Pages - Menu

Pages

29, డిసెంబర్ 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 75 (మంచు ఫోటోలు)

వారం తర్వాత ఈరోజున కొంచం ఎండ వచ్చింది. మంచు కరగడం మొదలైంది. నేనుంటున్న చోటకు దగ్గర్లోనే ఒక పార్కుకు పోయేదారిలో ఒక కొలనుంటుంది. సరదాగా బయటకెళ్ళి, కాఫీ త్రాగుతూ, అదెలా ఉందో చూద్దామని వెళ్ళాము. ఆ కొలనంతా మంచుమయమై పోయింది. అక్కడి ఫోటోలు ఇవన్నీ. 








27, డిసెంబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 74 (No Joy Christmas)

అమెరికాలో 2022 క్రిస్మస్ చాలా ఘోరంగా జరిగింది. కారణం? బాంబ్ సైక్లోన్ ప్రభావం. ఇటువంటి మంచుతుఫాన్ కొన్ని దశాబ్దాలుగా రాలేదని ఇక్కడ అంటున్నారు. దీనిదెబ్బకు కోట్లాదిమంది నానా ఇబ్బందులు పడ్డారు. పదివేలపైగా విమాన సర్వీసులు కేన్సిల్ అయ్యాయి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ ఆగిపోయాయి.  కోట్లాదిమంది ప్రయాణాలు మధ్యలో ఆగిపోయాయి. షెద్యూల్స్ అన్నీ తారుమారయ్యాయి. అంతా గందరగోళం అయిపొయింది.

నయాగరా ఫాల్స్ దగ్గర బఫెలో అనే సిటీ ఉంటుంది. అక్కడైతే రికార్డ్ స్థాయిలో, ఐదారడుగుల ఎత్తులో మంచు పేరుకుపోయింది. రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడకు వెళ్లలేనంత మంచు అక్కడుంది. మంచులో ఇరుక్కుపోయిన కార్లలోనుంచి శవాలను బయటకు తీస్తున్నారు. ఎన్నో ఇళ్ళు మంచులో కూరుకుపోయాయి. ఆ ఇళ్లలో వాళ్ళు అక్కడే చనిపోయారు. ఆ శవాలను కూడా బయటకు తీస్తున్నారు. 

కొన్నిచోట్ల ఇదే సమయంలో తీవ్రవర్షాలు కురిశాయి. మైనస్ డిగ్రీల చలికి అవి ఉన్నట్టుండి మంచు వర్షంగా మారిపోయాయి. నార్త్ లో అంతా మంచుమయం అయింది.

ఈ రోజుకీ అమెరికాలో పరిస్థితి అలాగే ఉంది. ఏమీ మార్పు లేదు. ఎవరూ ఇళ్లలోనుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం డెట్రాయిట్ లో మైనస్ 8 డిగ్రీల చలి ఉంది. తలుపులు వేసుకుని స్వెట్టర్లు తొడుక్కుని హీటర్లు పెట్టుకుని ఇంట్లో ఉండటమే తప్ప బయటకు పోయే పని లేదు.

డాలర్లలో చూస్తే ఎంత నష్టం జరిగిందో ఇంకా లెక్క తేలడం లేదు. కానీ ఇక్కడ న్యూస్ లో ఒకటే అంటున్నారు? ఇది నో జాయ్ క్రిస్మస్ అని. 

అదీ అసలు సంగతి. జాయ్ లేకుండా పోయింది. ఎంజాయ్ చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది అని అసలైన బాధ. జీసస్ ఎలా పోతే ఎవడిక్కావాలి? ఎప్పుడు పుడితే ఎవడిక్కావాలి? యూరప్లో ఉన్నంత మతపిచ్చి అమెరికాలో లేదు.

కింగ్ కౌంటీ, వాషింగ్ టన్ లో అయితే, క్రిస్మస్ స్టార్స్, క్రిస్మస్ ట్రీస్, కేండిల్స్ మొదలైన హంగామాను బ్యాన్ చేశారు. ఏమంటే, ఇతర మతస్తులకు ఇబ్బంది కలుగుతుందని. ఇది సియాటిల్ దగ్గర్లో ఉంది. అలా చేసినందుకు ఆ కౌంటీకి 'ఎబినేజర్ అవార్డు' అని ఒక అవార్డును కూడా ప్రకటించారు. 

అమెరికాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ బాహాటంగా చెయ్యకూడదని బ్యాన్ చేస్తున్నారు. ఇండియాలోనేమో పిచ్చి పుట్టినట్లు ఎక్కడ చూసినా క్రిస్మస్ స్టార్లు వెలుస్తున్నాయి. పిచ్చికి పరాకాష్ట ఇండియాలోనే ఉన్నట్టుంది చూస్తుంటే. 

అసలు జీసస్ డిసెంబర్ 25 న పుట్టనేలేదు అదొక పచ్చిఅబద్దం. మధ్యయుగాల చర్చి ఆధికారులు అల్లిన పెద్ద కట్టుకథ అది. దానిని గోబెల్స్ ప్రచారంతో ప్రపంచం చేత నమ్మించారు. కోట్లాది డాలర్ల వ్యాపారం చేసుకుంటున్నారు. అదే విధంగా, శాంటాక్లాస్ కూడా అబద్దమే. అలాంటివాడు ఎక్కడా లేడు. రాడు, కానీ లోకాన్ని నమ్మిస్తూ ఒక కట్టుకథ అల్లారు. దానిమీద కూడా కోట్లాది డాలర్ల వ్యాపారం నడుస్తున్నది.

పిచ్చిగొర్రెల లాంటి జనం నమ్ముతున్నారు. అనుసరిస్తున్నారు. పైగా వీళ్ళు రాముడు, కృష్ణుడు కల్పితాలంటారు. లక్షలాది ఏళ్లనుంచీ ఉన్న హిందూమతం అబద్దమంటారు. నిన్నగాక మొన్న పుట్టిన అబద్దాలపుట్ట క్రైస్తవం నిజమంటారు. కలిమాయ అంటే ఇదేనేమో?

సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా భ్రమింపజేయడమేగా కలిమాయ అంటే !

మరి అమెరికాలో ఇంత జరుగుతున్నా ప్రభువు ఉల్కలేదు, పలకలేదు. చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించే చర్చి ఫాదర్లు, ఆఫ్టరాల్ మంచు తుఫానును ఆపలేకపోయారు. హాయిగా త్రాగుతూ, మాంసం తింటూ, క్రిస్మస్ చక్కగా జరుపుకోలేకపోయారు. ఇంతమంది అమెరికన్ల చావులను ఆపలేకపోయారు. మరి ఏమైపోయింది దేవుని మహిమ?

పిచ్చిగొర్రెలని నమ్మించడం కాదు. ఇలాంటప్పుడు చూపిస్తే బాగుండేది కదా దేవుని మహిమ? కోట్లాదిమంది అమెరికన్లకు ఇబ్బందులు తప్పి ఉండేవి? వందల కోట్ల డాలర్లు మిగిలి ఉండేవి.

ఇప్పటికైనా అర్ధమౌతోందా, ప్రార్ధనతో మహిమలు జరగడం అనేది ఎంత బూటకమో? అదే నిజమైతే, ఈ క్రిస్మస్ 'నో జాయ్ క్రిస్మస్' ఎందుకైంది? అదికూడా క్రైస్తవులు ఎక్కువగా ఉన్న అమెరికాలో???

25, డిసెంబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 73 (మా క్రొత్త పుస్తకం 'Medical Astrology Part - 2' విడుదల)


నా కలం నుండి వెలువడుతున్న 57 వ పుస్తకంగా ఒక అద్భుతమైన రీసెర్చి గ్రంధాన్ని అమెరికానుండి నేడు విడుదల చేస్తున్నాను. కేవలం పదిరోజులలో నూరు జాతకాలను సమగ్ర విశ్లేషణ చేసి 360 పేజీల ఈ గ్రంధాన్ని పూర్తిచేశాను. అమెరికా వచ్చాక నేను వ్రాసిన ఏడవ పుస్తకం ఇది.

మీకు గుర్తుండే ఉంటుంది. రెండేళ్ల క్రితం Medical Astrology Part-1 అనే పుస్తకం నా కలం నుండి విడుదలైంది. అందులో నూరు జాతకచక్రాలను విశ్లేషించి, జలుబు నుంచి ఎయిడ్స్ వరకూ ఉన్న వివిధరోగాలు ఎలా కలుగుతాయి? జాతకం ప్రకారం వాటిని ఎలా తెలుసుకోవచ్చు? ఏయే జాగ్రత్తలు తీసుకుని వాటిని ఎదుర్కోవచ్చు? మొదలైన విషయాలను అందులో వివరించాను. తరువాత అది 'వైద్యజ్యోతిష్యం మొదటి భాగం' అనే పేరుమీద తెలుగులో కూడా వచ్చింది. ఈ రెండు పుస్తకాలూ 'ఈ బుక్స్' గాను, ప్రింట్ బుక్స్ గా కూడా విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను పొందాయి. పొందుతున్నాయి.

నేడు దీని రెండవభాగాన్ని అమెరికా నుండి విడుదల చేస్తున్నాను. ఇందులో మరొక నూరుజాతకాల విశ్లేషణను మీరు చూడవచ్చు. దీనిలో కూడా నూరురకాలైన మొండి రోగాల గురించి జ్యోతిష్యపరంగా ప్రాక్టికల్ గా వివరించాను.

ప్రస్తుతానికి ఇది 'ఈ బుక్' మాత్రమే అయినప్పటికీ, త్వరలో ప్రింట్ బుక్ గా కూడా వస్తుంది. తెలుగులోకి కూడా అనువాదం జరుగుతుంది.

ఈ రెండుపుస్తకాలు, జ్యోతిష్యవిద్యార్థులకు, పండితులకు కూడా టెక్స్ట్ బుక్స్ గా ఉపయోగపడతాయి. అటువంటి అద్భుతమైన రీసెర్చి వీటిలో ఉంది. ఈ రెండు వందల జాతకాలకు నేను చేసిన విశ్లేషణను బాగా అర్ధం చేసుకుంటే, జాతకంలోని రోగాలను, వాటికి కారణమైన జాతకుని గతకర్మను, వాటి పరిహారాలను సమస్తాన్నీ మీరు అర్ధం చేసుకోగలుగుతారు.'

జ్యోతిష్యప్రపంచంలో ఇటువంటి పుస్తకాలు ఇంతవరకు రాలేదని, ఇకముందు కూడా రాబోవని సగర్వంగా చెబుతున్నాను.

మహాసముద్రంలాంటి జ్యోతిష్యశాస్త్రాన్ని అర్ధం చేసుకోలేక, రకరకాల సిస్టమ్స్ ను కలగలిపి, చివరికి ఏదీ పూర్తిగా అర్ధంకాక, గందరగోళానికి లోనౌతున్న నేటి జ్యోతిష్యపండితులకు, విద్యార్థులకు, అభిమానులకు, స్పష్టమైన దిశానిర్దేశాన్ని ఈ పుస్తకాలద్వారా చేస్తున్నాను.

అద్భుతమైన భారతీయ జ్యోతిష్యశాస్త్రానికి స్పష్టతను తేవడానికి నేను చేస్తున్న కృషిలో భాగంగా ఈ గ్రంధములు విడుదల చేస్తున్నాను. ఇవి ఊకదంపుడు అనువాదాలు కావని, రీసెర్చి గ్రంధాలని గమనించండి.

అంతేకాదు, ముందుముందు రాబోతున్న నా జ్యోతిష్య పరిశోధనా గ్రంధాలలో - వివాహ సమస్యలు, విద్యాసమస్యలు, సంతానసమస్యలు, ఉద్యోగసమస్యలు, ఆధ్యాత్మిక జాతకాలు, ఈ విధంగా వందలాది జాతకాలను ప్రాక్టికల్ గా విశ్లేషిస్తూ ఇంకా మరిన్ని పుస్తకాలను విడుదల చేయబోతున్నాను.

ఋషిప్రోక్తము, వేదాంగమైన జ్యోతిష్యశాస్త్రానికి పట్టిన కలిపీడను వదిలించి, దానికి స్పష్టతను కలిగించి, లోకానికి దాని ఘనతను ప్రాక్టికల్ గా అర్ధమయ్యేలా చేయడమే, 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ద్వారా సనాతనధర్మానికి నేను చేస్తున్న అనేక సేవలలో ఒక సేవ.

ఈ పుస్తకం వ్రాయడంలో కూడా నాకు తోడునీడలుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది.

జ్యోతిష్యశాస్త్ర అభిమానులకు ఈ గ్రంధం ఒక విందుభోజనం వంటిది. ఆదరిస్తారని భావిస్తున్నాం.

24, డిసెంబర్ 2022, శనివారం

మూడవ అమెరికా యాత్ర - 72 (భయంకర మంచుతుపాన్ తో అమెరికా గజగజ)



అమెరికా మొత్తం మంచుదుప్పటి పరుచుకుంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. డెట్రాయిట్లో  నేనుంటున్న చోట మైనస్ 16 సెంటీగ్రేడ్ ఉంది. 50 మైళ్ళ స్పీడుతో వీస్తున్న గాలి ఉధృతం వల్ల మైనస్ 26 సెంటీగ్రేడ్ అనిపిస్తోంది. Actual is minus 16 but feels like minus 26 due to high cold winds.

కెనడా దగ్గరలో ఉన్న మోంటానాలో అయితే మైనస్ 51 సెంటీగ్రేడ్ కు ఒక్కరాత్రిలో పడిపోయింది. జస్ట్ పదినిముషాలు ఈ చలిలో బయట నిలబడితే మనిషి గడ్డకట్టుకుపోయి చనిపోతాడు.

రెండ్రోజులక్రితం ఆర్క్టిక్ ప్రాంతం నుంచి బయల్దేరిన ఈ బాంబ్ సైక్లోన్ (మంచు తుపాను) ఒక మంచుదుప్పటిలాగా అమెరికా మొత్తాన్నీ ఉత్తరం నుంచి దక్షిణానికి కప్పుకుంటూ పోయింది. కెనడా వైపు నుండి వచ్చిన ఈ మంచు తుపాన్ టెక్సాస్ వరకూ పాకుతూ పోయింది.

జనజీవనం అతలాకుతలమైంది. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్లలోనుంచి బయటకు రావడం లేదు. రావద్దని అమెరికా ప్రభుత్వమే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇదాహో, వ్యోమింగ్, డకోటా రాష్ట్రాలలో అయితే, స్మశానాలలోని సమాధులు కూడా మంచుతో కూరుకుపోయి కన్పించకుండా అయిపోయాయి.

7700 పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్ పోర్టులో జనం నిల్చిపోయారు. మొత్తం మీద గందరగోళంగా ఉంది. ఈ పరిస్థితి ఇంకా ఒకటి రెండ్రోజులపాటు ఉంటుందని అంటున్నారు.

ఇంతాచేస్తే, క్రిస్మస్ సెలవులు. రెండ్రోజుల్లో క్రిస్మస్ ఉంది. ఉన్నట్టుండి ప్రకృతి కన్నెర్ర చేసింది.

ప్రభువుకు కోపం వచ్చిందా? ప్రార్ధనలతోనే రోగాలు తగ్గించి, మిరకిల్స్ చేసే ఫాదర్లు, పాస్టర్లు  ఎంతమంది అమెరికాలో లేరు? వాళ్ళందరూ ఎందుకు దీనిని నివారించలేకపోతున్నారు? వాళ్ళ ప్రార్ధనలు ఎందుకు పనిచేయడం లేదు? కోట్లాదిమంది క్రైస్తవజనం ఎందుకింత ఇబ్బంది పడుతున్నారు? దేవుడెందుకు వారి మొరను ఆలకించడం లేదు? క్రిస్మస్ కు తన భక్తులందరూ రెడీ అవుతున్నారని ప్రభువుకు తెలీదా? తెలిసే కావాలని ఇదంతా చేస్తున్నాడా? లేదా అమెరికాలో కూడా పాపం ఎక్కువైపోయిందా? అయినా నా పిచ్చిగాని, ఇక్కడ పాపం అనే మాటకు అర్థమేముంది? ఇష్టమైతే, ప్రక్కవాడికి ఇబ్బంది లేకపోతే అంతా పుణ్యమే, ఏదీ పాపం కాదు.

క్రీస్తుకే క్రైస్తవులంటే కోపం వచ్చిందా? లేక ఆయనకూడా ఈ మంచు తుపాన్ దెబ్బకు ఎక్కడో దాక్కున్నాడా?

ఏంటో ఏమీ అర్ధం కావడం లేదు.

23, డిసెంబర్ 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 71 (హిందువులకు ఆత్మాభిమానం లేదా?)

మా ఫ్రెండ్ ఒకడు, ఇండియాలో వాళ్ళుంటున్న అపార్ట్ మెంట్ మేనేజింగ్ కమిటీకి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. నలభై ఫ్లాట్స్ ఉన్న వాళ్ళ అపార్ట్ మెంట్లో, కేవలం ఆరుగురు మాత్రమే క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళకోసం, అపార్ట్ మెంట్ సెల్లార్లో క్రిస్మస్ పండుగను చేసి కేకులు కోసి, అందరూ తిని, ఫోటోలు దిగారు. వాళ్ళకోసం, హిందూకుటుంబాలలో ఒకాయనకు క్రిస్మస్ తాత వేషం వేశారు. ఈయన వేయించుకుని ఫొటోకు పోజిచ్చాడు.

కానీ, వినాయకచవితికి మాత్రం, శ్రీరామనవమి, కృష్ణజయంతులకు మాత్రం, నవరాత్రులలో అమ్మవారి పూజకు మాత్రం, ఆ ఆరు కుటుంబాలూ రావు. ప్రసాదాలు పెడితే తినవు. 'మేము తినము' అని స్పష్టంగా చెబుతారు. ఒకవేళ మనం చేతిలో పెడితే ఆ ప్రసాదాన్ని మనం కళ్ళముందే కాలవలో పారేస్తారు కూడా. నిన్నమొన్నటిదాకా వాళ్ళుకూడా హిందువులే. నేటికీ, వారిలో చాలాపేర్లు హిందూపేర్లే ఉంటాయి. రిజర్వేషన్ కావాలి కదా మరి !

మనమేమో పోన్లేపాపం, అందరూ ఒకటేలే, అనుకోవడం, వాళ్లేమో అలా అనుకోకపోవడం. ఏంటిది?

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

ఆఫీసులలో కూడా ఇంతే. ఒకరో ఇద్దరో ఉన్న క్రైస్తవులు క్రిస్మస్ పండుగనో, ప్రీక్రిస్మస్ పండుగనో ఆఫీసులో హడావుడి చేస్తారు. దానికి డెకరేషన్ దగ్గరనుంచి అన్నీ హిందువులే చేస్తారు. వేడుకలలో పాల్గొంటారు. బైబిల్ వాక్యాలు వాళ్ళు చదువుతుంటే వీళ్ళు భక్తితో చేతులుకట్టుకుని వింటారు. వాళ్ళు పెట్టిన కేకులు తింటారు. ఒకటి చాలకపోతే, అడిగి పెట్టించుకుని మరీ రెండు తింటారు.

వారు మాత్రం, హిందువుల పండుగలలో ఏ మాత్రమూ పాలుపంచుకోరు. ప్రసాదాలు తినరు.  దూరంగా ఉంటారు. పైగా ఏ మాత్రం అవకాశం దొరికినా ఎగతాళి చేస్తూ విమర్శిస్తారు. అయినా సరే, మళ్ళీ క్రిస్మస్ కు హిందువులు తయారౌతారు. ఎందుకని? ఆ మాత్రం కేకులు మీకు బయట దొరకవా? అంత కక్కుర్తి అవసరమా?

పోన్లే పాపం. అందరూ ఒకటే. మనం అటెండ్ కాకపోతే వాళ్ళు బాధపడతారు అని వీరనుకుంటారు. మరి వాళ్లకూ ఆ ఫీలింగ్ ఉండాలి కదా ! ఉండదు. వాళ్లకు లేనప్పుడు, మీకు మాత్రమే అంత దిగజారుడుతనం ఎందుకు?

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

హిందూదేవాలయాలలో ఉద్యోగులుగా అన్ని మతాల వారూ ఉండవచ్చు. కానీ ఏ వక్ఫ్ బోర్డులో నైనా, చర్చి కమిటీలోనైనా,  మసీదులోనైనా, చర్చిలోనైనా, ఒక హిందువు ఉద్యోగిగా ఉన్నాడా? ఎందుకని? వాళ్లివ్వకనా? వీళ్ళు చెయ్యకనా? మొదటిదే కరెక్ట్ కదా! వారి ఆరాధనాస్థలాలలో గాని, సంస్థలలో గాని హిందువులను దగ్గరకే రానివ్వరు. హిందువులేమో, పోన్లే పాపం, అందరూ ఒకటేగా. అని అనుకుంటారు. వాళ్ళు మాత్రం అలా అనుకోరు. ఏమిటిది?

హిందువులకు ఆత్మాభిమానం లేదా?
   
షిరిడీ సాయిబాబా ఒక ముస్లిం అనేది అందరికీ తెలుసు. ఆయన హిందూ సెయింట్ కానేకాదు. ఆయనను ఒక దేవుడిగా ప్రచారం చేసినదీ, అక్కడకు తండోపతండాలుగా పోతున్నది హిందువులే అనేది కూడా సత్యమే. ఆయన దత్తాత్రేయుని అవతారం కానేకాదు. అదొక కట్టుకథ. దానిని సృష్టించింది కూడా కొంతమంది హిందువులే. సాయిబాబాను అవతారంగా పుస్తకాలు వ్రాసి ప్రచారం చేసినది కూడా కొందరు హిందువులే. జీసస్ దేవుడని, సాయిబాబా దేవుడని సినిమాలు తీసింది కూడా హిందూ నటులే.

మీ స్వార్ధం కోసం ఇంత దిగజారుడుతనం అవసరమా? సాయి సంస్థాన్ లో ఉన్న లక్షలాది కోట్ల రూపాయలను ఎలా ఖర్చుపెడుతున్నారు? దేనికి ఖర్చు పెడుతున్నారు? భక్తులు అక్కడ హుండీలలో వేసే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అన్నది ఎవరైనా ఆలోచించారా? హిందువులిచ్చే కోట్లాది రూపాయలలో కనీసం కొంతైనా హిందువులకోసం, హిందూమతం కోసం ఖర్చు చేస్తున్నదా సాయి సంస్థాన్?

సాయిరాం, సాయికృష్ణ, సాయి బాలాజీ, సాయి లక్ష్మి, సాయి పల్లవి, సాయి గీత, సాయివిష్ణు, ఇలాంటి పేర్లను తెలివిలేని అమాయకహిందువులు మాత్రమే పెట్టుకుంటారు. ఒక్క ముస్లిమయినా సరే, రామ, కృష్ణ, హరి, శివ, ఆంజనేయ, దేవి మొదలైన పేర్లు తోకలుగా తగిలించుకుంటాడా? ఎన్నటికీ ఉండదు. ఎందుకిలాంటి దిగజారుడుతనం హిందువులలోనే ఉంది? రేపటినుంచీ యేసురామ్, యేసుక్రిష్ణ, క్రీస్తుశివ, యెహోవా బాలాజీ మొదలైన పేర్లుకూడా పెట్టుకోండి, బాగుంటుంది.

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

సాయిబాబాకు గుళ్ళు కట్టి, రామ, కృష్ణ, శివ, విష్ణు, ఆంజనేయ, దేవీ విగ్రహాలను ఆయన కాళ్లదగ్గర పెట్టి, ద్వారపాలకులుగా పెట్టి, పూజలు చేస్తున్నారు. వేదపండితులు డబ్బుకోసం కక్కుర్తి పడి ఆ గుళ్ళలో పూజారులుగా పనిచేస్తున్నారు. సాయిబాబా విగ్రహానికి ఆకుపూజలు అభిషేకాలు చేస్తున్నారు.  మరి ముస్లిములెవరైనా హిందువుల పూజలు వాళ్ళ ఆరాధనాస్థలాలలో చేస్తున్నారా? చెయ్యరు. మరి హిందువులే ఎందుకు ఇలా దిగజారుతున్నారు? సాయిబాబా విగ్రహానికి హిందూ సాంప్రదాయ పూజలు చెయ్యమని ఏ ఆగమశాస్త్రం చెప్పింది? చెప్పనప్పుడు, మీ ఇష్టప్రకారం ఏదిపడితే అది చేయవచ్చునా ? తప్పుకాదా?

వేదం చదువుకున్న పూజారి, సాయిబాబాకు కాగడా హారతి ఇచ్చి, నమాజ్ లో అరిచినట్లు అరుస్తూ పూజ చెయ్యవలసిన అవసరం ఏంటి? డబ్బుకోసమా? ఆ డబ్బు మీకు బయట రాదా? ఇదేనా ధర్మనిష్ఠ అంటే? ఒకవేళ డబ్బు రాకపోతే ఒక్కపూట తిని, రెండో పూట పస్తులుండండి. బ్రాహ్మణధర్మం ఏం చెబుతున్నది? ఇలా చెయ్యమని చెప్పిందా వేదం? 

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

చాలామంది హిందువుల ఇళ్లలో సాయిబాబా విగ్రహాన్ని పూజామందిరంలో పెట్టుకుంటారు. కొంతమందైతే, జీసస్ ఫోటోలను కూడా పెట్టుకుంటారు. ఆశ్చర్యపోకండి. హిందూ పూజామందిరంలో జీసస్ శిలువ ఫోటోను నా చిన్నప్పుడే నేను చూచాను. అదేంటంటే, జీససంటే నాకిష్టం అని ఆ బ్రాహ్మణస్త్రీ చెప్పింది. మరి ఏ క్రైస్తవుడు గాని, ముస్లిం గాని, హిందూదేవీదేవతల విగ్రహాలను వాళ్ళ ఇళ్లలో పెట్టుకుని పూజిస్తారా? చెయ్యరు. మరి ఒక్క హిందువులే ఎందుకు ఇలా అతిమంచితనంగా ఉంటారు?

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

హిందువులలో చాలామంది దర్గాలకు పోయి మొక్కుకుంటూ, తాయెత్తులు కట్టించుకుంటూ ఉంటారు. కొన్నిచోట్ల అయితే, దర్గా కమిటీలను వాళ్లే నడుపుతూ ఉంటారు. గుంటూరులోని మస్తాన్ దర్గాయే పెద్ద ఉదాహరణ. ఇలాంటి దర్గాలు చాలా ఊర్లలో ఉన్నాయి. నడిపేది హిందువులే. అదేమంటే, పరమతసహనానికి ఇదే తార్కాణం అంటారు. బాగానే ఉంది. మరి హిందూ దేవాలయాలను ఏ క్రైస్తవుడైనా, ముస్లిమయినా ఇదే విధంగా చక్కగా నడుపుతున్నారా? ఉండదు. మరి హిందువులే ఎందుకు ఇలా చేస్తున్నారు?

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

శవాన్ని పాతిపెట్టిన చోటకు సాంప్రదాయ హిందువులు పోరు. అది స్మశానంతో సమానం. మరి దర్గాలకు హిందువులు పోయి మొక్కడం, తాయెత్తులు కట్టించుకోవడం చేస్తూనే ఉంటారు.  ప్రతిదర్గాలోనూ, ఒక ఫకీర్ శవం ఉంటుంది. ఆ ఫకీరేమో, హిందూద్వేషాన్ని తన జీవితమంతా అందరికీ నూరిపోస్తూ బ్రతికినవాడై ఉంటాడు. అక్కడకు హిందువులు పోయి, మొక్కుతారు. వాళ్ళు మాత్రం హిందువుల దేవాలయాల దరిదాపులకు కూడా రారు. వీరి ఆచారాలు పాటించరు. కొన్ని తరాల క్రితం వాళ్ళు కూడా హిందువులే మరి. ఒక్క హిందువులకే ఎందుకింత చవకబారుతనం?

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

ఇతరమతాల పైన ద్వేషాన్ని పెంచుకొమ్మని నేను చెప్పడం లేదు. వాస్తవాలను గ్రహించమంటున్నాను. అతిమంచితనం పనికిరాదంటున్నాను. మీ ధర్మం పైన మీకు నిష్ఠ ఉండాలంటున్నాను. మీ దిగజారుడుతనాన్ని, స్వార్ధాన్ని, అమాయకత్వాన్ని కొంచం తగ్గించుకోమంటున్నాను. మీ కాళ్లక్రింద నేల రోజురోజుకూ జారిపోతున్నది. గుర్తించమంటున్నాను.

ఇతరమతాలను తప్పకుండా గౌరవిద్దాం. అది హిందువులు ప్రత్యేకంగా నేర్చుకోవలసిన అవసరం లేదు. అది వారి రక్తంలోనే సహజంగా ఉంటుంది. కానీ, అంతకంటే ముందు మీ ధర్మాన్ని మీ మతాన్ని గౌరవించడం నేర్చుకోమని అంటున్నాను. 

ఆత్మగౌరవం ఉన్నవాడే ఇంకొకరిని  నిజాయితీగా గౌరవించగలుగుతాడు.

మిమ్మల్ని అనుక్షణం ద్వేషించి, మతాలు మార్చాలని చూచేవారి ఆచారాలను పండుగలను మీరు పాటించడం ఎందుకు? చర్చిలకు, దర్గాలకు పోయి మీరు మొక్కడం ఎందుకు? వాళ్ళ సెయింట్స్ ఫోటోలు మీ పూజామందిరాలలో ఎందుకు? వాళ్ళ ఫకీర్లను, ఫాదర్లను మీరు ఆరాధించడం ఎందుకు? వాళ్ళ పేర్లను మీరు తోకలుగా తగిలించుకోవడమెందుకు?

మీ మతంలో ఏం లేదు? ఏం తక్కువైంది? పోనీ, మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.

ఒకప్రక్క వారు మిమ్మల్ని హేళన చేస్తున్నా సరే, మిమ్మల్ని మీ దేవతలను విమర్శిస్తున్నా సరే, అనుక్షణం మిమ్మల్ని కించపరుస్తున్నా సరే, మీరు మీ ధర్మాన్ని పలుచన చేసుకోని, మీ నిష్ఠను వదిలేసి, వారి ఆచారాలను పాటించడం, వారి ఆరాధనాస్థలాలకు పోయి, టోపీలు, పెట్టుకుని, నెత్తిన ముసుగులేసుకుని ప్రార్ధనలు చేయడం ఎందుకు? అంటున్నాను.

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

ఆలోచించండి.

మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారా? లేక మీ దేవతలను మోసం చేస్తున్నారా? లేక మీ తల్లిదండ్రులను, పూర్వీకులను మోసం చేస్తున్నారా? మీ దేశాన్ని, ధర్మాన్ని మోసం చేస్తున్నారా? మీకొక వ్యక్తిత్వమూ, ధర్మనిష్టా ఉన్నాయా లేవా? ఇంతటి దిగజారుడుతనమూ, స్వార్ధమూ, భయమూ అవసరమా?

ఆలోచించండి.

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

22, డిసెంబర్ 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 70 (హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో పంచవటి స్టాల్ ప్రారంభం)


నేటినుండి జనవరి 1 వరకూ హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. దానిలో 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ప్రత్యేకస్టాల్ ను ఈ ఏడాదినుంచి మొదలుపెడుతున్నాం.

స్టాల్ నంబర్ 62 మాకు కేటాయించబడింది.

కోవిడ్ రాకముందు జరిగిన బుక్ ఎగ్జిబిషన్లలో వేరే వాళ్ళ స్టాల్స్ లో పంచవటి పుస్తకాలను పెట్టడం జరిగేది. ఈ ఏడాదినుంచి మాదంటూ ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేస్తున్నాం.

జనవరి 2023 లో విజయవాడలో జరిగే బుక్ ఎగ్జిబిషన్ లో కూడా మా ప్రత్యేక స్టాల్ ను నడపడం జరుగుతుంది.

ఇంతకుముందు మా పుస్తకాలు కావలసినవారు నాకు మెయిల్స్ ఇచ్చేవారు, 'మీ బుక్స్ ఏ స్టాల్లో దొరుకుతాయి?' అని. ఇప్పుడా బాధ లేదు. సరాసరి మా స్టాల్ కు వెళ్లి మా పుస్తకాలను చూడవచ్చు. 

అంతేకాదు, అక్కడున్న మా వాళ్ళతో మాట్లాడి, మా సంస్ధగురించి, మా ఆశ్రమం గురించి, మా సాధనామార్గం గురించి, సనాతనధర్మం గురించి, మీ సందేహాలను తీర్చుకోవచ్చు. నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ, మావాళ్లు అక్కడున్నారు. వాళ్ళు కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు.

హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ ప్రారంభ సందర్భంగా, నిరాడంబరంగా  మొదలుపెట్టబడిన మా స్టాల్ ఫోటోలను ఇక్కడ చూడండి.








మూడవ అమెరికా యాత్ర - 69 (దీర్ఘరాత్రి ముగుస్తోంది)

అమెరికాలో నేనున్న ప్రాంతం కెనడాకు చాలా దగ్గర. ఇక్కడనుంచి 45 నిముషాలలో కెనడా బార్డర్ దాటి కెనడాలొకి వెళ్ళవచ్చు. నిజానికి, చాలామంది కెనడాలో ఉంటూ, ప్రతిరోజూ డెట్రాయిట్ కి వచ్చి ఉద్యోగాలు చేసుకుని పోతూ ఉంటారు. కొంతమందైతే, కెనడాలో ఉంటూ, డెట్రాయిట్లో షాపింగ్ కని కూడా వస్తూ ఉంటారు. 

ఈరోజు డిసెంబర్ 21. దీనిని వింటర్ సోల్ స్టెయిస్ అంటారని అందరికీ తెలిసిన విషయమే. ఈరోజున అతి దీర్ఘమైన రాత్రి ఉంటుంది. భూమధ్యరేఖ దగ్గరలో పెద్ద తేడా ఉండకపోయినప్పటికీ, ధృవాలకు దగ్గరగా పోయేకొద్దీ ఇది పెరుగుతుంది.

డెట్రాయిట్ లో ఈరోజు రాత్రి అతి దీర్ఘరాత్రి. అంటే, దాదాపు 15 గంటలుంటుంది. పగలేమో 9 గంటలు మాత్రమే ఉంటుంది. ఈరోజు సాయంత్రం 5 కి చీకటి పడింది. రేపు ఉదయం 8 కి తెల్లారుతుంది. అంటే రాత్రి నిడివి 15 గంటలు.

రేపటినుంచీ రాత్రి తగ్గుతూ, పగలు పెరుగుతూ పోతుంది. అంటే, వెలుగు పెరుగుతుంది. చీకటి తగ్గుతుంది. అందుకని, ప్రాచీనకాలంలో ఈరోజును 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' లేదా 'దీపావళి' అని జరుపుకునేవారు. అన్ని దేశాలలోనూ ఈ పండుగ ఏదో ఒక పేరుతొ ఉంది. ఎందుకంటే ఇది ప్రకృతిలో జరిగే మార్పు కాబట్టి, అన్ని దేశాలలోనూ ఇది ఉంటుంది కాబట్టి, ప్రాచీన దేశాలలోని  ప్రజలు దీనిని చేసుకునేవారు. చలిరోజులు తగ్గిపోతూ, వెలుగు వేడి రేపటినుంచి పెరుగుతాయి కాబట్టి దీనిని ఒక పండుగగా జరుపుకునేవారు.

ఇదంతా క్రీస్తు పూర్వం ఎన్నో వేల ఏళ్ళనుంచీ ఉంది. కానీ, క్రైస్తవం దీనిని కాపీ కొట్టి, ఇదే క్రీస్తు పుట్టినరోజంటూ అబద్దాలు చెప్పడం మొదలుపెట్టి, డిసెంబర్ 25 ను కబ్జా చేసేసింది. రెండువేల ఏళ్ళనుంచీ ఇదే అబద్దాన్ని ఊదరకొడుతూ నేడు ప్రపంచమంతా ఇది నిజమేనేమో అని అనుకునేలాగా చేసేసింది.

నిజానికి డిసెంబర్ 25 న క్రీస్తు పుట్టనేలేదు. నా పరిశోధనా గ్రంధం 'డిసెంబర్ 25 న క్రీస్తు జన్మించాడా?' లో, బైబిల్లో ఉన్న రుజువులతోను,  ఖగోళ సాక్ష్యాలతోను ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపించాను. ఆ పుస్తకాన్ని ఉచిత పుస్తకంగా డౌన్లోడ్ కోసం ఉంచాను కూడా.

ఇంకొక నాలుగు రోజులలో క్రిస్మస్ అనే ఒక అబద్దపు పండుగను ప్రపంచమంతా జరుపుకుంటున్నది. అంటే, ప్రపంచానికి సత్యం అక్కర్లేదు. అబద్దమే కావాలి. లక్షసార్లు ఒక అబద్దాన్ని పదేపదే చెబితే అది నిజమౌతుందని తెల్లవాళ్ళకు బాగా తెలుసు. అందుకే క్రిస్మస్ అనే ఈ అబద్దపు పండుగను సృష్టించి ప్రపంచం నెత్తిన రుద్దారు. అంతేకాదు, ఇండియా చరిత్రనంతా మార్చిపారేసి పుస్తకాలు వ్రాయించి దానిని ప్రపంచం నమ్మేలాగా చేశారు. కానీ సత్యాన్ని ఎక్కువకాలం దాచలేరు. అది ఎవరికీ సాధ్యం కాదు.

నిజానికి ఈ సోల్ స్టెస్ లనేవి, ప్రకృతిలో కలిగే మార్పులు. అందులో డిసెంబర్లో వచ్చే ఈ మార్పుకు సూచనగా 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' లేదా దీపావళిని ఈరోజున జరుపుకోవాలి. ప్రాచీనకాలంలో ప్రపంచమంతా దీనిని జరుపుకునేది కూడా. క్రైస్తవం పుణ్యమాని నిజమైన పండుగ మాయమై, అబద్దపు వేడుక చలామణీలోకి వచ్చింది.

ఈ మార్పును స్వాగతించే రాత్రి నేడే. అందుకే ఇది దీర్ఘరాత్రి. ఆరునెలలుగా తగ్గుతున్న పగలు రేపటినుంచి పెరగడం మొదలుపెడుతుంది. చీకటి తగ్గడం, వెలుగు పెరగడం రేపటినుంచి మొదలౌతుంది.

వెలుగుకు స్వాగతం చెబుదాం. అబద్దాలను అబద్దాలుగా గుర్తిద్దాం.

మీకు సత్యం కావాలో, అసత్యం కావాలో మీరే తేల్చుకోండి.

మీరు సత్యం వైపున్నారో, అసత్యం వైపే ఎప్పటికీ ఉంటారో మీరే తేల్చుకోండి.

21, డిసెంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 68 (తండ్రి - కుమార - పరిశుద్ధాత్మ దేవుని మహిమలు )

ఈరోజున అమెరికా న్యూస్ ఛానల్స్ లో ఒక వార్త గుప్పుమంది.

అదేంటంటే - పోప్ ఫ్రాన్సిస్ కు బాగా దగ్గరవాడైన ఒక స్లోవేనియా ఫాథర్, ఇద్దరు నన్స్ కు ప్రార్ధన చెయ్యడం ఎలాగో స్లోగా నేర్పించి, చివరకు ఒకరోజున 'మనం ముగ్గురం కలసి సెక్స్ చేసుకుందాం' అని  వారిని ఒప్పించాడు. ఇది 1990 లలో జరిగింది.

'ఇదేంటి? ఇదేమి ప్రార్ధనరా ఫాదరా?' అని ప్రశ్నించిన ఆ నన్స్ తో, 'ఇదే త్రియేక దేవుని మహిమ అంటే. నేను దేవుడిని, నువ్వు పరిశుద్దాత్మవు. నువ్వేమో జీసస్ వు. మన ముగ్గురం ఒకటైపోవడమే ఫాథర్, సన్, హొలీఘోస్ట్ లు ఒకటే అనడానికి నిదర్శనం' అని నచ్చజెప్పి వాళ్ళతో 'త్రీ సం' కార్యక్రమాన్ని జయప్రదంగా చాలాసార్లు జరిపాడట. 'త్రీ సం' అంటే ఏమిటో నేటి తరంవారికి నేను మళ్ళీ వివరించనక్కర లేదనుకుంటాను.

ఆ ప్రీస్ట్ పేరు 'ఫాథర్ మార్కో ఇవాన్ రుప్నిక్'. ఆయనకిప్పుడు 68 ఏళ్ళు. స్లొవేనియాలో ఉంటాడు. ఇదంతా ఇక్కడ 'న్యూయార్క్ పోస్ట్' మొదలైన పేపర్లలో గుప్పుమంటూ నేడు బయటకు వచ్చేసింది.

ఆ ఎపిసోడంతా ఇక్కడ చూడండి.

ఫాదర్ రుప్నిక్ అనే ఈ పెద్దాయన 1994 ప్రాంతాలలో, ఈ విధంగా దాదాపు 20 మందికి పైగా నన్స్ కి హొలీఘోస్ట్ దర్శనం చేయించాడట. నన్స్ అందరూ బిక్కచచ్చి భయపడిపోయి నోర్మూసుకుని ఊరుకున్నారు.

కానీ వీరిలో ఒక్క నన్ మాత్రం తెగించి బయటపడి 2004 లో కంప్లెయింట్ చేసింది. ఎవరికి? వాటికన్ కి. ఎందుకంటే, సదరు ప్రీస్ట్ గారు ఏకంగా పోప్ ప్రాన్సిస్ కే కుడిభుజం లాంటివాడు. క్రింద చర్చిలలో ఎవరికి కంప్లైంట్ చేసినా నన్ కే మాడు పగులుతుంది. దాని పోపే మాడిపోతుంది. అందికని, వాటికన్ కే మొత్తుకుంది నన్.

దీన్నంతా ఎంక్వైరీ చేసిన వాటికన్ ఫాదర్ల కమిటీ, మే 2020 లో, అంటే సరిగ్గా పదహారేళ్ళ తర్వాత ఇలా నిర్ధారించింది.

'ఫాదర్ చేసిన పనులు నిజమే. అయితే ఇప్పుడాయన్ని ఏమీ చెయ్యలేం. ఎందుకంటే అవన్నీ జరిగి చాలా ఏళ్లై పోయింది. ఆ పాపాలన్నీ ప్రతి ఆదివారం చేసుకునే కన్ఫెషన్ లో కడిగివేయబడి ఉంటాయి. ఒకవేళ అలా కడగబడకపోతే, ఆ తప్పు దేవుడిది గాని, ఫాదర్ ది కాదు.  దేవుడిని మనం శిక్షించలేం కాబట్టి, కేసు కొట్టివేయడమైనది'.

వాటికన్ ఇచ్చిన తీర్పు చాలా గొప్పగా ఉంది కదూ ! అంటే, ఇలాంటి నేరాలలో ఇలాంటి తీర్పులు వెలువరించడానికి కూడా పదహారేళ్లు పడతాయన్నమాట. మన ఇండియా కోర్టులే అనుకున్నాను, వాటికన్ కూడా ఇంతేనా?

బహుశా ఆ వాటికన్ ప్రీస్ట్ లందరూ శ్రీదేవిది 'పదహారేళ్ళ వయసు' సినిమా చూసిన ఆమె ఫాన్స్ అయి ఉంటారు ! లేదా దేనికైనా పదహారేళ్లు వస్తేగాని వారు రంగంలోకి దిగరేమో మరి?

ఎంత గొప్ప మతమో ! ఈ మాట ఎందుకన్నానంటే, ఇదేదో మారుమూల ఇండియా పల్లెలో, ఊరూపేరూ లేని చర్చిలో జరిగిన కధ కాదు. సాక్షాత్తు వాటికన్ లో జరిగింది. మరి వాటికన్ చేసిన న్యాయమేంటి? దీన్ని న్యాయమంటారా?

వాటికన్ లోనే ఉన్న రొచ్చుని చూస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని ఊరుకుంటున్నాడో?

ఇంకో ఐదురోజుల్లో క్రిస్మస్ రాబోతోంది. అందరం చక్కగా కలిసి కూడికపార్ధన చేసుకుందామని ప్లానేస్తుంటే ఇదేం న్యూసురా బాబు?

ఫాదర్, సన్, హొలీఘోస్ట్ ల మహిమలు వర్ధిల్లుగాక !

త్రియేక దేవుని లీలలు వర్ధిల్లుగాక.

ఆమెన్ తీసుకురండి ! వెంటనే !

18, డిసెంబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 67 (అన్ని మతాలూ చెబుతున్నది ఒకటేనా?)

'అన్ని మతాలూ చెబుతున్నది ఒకటే' అని తరచుగా మనం వింటూ ఉంటాం.

అయితే, ఈ మాటను అనేది లిబరల్ హిందువులే గాని, మిగతా ఏ ఇతర మతస్తులూ ఇలా అనరు. గత 50 ఏళ్లలో ఏ ఇతర మతమూ ఇలా అనడం నేను వినలేదు.

'మేమే కరెక్ట్ మిగతావాళ్ళు తప్పు' అంటాయి సెమిటిక్ మతాలు. అంటే, యూదుమతం నుండి పుట్టిన క్రైస్తవం, ఇస్లాం మతాలు.

మొన్నటికి మొన్న ఇక్కడ 'ఇంటర్ ఫెయిత్ మీటింగ్' కు వెళ్ళినపుడు, మన హిందూ స్పీకర్ మాత్రమే ఇలాంటి ధోరణిలో మాట్లాడింది. యూదు మతబోధకులు ఆ మాట అనలేదు. క్రిస్టియన్ మెంబర్ కి అసలు ఆ ధోరణే లేదు.  ఆ మీటింగ్ ని ఆమె ఒక కామెడీగా తీసుకున్నట్లు అనిపించింది. ఇక ఇస్లాం ఇమాం అయితే, 'మీరంతా ఫూల్స్' అనే ధోరణిలో ఉన్నాడు. మిగతా వాళ్ళు చెబుతున్నది వినడానికి కూడా అతను ఇష్టపడటం లేదు.

ఒక్క హిందువులలోనే 'అన్ని మతాలూ ఒకటే' అనే పిచ్చిధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఆఫ్కోర్స్ అంతిమసత్యం అదే అయినప్పటికీ, ఇది కొంతమందికే అర్ధమైతే ఉపయోగం లేదు. మిగతావాళ్లు ఇంకో రకంగా అనుకుంటూ ఉన్నపుడు, వాళ్ళది మెజారిటీ అయినప్పుడు, పరిస్థితి తేడాగా ఉంటుంది.

ఈ ధోరణివల్ల ఏం జరుగుతోంది? 'అందరూ మనవాళ్లే' అని మనం అందరినీ వాటేసుకోవడం, వాళ్లేమో మనకు వెన్నుపోటు పొడిచి మన దేశంలో పాగా వేసి, చివరకు హిందువులని మైనారిటీలుగా చేసిపారేసి, మన మనుగడనే ప్రశ్నార్ధకం చేసే పరిస్థితిని తెస్తున్నారు. అయినా సరే, మనం అందరినీ సమానంగా ప్రేమిస్తూ, 'మనం మనం ఒకటే, అన్ని మతాలూ చెబుతున్నది ఒకటే' అంటూ, అందరిచేతా సమానంగా పొడిపించుకుంటున్నాం.

ఇదేమి వింతో నాకైతే అర్ధం కావడం లేదు.

అన్ని మతాలూ ఒక్కటే ఎలా అవుతాయి? ఒకటే విషయాన్ని అన్ని మతాలూ చెబుతుంటే, అసలిన్ని మతాలెందుకు వచ్చాయి?

ఈ  ఆలోచన ఉన్నవారెవరైనా ఈ మాట మాట్లాడరు.

సత్యమేమిటంటే, అన్ని మతాలూ ఒక్కటి కానే కావు. అవి వేర్వేరు విషయాలను నూరిపోస్తున్నాయి గాని, ఒకటే మాటను చెప్పడం లేదు. ఈ నిజాన్ని హిందువులైనవాళ్లు ఎంత స్పష్టంగా గుర్తిస్తే అంత మంచిది. ఎందుకంటే, భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోబోతున్నది మనమే కాబట్టి.

ప్రాచీనకాలం నుంచి ఇప్పటిదాకా వద్దాం.

భూమ్మీద అతి ప్రాచీనమైనది హిందూమతం. ఆఫ్కోర్స్ నేటికి పదివేల సంవత్సరాలక్రితం హిందూ అనే పదం లేదు.  ఒప్పుకుందాం. కానీ నేడు ఆ పేరు పాపులర్ అయింది గనుక అలాగే అనుకుందాం కాసేపు. అసలైతే సనాతన ధర్మం అనాలి. లేదా వైదికమతం అనాలి.

సృష్టిని చేసిన శక్తి ఒకటుంది. అదే సృష్టిగా మారింది. అదే సమయంలో దానికి అతీతంగా కూడా ఉంది. అది బ్రహ్మము. బ్రహ్మమంటే అనంతమైనది అని అర్ధం. బృహ్ అనే ధాతువు నుంచి ఆ పదం వచ్చింది.  'బృహత్తర' అనే మాటలో అన్నట్లుగా, అతి పెద్ద, విశాలమైన, అనంతమైన అని ఈ మాటకు అర్ధాలున్నాయి. జీవులన్నీ దానినుండి పుట్టాయి. మళ్ళీ దానిలో కలసిపోవడమే గమ్యం. దానిని బ్రతికి ఉన్నపుడే సాధించడం మోక్షం. అందరి గమ్యం అదే - అంటుంది హిందూమతం.

దీనినుండి వచ్చిన జైనమతం - అహింసయే ఉత్తమధర్మమని. ఏ జీవినీ హింసించకుండా, కొన్ని నియమనిష్టలను పాటిస్తూ బ్రతకమని, అన్నింటికీ అతీతమై, శుద్ధమై, స్వచ్ఛమైన కేవలముక్తిని ధ్యానంలో అందుకొమ్మని అంటుంది. 'బ్రతుకు, బ్రతకనివ్వు' అనేది దీని సూత్రం.

హిందూమతపు మరొక కొమ్మ అయిన బౌద్ధమేమో, ఆత్మ అనేది లేదని, దేవుడి గురించి అసలే మాట్లాడవద్దని, దుఃఖానికి అతీతమైన నిర్వాణస్థితిని ధ్యానం ద్వారా అందుకొమ్మని అంటుంది.

పురాణయుగంలో హిందూమతంలో పుట్టిన శైవం, వైష్ణవం, శాక్తేయం మొదలైన అనేక కొమ్మలు, మీమీ ఇష్టదేవతలను ఆరాధించవచ్చని, ఆ దేవతలందరూ ఒకే బ్రహ్మము యొక్క అనేక రూపాలని గుర్తుంచుకుని ఆరాధించమని, ఇతరులని హింసించకుండా నీతిగా బ్రతకమని, అదే మోక్షానికి మార్గమని బోధిస్తాయి.

హిందూ, జైన, బౌద్ధాలకు మతమార్పిడి ముఖ్యం కాదు. 'నచ్చి అనుసరిస్తే, మా జీవనవిధానాన్ని అనుసరించండి. లేకుంటే లేదు. అది మీ ఇష్టం' అంటాయి.

ఇకపోతే, హిందూమతాన్ని ఇస్లాం దాడులనుండి కాపాడటానికి పుట్టిన సిక్కులు, పాకిస్తాన్ తో చేతులు కలిపి, ఖలిస్తాన్ కోసం ఇండియాను ఇంకో ముక్కగా చీల్చే ప్రయత్నాలు  కెనడా నుంచి చేస్తున్నారు. నా దృష్టిలో వీళ్ళంత పిచ్చివెదవలు ఇంకెవరూ ఉండరు.

ఇతరదేశాలలో పుట్టిన ఇంకొక ప్రాచీనమతమైన యూదు మతమేమో - యాహ్వే అనేవాడు ఆరు రోజులు సృష్టినిచేసి, ఏడో రోజునుండి రెస్టు తీసుకుంటున్నాడని, ఆయన చెప్పిన పది నిబంధనల ప్రకారం మనిషి బ్రతకాలని, పాపాలు చేస్తే పరిహారంగా జంతుబలులివ్వాలని అంటుంది. చనిపోయినవారందరూ తీర్పుదినం కోసం వెయిటింగ్ రూమ్ లో వేచి  ఉంటారని, తీర్పు రోజున పాపులని నరకానికి, పుణ్యాత్ములని స్వర్గానికి దేవుడు పంపిస్తాడని అంటుంది. అంతే. ఈ మతం కూడా మతమార్పిడిని నమ్మదు. 'నువ్వు యూదుగా పుడితేనే యూదువౌతావు. మతం మారితే కాలేవు' అంటుంది. 

దానినుండి వచ్చిన క్రైస్తవమేమో, జీసస్ ఒక్కడే దేవుడి కుమారుడని, మనుషుల పాపాలకోసం దేవుడే ఆయన్ను బలిచేశాడని, ఆయన్ను నమ్మితే మనుషులందరూ పాపాలనుండి ఉద్ధరింపబడి తీర్పు దినం నాడు స్వర్గానికి పోతారని, నమ్మకపోతే నరకానికి పోతారని, కనుక అందరినీ జీసస్ ని నమ్మమని, మతం మారమని బ్లాక్ మెయిల్ చేస్తుంది. 'మా మతంలోకి మారితే తాయిలాలిస్తా' అంటుంది క్రైస్తవం.

ఆ తర్వాత వచ్చిన ఇస్లామేమో, అల్లా ఒక్కడే దేవుడని, మహమ్మదొక్కడే ఆయన ప్రవక్త అని,  ఇస్లాం ఒక్కటే దైవమతమని, మిగతావన్నీ సైతాన్ ఆరాధనలని చెబుతూ, కాఫిర్లను  (అంటే ముస్లిములు కానివారిని) చంపమని, వాళ్ళ ఆస్తులను, ఆడవాళ్లను కాజెయ్యమని, వాళ్ళను ఏమి చేసినా పాపం రాదని, పైగా ఎన్ని నేరాలు చేస్తే అంత పుణ్యం వస్తుందని, స్వర్గంలో అల్లా పక్కనే సీటు గ్యారంటీ అని, 72 మంది అప్సరసలు నీకోసం స్వర్గంలో సిద్ధంగా ఉంటారని, ఇలాంటి కాకమ్మకబుర్లు ఎన్నో చెబుతూ, మతం మారమని ఆశలు చూపిస్తుంది. ' మా మతంలోకి మారకపోతే చంపుతా' అంటూ బెదిరిస్తుంది ఈ మతం.

క్రైస్తవానికీ, ఇస్లాంకూ మతమార్పిడి ముఖ్యం. జనాన్ని పెంచుకొని దేశదేశాలు ఆక్రమించడం ముఖ్యం.  అయితే, క్రైస్తవం చాపక్రింద నీరులాగా, విద్య, వైద్యరంగాలలో సాయం చేస్తానంటూ ముందుకొచ్చి, మతాలు మారుస్తుంది.  ఇస్లామేమో, ముందు కాందిశీకులుగా, దిక్కులేనివాళ్లమంటూ, లేదంటే దౌర్జన్యంతో ఒక దేశంలో అడుగుపెట్టి, మెల్లిగా దానిని ఆక్రమించి, చివరకు 'ఈ దేశం మాదే' అంటుంది. దానికోసం, అల్లర్లు, హత్యలు, రేపులు, నానా కిరాతకాలు సిగ్గులేకుండా చేస్తుంది. ప్రాచీన ఇండియాను మూడు ముక్కలు చేసింది ఈ మతమేగా?

ఇవి కాకుండా అహమ్మదీయ, బహాయ్ మొదలైన ఎన్నో పిల్ల మతాలున్నప్పటికీ, వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే, అవి మైనారిటీలు గనుక, వాటికి వాయిస్ లేదు. ఇస్లామే వాటిని ఊచకోత కోస్తున్నది.

మరి మతాలు, అవి చెప్పే బోధనలు, ఇలా వేర్వేరుగా ఉంటే, అవన్నీ ఒకటే ఎలా అవుతాయి??

ఈ విషయం మాత్రం ఎంత ఆలోచించినా నాకర్ధం కావడం లేదు.

'మతాలన్నీ ఒకటే, అవి చెబుతున్నది ఒకటే' అనడం శుద్ధ తప్పు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే, కొన్నేమో శాంతిని బోధిస్తున్నాయి. కొన్నేమో హింసను బాహాటంగా ప్రేరేపిస్తున్నాయి. కొన్ని మతమార్పిడి చెయ్యమంటున్నాయి. కొన్నేమో, 'అది అనవసరం' అంటున్నాయి. కొన్నేమో 'నీ దారి నువ్వు చూసుకో' అంటున్నాయి. కొన్నేమో 'అందర్నీ ఉద్దరించు: అంటున్నాయి.

అన్ని మతాలూ ఒకటే ఎలా అవుతాయి?

యూదులలో ఐకమత్యం చాలా ఎక్కువ. వాళ్లలో వాళ్ళు చాలా సహాయం చేసుకుంటారు. కలసికట్టుగా పైకొస్తారు. మంచి పొజిషన్స్ లో ఉంటారు. వాళ్ళ లాబీయింగ్ చాలా గట్టిగా ఉంటుంది. అమెరికాను నిజానికి శాసిస్తున్నది వాళ్లే. వీళ్ళు మతమార్పిడి చెయ్యరు గనుక వీళ్లతో ఇబ్బంది లేదు.

క్రైస్తవులు కూడా ఐక్యమత్యంగానే ఉంటారు గాని, వాళ్లలో వాళ్ళకి నూట తొంభై శాఖలున్నాయి. దేశాన్ని బట్టి, రంగును బట్టి, క్రైస్తవులలో కూడా తేడాలున్నాయి. మొత్తం మీద యూదులకంటే తక్కువే అయినా, ఐకమత్యం వీళ్లలో కూడా ఎక్కువే. వీళ్లకు ఫండింగ్ అంతా ధనిక క్రైస్తవదేశాలనుండి అందుతుంది.

ఇకపోతే, ఇస్లాంలో మాత్రం ఐకమత్యం చాలా ఎక్కువ. చేసేవన్నీ నేరాలే గనుక, మూర్ఖంగా ఒకరికొకరు సాయం చేసుకుంటారు. వీరికి ఫండింగ్ అంతా, సౌదీ, కతార్, ఇరాన్ మొదలైన దేశాలనుండి అందుతుంది. ఒకప్పుడు పాకిస్తాన్ కూడా చేసేది, ఇప్పుడదే బెగ్గర్ కంట్రీ అయింది. కాబట్టి దౌర్జన్యం, బెదిరింపు, డ్రగ్స్,  అందర్నీ అడుక్కోవడం తప్ప ప్రస్తుతానికి అదేమీ చేయలేదు.

ఒక్క హిందువులలోనే ఐకమత్యం లేదు. వాళ్లకు ఫండింగ్ కూడా లేదు. అందుకే ఇండియాలో హిందువుల పరిస్థితి నానాటికీ అలా తయారౌతున్నది. పాదయాత్రలతో, పఠాన్ సినిమాలతో జనాన్ని బుట్టలో వేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే, ఇలాంటి చీప్ ట్రిక్స్ కి హిందువులు చాలా తేలికగా పడిపోతారు కాబట్టి.

సరే, మన మెయిన్ టాపిక్ లోకి వద్దాం.

మరి ఈ మతాలు చెబుతున్నది, చేస్తున్నది అంతా వేర్వేరు కదా? ఇవన్నీ ఒకటే ఎలా అవుతాయి?

'మతాలన్నీ ఒక్కటే' అనేవాళ్ళు తెలివిలేని హిందువులు మాత్రమే. అవి ఎప్పటికీ ఒక్కటి కావు. కాలేవు. ఈ సత్యాన్ని హిందువులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఐకమత్యంగా ఉంటే మంచిది. హిందూప్రభుత్వాన్నే, అంటే, బీజేపీనే ఇండియాలోని ప్రతి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎప్పటికీ ఎంచుకుంటే మంచిది.

కులాలకు, ప్రాంతాలకు, హోదాలకు అతీతంగా ఆలోచించండి. ఒక్కటవ్వండి. మీరు ఎవరికీ అన్యాయం చేయనక్కర్లేదు. అలా మీరెన్నటికీ చెయ్యలేరు కూడా. కనీసం మీ కాళ్ళ క్రింద నేలను మీరు కాపాడుకోండి. అంతే చాలు.

లేదంటే హిందువుల మనుగడ అనేదే ఇండియాలో ప్రశ్నార్ధకమయ్యే సమయం త్వరలో రాబోతున్నది. ప్రాచీనకాలంలో యూదుల లాగా దిక్కులు పట్టుకుని పోవలసిన పరిస్థితి, వేలాది ఏళ్లపాటు వాళ్ళకంటూ ఒకదేశం లేకుండా పోయిన పరిస్థితి  హిందువులకు కూడా రాబోతున్నది.  జాగ్రత్తపడండి.

12, డిసెంబర్ 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 66 (ఇంటర్ ఫెయిల్ మీటింగ్)





మొన్నీ మధ్యన ఇక్కడొక 'ఇంటర్ ఫెయిత్ మీటింగ్' కు వెళ్లాను. అంటే, అనేక మతాల మధ్యన జరిగే అవగాహనా సమ్మేళనం అన్నమాట. ఇది 'షారే జెడెక్' అనే యూదుమత టెంపుల్ లో జరిగింది.

ఇది డెట్రాయిట్ లో ఉన్న చాలా పెద్ద టెంపుల్. https://www.shaareyzedek.org/ అనే చోట దీని గురించి పూర్తి వివరాలను చూడవచ్చు.

దాదాపు ముప్పై నలభై ఎకరాలలో ఉంది ఈ టెంపుల్. చాలా రిచ్ గా ఉంది. స్టార్ ఆఫ్ సోలమన్ ను గుర్తు తెచ్చేలాగా, కిందకీ పైకీ ఉన్న త్రిభుజాల డిజైన్లో బాగా కట్టారు. యూదులంతా బాగా ధనికులే. అమెరికాలో వీళ్ళు సూపర్ రిచ్ సిటిజెన్స్ గా ఉంటారు. వాళ్ళ టెంపుల్స్ కి కూడా బాగా డొనేషన్ ఇస్తారు. కనుక అవన్నీ బాగా విశాలంగా, రిచ్ గా ఉంటాయి.

ప్రస్తుతం ఇక్కడ యూదుమతానికి చెందిన 'హనుక్కా' అనే పండుగ జరుగుతోంది. క్రీ. పూ 164 లో యూదుల రెండో ఆలయాన్ని గ్రీకుల బారినుండి కాపాడుకుని తిరిగి దానిని కైవశం చేసుకున్నారు. ఆ సందర్భంగా, మెనోరా అనబడే యూదుల దీపపుసెమ్మెను వెలిగించడానికి అక్కడ ఒక రోజు మాత్రమే సరిపోతుందని అనుకున్న నూనె వారం రోజులపాటు ఆ దీపాలను వెలిగించిందట. ఆలయస్వాధీనాన్ని, దీపాల అద్భుతాన్ని పురస్కరించుకుని యూదులు అప్పటినుంచీ 'హనుక్కా' అనే ఈ పండుగను చేసుకుంటారు. ఇది మన దీపావళికి అటూఇటుగా వస్తుంది. అందుకని, ఇక్కడున్న హిందూ సంఘాల లీడర్స్ కూడా యూదులతో కలసి, రెండు పండుగలూ ఒకే కప్పు క్రింద జరుపుకుందామని అనుకున్నారులాగా ఉంది.

ఈ ఈవెంట్ అలా జరిగింది.

మొదటి రోజున మెనోరాలో ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు. రోజుకొక్క దీపం చొప్పున ఏడు రోజులలో ఏడు దీపాలను వెలిగిస్తూ పోతారు.  ఒకప్పుడు మెనోరాలో ఏడు దీపాలుండేవిట. ఇప్పుడు తొమ్మిదయ్యాయని అక్కడ రబ్బీ చెప్పాడు. యూదుల ప్రీస్ట్ ని మనం 'రబ్బీ' అంటాము గాని, వాళ్ళు 'రబ్బై' అని అంటున్నారు.

సమావేశంలో యూదులు, హిందువులే ఉన్నప్పటికీ, క్రైస్తవులను, ముస్లిములను కూడా ఆహ్వానించారు.  వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే వచ్చారు. క్రిస్టియన్ లీడర్ ఒకామె, ముస్లిం ఇమామ్ ఒకాయన వచ్చారు. మంచి స్నేహపూరిత వాతావరణంలోనే సమావేశం జరిగింది. కాకపోతే, హిందూమతం గురించి, యూదుమతం గురించి తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడుకున్నారు. అదే వింత !

మన హిందూమతం గురించి వివరించడానికి భారతీయ టెంపుల్ నుండి శారదాకుమార్ అని ఒక సండే స్కూల్ టీచర్ని తెచ్చారు. ఆమె చిన్మయా మిషన్ లో ట్రెయినింగ్ అయి 'ఆచార్య' అనే పట్టాను పొందిందట. దీపావళి గురించి ఆమె వివరించి చెప్పిన వివరణ చాలా పేలవంగా, నిరాశాజనకంగా ఉండటమే కాక, పూర్తిగా నెగటివ్ ఇంప్రెషన్ ను శ్రోతలలో కలిగించేలా ఉంది. ఆమె మాట్లాడుతున్నంత సేపూ సభలో ఉన్న యూదు సోదరులు, సోదరీమణులు జోగుతున్నారు. లేదా విసుగ్గా ముఖాలు పెట్టుకుని ఉన్నారు.

ఉదాహరణకు, దీపావళిని వివరిస్తూ ఆమె, 'ఇండియాలో అందరూ ఈ రోజులలో పొద్దున్నే లేచి తలకు నూనె పట్టించుకుని గంగానదిలో మునుగుతారు. అది మా సాంప్రదాయం' అని చెప్పింది. నేను సభికుల వైపు చూస్తే వాళ్లంతా వాంతికొచ్చినట్లు ముఖాలు పెట్టారు. అంటే, 'ఒరే ఇండియన్ దరిద్రుల్లారా. నదులని ఆ విధంగా పాడుచేస్తున్నారన్న మాట మీరంతా' అన్నట్లుగా ఉంది వాళ్ళ ఫీలింగ్.

నావరకూ నేనెప్పుడూ ఆ విధంగా చేసినట్టు ఎంత చించుకున్నా నాకు గుర్తుకు రాలేదు. ప్రతి ఊర్లోనూ గంగానది ఎలా ఉంటుంది? పోనీ నదులున్న ఊర్లలో కూడా హిందువులెవరూ అలా పొద్దున్నే నూనె పూసుకుని నదిలో మునగరు. ఇక్కడ హిందూ లీడర్స్ అనేవాళ్ళు, ఇలాంటి బ్యాడ్ ప్రాపగాండా ఎందుకు చేస్తున్నారో, ఎందుకిలాంటి నెగటివ్ భావాలను ప్రచారం చేస్తున్నారో నాకైతే అర్ధం కాలేదు. ఇటువంటి ప్రచారాలవల్లే హిందూమతం అంటే సరియైన అవగాహన కలగకపోగా, నెగటివ్ భావాలు వినేవారిలో కలుగుతాయి. చేతనైతే సరిగ్గా చెప్పాలి, లేకపోతే ఊరుకోవాలి. ఇలా ఎందుకు చెయ్యడం? అనిపించింది.

హనుక్కా పండుగ జరిగిన ఎనిమిది రోజులూ యూదులు ఏడవకూడదు. కనుక, ఏడుపు ప్రార్ధనలు కూడా పనికిరావు. అవి పండుగ రోజులు గనుక, జోకులు, సరదా వాతావరణం ఉండాలట. ప్రోగ్రామ్ కూడా అలాగే జరిగింది.

చివరలో మన స్వీట్లు, యూదుల ఏదో స్నాక్స్ కలిపి అందరూ స్వీకరించారు. అదొక పార్టీలాగా జరిగింది. సభికులలో ఉన్న కొందరు స్కాలర్స్ కి నన్ను పరిచయం చేస్తామని నన్ను ఆహ్వానించిన ఆయన అంటే, వద్దని వారించాను.

ఇక మేము సెలవు తీసుకుని వచ్చేశాము.

ఇంటికొచ్చాక సమావేశం ఆర్గనైజర్ దగ్గర నుండి నాకొక మెసేజి వచ్చింది.

'సారీ అండి. మీకు ఇక్కడ స్కాలర్స్ ని పరిచయం చేద్దామని అనుకోని మిమ్మల్ని ఆహ్వానించాను. అది వీలుకాలేదు. సమావేశం మీకు విసుగు పుట్టినట్లుగా ఉంది' అనేది దాని సారాంశం.

ఇలా రిప్లై ఇచ్చాను.

'విసుగు పుట్టినమాట వాస్తవమే. ఆ స్కాలర్స్ దగ్గర నేను నేర్చుకునేది ఏమీ లేదు. నా దగ్గర నేర్చుకునే అదృష్టం వాళ్ళకింకా రాలేదు. పోతే, మీటింగ్ అంతా చాలా పేలవంగా నిరాశాజనకంగా ఉంది. హిందూ, యూదు మతాల మధ్యన చక్కటి ఇంటరాక్షన్ జరిగి ఉంటే బాగుండేది. మీ సమావేశాన్ని ఇంకా చాలా బాగా జరిపి ఉండవచ్చు.  హిందూ, యూదు మతాల మూలాలను, వాటిమధ్యనున్న పోలికలను, భేదాలను గురించి చర్చించి ఉండవచ్చు. Lost Tribes of Israel అనేవాళ్ళు రెండువేల ఏళ్ళనుండీ ఇండియాలో ఎలా తలదాచుకున్నారో వివరించి ఉండవచ్చు. ప్రపంచమంతా వాళ్ళని వెంటాడి వేటాడినా, రెండువేల ఏళ్లుగా ఇండియా వాళ్ళని ఎలా తల్లిలాగా కాపాడుతూ వచ్చిందో చెప్పి ఉండవచ్చు. అలా చేసి ఉన్నట్లయితే, వాళ్ళ దృష్టిలో ఇండియా గౌరవం పెరిగి ఉండేది. అటువంటి కోర్ విషయాలు చర్చిస్తే బాగుండేది' అని మెసేజి చేశాను.

అక్కడి రబ్బై ఒకాయన 'నేను మోసెస్ తమ్ముడి వంశం వాడిని. ఆ వంశంలో మాది ఇన్నో తరం. మేమంతా గాయకులము. అప్పటినుంచీ యూదుమతానికి చెందిన పాటలను ఇప్పటివరకూ పాడుతూ వస్తున్నాము' అని చెప్పి, గిటార్ మీద ఆ పాటలను పాడి వినిపించాడు.  మన వైపు నుండి, మనవాళ్ళు, ద్రుపద్ రాగాన్ని, కొన్ని భజనలను పాడి వినిపించారు. వాటిని మాత్రం యూదులు చాలా బాగా ఆనందించారు.

'హిందూమతంలో రసగుల్లాలు తింటాము' అని మనమంటే, 'యూదుమతంలో ఇవి తింటాము' అని  వాళ్ళు చెప్పారు. 'మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము' అని వీళ్లంటే, 'మేము ఈ విధంగా చేసుకుంటాము' అని వాళ్ళన్నారు. ఆ విధంగా ఆ మీటింగ్ జరిగింది గాని, అసలైన కోర్ ఇష్యుస్ ఎవరూ మాట్లాడలేదు.

ఎవరి విభేదాలు వారిలోనే ఉన్నాయి. బయటకు మాత్రం అందరూ బాగా నటించారు.

ఎందుకిలా అంటున్నానంటే, మ్యూజిక్ నీ సాంగ్స్ నీ అందరూ ఎంజాయ్ చేసినప్పటికీ, ముస్లిం ఇమామ్ మాత్రం చాలా అసహనంగా కనిపించాడు. ఇస్లాంలో మ్యూజిక్ అనేది ఒక పాపం కదా మరి? ఆయన దాన్నెలా ఎంజాయ్ చేయగలడు? ఖురాన్ ఒప్పుకోదు. పాపం ముళ్ళమీద కూచున్నట్టు కూచున్నాడు.

ఉన్న విభేదాలన్నీ కోర్ లో ఉంచుకుని, పైకి మాత్రం షేక్ హాండ్స్ ఇచ్చుకుంటూ,  నవ్వుతూ స్వీట్లు తింటే, అది ఇంటర్ ఫెయిత్ మీటింగ్ ఎలా అవుతుందో నాకైతే అర్ధం కాలేదు. అది ఇంటర్ ఫెయిత్ కాదు, ఇంటర్ ఫెయిల్ అని నాకనిపించింది.

నా చిన్నపుడు 'టెన్త్ పాస్, ఇంటర్ ఫెయిల్' అనే జోకు బాగా ప్రచారంలో ఉండేది. లేదా ఇంటర్ పాస్, టెంత్ ఫెయిలా? ఏదో ఒకటి సరిగ్గా గుర్తులేదు.

ఆ విద్ధంగా 'ఇంటర్ ఫెయిల్' మీటింగ్ ను ఆస్వాదించి, తలనొప్పితో ఇంటికి తిరిగి వచ్చాను. ఇకమీదట ఇలాంటి మీటింగ్స్ కి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాను.

అమెరికాలో మన హిందూ దేవాలయాల కమిటీ మెంబర్లు, హిందూమతాన్ని ప్రచారం చేస్తున్నామన్న భ్రమలలో ఉంటూ,  దానిగురించి పూర్తి నెగటివ్ ఇమేజిని ఇక్కడి వారిలో కలిగిస్తున్నారు. హిందూమతం కోర్ లో ఏముందో అర్ధం చేసుకోకుండా, వాళ్లకు తెలిసిన మూడు ఆచారాలు, నాలుగు పండుగలే హిందూమతం అనే భ్రమలలో ఉన్నారు. హిందూమతమంటే ఏమిటో ముందు వీళ్లకు సరిగ్గా అర్ధమైతే కదా, ఇతరులకు ప్రచారం చేసేది !

హిందూమతాన్ని మొత్తాన్నీ ఒక గొడుగు క్రిందకు తెచ్చి దానిని ఆర్గనైజ్ చేసే ఒక సెంట్రల్ కమిటీ లేకపోవడం మనకున్న అతిపెద్ద సమస్యలలో ఒకటి. అది లేకపోయేటప్పటికీ, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రచారాలు, కామెంట్లు, కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ హిందూమతాన్ని ఉద్ధరిస్తున్నామనే అనుకుంటున్నారు. కానీ ఎంత ఉద్ధరిస్తున్నారు? ఎంత నష్టపరుస్తున్నారు? అనేది మాత్రం వారికి అర్ధం కావడం లేదు. ఎవరికిష్టం వచ్చినల్టు వారు మాట్లాడుతుంటే, ఇతరమతాలకు అదే ఒక అలుసు అవుతోంది. 

ఇదంతా చూస్తుంటే, 1990 లలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది.

రామకృష్ణ వివేకానంద భావప్రచార పరిషత్ సభ్యులమంటూ కొంతమంది వెళ్లి బేలూర్ మఠంలో అప్పటి అధ్యక్షులైన శ్రీ భూతేశానందస్వామిని దర్శించారు. రామకృష్ణ వివేకానందుల భావాలను సమాజంలో ప్రచారం చేస్తామని  వారు ఆయనతో అన్నారు.

దానికాయన సున్నితంగా ఇలా అన్నారట, 'భావప్రచారానికి ముందు మీలో ఉండవలసింది భావశుద్ధి'.

అంతకు మించి ఆయన ఇంకేమీ అనలేదు. ఈ విషయాన్ని వారిలో ఒకాయనే నాతో అన్నాడు.

మనకే సరియైన అవగాహన లేదు. మనం ఇతరులకు ఏ విధంగా బోధించగలం?

7, డిసెంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 65 (ఈ పౌర్ణమి ప్రభావం-నార్త్ కెరొలినా లో అంధకారం)

డిసెంబర్ 3 శనివారం సాయంత్రం ఏడు గంటలు. నార్త్ కెరొలినాలోని మూర్ కౌంటీలో కరెంట్ పోయింది. ఈ రోజు బుధవారం. నేటికి అయిదురోజులైంది. కరెంట్ రాలేదు. కనీసం ముప్పై వేలమంది ఈ ఐదురోజులుగా చీకట్లో మగ్గుతున్నారు. చలేమో నాలుగు నుండి ఎనిమిది డిగ్రీలుంది. 

ఈ నాలుగు రోజులుగా కరెంటే కాదు. ఇంటర్నెట్ లేదు. మొబైల్ నెట్వర్క్ లేదు. అమెరికన్స్ నానా బాధలు పడుతున్నారు. ఈ చలిదేశంలో కరెంట్ లేకపోతే ఒక్కరోజైనా బ్రతకడం చాలా కష్టం. అలాంటిది అయిదు రోజులుగా నార్త్ కెరొలినా వాసులు నరకం చూస్తున్నారు.

సరిగ్గా పౌర్ణమి నీడలో ఇది జరిగింది.

అమెరికాను సూచించే మిథునరాశి నుండి చూస్తే, లగ్నాధిపతి బుధుడు సప్తమంలో  కెళ్ళిపోయాడు.  సప్తమానికి అర్గళం పట్టింది. మేషంనుండి రాహు, కుజ, చంద్రుల దృష్టి ధనుస్సు మీదుంది. అందుకే  ఇలా జరిగింది.

అయితే, ఇది ఏదో దానంతట అది జరిగిన విద్యుత్ ఫెయిల్యూర్ కాదు. ఎవరో దుండగులు వచ్చి, సబ్ స్టేషన్లమీద కాల్పులు జరిపి అక్కడి పరికరాలను ధ్వంసం చేశారు. వాళ్ళను ఇంతవరకూ  పట్టుకోలేకపోయారు. 'దాడులకు మన పవర్ లైన్లు ఎంత అందుబాటులో ఉన్నాయో చూడండి; అని ఇక్కడ సోషల్ మీడియాలో అమెరికన్లు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, 'గ్యాస్ లైన్లు, వాటర్ సప్లై లైన్లు కూడా ఇదే విధంగా సరైన రక్షణ లేకుండా ఉన్నాయి. మనకు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు' అని భయపడుతున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.

రాజకీయపార్టీల మధ్య గొడవలతో ఇవి జరుగుతున్నాయని, దుండగులు చేసిన పని కాదని లోకల్ వార్తలు. ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఫెడరల్ ప్రభుత్వం సామాన్యంగా జోక్యం చేసుకోదు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా రంగంలోకి దిగి  నార్త్ కెరొలినాకు సాయం చేస్తున్నారు. రాజకీయగొడవలకు ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇక్కడ కూడా ఉందన్నమాట. అవున్లే ఇండియాలో అయితే మకలహాలు రెచ్చగొట్టొచ్చు, ఇక్కడ అది కుదరదు. కాబట్టి ఇలాగన్నమాట. ఎక్కడైనా మనిషి మనస్తత్వం ఒకలాగే ఉంటుంది మరి. 

ఇదంతా చూస్తుంటే మన ఇండియా ఎంత స్వర్గమో అర్ధమౌతున్నది. ఇక్కడ సమస్యలు చాలా తక్కువ. కానీ ఇక్కడ కూడా ఉన్నాయి. చాలాసార్లు వాటినే మేనేజ్ చేయలేకపోతున్నారు.  అదే మన ఇండియాలో అయితే, అన్నీ సమస్యలే. అడుగడుక్కూ సమస్యలే. అందరూ దేశద్రోహులే. అయినా అక్కడ నడుస్తున్నదంటే అది మనుషుల మంచితనమో ఇంకేదోనో మాత్రం తెలీడం లేదు..

ఏదేమైనా, ఈ పౌర్ణమికి ఇక్కడ ఇలా జరిగింది.

3, డిసెంబర్ 2022, శనివారం

మూడవ అమెరికా యాత్ర - 64 (మా క్రొత్త పుస్తకం 'ఉత్తర గీత' విడుదల)

నేడు గీతా జయంతి. అందుకని, నా కలం నుండి వెలువడుతున్న 56వ పుస్తకంగా మరియొక ఉత్తమగ్రంధము 'ఉత్తరగీత'ను నేడు అమెరికా నుండి విడుదల చేస్తున్నాను. 

మన హిందూమతంలో ఎటువంటి ఉత్తమమైన  గ్రంధాలున్నాయో మనకే తెలియని పరిస్థితి నేడున్నది. అలాంటివాటిలో ఇంకా ఉత్తమములైన గ్రంధములను ఏర్చి కూర్చి, వాటికి నాదైన వ్యాఖ్యానములను వరుసగా వ్రాస్తూ వస్తున్నాను.

ఇదే హిందూమతమునకు, వేదాంత వాఙ్మయమునకు 'పంచవటి' నుండి మేము చేస్తున్న సేవ...

భగవద్గీతకు అనుచరులుగా ఉండే కృష్ణగీతలు రెండు మనకున్నాయి. ఒకటి అనుగీత, రెండు ఉత్తరగీత. ఈ రెండూకూడా శ్రీకృష్ణుని చేత అర్జునునకు బోధింపబడినవే.

నేపధ్యమేమో, మహాభారతయుద్ధం తదుపరి హస్తినాపురంలో రాజభవనప్రాంగణం. యుద్ధభూమిలో  తనకు చెప్పిన విషయములను మరచిపోయానని, మళ్ళీ చెప్పమని అడిగిన అర్జునునకు శ్రీకృష్ణుడు ఓపికగా మళ్ళీ బోధించినవే ఈ రెండు గ్రంధములలోని విషయములు.

భగవద్గీతలో సూచనాప్రాయముగా చెప్పబడిన కొన్ని విషయములు వీటిలో విస్తారముగా వివరింప బడతాయి.  వీటిలో ప్రస్తుతం ఉత్తరగీతకు నా వ్యాఖ్యానమును ఇప్పుడు విడుదల చేస్తున్నాను. దీనిలో యోగసాధనా క్రమం మిక్కిలి వివరముగా చెప్పబడింది. 

కాలక్రమంలో అనుగీతకూడా మా ప్రచురణగా వస్తుంది.

ఈ పుస్తకమును ఇల్లినాయ్ రాష్ట్రంలోని షాంపేన్ సిటీలో ఉన్నపుడు ఎక్కువగా వ్రాశాను. కానీ మిషిగన్ రాష్ట్రంలోని ట్రాయ్ సిటీ నుండి పూర్తిచేసి విడుదల చేస్తున్నాను.

నేటి సోకాల్డ్ మేధావులకు వచ్చే అనేక సందేహాలు అర్జునునకు కూడా అప్పటిలోనే వచ్చాయి. ఎంతైనా మహారాజు కదా మరి! వాటికి శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానములు ఈ  గ్రంధంలో చెప్పబడినాయి. ఆ సమాధానములలో, వేదాంతము, జ్ఞానము, యోగము, తంత్రశాస్త్రములు వివరింపబడినాయి. జీవన్ముక్తి, విదేహముక్తులు లక్ష్యములుగా చెప్పబడినాయి.

ఈ పుస్తకమును వ్రాయడంలో అనుకూలమైన వాతావరణమును కల్పించి, సహకరించిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు ప్రవీణ్, చావలి శ్రీనివాస్ లు, షాంపేన్ లో మమ్మల్ని ఎంతో ఆప్యాయతతో ఆదరించిన శ్రీనివాస్ నూకల, శకుంతలగార్లకు, డెట్రాయిట్ వాసులైన ఆనంద్ కుమార్, సుమతిలకు నా కృతజ్ఞతలు మరియు ఆశీస్సులను అందిస్తున్నాను.

డెట్రాయిట్ లో నా శిష్యులైన సాయి దంపతుల చేతులమీదుగా ఈ గ్రంధం విడుదల అవుతున్నది.

మా అన్ని గ్రంథముల లాగే, ఈ ఒక్క గ్రంధమును మీ జీవితానికి దిక్సూచిగా పెట్టుకుంటే చాలు, మీ జీవితం ధన్యమౌతుంది.

అసలైన హిందూమతమంటే ఏమిటో చదవండి. అర్ధం చేసుకోండి, ఆచరించండి. మానవజీవితాన్ని ఎంతో ఉన్నతంగా మార్చే అసలైన ఫిలాసఫీ మొత్తం ఈ గ్రంధంలో సంక్షిప్తంగా చెప్పబడింది.

మా గ్రంధాలన్నీ ఒక్క హిందువుల కోసమే కాదు, మొత్తం మానవజాతికి ఇవి ఎంతో పనికివచ్చే గ్రంధములు. ప్రపంచంలోని ఏ మతగ్రంధంలోనూ ఇటువంటి ఉన్నతమైన ఫిలాసఫీ మీకు ఎక్కడా దొరకదు. అలాంటివి మన అమూల్యగ్రంధములు. ఇవి మనిషికి మానవత్వాన్ని నేర్పడమే కాదు, దైవత్వంతో నింపుతాయి.

యధావిధిగా ఈ గ్రంధం కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది. మా మిగతా పుస్తకాల వలె దీనిని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాం.

1, డిసెంబర్ 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 63 (ఇస్లాం చాలా సంస్కరింపబడాలి)

ముస్లిములలో కిరాతక మనస్తత్వాన్ని పెంచి పోషించడంలో ఖురాన్ పాత్ర ఎంతో ఉంది. ఎలాగంటారా?

తనను నమ్మి, తల్లిదండ్రులను ఎదిరించి, తనతో ఉంటూ, సంసారం చేసిన శ్రద్ధ అనే అమ్మాయిని 35 ముక్కలుగా నరికి నెలలపాటు ఫ్రిజ్ లో దాచిపెట్టి, రోజుకొక్క ముక్కగా ఎక్కడెక్కడో పారేస్తూ వచ్చిన, ఆఫ్తాబ్ పూనావాలా, పోలీసులు చేస్తున్న విచారణలోగాని, లై డిటెక్టర్ టెస్ట్ లో గాని, ఇతర టెస్టులలో గాని, ఎక్కడా పశ్చాత్తాపాన్ని చూపించలేదు. అతనికి తప్పు చేశానన్న స్పృహ కూడా లేదు. అంతటి రాక్షసుడుగా ఉన్నాడు. అంతేకాదు, శ్రద్ధను చంపి, ఆమె ఇంకా తన ఫ్రిజ్ లో ఉండగానే, ఇంకో అమ్మాయితో డేటింగ్ సైట్లో డేటింగ్ మొదలుపెట్టి,రూముకు పిలిపించుకుని, శ్రద్ధ బాడీ నుండి తీసిన ఉంగరాన్ని ఆ అమ్మాయికి గిఫ్ట్ గా ఇచ్చాడు. వీడి గురించి మాట్లాడటానికి, రాక్షసుడనే పదం చాలా చిన్నదేమో ! ఆ పదాన్ని వాడితే రాక్షసులే సిగ్గుతో సూయిసైడ్ చేసుకుంటారేమో?

నిన్నటికి నిన్న ఒక కొరియన్ వ్లాగర్ అమ్మాయి, బాంబే నడిరోడ్లమీద అల్లరికి గురయ్యింది. అదికూడా లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుండగా, ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని లాగి, బైక్ మీద ఎక్కమని అల్లరి చేసినది, మహమ్మద్ షేక్, మహమ్మద్ నకీబ్ అనే ఇద్దరు ముస్లిమ్స్. ఇద్దరినీ అరెస్టు చేశారు ముంబై పోలీసులు. వాళ్ళలోనూ పశ్చాత్తాపం లేదు.

మొన్నటికి మొన్న, "క్రిస్టియన్స్ ని అనుకరిస్తూ, పుట్టినరోజు పండుగలు జరుపుకోవడం ఇస్లాం పధ్ధతి కాదు, అలా జరుపుకోవద్దు" అంటూ ఒక ఫత్వాను జారీ చేశాడు ఒక  ఇండియా ఇమామ్. ఈ మోడ్రన్ కాలంలో అలా మాట్లాడుతున్నందుకు వాడికి సిగ్గు కూడా లేదు.

ఉదయపూర్లో కన్నయ్య లాల్ అనే టైలర్ని కొద్దీ నెలలక్రితం దారుణంగా చంపేశారు ఇద్దరు ముస్లిమ్స్. కారణం నూపుర్ శర్మను అతడు సపోర్ట్ చేశాడని. పోలీసులు ఇద్దరినీ పట్టుకున్నారు. వాళ్లలో కూడా పశ్చాత్తాపం లేదు.

ఎందుకిలా అవుతుంది?

అటువంటి పనులు చేసిన తర్వాత ఎలాంటి మనిషైనా సిగ్గుపడతాడు. పశ్చాత్తాపపడతాడు. ఏదో తెలియకో, వేడిలోనో అలాంటి తప్పులు చేసినా, ఆ తరువాత బాధతో కుమిలిపోతాడు. కొంతమంది నేరస్తులైతే, ఆ మానసికక్షోభను భరించలేక సూయిసైడ్ కూడా చేసుకుంటారు. కానీ, చాలామంది ముస్లిములలో ఆ పశ్చాత్తాపం కనిపించదు.

కారణమేంటి?

అది వాళ్ళ తప్పు కాదు. ఖురాన్ బోధలలోనే ఆ తప్పుంది.

ఇతరమతాల వాళ్ళు సైతాన్ భక్తులని అది బోధిస్తుంది. వాళ్ళను చంపినా, ఇంకేం చేసినా తప్పులేదని అది నొక్కి వక్కాణిస్తుంది. వాళ్ళ ఆస్తులను కాజేసినా, వాళ్ళ ఆడవాళ్లను ఎత్తుకుపోయినా, రేపులు చేసినా ఏమీ తప్పులేదని చెప్పడమే గాక, అలా చెయ్యమని,  అలా  చేస్తే స్వర్గంలో అల్లా పక్కన సీటు గ్యారంటీ అని, అది తాయిలాలు చూపిస్తూ బోధిస్తుంది. అవన్నీ సత్యాలని ఈనాటికీ ప్రతి శుక్రవారంనాడు, ముల్లాలు వీళ్లకు నూరిపోస్తూ ఉంటారు. అవి నిజాలేనని ప్రతి ముస్లిమూ నమ్ముతాడు. అందుకే అలాంటి పనులు చేసినప్పటికీ వాళ్లలో పశ్చాత్తాపం ఉండదు.

26/11 మారణకాండ ముంబాయిలో జరిగి ఇప్పటికి 14 ఏళ్లయింది. ఈ దాడిలో దొరికిన ఒకేఒక్క దోషి, అజ్మల్ కసబ్ లో ఏమాత్రమూ అపరాధభావన గాని, పశ్చాత్తాపం గాని కనిపించలేదు. కారణం వెరీ సింపుల్. నేను పైన చెప్పినదానిలోనే కారణం ఉంది. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళనలా రెచ్చగొడుతున్న ఖురాన్ బోధలదే అసలైన తప్పు.

ఇతర మతాల మనుషులు తమ బానిసలని, వాళ్ళను ఏమి చేసినా తప్పులేదని చెబుతున్న ఖురాన్ చీకటిబోధలను వాళ్ళు గుడ్డిగా నమ్మడము, ముల్లాలందరూ ప్రతిశుక్రవారం ప్రార్థనలలో వాళ్ళనలా నమ్మిస్తూ ఉండటమే దీనికంతా కారణం.

'అలా చెయ్యడం తప్పు,  అలాంటి నేరాలు మనం చెయ్యకూడదు. నీతిగా బ్రతకాలి. మతం ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యం' అని ఏ ముల్లా కూడా చెప్పడు. 'పుట్టినరోజులు జరుపుకోవద్దు, అది ఖురాన్ కు విరుద్ధం' అంటూ నిన్నగాక మొన్న ఫత్వా జారీ చేసిన ముల్లాయే, నేను చెబుతున్నది నిజమనడానికి ఉదాహరణ.

అసలు ముస్లిములు చేసే రోజువారీ ప్రార్ధనలోనే ద్వేషం దాగుంది. అదేంటి?

'లా ఇలాహ్ ఇల్లల్లాహ్ ముహమ్మదర్రసూలుల్లాహ్' అంటే అర్థమేంటి?

'అల్లా తప్ప వేరే దేవుడు లేడు. మహమ్మదొక్కడే ఆయన ప్రవక్త'. అని ఆ ప్రార్ధనకర్ధం.

అంటే, అర్థమేంటి? అల్లా తప్ప మిగిలిన ఎవరూ దేవుళ్ళు కారు అని ఆ ప్రార్ధన నర్మగర్భంగా  మాత్రమే కాదు, డైరెక్ట్ గానే చెబుతోంది. ఇతర ప్రవక్తలెవరూ ప్రవక్తలు కారు. మహమ్మద్ ఒక్కడే ప్రవక్త. ఆయన చెప్పిన ఖురానే దైవశాసనం, మిగతా మతాల గ్రంధాలన్నీ సైతాన్ పుస్తకాలని అది  క్లియర్ గా చెబుతోంది.

ముస్లిములు ప్రతిరోజూ చేసే దైవప్రార్థనలోనే అసలు నెగటివిటీ ఉంది. ద్వేషం ఉంది. ఇతరమతాలంటే, ప్రవక్తలంటే, అసహనభావం ఉంది. మరి అలాంటి ప్రార్ధనను ప్రతిరోజూ శ్రద్ధగా చేసేవాళ్ళు అలా ఉండక ఇంకెలా ఉంటారు? 

ఖురాన్లో హింసను ప్రేరేపించే సూరాలు బోలెడున్నాయి. పాకిస్తాన్ లోని తీవ్రవాద ముఠాలన్నీ ఆ సూరాలనే ఆధారంగా తీసుకుంటాయి. 'దేవుడే ఇలా చెయ్యమని మాకు చెప్పాడు, తప్పేముంది?' అని వాళ్ళు వాదిస్తారు. దానినే వాళ్ళు నమ్ముతారు కూడా. అందుకే ఎలాంటి ఘోరాలు చేసినా, వాళ్లలో పశ్చాత్తాపం ఎక్కడా కనపడదు దేవుడు చెప్పిన పనులనే తాము చేస్తున్నామని వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు.

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూచినా, ఇతర మతాల విషయంలో ముస్లిముల ప్రవర్తన ఇలాగే ఉంటుంది. దీనికి మూలకారణం ఖురాన్ బోధలలోనే ఉంది.

వాటిని మార్చి, ఆ హింసాత్మక పద్యాలను ఖురాన్ నుంచి తొలగించి దానిని సంస్కరించనంతవరకూ ముస్లిమ్స్ లోని హింసాత్మకధోరణి పోదు.

కానీ అది ఎన్నటికైనా జరుగుతుందా? ఎన్నటికీ జరగదు. మరి వాళ్లెలా శాంతిగా మారతారు? అదీ జరగదు. మరేం జరగబోతోంది.

నేను చెప్పడమెందుకు? ఏం జరగబోతోందో ప్రపంచంలో అందరికీ తెలుసు. ఇజ్రాయెల్ లో ఏం జరుగుతోంది? ఇండియాలో ఏం జరుగుతోంది? అమెరికాలో ఏం జరుగుతోంది? ఇరాన్లో, సిరియాలో, రువాండాలో, ఉగాండాలో, ఇథియోపియాలో, నైజీరియాలో, ఆఫ్ఘనిస్తాన్ లో, చివరకు పాకిస్తాన్ లో కూడా ఏం జరుగుతోంది? మారణకాండ జరుగుతోంది. వాళ్ళు పెంచి పోషించిన తాలిబానే వాళ్ళను కాటేస్తోంది. ఎక్కడైనా అదే జరుగుతుంది.

మొన్నొక ముస్లిం ఫ్రెండ్ నాతో మాట్లాడుతూ, 'ప్రపంచదేశాలలో అన్నిట్లోనూ మా జనాభా పెరుగుతోంది. దేశదేశాలలో అతివేగంగా విస్తరిస్తున్న మతం ఇస్లామే' అన్నాడు. అది నిజమే. ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే, వాళ్లకు జనాభానియంత్రణ లేదు. ఇస్లాం అంటే ఇష్టపడి ఎవరూ గుంపులు గుంపులుగా దానిలోకి మారడం లేదు. వాళ్ళ జనాభా పెరగడం వల్ల ఇస్లాంకు మెజారిటీ వస్తోంది. 20 ఏళ్లలో వెయ్యిమంది ముస్లిమ్స్ లక్షమంది అవుతారు. మిగతావాళ్ళు రెండువేలు లేదా మూడువేలమంది అవుతారు. మరి జనాభా పెరగక ఏమౌతుంది?

ఈరోజు న్యూస్ చూశారా? UK లోని వేల్స్, లీసెస్టర్ లలో క్రిస్టియన్స్ మైనారిటీలయ్యారు.  ముస్లిం జనాభా 44 శాతం పెరిగింది. ఇంగ్లాండ్ లోని ఇంగ్లీష్ మేధావులందరూ ఏం చెయ్యాలో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు. క్రైస్తవమతానికి ఆయువుపట్టులాంటి దేశంలో క్రైస్తవులు మైనారిటీలయ్యారు. ఊహించగలరా? రేపు ఇండియాలో కూడా ఇదే జరగబోతోంది.

ఒక ఇండియా శిష్యురాలు ఫోన్లో నాతో ఇలా అంది, 'ఎప్పటిదాకానో ఎందుకు? ఇప్పుడు మాత్రం హిందువులు మైనారిటీలు కారా? ప్రస్తుతం అలాగే బ్రతుకుతున్నాము కదా'

నిజమే అనిపించింది నాకు.

ఒక అమెరికన్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే అతనిలా అన్నాడు.

'మీ హిందువులు మా దేశంలో ఎన్ని గుళ్ళయినా కట్టుకోండి. మాకేమీ అభ్యంతరం లేదు. మీతో హానిలేదని మాకు తెలుసు. మీ జనాభా పెరగదు. మీరు మతమార్పిడి చెయ్యరు. కానీ ఒక్క మసీదును మా దేశంలో కడితే మేము చాలా కంగారుపడతాము. ఎందుకంటే, ముందు మసీదంటారు. తరువాత షరియా అంటారు. జనాభాను పెంచేస్తారు. తరువాత ఏకంగా  దేశమే మాదంటారు. ఇలా జరుగుతుందని మాకు బాగా తెలుసు. అందుకే మాకంటూ ఒక ప్లానుంది. మీ ఇండియావాళ్లకు ఒక ప్లానంటూ లేదు. ముందుముందు మీకు చాలా ట్రబులుంటుంది' అన్నాడు.

నాకు ఒప్పుకోక తప్పలేదు.

చైనాలోని ఊగిర్ ప్రావిన్స్ లో కూడా ముస్లింసమస్య ఉంది. అక్కడ, లక్షమంది ముస్లిం ఆడవాళ్లకు బలవంతంగా పామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించాడు జిన్ పింగ్. చైనాలో ఉండాలంటే చైనీయులుగా ఉండండి. మా రూల్స్ పాటిస్తూ ఉండండి. లేదంటే బయటకు పొండి' అని ఖచ్చితంగా చెప్పాడు. అది నిరంకుశ కమ్యూనిస్ట్ పరిపాలన గనుక అలా సాగింది. ప్రజాస్వామ్య దేశాలలో ఎలా సాగుతుంది? అందుకే ఇండియాలాంటి దేశాలలో కష్టాలు మొదలౌతున్నాయి.  ఇంగ్లాండ్ కంటే గొప్ప ఉదాహరణ ఇంకేదీ అవసరం లేదనుకుంటాను !

మూలాన్ని మార్చనంతవరకూ ఫలితాలెలా మారుతాయి? కళ్ళు మూసుకుని ఊరుకుంటే జనాభా పెరగకుండా ఉంటుందా? ఎవరేమన్నప్పటికీ, ఇంకొక 50 ఏళ్లలో, ప్రపంచదేశాలన్నింటిలో  ముస్లిములే మెజారిటీగా ఉంటారు. ఇస్లామే ప్రపంచమతం అవుతుంది. స్టాటిస్టికల్ వాస్తవాలు ఇదే నిజమంటున్నాయి.

దీనిని ఆపాలంటే, చైనా, ఇజ్రాయెల్ ల వల్లే అవుతుంది. ఇండియా వల్ల కాదు. ఏమంటే ఇండియాకు దాని రాజకీయవ్యవస్థయే పెద్ద అడ్డు అవుతుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇండియా దీనిని ఎదుర్కొనడం అసాధ్యం.

ముందు ముందు ఏం జరుగుతుందో చూడ్డానికి అసలు మనమంటూ ఉంటామా? డౌటే !