నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

22, జూన్ 2022, బుధవారం

మాల్దీవులలో యోగా చేస్తున్న వారిపై ఇస్లామిక్ గుంపు దాడి - ఇదేనా శాంతియుత ఇస్లామంటే?

నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మాల్దీవులలోని ఫుట్ బాల్ స్టేడియంలో యోగా చేయడానికి దాదాపు 200 మంది సిద్ధమయ్యారు. వారిలో బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ అధికారులు, నాయకులు కూడా ఉన్నారు. ఇండియన్ ఎంబసీ అధ్వర్యంలో అధికారికంగా జరుగుతున్న ఈవెంట్ అది.

హఠాత్తుగా ఒక పెద్ద గుంపు స్టేడియంలోకి జొరబడి, కర్రలతో వారిపైన దాడి చేయడం, వస్తువులను ధ్వంసం చేయడం, యాంటీ ఇండియా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ అధికారులు కూడా ఉన్నారు గనుక, వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలు ఉపయోగించి దుండగులను అదుపుచేశారు. వారిపైన తగిన చర్యలుంటాయని మాల్దీవ్స్ అధ్యక్షుడు ప్రకటించారు. 

ఈ దౌర్జన్యచర్యకు ముందు, 'యోగా అనేది ఇస్లాంకు వ్యతిరేకం కనుక దీనిని చెయ్యకూడదు' అంటూ బ్యానర్స్ ను వారు ప్రదర్శించారు. నినాదాలు చేశారు. మాల్దీవులలో అధికారికమతం సున్నీ ఇస్లాం. ఇక చెప్పేదేముంది? వారిలో మూర్ఖత్వం తప్ప, సహనం, శాంతి ఎలా ఉంటాయి?

అసలేంటి మాల్దీవ్స్ కధ?

ఇది హిందూమహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపం. బుద్ధుని కాలానికంటే ఎంతో ముందే ఇండియానుంచి కొంతమంది ఈ ద్వీపానికి వలసవెళ్లి స్థిరపడ్డారు. వీరిలో గుజరాత్ ప్రజలున్నారు. తమిళనాడు ప్రజలున్నారు. మొదట్లో ఇది ఒక మినీ ఇండియాగా ఉండేది. తరువాత  వెయ్యేళ్ళ పాటు బౌద్ధమతం అక్కడ వెల్లివిరిసింది. 

12 వ శతాబ్దంలో అక్కడికొచ్చిన అరబ్ వర్తకుల మాయమాటలు నమ్మిన మాల్దీవ్స్ రాజు తన మతాన్ని మార్చుకుని ఇస్లాం స్వీకరించాడు.  అక్కడనుంచి ఆ ద్వీపం ఖర్మ కాలింది. ఈరోజున, ప్రశాంతంగా యోగా చేసుకుంటున్న జనంపైన ఇస్లామిక్ గూండాలు దాడిచేసే స్థాయికి దిగజారిపోయింది. అదీ ఇస్లాం అక్కడ స్థాపించిన 'శాంతి'.

సైద్ధాంతికంగా చూస్తే, ఇస్లాం కంటే బౌద్ధం ఎంతో ఉన్నతమైన మతం. ఒక్క అనాత్మవాదాన్ని పక్కన ఉంచితే, దానిలో మిగతాదంతా బంగారమే. అలాంటి బంగారుమతాన్ని వదలిపెట్టి, అసహనాన్ని, దౌర్జన్యాన్ని, హింసనూ ప్రేరేపించే ఇస్లాంను స్వీకరించడమే మాల్దీవుల తప్పు. నేడు పరిస్థితి ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది మరి?

అసలీ దౌర్జన్యం వెనుక కతార్ వంటి మూర్ఖపు అరబ్ దేశాలూ, పాకిస్తానూ ఉన్నాయన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఇండియా అంటేనే మండిపడే ఈ మూర్ఖపు దేశాలకు యోగాలో ఉన్న ఔన్నత్యం ఎలా అర్ధమౌతుంది? అసలు, ప్రపంచమంతా ఇస్లాం చెప్పినట్లే ఎందుకుండాలి? ఇస్లాంలో అంత గొప్ప సైద్ధాంతిక ఔన్నత్యమూ లేదు. ఆధ్యాత్మిక శిఖరాలూ లేవు. శాంతీ, సహనమూ, మానవత్వమూ, ప్రేమా, దయా, జాలీ ఏవీ లేవు.

ఇస్లామనేది నిన్నగాక మొన్నొచ్చిన పిల్లమతం. మతాలన్నిటిలోకీ చిన్నవయసున్నది అదే. దానికంటే వేలాది ఏళ్లుముందు పుట్టి, ఎంతో గొప్ప సైద్ధాంతిక ఔన్నత్యాలూ, మానవతా దృక్పథాలూ, సహనమూ, శాంతీ ఉన్న హిందూమతం లాంటి ఎన్నో మతాలు ప్రపంచంలో ఉన్నాయి. ఈరోజున ఇదొచ్చి అన్నిటిమీదా దౌర్జన్యమేంటి? ఎన్ని దౌర్జన్యాలను అది చేస్తున్నా, దానిని అందరూ ఆమోదించడమేంటి?

అసలు, ప్రపంచమంతా ఇస్లాం చెప్పినట్లు ఎందుకు వినాలి? ఆ మతంలో అంత గొప్ప ఔన్నత్యమేమీ లేదే?

చూడబోతుంటే ప్రపంచం, శాంతి వైపుకంటే అశాంతివైపే పోతున్నట్లు కనిపిస్తోంది. కలియుగంలో ధర్మం అధర్మంగా, న్యాయం అన్యాయంగా, సత్యం అసత్యంగా కనిపిస్తుందని అంటారు.

కలియుగం ముదరడమంటే ఇదేనేమో? ముందు ముందు ఇంకెన్ని దేశాలకు ఈ విషం వ్యాపించబోతోందో? పరిస్థితులు ఇలా ముదిరి ముదిరి, ప్రపంచమంతా ముస్లిమ్స్, నాన్ ముస్లిమ్స్ అనే రెండు వర్గాలుగా విడిపోయి, ప్రతిదేశంలోనూ సివిల్ వార్స్ మొదలై, ప్రపంచయుద్ధంలో భూమి సర్వనాశనమై ఒక నిప్పులముద్దగా మారిపోయి, మానవజాతి అంతరించిపోయే దిశగా మనం ప్రయాణిస్తున్నామా? దీనికి మతాలే కారణమౌతాయా?

ఏమో మరి? భవిష్యత్తే జవాబు చెప్పాలి.