నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, సెప్టెంబర్ 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 14 (Beware of Vampires)

మొన్నామధ్యన డెట్రాయిట్లోనే ఉన్న శిష్యుడు సాయి వాళ్ళింటికి వెళ్ళొచ్చాము. మాటల మధ్యలో వాళ్ళ ఆఫీసులో జరిగిన మతమార్పిడి ప్రయత్నాన్ని గురించి సాయి చెప్పుకొచ్చాడు. దీనిమీద చేసిన వీడియోను ఇక్కడ చూడండి.

ఇండియాలోనే కాదు, ఇక్కడ కూడా క్రైస్తవ మతప్రచారం ఉంది. ఏమాత్రం వీక్ గా కనిపించినా బుట్టలో వేసేసుకుందామని చూసేవాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. అమెరికా ఆఫీసుల్లో కూడా ఇదుందంటే విచిత్రమనిపించింది. సాయి చెప్పినది వింటుంటే నాకు వాంపైర్లు గుర్తొచ్చారు.

వాంపైర్స్  మీద తీసిన అనేక సినిమాలు హాలీవుడ్ లో ఉన్నాయి. వాంపైర్లు మన మధ్యనే ఉంటారని, మాయచేసి రక్తం పీల్చేసి మనల్ని కూడా వాళ్లలో కలిపేసుకుంటారని ఆ సినిమాలలో చూపిస్తారు. అది నిజమే. కాకపోతే, చాపక్రింద నీరులాగా మెల్లిగా మనకు బోధలు మొదలుపెట్టి, మనల్ని మతం మార్చాలని చూసే మనుషులే అసలైన వాంపైర్లు. అసలైన రక్తపిశాచాలు వీళ్ళే.

సహజంగానే ఇక్కడి తెల్లవాళ్లకు రేసిజపు దురహంకారం ఎక్కువ. అందులోనూ తెల్లతోలు ఆడవాళ్ళలో మరీ ఎక్కువగా దీనిని గమనిస్తున్నాను. దీనికితోడు క్రైస్తవం కూడా కలిస్తే ఇక చెప్పనక్కర్లేదు. అసలే కోతి, ఆ తర్వాత ఏదో అయింది అన్నట్లుగా తయారౌతుంది పరిస్థితి.

నల్లవాళ్ళు కొంచం పరవాలేదు. వాళ్ళు కూడా మనలాగే ఏదో ఒక అభద్రతాభావంలో బ్రతుకుతున్నారు. కనుక, నార్మల్ గా, సాదాసీదాగా ఉంటారు. కానీ తెల్లపీనుగులు, అందులోనూ మన ఇండియా అంటే తెలియని దురహంకార క్రిస్టియన్స్ అయితే, మనల్ని పురుగుల్లాగా చూస్తారు. ఆఫ్ కోర్స్ మనతో ప్రస్తుతం వాళ్లకు అవసరం ఉంది గనుక, బయటకు అనకపోయినా, లోపల మాత్రం మనమంటే వాళ్లకు మంటే. కులపిచ్చి అని మనల్ని అంటారు గాని, వీళ్ళ రేసిజం ముందు మన కులపిచ్చి ఎందుకూ పనికిరాదు.

ఇంతకీ రేసిజం అంటే ఏంటి? రంగు, జాతి ఇవేగా? వీటికి తోడు ధనమదం, దానికి తోడు మతపిచ్చి కలిస్తే ఇక చెప్పేదేముంది?

అయినా, తాతకు దగ్గులు నేర్పినట్టు, మనకి మతం గురించి చెప్పబోవడం ఎంత సాహసమో వీళ్ళకెప్పుడర్ధమౌతుందో? ఎప్పుడంటే, వీళ్లకు ధాటిగా మనం సమాధానం చెప్పగలిగినప్పుడే అది సాధ్యమౌతుంది.  అలా చెప్పగలగాలంటే, ముందు మన గురించి మనకు తెలిసుండాలి. మన గురించి మనలో ఎంతమందికి తెలుసు? అన్నదే అసలైన ప్రశ్న.

మనకేమీ తెలీదని వాళ్ళనుకుంటారు. వాళ్లదాంట్లో ఏదో ఉందనీ అనుకుంటారు. రెండూ తప్పులే. ఈ భ్రమల్లో పడి మనల్నేదో ఉద్దరించాలని ప్రయత్నిస్తారు.

All good words will have a bad side to them, especially so, when they are intended to convert you.

Beware of the good words !