నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, జూన్ 2022, మంగళవారం

The Lady of Heaven సినిమా గొడవేంటి?

UK లో రిలీజ్ కాబోయిన The Lady of Heaven సినిమా బ్యాన్ అయిపొయింది. సినిమా హాళ్ళనుంచి వెనక్కు తీసుకోబడింది. దీనికి కారణం UK లో ఉన్న ముస్లీముల ఆందోళన. ఏమిటా ఆందోళన వెనుక ఉన్న కారణాలు?

ఫాతిమా అనే మహిళ కథ ఈ సినిమా.

ఎవరీ ఫాతిమా?

ఫాతిమా అనే ఆమె, మహమ్మద్ ప్రవక్త మొదటి భార్య ఖదీజాకు పుట్టిన కూతురు. ఈమె దాదాపుగా తన 27 వ ఏటనే చనిపోయింది. మహమ్మద్ చిన్న భార్య అయేషా తండ్రి అబూ బకర్ చేయించిన దాడిలో ఈమెకు గర్భస్రావమై ఆ గాయాలతో చిన్నవయసులోనే చనిపోయింది.

అప్పటికి మహమ్మద్ ప్రవక్త చనిపోయి ఆర్నెల్లు మాత్రమే అయింది. మహమ్మద్ చనిపోగానే, మామ అబూబకర్ వర్గానికీ, అల్లుడు ఆలీ వర్గానికీ అధికారపోరు మొదలైంది. ఆ దాడులలో మహమ్మద్ కూతురు ఫాతిమా చనిపోయింది. అంటే, ఇస్లామిక్ దౌర్జన్యాలకు బలి అయిన మొదటి మహిళ స్వయానా మహమ్మద్ ప్రవక్త కూతురే. మహమ్మద్ మామ అబూబకర్, తనకు  మనవరాలి వరసైన ఫాతిమాను చంపించాడు.

క్లుప్తంగా ఇదీ కధ. దీనిని తీసింది షియా ముస్లిం వర్గాలు. ఎందుకంటే, ఫాతిమాను వాళ్ళు గౌరవిస్తారు. అయితే, సున్నీలు దీనిని ఒప్పుకోరు. 

సింపుల్ గా చెప్పాలంటే, మహమ్మద్ మామ వర్గం షియాలు. అల్లుడి వర్గం సున్నీలు. మహమ్మద్ చనిపోయి 1400 ఏళ్ళైనా, ఈనాటికీ వీళ్ళు కొట్టుకు చస్తూనే ఉన్నారు. ప్రక్క మనుషులను చంపుతూనే ఉన్నారు. షియా సున్నీల గోల, అధికారం కోసం మామా అల్లుళ్ళ తగాదా తప్ప ఇంకేమీ కాదు.

ఈ సినిమా రిలీజ్ కాకూడదని, సున్నీ ముస్లిం వర్గాలు UK లో గొడవలు చేశాయి. వాళ్ళు చూపించిన కారణాలేమంటే, మహమ్మద్ ప్రవక్త వేషాన్ని ఒక మనిషి వేశాడట ! అది తప్పట ! సినిమాలో ఒక మనిషి వేషాన్ని మనిషి వెయ్యక, ఇంకెవరు వెయ్యాలో నాకైతే అర్ధం కాలేదు.

సరే, ఈ గొడవలు తట్టుకోలేని UK ప్రభుత్వం ఈ సినిమాను బ్యాన్ చేసేసింది. ఇంకోప్రక్కన ఇండియాలోని యూపీ, బెంగాల్ రాష్ట్రాలు తగలబడుతున్నాయి. కారణమేంటి? 56 ఏళ్ల మహమ్మద్ 9  ఏళ్ల ఆయేషాతో సంసారం చేశాడన్న వాస్తవాన్ని నూపుర్ శర్మ మాట్లాడటం దైవద్రోహం అయిపోయిందట. అందుకని రెచ్చిపోయి రోడ్లమీదకొచ్చి విధ్వంసాలు చేస్తారట ! అది జరిగిన వాస్తవమే కదా? అంటే తప్పేముంది?

చారిత్రకంగా జరిగిన విషయాలను కూర్చుని మాట్లాడి కూల్ గా డిబేట్ చెయ్యలేని వాళ్ళు మాత్రమే ఇలాంటి గొడవలు చేస్తారు. ఎందుకని? డిబేట్ మొదలుపెడితే వాళ్ళ మతంలోని డొల్ల అంతా బయటపడుతుంది కాబట్టి.

మొదటినుంచీ ఇస్లామనేది దౌర్జన్యంతో, హింసతో పెరిగిన మతం. చరిత్రను చదివిన ఏ విద్యార్థికైనా ఈ విషయం తెలుస్తుంది. అంతెందుకు? మొన్న శుక్రవారం నాడు కాందహార్ లోని మసీదులో సున్నీలు మానవబాంబును ప్రయోగించి హజారా ముస్లిమ్స్ 51 మందిని చంపేశారు. ఇదేంటి మరి? వాళ్ళు మీ సాటి ముస్లిములే కదా? వాళ్ళనెందుకు అలా చంపడం? పైగా వాళ్ళు మసీదులో ప్రార్ధనలు చేస్తున్నపుడు చంపారు. వాళ్ళు ప్రార్ధిస్తున్నదీ అల్లానే కదా? మరి చంపడం ఎందుకు? ఎందుకంటే, ఈనాటికీ వాళ్ళు రాక్షసులుగానే బ్రతుకుతున్నారు కాబట్టి. నాగరికమానవులుగా ఎంతమాత్రం బ్రతకడం లేదనడానికి నిన్నగాక మొన్న కాందహార్ లో జరిగిన ఈ సంఘటనే రుజువు.

అంటే, నీకు నచ్చకపోతే చంపడమేనా? లాజిక్ లేదా? రీజన్ లేదా? దేశపు చట్టం లేదా? ఖురాన్లో అలా చెప్పబడిందట. కాబట్టి వీళ్లకు సాటిమనిషిని చంపేసే అధికారం వచ్చిందట. ఏంటీ అరాచక మతం? 'ప్రక్కమనిషిని చంపు' అని చెప్పడానికి మహమ్మద్ ఎవరసలు?

ఇస్లామనేది ఏ దేశంలో ఉంటే అక్కడ విధ్వంసమే జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఏదో కొన్ని దేశాలలో తప్ప ముస్లిమ్స్ శాంతిగా ఎక్కడా లేరు. మళ్ళీ ఇస్లామంటే శాంతి అంటారు.

వాళ్ళ ప్రవక్త గురించీ, వాళ్ళ చరిత్ర గురించీ బాహాటంగా మాట్లాడాలంటే ఎందుకో అంత భయం? వాస్తవాలు బయటపడతాయనా? ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా వాస్తవాలను దాచడం ఎలా సాధ్యమౌతుందో మరి? సినిమాహాళ్లలో రిలీజ్ చెయ్యకపోతే, నెట్ ఫ్లిక్స్ లో చూస్తాం. OTT ప్లాట్ ఫామ్ ను ఎలా కంట్రోల్ చెయ్యగలరు ఈ దౌర్జన్యకారులు?

మా మతం గురించి ఎవరూ మాట్లాడకూడదు, అవి వాస్తవాలైనా సరే ! మేం మాత్రం ఎలాంటి దాడులైనా చేస్తాం. ఎన్ని దేశాల సంస్కృతులనైనా  నాశనం చేస్తాం. ఎన్ని కుట్రలైనా చేస్తాం. ఇదేనా ఇస్లామంటే? 

ఏది ఏమైనా, UK కి కూడా మూడిందన్నమాట ! శుభం ! ఇండియాను దోచుకున్నందుకు UK ఈ విధంగా పరిహారం చెల్లిస్తుందన్నమాట !

చూద్దాం !