ఉదయం తొమ్మిదికి ట్రాయ్ లో రైలెక్కి, మధ్యాన్నం రెండు గంటలకు చికాగో యూనియన్ రైల్వే స్టేషన్లో దిగాము. షాంపేన్ ట్రెయిన్ కోసం అక్కడ రెండు గంటలపాటు వేచి ఉండాలి. ట్రాక్ రిపేర్లు జరుగుతున్నాయని ఈ రైలు డిపార్చర్ ఒక గంట లేటైంది. కనుక మూడు గంటల వెయిటింగ్ టైం ఉంది. అందుకని లగేజి దగ్గర కొంతమంది కాపలాగా ఉంటే, కొంతమందిమి స్టేషన్ బయటకొచ్చి చికాగో డౌన్ టౌన్ లో షికార్లు చేశాము. రెండు వీధుల అవతలనే సియర్స్ టవర్ ఉన్నది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన టవర్లలో ఒకటి. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్ కట్టకముందు ఇదే ప్రపంచంలోని అతి ఎత్తైన టవర్. ఈ బిల్డింగ్ లో 110 అంతస్తులున్నాయి. దీనిని 1975 లో కట్టారు.
చికాగో డౌన్ టౌన్, సియర్స్ టవర్ దగ్గర
చికాగో యూనియన్ రైల్వే స్టేషన్ లాంజ్ లో
చికాగో రైల్వే స్టేషన్, మన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కంటే బాగుంది, నీట్ గా ఉంది. సిటీ మధ్యలో ఉండటంతో దీనికి చాలా ఎంట్రన్స్ లున్నాయి. ఎక్కడా బెగ్గర్స్, హాకర్స్, కనపడలేదు. ప్లాట్ ఫామ్ మీద పడుకుని నిద్రపోయేవాళ్లు, అల్లరిచిల్లరగా తిరిగేవాళ్లు ఎక్కడా లేరు. ఎనౌన్స్ మెంట్ లేదు. వ్యాపారప్రకటనలు లేవు. అంత పెద్ద స్టేషన్ కూడా నిశ్శబ్దంగా, డీసెంట్ గా ఉంది.
ఇది, చెన్నై సెంట్రల్ స్టేషన్ మోడల్లో ఉంది. రైళ్లన్నీ వచ్చి ఒక డెడ్ ఎండ్ లో ఆగుతాయి. అక్కడనుంచి బయటకి దారులుంటాయి. ప్లాట్ ఫామ్స్ మీద మనుషులెవరూ ఉండరు. అవన్నీ అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా ఉంటాయి. మనుషులందరూ ఒక పెద్ద వెయిటింగ్ లాంజ్ లో ఉంటారు. రైలు టైమైనప్పుడు, ఒకతను వచ్చి ఆ రైలు పాసింజర్స్ ముందుకు రమ్మంటాడు. మనం వెళ్లి క్యూలో నిలబడితే, అతను దారిచూపిస్తూ తీసుకెళ్లి ఆ ప్లాట్ ఫామ్ కు దారి చూపుతాడు. చాలా డీసెంట్ గా ఉంది.
చికాగో యూనియన్ రైల్వే స్టేషన్. డౌన్ టౌన్ కు వెళ్లే ఎగ్జిట్ దగ్గరనుంచి
ఇది ఈ స్టేషన్ కున్న అనేక ఎంట్రన్స్ లలో ఒకటి. దీనిలోనుంచి బయటకొస్తే సియర్స్ టవర్ దగ్గరకు వస్తాము.
సియర్స్ టవర్ దగ్గరలోని బిల్డింగ్స్ ఇలా ఉంటాయి
చికాగో రివర్ దగ్గర
చికాగో నది, సియర్స్ టవర్ దగ్గర
చికాగో ని 'విండీ టౌన్' అంటారు. లేక్ మిషిగన్ పక్కనే ఉండటంతో ఎప్పుడూ హోరుమని గాలివీస్తూ ఉంటుంది. ఈ రోజున కూడా బాగా చలిగాలి ఉంది.
చికాగో రివర్
స్టీమర్లో ఎక్కి, చికాగో నది గుండా తిరుగుతూ సిటీ టూర్ చేసే సౌకర్యం ఇక్కడుంది. నేను ఆ బ్రిడ్జి మీద నిలబడి చూస్తూ ఉండగా ఒక స్టీమర్ వచ్చింది. దాని వీడియో ఇది.
చికాగో యూనియన్ స్టేషన్ ప్లాట్ ఫామ్స్
సాయంత్రం అయిందింటికి చికాగో యూనియన్ స్టేషన్ ప్లాట్ ఫామ్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ ఐదుకే చీకటి పడిపోతోంది.
చికాగో డౌన్ టౌన్
షాంపేన్ అర్బానా స్టేషన్లో రిసెప్షన్
చికాగోలో సాయంత్రం అయిందింటికి డబల్ డెక్కర్ రైలెక్కి రాత్రి ఏడింటికి షాంపేన్ చేరుకున్నాం. అప్పటికే రాత్రి పదో, పదకొండో అయినట్లు చీకటిగా ఉంది. ఈ ట్రెయిన్ నిండా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్ ఉండటంతో చికాగో నుంచి ఇక్కడకు స్టూడెంట్స్ వస్తూపోతూ ఉంటారు.
శ్రీనివాస్, జ్యోతి, గీత స్టేషనుకొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు.
షాంపేన్ లో శ్రీనివాస్ గారి ఇంటినుండి 'సనత్సుజాతీయము' తెలుగు పుస్తకం విడుదల
షాంపేన్ సరస్వతీ మాత ఆలయ సందర్శన. ఇక్కడ చలి మైనస్ ఒక డిగ్రీ ఉంది.
షాంపేన్ లో