“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

7, సెప్టెంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 15 (Liz Truss Vs Rishi Sunak Astrology)

యూకే నూతన ప్రధానిగా ఈరోజు లిజ్ ట్రస్ ఎన్నికైంది. రిషి శునక్ ఓడిపోయాడు. వీళ్ళ జాతకాలు పైపైన పరిశీలిద్దాం.

రిషి శునక్ భారతీయసంతతికి చెందినవాడు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు. ఇతను మే 12,1980 న సౌతాంఫ్టన్ లో పుట్టాడు. రేవతి నక్షత్రం 4 వ పాదం. మీనరాశి అయింది. 

ప్రస్తుతం గోచార గురువు మీనంలో జననకాల చంద్రుని మీద ఉన్నాడు. అయితే వక్రించి ఉంటూ కుంభంలోకి పోతున్నాడు. ఇది నష్టాన్నిస్తుంది. మొదట్లో అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ చివరకు పరాజయం వరిస్తుంది. వెరీ సింపుల్.

గోచార శని, లాభస్థానంలో ఉంటూ వక్రించి దానికి వ్యయస్థానమైన దశమంలోకి పోతున్నాడు. ఇది మంచి సూచన కాదు. మొదట్లో లాభం కనిపిస్తుంది. కానీ చివరకు వృత్తిపరంగా నష్టం ఎదురౌతుంది. కనుక ఓటమిని చవిచూచాడు.


లిజ్ ట్రస్ జూలై 26,1975 న ఆక్స్ ఫర్డ్  లో పుట్టింది. శతభిషా నక్షత్రం 3 వ పాదం కుంభరాశి అయింది.

గోచార గురువు, ధనస్థానంలో నుంచి లగ్నంలోకి వస్తున్నాడు. ఇది విజయసూచన.

గోచారశని, ద్వాదశంలోనుండి లాభస్థానానికి పోతున్నాడు. అంటే, మొదట్లో వెనుకబడినట్లు కనిపించినా, చివరకు లాభాన్ని పొందుతుందని సూచన.

పరుగుపందెం మొదలైనప్పుడు అదే జరిగింది. మొదట్లో శునక్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. రాన్రాను పరిస్థితి మారిపోతూ వచ్చింది. శునక్ వెనుకబడ్డాడు.  ట్రస్ ముందుకొచ్చింది. గెలిచింది.

ఏ సంఘటననైనా నిర్ణయించే గ్రహాలలో రాహుకేతువులు కూడా ప్రధానపాత్రలలో ఉంటాయి. ఇవి ఈ జాతకాలలో ఎక్కడున్నాయో చూద్దాం.

ప్రస్తుతం వీరు మేష - తులా రాశులలో ఉన్నారు. రిషి జాతకంలో, మీనరాశి నుండి వీరు 2-8 ఇరుసులో ఉంటారు. ఇది మంచిది కాదు. అదే లీజ్ జాతకంలో నైతే, 3-9 ఇరుసులో ఉంటారు. విజయానికి ఇది మంచి యోగం. కనుక లీజ్ గెలిచింది.

చూడటానికి చాలా సింపుల్ గా కనిపించిన ఈ ఎన్నిక వెనుక, కనిపించని రాజకీయాలు, లాబీయింగులు, రేసిజం కోణాలు, ఇంకా ఎన్నో ఉంటాయి. శునక్ ను చెడుగా చిత్రీకరించి అతని విజయావకాశాలను నీరు గార్చడంలో మీడియా కూడా ప్రధానపాత్ర పోషించింది. దానివెనుక ఎవరున్నారో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అవన్నీ వివరించడం నా అభిమతం కూడా కాదు.

అయినా, భారతీయసంతతికి చెందినవాడు బ్రిటిష్ ప్రధానమంత్రి అంత సులభంగా ఎలా అవుతాడు? తెల్లదేశాలు, ముస్లిందేశాలు ఎలా ఒప్పుకుంటాయి? ఇండియా ఎదుగుతుంటే యూరప్, మిడిల్ ఈస్ట్, అమెరికా, చైనా, ఇంకా ఏ ఇతరదేశమూ ఒప్పుకోదు. ఇది చాలా చిన్న విషయం, దీనిని అర్ధం చేసుకోడానికి జ్యోతిష్యం ఎందుకు? ఇంటర్నేషనల్ ఎఫైర్స్ తెలిస్తే చాలు. కాకపోతే, సరదాగా  జ్యోతిష్య కోణాలను  చూస్తున్నామంతే.

తెరవెనుక ఎన్ని కుంభకోణాలు జరిగినా, చివరకొచ్చే గెలుపు ఓటములు మాత్రం జాతకచక్రంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. అదొక్కటే నేను చెప్పదలుచుకున్నది !

దీనిపైన చేసిన వీడియోను ఇక్కడ చూడండి మరి !