Pages - Menu

Pages

24, జనవరి 2023, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 88 (ఈ ఏడాది గందరగోళమే)

16 వ తేదీన శనీశ్వరుడు రాశి మారిన దగ్గరనుండి, ప్రస్తుతం ఖగోళంలో ఒక చెడుయోగం నడుస్తున్నది. ఇది ఏప్రియల్ వరకూ ఉంటుంది. ఆ తరువాత కొద్దిగా మారినప్పటికీ, నవంబర్ వరకూ ఇంకో రూపాన్ని ధరిస్తుంది. మొత్తంమీద ఈ ఏడాదంతా పరిస్థితులు ఏమీ బాగుండవు. 

నేను చెబుతున్నదానికి సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి గమనించండి.

అమెరికాలో వరుసగా మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయి. లాస్ ఏంజెల్స్ దగ్గర మాంటెరీ పార్క్ షూటింగ్ లో 11 మంది చనిపోయారు. ఇది చైనీస్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జరిగింది. చైనావాళ్ళంటే అమెరికాలో పెరుగుతున్న ద్వేషానికి ఇదొక మచ్చుతునక.

నిన్న మధ్యాన్నం  సాన్ ప్రాన్సిస్కో దగ్గరలోని హాఫ్ మూన్ బే లో మరొక మాస్ షూటింగ్ జరిగింది.  అందులో 7 మంది కాల్చబడ్డారు.

అయోవాలో జరిగిన ఇంకొక కాల్పుల సంఘటనలో ఇద్దరు కాల్చబడ్డారు. ఈ రకంగా అమెరికా అంతా  మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయి. గత 20 రోజులల్లో ముప్పైకి పైగా ఇటువంటి సంఘటనలు అమెరికాలో జరిగాయి. పెరుగుతున్న గన్ కల్చర్ కు ఇది స్పష్టమైన ఉదాహరణ.

నాలుగొందల ఏళ్ల క్రితం అమెరికాను ఆక్రమించినపుడు గన్స్ ఉపయోగించి రెడ్ ఇండియన్స్ ను దారుణంగా చంపేసి అమెరికాను ఆక్రమించారు యూరోపియన్స్. నేడు అవే గన్స్ తో అమెరికా నాశనమయ్యేట్టు కన్పిస్తోంది. Karma strikes back అంటే ఇదేనేమో మరి.

కానీ, గన్స్ ను నిషేధించడం మాత్రం  అమెరికాలో ఎన్నటికీ చెయ్యరు. కారణం? గన్ కంపెనీలకు సెనేట్ లో చాలా గట్టి లాబీ ఉంది.  అసలా కంపెనీలన్నీ రాజకీయనాయకుల బినామీ కంపెనీలే అని కూడా పుకారుంది. కనుక వాటిని బ్యాన్ చెయ్యరు. గన్ కల్చర్ నడుస్తూనే ఉంటుంది. కనుక, అమెరికాలో మారణహోమం జరుగుతూనే ఉంటుంది.

వచ్చే ఎన్నికలలో మోడీగారిని దింపేసి ఇండియాను మళ్ళీ సర్వనాశనపు అంచులలోకి నెట్టాలని ఇస్లామిక్ దేశాలు, కొన్ని యూరోపియన్ దేశాలు కంకణం కట్టుకున్నట్లుగా కన్పిస్తోంది. అందుకే మోదీగారికి వ్యతిరేకంగా, పూర్తిగా వక్రీకరించిన డాక్యుమెంటరీని ఒకటి BBC చేత తయారు చేయించి లోకం మీదకు  వదిలారు. దానిని ఇండియాలోని అభివృద్ధి వ్యతిరేక యూనివర్సిటీలలో ప్రదర్శిస్తున్నారు ముస్లిం స్టూడెంట్స్. ఏదో విధంగా మోడీగారిపైన బురద చల్లాలన్నదే వాళ్ళ కుట్ర. దానికి కాంగ్రెస్ వత్తాసు. ఈ దేశద్రోహుల ఆటలు ఇంకెన్నాళ్లో అర్ధం అవడం లేదు.

స్వీడన్ లో కురాన్ ను తగలబెట్టారు. దానిమీద గందరగోళాలు జరుగుతున్నాయి. గొడవలు చెయ్యడం కాదు. అసలు ఖురాన్ అంటే  ప్రతివారిలోనూ ఎందుకంత వ్యతిరేకత వస్తోందో ఆలోచించాలి. అందులో ఉన్న కంటెంట్ అలాంటిది మరి ! ఏవో కొన్ని అభ్యంతరకమైన శ్లోకాలున్నాయని, మనుస్మృతిని  రోడ్డుమీద తగులబెట్టాడు అంబెడ్కర్. ఇంతా చేస్తే ఆయన దానిని పూర్తిగా చదవనే లేదు. పూర్తిగా చదవకుండానే అంతటి గొప్ప పనిని చేసేశాడు. మరి బైబిల్లో, కురాన్ లో ఏముందో తెలిస్తే, ఒకవేళ ఇప్పటికీ ఆయన బ్రతికుంటే, ఆయనలో నిజాయితీ ఏమైనా మిగిలుంటే, ఆ రెండు పుస్తకాలనూ ఏం చేసేవాడో?

అమెరికాలో వేలాదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ సంస్థలు వేలాదిమందిని లే ఆఫ్ చేశాయి. వాళ్లలో చాలామంది ఇప్పుడు ఇండియాకు వెళ్ళవలసి వస్తుంది. ప్రస్తుతం వీళ్ళందరూ కుటుంబపరంగా రకరకాలైన విచిత్రపరిస్థితులలో ఉన్నారు. అందరి పరిస్థితీ ఇప్పుడు ఒక్కసారిగా గందరగోళంలో పడింది.

శనీశ్వరుడు కుంభరాశిలో అడుగుపెట్టిన వెంటనే ఈ మార్పులన్నీ చోటుచేసుకుంటున్నాయి గమనించండి. ముఖ్యంగా మూడు రంగాలలో ఈ మార్పులు గోచరిస్తాయి. 1. మతకలహాలు. 2. ఉద్యోగుల పరిస్థితి 3. నేరాలు ఘోరాలు.

ఈ పరిస్థితి 2023 మొత్తం ఉంటుంది. ఇంకా ఘోరమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఎదురౌతాయి. చూస్తూ ఉండండి.