా. అదన్నమాట దోశా ఫౌండేషన్ భాగోతం.

కథ కంచికి. మనం హాల్లోకి.

సుబ్బారాయుడో ఈ దవాఖాన మంచిదంట..

తత్వాలనేవి నిగూఢరహస్యాలను మామూలు వాడుకభాషలో, గ్రామీణభాషలో  చెబుతున్నప్పటికీ, అవేం చెబుతున్నాయి? అన్న విషయంలో మాత్రం అర్ధం కాకుండా ఉంటాయి. వాటిని అర్ధం చేసుకోవాలంటే ఒక్కొక్క పదాన్నీ చాలా ఆలోచించవలసి ఉంటుంది. పైకి కనిపిస్తున్న అర్ధం అసలుది కాదు.  దానిలోపల అసలైన అర్ధం దాగి ఉంటుంది. అందుకే, 'తినగ తినగ వేము తియ్యనుండు' అన్నట్లు. ధ్యానించగా ధ్యానించగా వీటి అసలు అర్ధం అవగతమౌతుంది. 

మధ్యయుగాలలో ఇటువంటి  తత్వాలను దాదాపు అందరు మహనీయులూ చెప్పారు.

మన పంచవటి తత్వాలు ఇవిగో చదువుకోండి మరి !
-----------------------------------------------
సుబ్బారాయుడో
ఈ దవాఖాన మంచిదంట
డబ్బారాయుడో
ఇక జంపకాన కప్పుకుంట

గోలీలను ఇస్తాడు
గోడకు నిలబెడతాడు
రోగమేందొ చెప్పమంటె
సావగొట్టి పంపుతాడు                 || సుబ్బారాయుడో ||

కల్లుపాక నడిపినోడు
ఒళ్ళు బలిసి పొయ్ నాడు
మత్తులోన మునిగినోడు
మళ్ళొస్తానన్నాడు                || సుబ్బారాయుడో ||

పుస్తకాలు చదివినోదు
పురసత్తును మరిచినాడు
గాలికట్ల తిరిగినోడు
గాడ్దె లెక్క మారినాడు              || సుబ్బారాయుడో ||

కిందపైన కలిపినోడు
కిక్కురుమనకున్నాడు
అన్నీ తెలుసన్నవోడు
అడుసులోకి పొయ్ నాడు        || సుబ్బారాయుడో ||

అడుక్కోండి అన్నవోడు 
అప్పచ్చిగ మారినాడు
అబద్దాలు చెప్పినోడు 
ఆగం చేస్తున్నాడు                    || సుబ్బారాయుడో ||

గుంజుకుంటు పోయినోడు
గింజుకుంటు బతుకుతాడు
తలుపుదీసి పరిచినోడు
తమాసగా గతుకుతాడు            || సుబ్బారాయుడో ||

వాగి వాగి సచ్చినోడు
ఒడ్డుకెక్కి నిలిచినాడు
ముంగిలాగ నవ్వినోడు
ముందుచూడమన్నాడు             || సుబ్బారాయుడో ||

పులుసువండి పెట్టినోడు 
పురిట్లోనె పోయినాడు
చారుగాసి పోసినోడు
చబుత్రాల కెక్కినాడు                || సుబ్బారాయుడో ||

ఆగము జేసేటిదొకడు
రాగము దీసేటిదొకడు
పాకము పట్టేటిదొకడు 
పప్పులు కలిపేటిదొకడు            || సుబ్బారాయుడో ||

తవ్వినోడు నింపుతాడు
కూల్చినోడు కడతాడు
పడినోడే లేస్తాడు
పాదుషాగ వెలుగుతాడు            || సుబ్బారాయుడో ||

ఎగురుతున్న నిన్నుజూసి
ఎగిరిపోతవంటాడు
కుములుతున్న నన్నుజూసి
ఖుషీ చెయ్యమంటాడు            || సుబ్బారాయుడో ||
 
సంతలోన తిరిగినోడు
సట్టుబండ లాంటోడు
ముచ్చులెక్క నిన్నుజూసి
ముచ్చటంగ నవ్వుతాడు        || సుబ్బారాయుడో ||

ఏడిస్తే నవ్వుతాడు
నవ్వితేను కొడతాడు
నవ్వూ ఏడ్పులను కలిపి
నాటకాలు ఆడతాడు                || సుబ్బారాయుడో ||

నిన్నొచ్చానంటాడు
రేపొస్తానంటాడు
నిన్నా రేపుల నడుమ
నేనే పొమ్మంటాడు                    || సుబ్బారాయుడో ||

అన్నిటికీ నవ్వుతాడు
ఆడ్డపంచె కడతాడు
ఆత్రంగా ఎదురొస్తే
అసలే పట్టించుకోడు                 || సుబ్బారాయుడో ||

7, మే 2022, శనివారం

వేషాలను నమ్మబోకు తమ్ముడూ...

వేషాలను నమ్మబోకు తమ్ముడూ 

మోసాలకు లొంగబోకు తమ్ముడూ...


మన గడ్డం స్వాములోర్ల కతలు ఇనుకో తమ్ముడూ...


స్వాములోర్ల మంటారు

సాంప్రదాయమంటారు

చాదస్తాల్ నూరిపోసి 

చీకట్లో ముంచుతారు                            || వేషాలను ||


నీతులెన్నొ చెబుతారు

నిష్ఠలంటు నీల్గుతారు

నీవే మా గురువంటె 

నీళ్ళలోకి దించుతారు                        || వేషాలను ||


గడ్డాలే పెంచుతారు

గుడ్డాలే కడతారు

దొడ్డిదారి పనులుచేసి

అడ్డంగా ఎదుగుతారు                      || వేషాలను ||


సత్యాలను చెప్పబోరు

షాపులనే తెరుస్తారు

మా అంగడి మంచిదంటు

నాసిసరుకు అమ్ముతారు             || వేషాలను ||


నాయకులతొ జతకట్టి

నల్లధనం దాస్తారు

బయటకు నీతులు చెబుతూ

బ్రతికేస్తూ ఉంటారు                     || వేషాలను ||


లోకంలో ప్రతివిషయం

మాకెరికేనంటారు

శివరాత్రికి చిందులేసి

సినిమా చూపిస్తారు                     || వేషాలను ||


శాంతిదూతలమనే ప్రభువు బిడ్డల చరిత్రలు ఇవిగో తమ్ముడూ...


పాస్టర్లం అంటారు

పగలే ఎగదోస్తారు

ప్రేమా కరుణా అంటూ

పెత్తందార్లౌతారు                                || వేషాలను || 


మూలాలను మరుస్తారు

ముచ్చట్లే చెబుతారు

మాటలకోటలు కట్టి

మూటలనే పెంచుతారు                 || వేషాలను || 


విదేశీయ ధనం తెచ్చి

పెద్దముద్ద వాళ్ళు మింగి

మెతుకులనే విదిలించి

మేడలెన్నొ కడతారు                        || వేషాలను ||


కులద్వేషం నింపుకుంటు

పైకి ప్రేమ కబుర్లంట

జీససునే శిలువేస్తూ

జీవిస్తూ ఉంటారు                            || వేషాలను ||


శాంతిదూతలం అంటు 

చెత్త చెత్త వాగుతారు

మతం అడ్డుపెట్టుకోని

మహరాజులు అవుతారు                 || వేషాలను ||


ఇకపోతే, సాయెబ్బుల సంగతులు వినరా తమ్ముడూ... 


మైనార్టీలంటారు

మసీదులే కడతారు

ఆల్ ఖైదా జతకట్టి

అందర్నీ చంపుతారు                         || వేషాలను || 


శాంతిశాంతి అంటారు

సమానత్వమంటారు

మైకులు తగ్గించమంటె 

మొత్తానికి లేపుతారు                         || వేషాలను ||


తిండి మనది తింటారు

పాకిస్తానంటారు

దేశభక్తి మరచిపోయి

టెర్రరిష్టులౌతారు                            || వేషాలను ||


గుళ్ల గోడలను కూల్చి

గోడకేమొ మొక్కుతారు

అఙానంటు ప్రతిరోజు

అబద్దాలు పాడతారు                       || వేషాలను ||


పాలించామంటారు

పాదుషాలమంటారు

దేశం ఇస్లాముతోటి

దిగదూస్తామంటారు                     || వేషాలను ||


ఘనత వహించిన మన నాయకుల నాటకాలు చూడరా తమ్ముడూ ...
 

పదవిలోకి రాకముందు

సేవకులం అంటారు

పదవి చేతికందగానె 

ప్రభువులుగా మారుతారు                || వేషాలను || 


కులాలనే రెచ్చగొట్టి

ప్రాంతాలకు చిచ్చుపెట్టి

ప్రజాస్వామ్యమని చెబుతూ

ప్రజాధనం బొక్కుతారు                  || వేషాలను || 


తెల్లబట్టలేసుకోని 

మల్లెపువ్వులాగ తిరిగి

నల్లధనం కూడబెట్టి

నమ్మినోణ్ణి ముంచుతారు                || వేషాలను ||


పవరులోకి రాకముందు

పత్తిత్తుల మంటారు

పవరు చేతికందగానె

పచ్చనోట్ల పండుతారు                  || వేషాలను ||


కంచెచేను మేసినట్టు

గట్టు కట్టు దాటినట్టు

దొరికింది దొరికినట్టు

దోచేస్తూ ఉంటారు                          || వేషాలను ||


ముందు నీతి చెప్పినోడు

వెనుక దొంగ అవుతాడు

ఇంకొకడు నీతి చెబితె 

వాణ్ని అణగదొక్కుతాడు             || వేషాలను ||


అసలీ లోకమే పెద్ద రొచ్చుగుంటరా తమ్ముడూ..


లోకంలో ఎటుచూచిన

లొసుగులతో నిండిపోయె 

లొల్లిలేని బ్రతుకు జూడ

కల్లగానె మిగిలిపోయె                     || వేషాలను ||


నీతిమాట ఎత్తబోతె

నేతిబీరకాయ లెక్క

నీతన్నది లేదులేదు

బూతేరా లోకమంత                             || వేషాలను || 


అవకాశం రానివాడు

అరుస్తూనె ఉంటాడు

అవకాశం దొరికితేను

అడ్డంగా దోస్తాడు                             || వేషాలను ||


మతమన్నది మహామాయ

రాజకీయమసలు మాయ

అవసరమూ అవకాశం

అంతే ఈ లోకమంత                          || వేషాలను ||


చిన్నదొంగ పెద్దదొంగ

గల్లిదొంగ గజదొంగ

అంతా దొంగలమయమే

ఇంతేరా ఈ లోకం                              || వేషాలను ||


ఇవన్నీ వదిలేయ్ రా. నువ్వు మనిషివి. మనిషిలా బ్రతుకు. అంతే చాలు.


లోకమంత పెద్దమాయ

జీవితమొక చిన్నమాయ

మాయలన్ని మంటగలిపి

మనిషిలాగ బ్రతుకు చాలు            || వేషాలను ||


బురదగుంట లోన నిలిచి

బురద కడుగు ప్రయత్నాలు

బుద్ధిలేని వాళ్లపనులు

బుద్ధిగ నీ బ్రతుకు బ్రతుకు            || వేషాలను ||


మూడునాళ్ళ బ్రతుకులోన

మోసమేల? మాయలేల?

విడిదిలాంటి జీవితాన

విషపుతిండి తినగనేల?            || వేషాలను ||


కులం మతం కుళ్ళునంత

కుంపటి కెక్కించమంట

మానవత్వ సువాసనల

మనసులోన నింపమంట             || వేషాలను ||


ఒకడినోరు కొట్టకుండ

ఒంటిగ నిను బ్రతకమంట

బ్రతుకు చెల్లిపోయినాక

ఎవడికెవడు? తెలియమంట             || వేషాలను ||


గుబులు లేని గుండెతోటి

మచ్చలేని మనసుతోటి

సామాన్యపు బ్రతుకు బ్రతికి

దారిబట్టి ఏగమంట                         || వేషాలను ||


వేషాలను నమ్మబోకు తమ్ముడూ

మోసాలకు లొంగబోకు తమ్ముడూ...