Pages - Menu

Pages

8, జనవరి 2023, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 80 (మా క్రొత్త పుస్తకం 'యోగబీజము' విడుదల)

నా కలంనుండి వెలువడుతున్న 59 వ పుస్తకంగా మహాసిద్ధుడైన శ్రీగోరక్షనాథులు రచించిన ప్రాచీన సంస్కృతగ్రంధము 'యోగబీజము'నకు నా వ్యాఖ్యానమును అమెరికానుండి నేడు విడుదల చేస్తున్నాను.

అమెరికా వచ్చిన ఈ ఐదునెలల కాలంలో నేను వ్రాసిన తొమ్మిదవ గ్రంధం ఇది. చాలా అరుదైన సిద్ధయోగ గ్రంధములలో ఇదీ ఒకటి.

అద్భుతమైన మన సనాతనధర్మములో లక్షలాది గ్రంధములు తురకల దండయాత్రలలో ఘోరాతిఘోరంగా తగులబెట్టబడినాయి. నలందా బుద్ధవిహారం లోని లైబ్రరీ ఒక్కటే మూడునెలలపాటు తగలబడుతూనే ఉందంటే అందులో ఎన్ని లక్షలాది గ్రంధములు అగ్నికి ఆహుతయి పోయాయో, ఎంతటి తరతరాల రీసెర్చీ, విజ్ఞానసంపదా నాశనమై పోయిందో అర్ధం చేసుకోవచ్చు మన భారతదేశమునకు, హిందూమతమునకు తురకరాక్షసులు చేసిన హాని మాటలలో చెప్పగలిగేది కాదు. ఆ విధంగా నెలలతరబడి మంటలకు ఆహుతి కాగా మిగిలిన కొన్ని గ్రంధములే ప్రస్తుతం మనకు అమిత సంభ్రమాశ్చర్యములను కలిగిస్తున్నాయి. మనకే గాక, యూరోప్, అమెరికా మొదలైన ఇతరదేశస్థులు వీటిని చదివి వీటిలోని జ్ఞానసంపదకు బిత్తరపోతున్నారు. ఇంగ్లీష్ లోకి, ఇతర యూరోపియన్ భాషలలోకి వీటిని అనువాదం చేసుకుని అనుసరిస్తున్నారు. వీటిని ఆచరిస్తున్నారు. ఎంతోమందికి యోగాభ్యాసమును నేర్పుతున్నారు.

హిందూమతమును అనుసరించే అమెరికన్లు నేడు వేలాదిమంది ఉన్నారు. బైటకు చెప్పకపోయినా, అభిమానించేవారు లక్షలలో ఉన్నారు. యోగాను చేస్తున్నవారు కోట్లలో ఉన్నారు. అమెరికాలో ప్రతి ఇంటిలో యోగా చేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు. నేను చూచి, చాలా ఆశ్చర్యపోయాను. సరిగ్గా చెప్పాలంటే, మన ఇండియాలో కూడా ఇంతగా యోగాభ్యాసమును మనం చేయడం లేదు. వీళ్ళు చేస్తున్నారు.

నేడు అమెరికాలో, యూరప్ లో శివభక్తులు, కృష్ణభక్తులు,  దేవీభక్తులు, యోగులు ఎంతో మంది ఉన్నారు. ఇది వారి అదృష్టం. ఇండియాలో హిందూమతం నుండి ఇతరమతాలలోకి  ప్రతిరోజూ మారుతున్నారు. అది వారి దరిద్రం.

సిద్ధయోగసాధనను వివరిస్తూ చెప్పబడిన అతి ముఖ్యములైన గ్రంధములలో 'యోగబీజము' ఒకటి. నాశనం కాకుండా ఇది మనకు లభించడము మనందరి అదృష్టం.  ఈనాడు దీనికి వ్యాఖ్యానమును వ్రాయగలగడం నా అదృష్టం.

మామూలు యోగసాధనకు, సిద్ధయోగసాధనకు గల భేదములను ఈ గ్రంధము స్పష్టముగా వివరిస్తుంది. జ్ఞానికంటే యోగి ఉత్తముడని ఇది చెబుతుంది. భగవద్గీత 6 వ అధ్యాయము 46 వ శ్లోకం కూడా దీనినే చెప్పినది.

శ్లో || తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున || 6. 46 ||  

'తపస్వులకంటే యోగి అధికుడు. జ్ఞానులకంటే యోగి అధికుడు. కర్మిష్ఠులకంటే యోగి అధికుడు. కనుక ఓ అర్జునా ! నీవు యోగివి కా !'

యధావిధిగా ఈ పుస్తకమును వ్రాయడంలో కూడా నాకు తోడునీడలుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

మిగతా మా గ్రంధములలాగే ఇది కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది. చదవండి. హిందూమతం యొక్క మహత్తరమైన ప్రాచీనవిజ్ఞానమును అర్ధం చేసుకోండి.