Pages - Menu

Pages

2, జూన్ 2022, గురువారం

తుల్సా ఓక్లహామా ఆస్పత్రి షూటింగ్ - జ్యోతిష్య విశ్లేషణ

జూన్ 1, 2022 బుధవారం సాయంత్రం ఐదుగంటల సమయం. అమెరికాలో మళ్ళీ కాల్పులు జరిగాయి. ఈసారి ఓక్లహామాలోని తుల్సా అనే చోట ఒక ఆస్పత్రిలోకి వచ్చిన ఒక నల్లజాతీయుడు నలుగురిని  కాల్చి చంపేసి, చివరలో తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఆ సమయానికి గ్రహస్థితి ఇలా ఉంది.

గమనించండి ! ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దుర్ఘటనలు జరగడం లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ ట్రెండ్ మారింది. ప్రతిచోటా హత్యలు, దాడులు, దుర్ఘటనలు మొదలయ్యాయి.  కారణం? ఇంతకు ముందు టెక్సాస్ షూటింగ్ పోస్ట్ లో నేను సూచించిన ప్రస్తుత గ్రహస్థితే కారణం. 

ఈ చక్రంలో తులాలగ్నం అప్పుడే మొదలైంది. కన్యారాశి ప్రభావమే ఇంకా ఉంది. దశమం అమెరికా అయింది.  తులనుంచి గృహంలో ప్లూటో (మరణం) ఉన్నది. హింసాత్మక సంఘటనలకు కారకుడైన కుజుడు గురువుతో కలసి శపితయోగ అర్గళంలో ఉన్నాడు. వీరిద్దరూ మీనరాశిలో ఉంటూ ఆస్పత్రులను సూచిస్తున్నారు. అమావాస్య వెళ్లిన మూడో రోజు. ఇంకేం కావాలి?

ఈ ఒక్క సంఘటనకే కాదు. కాశ్మీర్లో రజనీ అనే కాశ్మీర్ పండిట్ టీచర్ని ముస్లిం రాక్షసులు కాల్చి చంపేసినా, రాజస్థాన్ బ్యాంక్ ఉద్యోగిని కూడా అదే కాశ్మీర్లో కాల్చేసినా, ప్రేమకు ఒప్పుకోలేదని తమిళనాడులో రోడ్డుమీద అమ్మాయిని పొడిచి చంపేసినా, సింగర్ KK హార్ట్ ఎటాక్ తో  53 ఏళ్లకే చనిపోయినా, అక్రమసంబంధం అనుమానంతో భర్త లవర్ ని, అతని భార్య గ్యాంగ్ రేప్ చేయించి దానిని వీడియో తీయించినా, మంకీ పాక్స్, నైల్ ఫీవర్ లు మానవజాతిని బెదిరిస్తున్నా - ఇలా వ్రాస్తూ పోతే వందలాది రోజువారీ సంఘటనలకు ప్రస్తుతం ఉన్న ఈ గ్రహస్ధితే ప్రేరకం.

మళ్ళీ ఏదో సీజన్ మొదలైనట్టు అనిపించడం లేదూ?