Pages - Menu

Pages

30, జనవరి 2023, సోమవారం

ఇండియాకు తిరిగి వచ్చేశాం - భవిష్యత్ ప్రణాళిక

ఆర్నెల్ల అమెరికావాసాన్ని ముగించుకుని నిన్న సాయంత్రం ఇండియాకు తిరిగి వచ్చేశాం. కొన్నాళ్లపాటు హైద్రాబాద్ లో నివాసం. ఆ తరువాత ఆశ్రమనివాసం. గ్రంథరచన, ఆశ్రమంలో రిట్రీట్స్ నిర్వహించడం, సమాజానికి బోధన, చారిత్రకక్షేత్రాల సందర్శనం, అసలైన హిందూధర్మప్రచారం ముమ్మరంగా మొదలౌతాయి.

మా ఆశ్రమంలో జరిగే రిట్రీట్స్ లో ఈ క్రింది విషయాలు బోధించబడతాయి.

1. జ్యోతిష్య రిట్రీట్స్ -- వీటిలో నాదైన జ్యోతిష్య విశ్లేషణా విధానం బోధింపబడుతుంది. ఇది గత 30 ఏళ్లుగా నేను పరిశోధన చేసి నిగ్గుతేల్చిన జ్యోతిష్య సూత్రాల సమాహారంగా ఉంటుంది. దీనిని నేర్చుకోవడం ద్వారా మీరు ఋషితుల్యులైన నిజమైన జ్యోతిష్కులుగా తయారౌతారు. నేడు సమాజంలో ఉన్న కమర్షియల్ జ్యోతిష్యం యొక్క డొల్లతనాన్ని గ్రహిస్తారు. మీ మీ జీవితాలను మీరే దిద్దుకోగలుగుతారు. ఇతరులకు మార్గదర్శనం చేయగలుగుతారు.

2.  మార్షల్ ఆర్ట్స్ రిట్రీట్స్ --  40 ఏళ్లుగా నేను అభ్యాసం చేస్తూ, నిర్మించుకుంటూ వస్తున్న మార్షల్ ఆర్ట్స్ విధానం, కావలసినవారికి అర్హులైనవారికి నేర్పించబడుతుంది. దీనివల్ల, ధైర్యం, చొరవ, ఫిజికల్ ఫిట్నెస్ లు విపరీతంగా పెరుగుతాయి. ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనగలిగే సమర్ధత మీలో కలుగుతుంది. 

3. అల్టర్నేటివ్ మెడికల్ రిట్రీట్స్ -- మీ కుటుంబం వరకూ చిన్నా పెద్దా రోగాలకు మీరే వైద్యం చేసుకునేలాగా హోమియో శిక్షణ ఇవ్వబడుతుంది. మా ఆరోగ్యసూత్రాలు, మా జీవనవిధానం నేర్పించబడతాయి.

4. అసలైన హిందూమతం ఏమిటో స్పష్టంగా బోధించబడుతుంది. నేడు సమాజంలో ఉన్న రకరకాల శాఖలు, ఉపశాఖలను సమన్వయం చేస్తూ, గందరగోళాలను తొలగిస్తూ, మౌలికమైన, అసలైన హిందూమతం ఏమిటో చక్కగా అర్ధం చేసే రీతిలో ఈ బోధన ఉంటుంది. దీనిని అర్ధం చేసుకున్నవారు, హిందూమతం అంటే ఏమిటో స్పష్టమైన అవగాహనను కలిగి ఉండటమే గాక, ఇతర మతాలవారు అడిగే ఎటువంటి ప్రశ్ననైనా సమర్ధవంతంగా వివరించగలుగుతారు. హిందూమతంపైన జరుగుతున్న దుష్ప్రచారాలను తేలికగా త్రిప్పికొట్టగలుగుతారు. దొంగగురువుల వలలో పడకుండా ఉంటారు.

5. సాధనా రిట్రీట్స్ -- ఆధ్యాత్మిక సాధనలలో శ్రద్ధ ఉన్నవారికి నాదైన యోగసాధనా మార్గం వివరంగా బోధించబడుతుంది. ఇది భౌతిక, ప్రాణిక, మానసిక స్థాయిలలో విభిన్న యోగ, ధ్యానప్రక్రియల సమాహారంగా ఉంటుంది. చక్కని ఆరోగ్యాన్ని, ప్రాణశక్తిని, ధ్యానశక్తిని పెంపొందిస్తుంది. జీవనసాఫల్యతను త్వరగా తేలికగా అందిస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని సాధనా విధానాలు, మార్మికసాధనలు దీనిలో కలసి మెలసి ఉంటాయి.

6.  పూర్తి అర్హతలున్నవారికి ఉన్నతస్థాయికి చెందిన తంత్రసాధన నేర్పబడుతుంది.

ఇవన్నీ కూడా, పూర్తిగా ఉచితంగా నేర్పబడతాయి.

కులానికి మా ఆశ్రమంలో ఎటువంటి ప్రాముఖ్యతా లేదు. 'మీదే కులం?' అనే ప్రశ్నను మా ఆశ్రమంలో ఎవరూ మిమ్మల్ని అడగరు. మీ డబ్బుతో మాకు సంబంధం లేదు. మీరు ధనికులా, పేదవారా మాకనవసరం. నిజాయితీ, స్వచ్ఛమైన మనసు, ఆధ్యాత్మిక తపనలు మాత్రమే మీలో ఉండవలసిన అర్హతలు. అలాంటివారికి మా సంస్థ, మా ఆశ్రమం స్వాగతం పలుకుతాయి.

రాజకీయాలతో మాకు సంబంధం లేదు. కానీ, హిందూమతాన్ని సమర్ధించే ఏ పార్టీకైనా మా తోడ్పాటు ఉంటుంది.

కులాలకు అతీతంగా అసలైన హిందూధర్మాన్ని నేర్పించడం అదికూడా ఉత్త థియరీ కాకుండా, ప్రాక్టికల్ గా వేదాంత-యోగ-ధ్యానసాధనా పూర్వకంగా నేర్పించడం, సమాజంలో ఆధ్యాత్మిక జాగృతిని తీసుకురావడం, భారతీయులలో దేశభక్తిని పెంచడమే మా ఆశ్రమ లక్ష్యం.

ఎప్పటికప్పుడు జరిగే మా కార్యక్రమాల వివరాలకోసం మా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఎకౌంట్లను, మా యూట్యూబ్ వీడియోలను, మా వెబ్ సైట్ లను, నా తెలుగు ఇంగ్లీష్ బ్లాగ్ లను చూస్తూ ఉండండి.

27, జనవరి 2023, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 90 (గుడ్ బై అమెరికా - ప్రస్తుతానికి)

అమెరికాకు గతంలో వచ్చిన రెండుసార్లూ వేసవికాలంలో వచ్చాను. ఈసారి కావాలని చలికాలంలోనే వచ్చాను. ఏమంటే, అందరూ భయంకరంగా వర్ణిస్తున్న డెట్రాయిట్ చలి ఎలా ఉంటుందో చూద్దామని ఇలా వచ్చాను. మైనస్ డిగ్రీల చలిని ప్రత్యక్షంగా చూచాను.

అయితే, గత 40 ఏళ్ల అమెరికా చరిత్రలో ఈ చలికాలమే అతితక్కువ చలిగా ఉందట. మామూలుగా అయితే ఈ సమయానికి గుట్టలు గుట్టలుగా మంచు ఉంటుందట. ఈ ఏడాది లేదు. మంచుతుఫాన్ వల్ల గత రెండు రోజులనుంచి మాత్రమే మంచుగుట్టలు కనిపిస్తున్నాయి. ఇదంతా అమెరికా న్యూస్ ఛానల్స్ లో చెబుతున్నారు. మనం అడుగుపెట్టిన వేళా విశేషమేమో మరి? లేదా క్లైమేట్ చేంజ్ ప్రభావం కావచ్చు.

'ఇప్పుడే మీకు నరకంలాగా అనిపించిందా? ఇంతకు ముందొచ్చినట్లైతే ఇంకేమనేవాళ్ళో?' అంటున్నారు ఇరవై ఏళ్ల పైనుంచీ ఇక్కడుంటున్న నా శిష్యులు. ఏమీ అనను. ఏదో మాటవరసకి నరకం అన్నానుగాని, నిజానికి అలాంటిదేమీ లేదు. స్వర్గనరకాలు మనసులో ఉన్నాయిగాని బయటేముంది? ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటాయి. మనిషి జీవితమే ఇంత !  

ఈ ఆరునెలల కాలంలో నేను ఎటువంటి టూరిస్ట్ ప్లేసులూ చూడలేదు. కనీసం చాలామంది పొలోమంటూ పరిగెత్తిపోయి చూచే నయాగరా జలపాతం, లాస్ వెగాస్ లు కూడా చూడలేదు. ఊరకే ఇంటిపట్టున ఉన్నానంతే. అవన్నీ చూడాలని మనకు ఇంట్రస్ట్ ఉంటే కదా అక్కడకు వెళ్ళడానికి? ఏముందక్కడ చెత్త ! నేను అమెరికాకు వచ్చింది నన్నభిమానించే  మనుషులకోసం గాని, ప్లేసుల కోసం కాదు. టూరిస్టు ప్లేసులు చూడాలంటే ఇండియాలో లేవా? ఇండియాలో లేనివి ఇక్కడేమున్నాయి?

మరి ఈ ఆరునెలలకాలంలో ఏం చేశాను? లోకం దృష్టిలో ఏమీ చెయ్యలేదు. నాలుగు గోడల మధ్యలో ఉంటూ, నా సాధనలో నేను కాలం గడిపాను. అదేంటో లోకానికి తెలియదు. తెలియవలసిన అవసరం కూడా లేదు.

అయితే, లోకానికి కనిపించే పనులు కూడా కొన్ని చేశాను.

ఆధ్యాత్మిక నిధులవంటి పది అద్భుతములైన పుస్తకాలను వ్రాశాను. అవి, 

    • 1. శ్రీ గోరక్ష వచన సంగ్రహము 
    • 2. యోగబీజము 
    • 3. అధ్యాత్మోపనిషత్ 
    • 4. Medical Astrology - II
    • 5. ఉత్తరగీత
    • 6. శ్రీరామగీత 
    • 7. సనత్సుజాతీయము 
    • 8. కైవల్యోపనిషత్ 
    • 9. వేదాంతసారము 
    • 10. ముక్తికోపనిషత్. 
అయిదు స్పిరిట్యువల్ రిట్రీట్స్ ను నిర్వహించాను. అవి, 
    • 1. డెట్రాయిట్ రిట్రీట్ 
    • 2. గాంగెస్ రిట్రీట్ 
    • 3.  షాంపేన్ రిట్రీట్ 
    • 4. కేంటన్ రిట్రీట్ 
    • 5. ట్రాయ్ రిట్రీట్.
  • అమెరికా శిష్యులకు యోగ - తంత్ర దీక్షలిచ్చాను.
  • ఇరవైగంటల పైగా నిడివిగల ఆడియో ఉపన్యాసాలిచ్చాను. శిష్యులడిగిన అనేక ఆధ్యాత్మిక సందేహాలను తీర్చాను.
  • ఈ పర్యటనా విశేషాలను వివరిస్తూ 90 పోస్టులను వ్రాశాను.
ఈ ఆర్నెల్లకాలంలో, అమెరికా నాలుగుమూలలా ఉన్న నా శిష్యులు నన్ను తమ కుటుంబసభ్యులలాగా చూసుకున్నారు. వాళ్ళు చూపించిన ప్రేమను, గౌరవాన్ని ఎన్నటికీ మరచిపోలేను. అంతగా నన్ను అభిమానించారు. నేను నడచిన సాధనామార్గంలో వాళ్ళు కూడా నడవడానికి సిద్ధమయ్యారు. నావద్ద యోగదీక్షలను స్వీకరించారు. నేను నడచిన, నడుస్తున్న యోగమార్గం లోకి అడుగుపెట్టారు. వాళ్ళ మంచితనానికి, సత్ప్రవర్తనకు ఎంతో ఋణపడ్డాను.

దీనికి భిన్నంగా, చాలాఏళ్ల నుంచీ పరిచయం ఉన్న కొందరు పాతశిష్యులైతే ఈ ఆర్నెల్లకాలంలో నన్ను చూడటానికి రాకపోగా, కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. అంతగా డబ్బు వ్యామోహంలో కూరుకుపోయారు. లేదా, వారికి కావలసినవి నా దగ్గర దొరకలేదేమో? బహుశా, వారికి కావలసినవి ఇచ్చే గురువుల వద్దకు చేరిపోయి ఉంటారు. సరే, వాళ్ళ ప్రాప్తం అంతవరకే. మాయాప్రభావం అలాంటిది మరి ! దానిని తప్పుకోవడం ఎవరికి సాధ్యం? అది ఒక్కొక్కరిని ఒక్కొక్కవిధంగా పట్టుకుంటుంది. ఆడిస్తుంది. అంతిమంగా చూస్తే, ఎవరి కర్మ వారిది. అంతే !

నేను ఉపదేశించే యోగమార్గంలో నడిచేవాళ్ళనే నేను ఇష్టపడతాను. వారికే నా సమయాన్ని కేటాయిస్తాను. అంతేగాని, కాలక్షేపం కోసం ఫోన్లు చేసేవాళ్ళను, అవసరం ఉన్నపుడు మాత్రమే ఫోన్లు చేసేవాళ్లను, పనులు కావడం కోసం జ్యోతిష్యప్రశ్నలు, పరిహారాలు అడిగేవాళ్ళను, లౌక్యంగా మాట్లాడేవాళ్ళను దూరం ఉంచుతాను. అలాంటివారితో మాట్లాడటం కూడా టైం వేస్ట్ అని నా అభిప్రాయం. లోకుల దురాశకు అనుగుణంగా డాన్స్ చేసే బిజినెస్ గురువులు, జ్యోతిష్కులు చాలామంది లోకంలో ఉన్నారు. అలాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళే సరిపోతారు. మనదారి వేరు. శుద్ధమైన యోగ-వేదాంత మార్గంలో నడిచేవాళ్లే నాతో ఉంటారు. ఉండగలరు కూడా. అందరికీ అది సాధ్యం కాదు.

ఆర్నెల్లు అయిపోయాయి. అమెరికా పొమ్మంటోంది. ఇండియాలోని మా ఆశ్రమం రమ్మంటోంది. ఇప్పుడు ఇండియాకు బయలుదేరుతున్నాను.

నాతో ఆత్మీయతానుబంధాన్ని పెంచుకున్న అమెరికాశిష్యులు కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు. ఆర్నెల్లనుంచీ వదలి ఉన్న ఇండియా శిష్యులు ఇక త్వరగా వెనక్కు రమ్మంటున్నారు. వారిలో కొందరు వాళ్ళ US సిటిజెన్ షిప్ నీ, మరికొందరు తమ గ్రీన్ కార్డులనీ సరెండర్ చేసి మరీ, నాతోపాటు ఆశ్రమజీవితం గడపడానికి ఇండియాకు వచ్చి సెటిలై ఉన్నారు. నా రాకకోసం ఎదురుచూస్తున్నారు. కనుక వాళ్ళ కోసమైనా నేను ఇండియాకు తిరిగి రావాలి.

గుడ్ బై అమెరికా, ప్రస్తుతానికి.

ఒకటి రెండేళ్లలో మళ్ళీ కలుసుకుందాం ... వీలైతే !

26, జనవరి 2023, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 89 (పరాశక్తి ఆలయం - మంచుతుఫాన్)

అమెరికా ట్రిప్ ముగియబోతోంది.

పాంటియాక్ లోని పరాశక్తి ఆలయంతో, ఇక్కడి పరాశక్తి అమ్మవారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఈ అనుబంధం ఇప్పటిది కాదు. బయటకు కన్పించడం వరకూ, గత పదేళ్లనుంచీ ఇది కొనసాగుతోంది. దానికి ముందు ఇంకా ఎంతో కాలం నుంచీ ఉంది. కానీ ఆ విషయాలు ఇక్కడ వ్రాయను. మీరు నమ్మలేరు. కాబట్టి అనవసరం.

ఈ ప్రాంతంలో దేవి పరాశక్తి ఆలయం ఉన్న వీధిపేరు సరసోత లేన్. నాలుగువందల ఏళ్ల క్రితం యూరోపియన్స్ అమెరికాను ఆక్రమించినపుడు అప్పుడున్న పేర్లనే ఇప్పటికీ ఉంచారు. అవన్నీ అప్పటి రెడ్ ఇండియన్స్ పెట్టుకున్న పేర్లు. చాలాప్రాంతాలకు రెడ్ ఇండియన్స్ పెట్టిన పేర్లను అమెరికన్స్ అలాగే ఉంచేశారు. వాటిలోవే ఈ పాంటియాక్, సరసోత మొదలైనవి. నిజానికి ఈ 'సరసోత' అనేది 'సరస్వతి' అనే వైదిక జ్ఞానదేవత  యొక్క పేరు. సరస్వతీ అమ్మవారిని రెడ్ ఇండియన్స్ 'సరసోత' అనేవారు. అదేపేరును అమెరికా వాళ్ళు కూడా ఇప్పుడు వాడుతున్నారు. దాని అర్ధం వారికి తెలీదు. మనకు తెలుసు.

చరిత్ర ప్రకారం, దాదాపు పదివేల సంవత్సరాల క్రిందటినుంచీ ఇక్కడి పాంటియాక్ ప్రాంతంలోని రెడ్ ఇండియన్స్, జ్ఞానదేవతయైన సరస్వతీదేవిని ఆదిపరాశక్తిగా ఆరాధించేవారు. ఆమెను "సరసోత" అని వాళ్ళు పిలిచేవారు.  యూరోపియన్స్ వచ్చి అదంతా ధ్వంసం చేసేశారు. రెడ్ ఇండియన్ల భాషనూ సంస్కృతినీ ఆచారాలను అన్నింటినీ తుడిచి పెట్టేశారు. పనికిరాని అబద్దాలపుట్ట క్రైస్తవాన్ని వాళ్ళమీద బలవంతంగా రుద్దారు.  కానీ, వాళ్ళు చేసిన తప్పులు వాళ్లకు తెలుసు. అందుకని, భయంచేత అదే పేరును ఇప్పటికీ అలాగే ఉంచారు. ఇప్పుడు సరిగ్గా ఇదేచోట, తమిళులు అద్భుతమైన ఆదిపరాశక్తి ఆలయాన్ని నిర్మించారు. దాదాపు 40 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు తమిళ సోదరులు.

చాలా ఏళ్లక్రితం ఇక్కడికొచ్చి స్థిరపడిన డాక్టర్ కృష్ణకుమార్ అనే తమిళసొదరుడు ఒకసారి కంచిలో నాడీజ్యోతిష్యం చూపించుకున్నపుడు, 'నువ్వు అమెరికాలో అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తావు' అని రీడింగ్ వచ్చింది. మొదట్లో ఆయన దానిని నమ్మలేదు. కానీ అనేక ఏళ్ల తర్వాత ఈ ఆలయాన్ని ఆయనే నిర్మించవలసి వచ్చింది. అదే నేటి ఆదిపరాశక్తి ఆలయం.

పదేళ్ల క్రితం, అంటే 2013 లో నేను 'శ్రీవిద్యారహస్యం' పుస్తకాన్ని వ్రాశాను. ఆ తరువాత, ఈ ఆలయానికి 2016 లో మొదటిసారిగా వచ్చాను. అప్పుడే ఇక్కడ 'శ్రీవిద్యోపాసన' మీద ఉపన్యాసమిచ్చాను.  ఆ తరువాత 2017 లో వచ్చాను. అప్పుడు 'లలితాసహస్రనామాలు - శక్తి ఉపాసన' అనే అంశం పైన మాట్లాడాను. నేను వ్రాసిన 'శ్రీ లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక' అనే పుస్తకం వ్రాయాలన్న సంకల్పం ఈ ఆలయంలో ఉన్న సమయంలోనే నాలో కలిగింది. అదే ఆ పుస్తకంగా ఆవిర్భవించింది. నేడు వేలాదిమందికి స్ఫూర్తినిస్తోంది.

ఈ ఆలయానికి మళ్ళీ ఇప్పుడొచ్చాను. ఈసారి ఎటువంటి ఉపన్యాసమూ ఇవ్వలేదు. ఇక్కడివాళ్ళు మాట్లాడమన్నారు. కానీ నేనే తిరస్కరించాను. వచ్చిన ప్రతిసారీ ఒక్కొక్కవిధంగా జగన్మాత నన్ను అనుగ్రహిస్తూనే ఉన్నది. అవన్నీ ఇక్కడ వ్రాసి మిమ్మల్ని అపనమ్మకానికి గురిచేయడం నాకిష్టం లేదు.

కానీ ఒక్కవిషయం చెప్తాను. ఈ ఆలయంలో అద్భుతమైన శక్తితరంగాలున్నాయి. ఇక్కడున్నంత సేపూ మనం అమెరికాలో ఉన్నామన్నది పూర్తిగా మర్చిపోతాం. ఇండియాలోని ఏదో ఒక శక్తిపీఠంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ఆలయం నుండి బయటకు రావాలని అనిపించదు. అంతటి శక్తిప్రభావం ఇక్కడ ఉన్నది.

నిన్న ఆలయానికి వెళ్ళొచ్చాము. పరమేశ్వరి ఆదిపరాశక్తికి ప్రణామం చేసి, 'అమ్మా! ఇండియాకు బయలుదేరుతున్నాం. మళ్ళీ త్వరలో వచ్చి నీ దర్శనం చేసుకునేటట్లు అనుగ్రహించు తల్లీ' అని ప్రార్ధించి తిరిగి వచ్చాము.

ఆ ఫోటోలను ఇక్కడ చూడండి.






'వింటర్లో నార్త్ అమెరికా వచ్చాను. మైనస్ 14 డిగ్రీల చలిని చూశాను. కానీ మంచు తుఫాన్ను చూడలేదే' అని నిన్న అనుకున్నా. తెల్లారి లేచేసరికి అదికూడా వచ్చింది. కెనడా నుంచి తూర్పువైపుగా ప్రయాణిస్తున్న మంచుతుఫాన్ ఒకటి, యూ ఆకారంలో ఒక వంపుతిరిగి, చికాగో, డెట్రాయిట్ పరిసరప్రాంతాలను ఇవాళ ఒక ఊపు ఊపేసింది. తెల్లవారు ఝామునుంచీ మంచువర్షం కురుస్తోంది. గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోయింది. రేపు ఉండదు. మాయమైపోతోంది.

అందుకని సరదాగా మంచుతుఫాన్లో ఒక గంటసేపు తిరిగి వచ్చా. ఆ ఫోటోలను ఇక్కడ చూడండి.











24, జనవరి 2023, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 88 (ఈ ఏడాది గందరగోళమే)

16 వ తేదీన శనీశ్వరుడు రాశి మారిన దగ్గరనుండి, ప్రస్తుతం ఖగోళంలో ఒక చెడుయోగం నడుస్తున్నది. ఇది ఏప్రియల్ వరకూ ఉంటుంది. ఆ తరువాత కొద్దిగా మారినప్పటికీ, నవంబర్ వరకూ ఇంకో రూపాన్ని ధరిస్తుంది. మొత్తంమీద ఈ ఏడాదంతా పరిస్థితులు ఏమీ బాగుండవు. 

నేను చెబుతున్నదానికి సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి గమనించండి.

అమెరికాలో వరుసగా మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయి. లాస్ ఏంజెల్స్ దగ్గర మాంటెరీ పార్క్ షూటింగ్ లో 11 మంది చనిపోయారు. ఇది చైనీస్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జరిగింది. చైనావాళ్ళంటే అమెరికాలో పెరుగుతున్న ద్వేషానికి ఇదొక మచ్చుతునక.

నిన్న మధ్యాన్నం  సాన్ ప్రాన్సిస్కో దగ్గరలోని హాఫ్ మూన్ బే లో మరొక మాస్ షూటింగ్ జరిగింది.  అందులో 7 మంది కాల్చబడ్డారు.

అయోవాలో జరిగిన ఇంకొక కాల్పుల సంఘటనలో ఇద్దరు కాల్చబడ్డారు. ఈ రకంగా అమెరికా అంతా  మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయి. గత 20 రోజులల్లో ముప్పైకి పైగా ఇటువంటి సంఘటనలు అమెరికాలో జరిగాయి. పెరుగుతున్న గన్ కల్చర్ కు ఇది స్పష్టమైన ఉదాహరణ.

నాలుగొందల ఏళ్ల క్రితం అమెరికాను ఆక్రమించినపుడు గన్స్ ఉపయోగించి రెడ్ ఇండియన్స్ ను దారుణంగా చంపేసి అమెరికాను ఆక్రమించారు యూరోపియన్స్. నేడు అవే గన్స్ తో అమెరికా నాశనమయ్యేట్టు కన్పిస్తోంది. Karma strikes back అంటే ఇదేనేమో మరి.

కానీ, గన్స్ ను నిషేధించడం మాత్రం  అమెరికాలో ఎన్నటికీ చెయ్యరు. కారణం? గన్ కంపెనీలకు సెనేట్ లో చాలా గట్టి లాబీ ఉంది.  అసలా కంపెనీలన్నీ రాజకీయనాయకుల బినామీ కంపెనీలే అని కూడా పుకారుంది. కనుక వాటిని బ్యాన్ చెయ్యరు. గన్ కల్చర్ నడుస్తూనే ఉంటుంది. కనుక, అమెరికాలో మారణహోమం జరుగుతూనే ఉంటుంది.

వచ్చే ఎన్నికలలో మోడీగారిని దింపేసి ఇండియాను మళ్ళీ సర్వనాశనపు అంచులలోకి నెట్టాలని ఇస్లామిక్ దేశాలు, కొన్ని యూరోపియన్ దేశాలు కంకణం కట్టుకున్నట్లుగా కన్పిస్తోంది. అందుకే మోదీగారికి వ్యతిరేకంగా, పూర్తిగా వక్రీకరించిన డాక్యుమెంటరీని ఒకటి BBC చేత తయారు చేయించి లోకం మీదకు  వదిలారు. దానిని ఇండియాలోని అభివృద్ధి వ్యతిరేక యూనివర్సిటీలలో ప్రదర్శిస్తున్నారు ముస్లిం స్టూడెంట్స్. ఏదో విధంగా మోడీగారిపైన బురద చల్లాలన్నదే వాళ్ళ కుట్ర. దానికి కాంగ్రెస్ వత్తాసు. ఈ దేశద్రోహుల ఆటలు ఇంకెన్నాళ్లో అర్ధం అవడం లేదు.

స్వీడన్ లో కురాన్ ను తగలబెట్టారు. దానిమీద గందరగోళాలు జరుగుతున్నాయి. గొడవలు చెయ్యడం కాదు. అసలు ఖురాన్ అంటే  ప్రతివారిలోనూ ఎందుకంత వ్యతిరేకత వస్తోందో ఆలోచించాలి. అందులో ఉన్న కంటెంట్ అలాంటిది మరి ! ఏవో కొన్ని అభ్యంతరకమైన శ్లోకాలున్నాయని, మనుస్మృతిని  రోడ్డుమీద తగులబెట్టాడు అంబెడ్కర్. ఇంతా చేస్తే ఆయన దానిని పూర్తిగా చదవనే లేదు. పూర్తిగా చదవకుండానే అంతటి గొప్ప పనిని చేసేశాడు. మరి బైబిల్లో, కురాన్ లో ఏముందో తెలిస్తే, ఒకవేళ ఇప్పటికీ ఆయన బ్రతికుంటే, ఆయనలో నిజాయితీ ఏమైనా మిగిలుంటే, ఆ రెండు పుస్తకాలనూ ఏం చేసేవాడో?

అమెరికాలో వేలాదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ సంస్థలు వేలాదిమందిని లే ఆఫ్ చేశాయి. వాళ్లలో చాలామంది ఇప్పుడు ఇండియాకు వెళ్ళవలసి వస్తుంది. ప్రస్తుతం వీళ్ళందరూ కుటుంబపరంగా రకరకాలైన విచిత్రపరిస్థితులలో ఉన్నారు. అందరి పరిస్థితీ ఇప్పుడు ఒక్కసారిగా గందరగోళంలో పడింది.

శనీశ్వరుడు కుంభరాశిలో అడుగుపెట్టిన వెంటనే ఈ మార్పులన్నీ చోటుచేసుకుంటున్నాయి గమనించండి. ముఖ్యంగా మూడు రంగాలలో ఈ మార్పులు గోచరిస్తాయి. 1. మతకలహాలు. 2. ఉద్యోగుల పరిస్థితి 3. నేరాలు ఘోరాలు.

ఈ పరిస్థితి 2023 మొత్తం ఉంటుంది. ఇంకా ఘోరమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఎదురౌతాయి. చూస్తూ ఉండండి.

22, జనవరి 2023, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 87 (మా క్రొత్త పుస్తకం 'శ్రీ గోరక్ష వచన సంగ్రహము' విడుదల)

నా కలం నుండి వెలువడుతున్న 60 వ పుస్తకంగా  'శ్రీ గోరక్ష వచన సంగ్రహము'నేడు విడుదలౌతున్నది. ఇది మహాయోగియైన శ్రీ గోరక్షనాధుడు రచించిన సంస్కృత గ్రంధమునకు నా వ్యాఖ్యానము. సిద్ధయోగ సాధనా విధానములపైన ఇది సమగ్రమైన పుస్తకమని చెప్పవచ్చు.

శ్రీ గోరక్షనాథులవారు రచించిన, 'సిద్ధ సిద్ధాంత పధ్ధతి', 'గోరక్షసంహిత', 'యోగబీజము' అనబడే మూడు అద్భుతమైన గ్రంధములకు నా వ్యాఖ్యానమును గతంలో 'పంచవటి' నుండి విడుదల చేసియున్నాము. వాటిలో కూడా, సిద్ధయోగమార్గం వివరింపబడింది. అదేదారిలో వస్తున్న నాలుగవ పుస్తకమిది.

మంత్రయోగము, హఠయోగము, లయయోగము, రాజయోగముల సమాహారమే సిద్ధయోగము. దీనికి మహాయోగమని కూడా పేరున్నది. ఈ మార్గంలో, ఈ నాలుగువిధములైన యోగసాధనలు కలసిమెలసి ఉంటాయి. అందుకని దీనిని మహాయోగమంటారు. అంటే, చాలా ఉన్నతమైన, విశాలమైన పరిపూర్ణమైన యోగమార్గమని అర్ధము.

మూడవ అమెరికా యాత్రలో నేను వ్రాసిన పదవ పుస్తకం ఇది. ఈ ట్రిప్ లో ఇక పుస్తకాలను వ్రాయడం ఆపుతున్నాను. ఇండియాకు వచ్చిన తరువాత తిరిగి నా పుస్తకరచనను ప్రారంభిస్తాను.

'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' లో మేము అభ్యాసం చేసే సాధనావిధానం సిద్ధయోగమునకు చాలా దగ్గరగా ఉంటుంది. అయితే, ఇది కాకుండా కొన్ని ఇతర అభ్యాసాలు కూడా మా విధానంలో ఉంటాయి.

సిద్ధయోగసాధనా విధానమును అభిమానించేవారికి, ఆచరిస్తున్నవారికి ఈ గ్రంధం ఒక విందుభోజనం లాగా ఉంటుంది.  చదవండి. హిందూమతంలోని అద్భుతాలను గురించి తెలుసుకోండి.

యధావిధిగా ఈ పుస్తకమును వ్రాయడంలో కూడా నాకు తోడునీడలుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

మిగతా మా గ్రంధములలాగే ఇది కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది. మా మిగతా గ్రంథముల వలె దీనిని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాం.

21, జనవరి 2023, శనివారం

మూడవ అమెరికా యాత్ర - 86 (శనీశ్వరుని కుంభరాశి ప్రవేశం - వాయుయాన ప్రమాదాలు)

శనీశ్వరుడు కుంభరాశిలోకి తిరిగి ప్రవేశించడంతోనే వాయుయానప్రమాదాలు మొదలయ్యాయి. అంతేగాక మరికొన్ని విశేషాలు కూడా జరిగాయి. వాటిమీద చేసిన యూట్యూబ్  వీడియోను ఇక్కడ చూడండి.

20, జనవరి 2023, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 85 (ఎంతసేపూ ఇండియా మీద పడి ఏడవడం తప్ప ఇంకేముందిరా మీ దగ్గర?)

మోడీగారు తిరుగులేని నాయకునిగా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇండియా అన్ని రంగాలలో వేగంగా ఎదుగుతోంది. ప్రపంచమంతా కోవిడ్ తో అల్లాడిపోతే, ఇండియా క్షేమంగా బయటపడింది. పాకిస్తాన్ బెగ్గర్ కంట్రీ అయికూచుంది. శ్రీలంక కుదేలై పోయింది. నేపాల్ అప్పుల్లో కూరుకుపోయింది. బంగ్లాదేశ్ దివాళా తియ్యడానికి సిద్ధంగా ఉంది. ఇండియా మాత్రం క్షేమంగా ఉంది. దీనికి కారణం మోదీగారి నాయకత్వం !

ప్రపంచదేశాలలో ఇండియా అంటే ఏడిచే దేశాలు ఎన్నో ఉన్నాయి.  దానికి కారణాలు మాత్రం చాలా సింపుల్.

ఒకటి- తెలుగురాష్ట్రాలలో తప్ప మిగతారాష్ట్రాలలో క్రైస్తవవిషం పాకడం ఇంతకుముందంత వేగంగా జరగడం లేదు. దానికి కారణం హిందువులలో వస్తున్న చైతన్యం. పైగా, మతమార్పిడి కోసం విదేశాలనుండి వస్తున్న ఫండింగ్ ఆగింది. కనుక వాటికన్ కూ, దాని తొత్తులకూ మా చెడ్డ మంటగా ఉంది.

రెండు - ఇస్లామిక్ కుట్రలను, కుతంత్రాలను ఇండియా సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ను చావుదెబ్బ తీసింది. ఎవరిమాటా వినడం లేదు. బలమైన ఆర్ధికశక్తిగా రూపొందుతోంది.

ఇదంతా మోదీగారి నాయకత్వంలో జరిగింది. అందుకని మోదీగారన్నా, ఇండియా అన్నా క్రైస్తవదేశాలకు, ముస్లిందేశాలకు మహామంట మొదలైంది. ఇండియా స్థిరంగా క్షేమంగా ఉండటం వీటికి నచ్చదు. ఎందుకంటే, గత వెయ్యేళ్ళుగా ఇండియాను ఇష్టానుసారం దోచుకున్నవి ఈ దేశాలే కదా !

అందుకని, మోదీగారి మీద బురద చల్లడం మొదలుపెట్టాయి.

ఇందులో భాగంగా వచ్చినదే 2002 గుజరాత్ అల్లర్ల మీద BBC తీసిన డాక్యుమెంటరీ.  దీనికి ఫండింగ్ చేసినది వాటికన్ అనే విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. పైగా, దీనిపైన UK పార్లమెంట్ లో ప్రధాని రిషి సునక్ ను ప్రశ్నించాడు ఒక పాకిస్తానీ జాతీయుడైన లేబర్ పార్టీ MP. వీడిపేరు ఇమ్రాన్ హుసేన్. బ్రిటన్ లో వీడొక లేబర్ పార్టీ MP. పనీ పాటా లేకపోతే వాళ్ళ  UK లో ఉన్న సమస్యల మీద మాట్లాడుకోవచ్చు కదా? వాటి పరిష్కారాల గురించి ఆలోచించవచ్చు కదా? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఇండియాలో జరిగిన అంతర్గత విషయాలు వీడికెందుకు? అదికూడా బ్రిటిష్ పార్లమెంట్లో దానిగురించి ప్రశ్నించడం ఎందుకు? తెలివుందా అసలు? అయితే, ఈ ప్రశ్నకు రిషి సునక్ చాలా మర్యాదగా తెలివిగా జవాబిచ్చి వాడి నోరు మూయించాడు

ఇదంతా చూస్తుంటే నాకొకటి అనిపిస్తోంది. అసలీ ముస్లింల DNA లోనే ఏదో పెద్ద లోపం ఉన్నట్లుంది. లేకపోతే ఏమిటి? ఎక్కడున్నా సరే, ఉన్నతంగా ఆలోచించే పనే ఉండదు. శాంతి మతమంటారు. కానీ ప్రతిక్షణం కుట్రలు కుతంత్రాలు దౌర్జన్యాలు చేస్తుంటారు. అభివృద్ధి తప్ప మిగతావన్నీ వీళ్లకు కావాలి. ఇండియామీద పడి ఏడవందే ఒక్క రోజుకూడా గడవదా వీళ్ళకి?

ఇక, అమెరికా పరిస్థితి చూద్దాం. ఈరోజు అమెరికాలో మరో సంఘటన జరిగింది. హైదరాబాద్  కు చెందిన అరుణామిల్లర్ అనే భారతీయ మహిళ అమెరికాలోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయింది.  ఇది ఇండియాకు గర్వకారణం. ఆమె భగవద్గీత పైన చేయిపెట్టి  ప్రమాణస్వీకారం చేసింది. ఇది ఇంకా గర్వకారణం. భారతీయులంతా ఎంతో గర్వపడవలసిన విషయం.

ప్రమాణ స్వీకారం చేస్తూ ఆమె ఇలా అన్నది.

'హిందూత్వం అనేది ఒక మతం అనడం కంటే, ఒక సంస్కృతి అని నేను నమ్ముతాను. మేము శాంతిని కోరుకుంటాము. ప్రపంచంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటాము'. 

కానీ సైతాన్ ఇక్కడ కూడా ప్రత్యక్షమైంది. దానిపేరు IAMC (ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్). ఇండియా నుంచి ఇక్కడ కొచ్చి సెటిలైన ముస్లింల గ్రూపు అది.  ఆ గ్రూపు అరుణామిల్లర్ ను తప్పుపట్టింది. ఆమెకు హిందూ మూలాలున్నాయని, దానికి ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఆమెకు హిందూసంస్థల ఫండింగ్ ఉందని ఆరోపించింది. ఆమెకు బీజీపీతో, ఆరెస్సెస్ తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ఆమెను ఒక ఫాసిస్ట్ గా చిత్రీకరిస్తూ నినాదాలిచ్చారు.

ఏంటిదంతా? హిందూ మూలాలుంటే తప్పా? మరి ఇస్లాం మూలాలుంటే తప్పుకాదా? ఇస్లాం చరిత్ర అంతా రక్తమయమే కదా? ఆ అశాంతిమతంలో శాంతి అనేది ఎక్కడుంది అసలు? అరుణామిల్లర్ భగవద్గీత మీద ప్రమాణం చెయ్యక కురాన్ మీద చేస్తుందా?

IAMC కి అసలు బుద్దనేది ఉందా? ఎంతసేపూ ఇండియా మీద పడి ఏడవడం తప్ప మీకంటూ ఏముందిరా అసలు? ఇతర దేశాలమీద పడి దోపిడీదొంగల్లాగా దోచుకోవడం, అడుగుపెట్టిన ప్రతిచోటా సర్వనాశనం చెయ్యడం, లేదంటే భూమిని త్రవ్వి ఆయిల్ అమ్ముకోవడం తప్ప మీకంటూ ఒక పద్ధతీ, విచక్షణాజ్ఞానమూ, సహనమూ, అభివృద్దీ  ఎప్పుడున్నాయి గనుక? ఆరెస్సెస్ కాలిగోటికైనా సరిపోతుందా మీ సంస్థ?

బీజేపీతో ఆరెస్సెస్ తో సంబందాలుంటే తప్పేంటి? అవి దేశభక్తితో అణువణువూ నిండిపోయి ఉన్న సంస్థలు. మీరేమో ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, ఇప్పుడు అమెరికాకొచ్చి ఇండియాకు వ్యతిరేకంగా విషం కక్కుతున్న నీతిలేని విషపు జంతువులు. బీజేపీ గురించి ఆరెస్సెస్ గురించి మాట్లాడటానికి మీకసలు అర్హతే లేదు.

అయితే, అమెరికన్స్ తెలివి తక్కువవాళ్ళు కారు. ఎవరేమిటో వాళ్లకు బాగా తెలుసు. పాపం వాళ్ళేమీ అనలేదు. భగవద్గీతలో ఏముందో వాళ్లకు బాగా తెలుసు. అందుకే అరుణామిల్లర్ భగవద్గీత పైన  ప్రమాణం చేస్తే ఆనందంగా ఆమోదించారు. మధ్యలో ఈ IAMC గాళ్ళకు నొప్పిపుట్టింది. గొల్లుమని గోలపెట్టి ఏడుస్తున్నారు.

ఈనాడు ప్రపంచదేశాలతో ధీటుగా గర్వంగా ఇండియా నిలబడి ఉందంటే, మోదీజీ, రాజనాధ్ సింగ్, అమిత్ షా, యోగి ఆదిత్యనాధ్ - ఈ నలుగురే కారకులు. నిజమైన దేశభక్తులు వీళ్ళే. భరతభూమి ముద్దుబిడ్డలు కూడా వీళ్ళే. వీళ్ళ నాయకత్వంలో ఇండియా ముందుకు దూసుకుపోతోంది. అందుకే ఇస్లామిక్ సైతాన్లకు నిద్రపట్టడం లేదు. క్రొత్తేముంది? మొదటినుంచీ వీళ్ళ బ్రతుకులు ఇంతేగా? ఇస్లామిక్ విషం తలకెక్కినవాళ్లకు రీజన్ పనిచేస్తుందని అస్సలు ఆశించకూడదు. వీళ్లకు బుద్ధి వస్తుందని ఆశించడం కంటే బుద్ధితక్కువపని ఇంకొకటి ఉండదు. 

నిస్పక్షపాతంతో మాట్లాడుతూ, విశాలమైన దృష్టితో ఆలోచించే ముస్లింని నేను ఇంకా చూడవలసి ఉంది. ఇప్పటిదాకా అయితే చూడలేదు. దేశభక్తి ఉన్న ఇండియా ముస్లింని కూడా ఇప్పటిదాకా చూడలేదు. ఈ విషయంలో మాత్రం అంబెడ్కర్ చెప్పినది నిజమే. 'ముస్లిములు ఏ దేశంలో ఉన్నా, ఆ దేశంలో మమేకం కారు. వాళ్ళ మతంతో మాత్రమే వాళ్ళు మమేకం అవుతారు' అని ఆయనన్నాడు. అందుకే ఇస్లామేతర దేశాలలో ఏ దేశంలో చూసినా, చదువుకున్న ప్రతివారూ, ఆలోచనాశక్తి ఉన్న ప్రతివారూ, ఇస్లామంటే అసహ్యించుకుంటున్నారు.

'ఎలుకతోలు దెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపుగాదు' అని వేమనయోగి ఊరకే అనలేదు మరి !

15, జనవరి 2023, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 84 (శని భగవానుని కుంభరాశి ప్రవేశం - ఫలితాలు )

వక్రత్వం వల్ల గత అయిదు నెలలుగా మకరరాశిలో సంచరిస్తున్న  శనిభగవానుడు మళ్ళీ కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంఘటన రెండు రోజులలో జరుగబోతోంది.

అమెరికాలో అయితే, ఈస్టర్న్ టైం ప్రకారం జనవరి 16 రాత్రి (తెల్లవారితే 17), రెండున్నర గంటల ప్రాంతంలో జరుగుతుంది. ఇండియాలో అయితే, జనవరి 17 మధ్యాన్నం ఒంటిగంట ప్రాంతంలో జరుగుతుంది.

దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

మేషరాశి

ఉద్యోగపరంగా ఎదురౌతున్న చిక్కులు తొలగిపోతాయి. అన్నింటా లాభం కనిపిస్తుంది.

వృషభరాశి

ఉద్యోగంలో పనివత్తిడి ఎక్కువౌతుంది. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటుంది.

మిథునరాశి

దూరప్రాంతాలకు ప్రయాణిస్తారు. గురుసమానులు, పెద్దలకు కష్టకాలం.

కర్కాటకరాశి

నష్టాలు, చికాకులు, ఆరోగ్యసమస్యలు ఎక్కువౌతాయి.

సింహరాశి

సమాజంతో, పార్ట్ నర్స్ తో వ్యవహారాలు ఎక్కువౌతాయి. జీవితభాగస్వామికి కష్టకాలం మొదలౌతుంది.

కన్యారాశి

మానసిక చికాకులు తగ్గి మంచికాలం మొదలౌతుంది.

తులారాశి

ఇంటిలో చికాకులు మాయమౌతాయి. అయితే, సంతానచింత ఉంటుంది.

వృశ్చికరాశి

ధైర్యం సన్నగిల్లుతుంది. గృహసౌఖ్యం లోపిస్తుంది.

ధనూరాశి

కష్టాలు మాయమౌతాయి. ధైర్యం పెరుగుతుంది.

మకర రాశి

ఆరోగ్య సమస్యలు పోతాయి. కుటుంబచికాకులు, డబ్బు ఇబ్బందులు కలుగుతాయి.

కుంభరాశి

ఖర్చులు తగ్గుతాయి. బద్ధకం పెరుగుతుంది. ఆరోగ్యం కుంటుపడుతుంది.

మీనరాశి

ఖర్చులు, ఆరోగ్యసమస్యలు పెరుగుతాయి.

ఈ ఫలితాలు కనిపించడం సూచనాప్రాయంగా మొదలైపోయి ఉంటుంది. గమనించుకోండి.

12, జనవరి 2023, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 83 (అమెరికాలో కూడా ముసలం మొదలైంది)

అమెరికాలో షరియా మొదలైంది.

డెట్రాయిట్ దగ్గరలో హాంట్రామిక్ అనే ఒక సిటీ ఉంటుంది. ఇది డెట్రాయిట్ మెట్రో పరిధిలోకే వస్తుంది. కొన్నేళ్ల క్రితం వరకూ ఇక్కడ మొత్తం పోలిష్ జాతీయులు మాత్రమే ఉండేవారు. సెప్టెంబర్ 19, 1987 న ఈ సిటీకి పోప్ జాన్ పాల్ II కూడా వచ్చాడు. అంతగా క్రైస్తవుల ప్రాబల్యం ఉన్న సిటీ ఇది.

కానీ ఇప్పుడు, అంటే నిన్నటికి నిన్న, ఈ సిటీ కౌన్సిల్ లో ఒక కొత్త చట్టం పాస్ అయింది. అదేంటంటే, ఈద్ పండుగ సందర్భంగా ఎవరి ఇళ్లలో గాని, లేదా బ్యాక్ యార్డ్ లో గాని, గొర్రెలను, మేకలను చంపి వండుకొని తినవచ్చు. అనేదే ఈ చట్టం. దీనిని కౌన్సిల్ సభ్యులు మెజారిటీ ఓట్లతో ఆమోదించారు. కారణం? ప్రస్తుతం ఈ సిటీలో పోలిష్ జాతీయులు  చాలా తక్కువమంది ఉన్నారు.  ముస్లిం జనాభా ఏమో 62 శాతం అయి కూచుంది. ఆఫ్కోర్స్ ఇది కొన్నేళ్ల క్రితం పరిస్థితి, ఇప్పుడెంతో తెలీదు. ఇంకా పెరిగి ఉంటుంది. 

ప్రస్తుతం హాంట్రామిక్ అనే ఈ సిటీ, అమెరికా మొత్తం మీద ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నెంబర్ వన్ సిటీ అయి కూచుంది. ప్రస్తుతం ఈ సిటీ మేయర్ ఒక ముస్లిమ్. కౌన్సిల్ సభ్యులందరూ కూడా ముస్లిములే. కనుక ఈ విధమైన చట్టాన్ని వాళ్ళు పాస్ చేసుకున్నారు. పాపం అమెరికా రాజ్యాంగాన్ని వాళ్ళేమీ ధిక్కరించలేదు. సిటీ కౌన్సిల్ అధికారాలను ఉపయోగించుకుని, వాళ్ళ మెజారిటీ ప్రకారం, రాజ్యాంగపరిధిలోనే, వాళ్ళ చట్టం వాళ్ళు చేసుకున్నారు. అమెరికా కూడా నోర్మూసుకోవలసిందే. వీరిని ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంది.

అంటే,  అమెరికాలో ఒక సిటీని ఆక్రమించి, మెజారిటీ పెంచుకుని, అక్కడ డైరెక్ట్ గా షరియాను అమలు చేయడం మొదలుపెట్టారన్నమాట. ప్రస్తుతం ఈ సిటీలో 24% బంగ్లాదేశీయులు, 38% యెమెన్ జాతీయులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రస్తుతం అమెరికన్ సిటిజెన్సే. ఎప్పుడైతే వాళ్ళకు మెజారిటీ వచ్చిందో షరియా చట్టాలను పాస్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే వీళ్ళ జనాభా పెరగడం మొదలైందో, పోలిష్ జాతీయులు వాళ్ళ ఇళ్లను ఖాళీ చేసి అమెరికాలోని వేరే రాష్ట్రాలకు తరలిపోవడం మొదలైపోయింది. అంటే మన కాశ్మీర్లో లాగా అన్నమాట. అయితే కాశ్మీర్లో చేసినట్టు ఇక్కడ అరాచకాలు, దౌర్జన్యాలు, హత్యలు చేస్తే మర్నాడే సైన్యం దిగుతుంది. రెండో రోజు అందర్నీ కాల్చిపారేస్తారు.  ఆ భయంతో, అమెరికా రాజ్యాంగం ప్రకారం మెల్లిగా పోతూ, వాళ్లకు కావలసిన చట్టాలను వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే కాశ్మీర్ లాగా, లేకపోతే ఇలా అన్నమాట !

ఇప్పుడు అమెరికన్లకు భయం మొదలైంది. గగ్గోలు పెడుతున్నారు. 'ఇదేంటి? ఇన్నాళ్లూ మా సిటీ  చాలా ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు రోడ్లమీద మేకల్ని గొర్రెల్ని నరకడం మేము చూడాలా? హే జీసస్ ! వాట్ ఈస్ దిస్?' అని గోల పెడుతున్నారు.

Karma strikes back అంటే ఇదే మరి. ఈనాటికీ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తోంది కదా అమెరికా? మరి దాని ఫలితం అనుభవించొద్దూ?

అంతే కాదు. PETA (People For Ethical Treatment of Animals) అనే సంస్థ గురించి అందరికీ తెలుసు కదా ! వీళ్ళు కూడా ఏమీ మాట్లాడలేక నోళ్లు మూసుకున్నారు. అంతా రాజ్యాంగపరంగానే జరుగుతోంది. కనుక వాళ్లకు కూడా వాయిస్ లేకుండా పోయింది.

ఇకపోతే, ఈ సిటీలో కొద్దిమంది తెల్ల అమెరికన్స్ మాత్రం పారిపోలేక ఇక్కడే మిగిలిపోయి ఉన్నారు. వాళ్లేమో LGBTQ వర్గానికి చెందినవారు.  అది వాళ్ళ మతం. వాళ్ళు తమ LGBTQ జెండాను కౌన్సిల్ సమావేశంలో ప్రదర్శిస్తే మిగతా కౌన్సిల్ సభ్యులంతా దాన్ని వ్యతిరేకించారు.

'ఇదేంటి? మీ విశ్వాసం ప్రకారం గొర్రెలని మేకల్ని మీ ఇంటి దొడ్లలో నరుక్కోవచ్చని మీరు రూల్ పాస్ చేసుకున్నారు సరే.  మరి మా విశ్వాసాన్ని ఎందుకు వద్దంటున్నారు?' అని LGBTQ అడిగితే,  'మీ దిక్కున్నచోట చెప్పుకోండి. ఇదింతే' అని మెజారిటీ కౌన్సిల్ సభ్యులన్నారు. ఇదంతా వార్తల్లో గుప్పుమంది.

నేను అబద్దాలు వ్రాయడం లేదు. కావాలంటే ఇక్కడ చూడండి.

https://www.freep.com/story/news/local/michigan/wayne/2023/01/11/hamtramck-city-council-approves-religious-animal-sacrifices-slaughter-home/69797191007/

అదృష్టవశాత్తూ, మన ఇండియాలో ఇలాంటి చట్టాలేమీ అవసరం లేదు. అక్కడ ఎవడికేమైనా ఎవడికీ పట్టదు. ఈద్ కి ఎన్ని కోట్ల మేకలు గొర్రెల తలలు తెగి పడతాయో ఎవడికీ పట్టదు. రెండ్రోజులనుకుంటారు, మూడోరోజు మర్చిపోతారు. హైదరాబాద్, కడప, కర్నూలు, గుంటూరు, ఆదోని, రాయచూర్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లలో అయితే రోడ్లమీదనే మేకల్ని గొర్రెల్ని పబ్లిగ్గా నరుకుతారు,  మామూలుగా అయితే, ప్రతిదానికీ గోలగోల చేసే PETA  వాళ్ళు కూడా అప్పుడెక్కడకు పోతారో కనిపించి చావరు. సడన్ గా మాయమై పోతారు. ఇదొక వింత !

జనాభాని పెంచు, మసీదు కట్టు, షరియా అమలు చెయ్, లోకల్స్ ని తరిమెయ్,  దేశం మాదే అను - భలే ఉంది కదూ ఈ సూత్రం! ఎన్ని జన్మలెత్తినా హిందువులు ఈ సూత్రాన్ని నేర్చుకోగలరా అసలు?

ఇండియా ఎలాగూ భ్రష్టు పట్టింది. త్వరలో అమెరికా కూడా పట్టబోతోంది.

శుభం !

NASA ఎలాగూ భూమిలాంటి కొత్త గ్రహాన్ని (Exo Planet) కనుక్కుంది. ఈ భూమిని ముస్లిమ్స్ కి వదిలేసి, మిగతావాళ్లందరూ ఆ భూమికి పారిపోతే బెటరేమో?

కానీ ఒక్క సలహా ! ఇండియా విభజన సమయంలో చేసినట్టు, మళ్ళీ కొంతమందిని దేశంలోనే ఉంచుకుని, కొంతమందికి మాత్రం మీ దేశంలో ఒక ముక్కను విడగొట్టి ఇవ్వకండి. కొంతకాలానికి ఈ ముక్కకూడా పోతుంది. అలాగే, భూమీ పోయి, ఆ ఎక్సో ప్లానెట్ కూడా పోతుంది.  అదీ పాయె ఇదీ పాయె అన్నట్టు అవుతుంది మీ బ్రతుకు !

తెలివితెచ్చుకోకపోతే మీ ఖర్మ ! అనుభవించేటప్పుడు అర్ధమౌతుంది !

మూడవ అమెరికా యాత్ర - 82 (డెట్రాయిట్ డౌన్ టౌన్ ఫోటోలు)

మేముంటున్న చోటనుండి డెట్రాయిట్ డౌన్ టౌన్ కేవలం ఇరవై నిముషాల ప్రయాణ దూరంలో ఉంటుంది. ఇవాళ మధ్యాన్నం అక్కడికెళ్లి డెట్రాయిట్ నదిని, నది ఆవలిగట్టున ఉన్న కెనడాలోని విండ్సర్ సిటీని చూచి వచ్చాము.

సాయంత్రం నాలుగప్పుడు కూడా నది ఒడ్డున చలి మూమూలుగా లేదు. ఫోటో తీద్దామని గ్లోవ్స్ లోంచి చేతులు బయటకు తీస్తే, పదే పదినిముషాలలో మొద్దుబారి కొంకర్లు పోయాయి. అంత చలిగా ఉంది. ఇక రాత్రయితే అక్కడెవరూ ఉండరని చెప్పారు. నాలుగుకే షాపులన్నీ మూసేస్తున్నారు.

ఇక్కడనుంచి నదిమీదుగా కెనడాకు ఒక బ్రిడ్జి ఉంది. దానిమీదుగా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. పదిహేను నిముషాలలో కెనడాకు చేరుకోవచ్చు. నదిక్రిందుగా టన్నెల్ కూడా ఉంది. దానిలో నుంచి కార్లు, గూడ్స్ ట్రెయిన్ కూడా కెనడాకు పోతున్నాయి.

నది ఒడ్డున జెనరల్ మోటార్స్ కంపెనీ వారిది పెద్ద బిల్డింగ్ ఉంది. దానిపేరు రినైజాన్స్ బిల్డింగ్. దాని దగ్గర తీసుకున్న ఫోటోలను, డెట్రాయిట్ రివర్ ఫోటోలను, దూరంగా కనిపిస్తున్న కెనడాను (విండ్సర్ సిటీ) ఇక్కడ చూడండి.







డెట్రాయిట్ రివర్ ఒడ్డున



డెట్రాయిట్ రివర్ ఒడ్డున - ఆవలి ఒడ్డున కెనడా


డెట్రాయిట్ రివర్ ఒడ్డున



రినైజాన్స్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లోని రెస్టారెంట్ లో


డెట్రాయిట్ రివర్ ఒడ్డునున్న జనరల్ మోటార్స్ రినైజాన్స్ బిల్డింగ్ 




డెట్రాయిట్ నుండి కెనడాకు పోయే టన్నెల్ ఇదే

మూడవ అమెరికా యాత్ర - 81 (తిరుమల ట్రిప్ రద్దు చేసుకున్నాం)

రెండువారాలలో ఇండియాకు ప్రయాణం.

ఇండియా వెళ్ళాక, ఆశ్రమం పనులు, పంచవటి పనులు ముమ్మరంగా మొదలౌతాయి. దానికి ముందుగా ఒక పదిమంది శిష్యులతో కలసి ముందు తిరుపతి వెళ్లి, వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని, ఆ తరువాత ఒంగోలుకు వచ్చి, ఆశ్రమం పనులు మొదలుపెడదామని అనుకున్నాం. కానీ, తిరుమలలో కాటేజీలు, దర్శనం టికెట్లు, అన్నింటికీ రేట్లు పెంచేయడం, హుండీ డబ్బులను క్రైస్తవమిషనరీలకు, చర్చిలకు మళ్లిస్తున్నారన్న వార్తలు వినవస్తున్న క్రమంలో, పొరపాటున కూడా తిరుమల వెళ్లకూడదని నిశ్చయించుకుని, మా నిర్ణయాన్ని మార్చుకున్నాం.

ఏ దేవస్థానానికైనా మనమిస్తున్న డబ్బులలో ప్రతి రూపాయీ హిందూమతానికి మాత్రమే ఉపయోగపడాలి గాని, చర్చిలకు, హజ్ యాత్ర సబ్సిడీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. ఆ విధంగా తిరుమల ఎడ్మినిస్ట్రేషన్ సంస్కరింపబడేటంతవరకూ తిరుమలకు వెళ్లకూడదని నిశ్చయించుకుని, నేనూ నాతోపాటు ఒక పదిమంది శిష్యులు, తిరుమల ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకున్నాము. దానిబదులు ఇక్కడ నోవై లో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చాం.

వీకెండ్ కాదు కాబట్టి, ఈరోజు ఇక్కడ దేవాలయమంతా ఖాళీగా ఉంది. జనం లేరు. తొక్కిడి, హడావుడి లేవు. ప్రశాంతంగా కావలసినంతసేపు కూర్చుని జపధ్యానములు చేసుకుని, స్వామిని ప్రార్ధించి ఇంటికి తిరిగి వచ్చాం.

ఈ సందర్భంగా, నా శిష్యులందరికీ ఒక ఆదేశాన్నిస్తున్నాను. షిరిడీకి ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళకండి. ఎందుకంటే, ముస్లింఫకీర్ అయిన షిరిడీసాయిబాబాను మనం ఆరాధించవలసిన అగత్యం ఎంతమాత్రమూ లేదు. అలా ఆరాధించడం హిందూమతానికి మనం చేస్తున్న దారుణమైన అపచారమని నేను నమ్ముతాను. నా శిష్యులు కూడా దీనిని ఖచ్చితంగా పాటించాలి. 

అదేవిధంగా, మళ్ళీ నేను చెప్పేటంతవరకూ తిరుమలకు కూడా వెళ్ళకండి. మీ ఇంటిలోనే స్వామిని ప్రార్ధించండి. లేదా మీ దగ్గరలో ఉన్న ప్రయివేట్ యాజమాన్యం నడుపుతున్న హిందూ దేవాలయానికి వెళ్ళండి. నా శిష్యులైనవారు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. గమనించండి.

నోవై వెంకటేశ్వర ఆలయం ఫోటోలను బయటనుండి ఇక్కడ చూడండి.



8, జనవరి 2023, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 80 (మా క్రొత్త పుస్తకం 'యోగబీజము' విడుదల)

నా కలంనుండి వెలువడుతున్న 59 వ పుస్తకంగా మహాసిద్ధుడైన శ్రీగోరక్షనాథులు రచించిన ప్రాచీన సంస్కృతగ్రంధము 'యోగబీజము'నకు నా వ్యాఖ్యానమును అమెరికానుండి నేడు విడుదల చేస్తున్నాను.

అమెరికా వచ్చిన ఈ ఐదునెలల కాలంలో నేను వ్రాసిన తొమ్మిదవ గ్రంధం ఇది. చాలా అరుదైన సిద్ధయోగ గ్రంధములలో ఇదీ ఒకటి.

అద్భుతమైన మన సనాతనధర్మములో లక్షలాది గ్రంధములు తురకల దండయాత్రలలో ఘోరాతిఘోరంగా తగులబెట్టబడినాయి. నలందా బుద్ధవిహారం లోని లైబ్రరీ ఒక్కటే మూడునెలలపాటు తగలబడుతూనే ఉందంటే అందులో ఎన్ని లక్షలాది గ్రంధములు అగ్నికి ఆహుతయి పోయాయో, ఎంతటి తరతరాల రీసెర్చీ, విజ్ఞానసంపదా నాశనమై పోయిందో అర్ధం చేసుకోవచ్చు మన భారతదేశమునకు, హిందూమతమునకు తురకరాక్షసులు చేసిన హాని మాటలలో చెప్పగలిగేది కాదు. ఆ విధంగా నెలలతరబడి మంటలకు ఆహుతి కాగా మిగిలిన కొన్ని గ్రంధములే ప్రస్తుతం మనకు అమిత సంభ్రమాశ్చర్యములను కలిగిస్తున్నాయి. మనకే గాక, యూరోప్, అమెరికా మొదలైన ఇతరదేశస్థులు వీటిని చదివి వీటిలోని జ్ఞానసంపదకు బిత్తరపోతున్నారు. ఇంగ్లీష్ లోకి, ఇతర యూరోపియన్ భాషలలోకి వీటిని అనువాదం చేసుకుని అనుసరిస్తున్నారు. వీటిని ఆచరిస్తున్నారు. ఎంతోమందికి యోగాభ్యాసమును నేర్పుతున్నారు.

హిందూమతమును అనుసరించే అమెరికన్లు నేడు వేలాదిమంది ఉన్నారు. బైటకు చెప్పకపోయినా, అభిమానించేవారు లక్షలలో ఉన్నారు. యోగాను చేస్తున్నవారు కోట్లలో ఉన్నారు. అమెరికాలో ప్రతి ఇంటిలో యోగా చేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు. నేను చూచి, చాలా ఆశ్చర్యపోయాను. సరిగ్గా చెప్పాలంటే, మన ఇండియాలో కూడా ఇంతగా యోగాభ్యాసమును మనం చేయడం లేదు. వీళ్ళు చేస్తున్నారు.

నేడు అమెరికాలో, యూరప్ లో శివభక్తులు, కృష్ణభక్తులు,  దేవీభక్తులు, యోగులు ఎంతో మంది ఉన్నారు. ఇది వారి అదృష్టం. ఇండియాలో హిందూమతం నుండి ఇతరమతాలలోకి  ప్రతిరోజూ మారుతున్నారు. అది వారి దరిద్రం.

సిద్ధయోగసాధనను వివరిస్తూ చెప్పబడిన అతి ముఖ్యములైన గ్రంధములలో 'యోగబీజము' ఒకటి. నాశనం కాకుండా ఇది మనకు లభించడము మనందరి అదృష్టం.  ఈనాడు దీనికి వ్యాఖ్యానమును వ్రాయగలగడం నా అదృష్టం.

మామూలు యోగసాధనకు, సిద్ధయోగసాధనకు గల భేదములను ఈ గ్రంధము స్పష్టముగా వివరిస్తుంది. జ్ఞానికంటే యోగి ఉత్తముడని ఇది చెబుతుంది. భగవద్గీత 6 వ అధ్యాయము 46 వ శ్లోకం కూడా దీనినే చెప్పినది.

శ్లో || తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున || 6. 46 ||  

'తపస్వులకంటే యోగి అధికుడు. జ్ఞానులకంటే యోగి అధికుడు. కర్మిష్ఠులకంటే యోగి అధికుడు. కనుక ఓ అర్జునా ! నీవు యోగివి కా !'

యధావిధిగా ఈ పుస్తకమును వ్రాయడంలో కూడా నాకు తోడునీడలుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

మిగతా మా గ్రంధములలాగే ఇది కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది. చదవండి. హిందూమతం యొక్క మహత్తరమైన ప్రాచీనవిజ్ఞానమును అర్ధం చేసుకోండి.

4, జనవరి 2023, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 79 (రాజౌరీ హిందువుల హత్యలు - భారతదేశం నిద్రపోతోంది)

కాశ్మీర్ లోని రాజౌరీ అనే ఊళ్ళో నిన్నగాక మొన్న హిందువుల హత్యలు జరిగాయి. ఇవి టార్గెటెడ్ హత్యలు. అంటే, ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, ఆధార్ కార్డు అడిగి, చెక్ చేసి, అప్పుడు షూట్ చేశారు. మళ్ళీ ఇంకో ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి అక్కడా అదే పని చేశారు. మొగవాళ్లను, పిల్లలను చంపేశారు. ఆడవాళ్లను వదిలేశారు. చనిపోయిన ఆరుగురూ బ్రాహ్మిన్ కులానికి చెందినవారే.

ఇది కాశ్మీర్లో మామూలే అనకండి. రేపు మీ ఊరికి కూడా పాకుతుంది. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కేరళలు అదే దిశగా పోతున్నాయి. దీనికి కారణం అక్కడ పెరిగిన ముస్లిం జనాభా.

2011 లెక్కల ప్రకారం కాశ్మీర్ లో 68 శాతం మంది ముస్లిములున్నారు. ఆ మాటకొస్తే అసలు ప్రభుత్వం దగ్గరే సరైన లెక్కలు లేవు. ప్రస్తుతం 2023 వచ్చింది, కానీ ప్రభుత్వం మాత్రం ఇంకా 2011 లెక్కలు చూపిస్తోంది. అప్పటికే 68 శాతం ఉంటే, ఈ 12 ఏళ్లలో ఎంత పెరిగింది? పాకిస్తాన్ నుంచి ఎంతమంది వచ్చి సైలెంట్ గా సెటిలైపోయారు? తెలీదు. కనీసం 85 శాతం అయ్యి ఉంటుంది. ఇక అక్కడ హిందువులకు రక్షణ ఎలా ఉంటుంది? మన హైదరాబాద్ లోనే రోహింగ్యాలు బోలెడుమందున్నారు. ఇక కాశ్మీర్లో పాకిస్తానీలు ఉండరా? అందుకే అక్కడ జనాభా లెక్క ప్రభుత్వం దగ్గర కూడా లేదు.

చనిపోయిన ఈ హిందువులు, వాళ్ళ పిల్లలు చేసిన తప్పేమిటి? శాంతిగా బ్రతుకుతున్నవారిని అలా చంపడం కరెక్టేనా? దేవుడి దృష్టిలో ఇది తప్పా రైటా? లేక వాళ్ళ పుస్తకంలో అలా వ్రాశారు గనుక అది రైటా? లేక వాళ్ళ దేవుడు ఇలాంటి పనులను సమర్ధిస్తాడా? ఇస్లామంటే ఇదేనా?

కొన్ని పోస్టులలో నేను ఇస్లాం ను విమర్శిస్తే చాలామందికి కోపం వచ్చింది. మరి నేడు జరిగిందేమిటి? నేను చెబుతున్నది నిజమా అబద్ధమా?

కనీసం మీడియాకూడా దీన్ని దేశసమస్యగా చూపించడం లేదు. కేవలం కాశ్మీర్ కో, ఇంకో ప్రాంతానికో పరిమితమైన సమస్యగా చూపిస్తోంది. కానీ ఇదే సమస్య ముదిరి ముదిరి ముందుముందు ప్రతిరాష్ట్రానికీ ప్రతి ఊరికీ పాకుతుంది. రేపు దేశభద్రతే అయోమయంలో పడుతుంది. హిందువుల మనుగడే ప్రశ్నార్ధకమౌతుంది? అప్పుడేం చేస్తారు? అప్పుడు కూడా 'నా కులం' 'నా కులం' అనుకుంటూ కూచుంటారా? లేక, అందరం 'భాయీ భాయీ' అనుకుంటారా? లేక మతాలు మార్చుకుంటారా?

అసలు దీనిని 'టెర్రరిస్ట్ దాడి' అనడమే తప్పు. ఈ పదం కూడా మీడియా వక్రీకరణమే. ఇది టెర్రరిజం కాదు. హిందూమతం పైన ఇస్లాం చేస్తున్న దాడి. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని వాస్తవంగా చూపకుండా, ఏవేవో పేర్లుపెట్టి, దాచిపెట్టి ఉంచుతుంటే, రోజురోజుకూ సమస్య ముదురుతోంది గాని తగ్గదు. జరిగినదాన్ని జరిగినట్లు చెప్పడానికి ఎందుకంత భయం?

'కాశ్మీరులో హిందువులపైన ఇస్లామిక్ కిరాతకుల దాడి' అని ఎందుకు మీడియాలో చెప్పరు? 'బ్రాహ్మణ కుటుంబాలను ఆధార్ కార్డు అడిగి మరీ చంపారు' అన్న నిజాన్ని ప్రజలకు చెప్పడానికి ఎందుకంత భయం?

సమస్యను నేను స్పష్టంగా చెబుతున్నాను.

హిందువులలో కుల ఐకమత్యం తప్ప, మతపరమైన ఐకమత్యం లేదు. అదే హిందూమతానికున్న పెద్ద లోటు.  కులాలలో కూడా, కొన్ని కులాలలోనే ఈ విధమైన ఐకమత్యం ఉన్నది. అందరికీ లేదు. మతపరంగా ఒకే త్రాటిక్రిందకు వచ్చే గుణం అసలే లేదు. అందుకే ఇన్ని సమస్యలు. ఈ ఐకమత్యలోపమే ముందుముందు ఇండియా కొంప ముంచబోతున్నది.

హిందువులలో ప్రతివాడూ, 'నా ఇల్లు బాగుంటే చాలు' అనుకుంటాడు గాని జాతీయతాభావం, దేశభక్తి వారిలో లేవు. అవి లేనప్పుడు, నువ్వు ఏ కులమైనా సరే, చివరకు ఒకనాటికి నీ ఇల్లు కూడా లేకుండా పోతుందన్న స్పృహ వారిలో రావాలి. అది లోపించడమే అతిపెద్ద దరిద్రం.

అన్ని మతాలూ ఒకటే అనుకోవడం ఇంకో లోపం. అన్నిమతాలూ ఒకటి ఎప్పటికీ కావు. సమస్యేమిటంటే, హింసాత్మకమతాలైన క్రైస్తవ, ఇస్లాం మతాలేమో శాంతిమతాలుగా ప్రచారం చేయబడుతున్నాయి. నిజమైన శాంతియుతమతమైన హిందూమతమేమో, నానా అపవాదులను లోనౌతున్నది. ఇదంతా గోబెల్స్ ప్రచార ఫలితం. వందలాది ఏళ్ళుగా నిజాలను అబద్ధాలుగాను, అబద్ధాలను నిజాలుగాను ప్రచారం చేసిన ఫలితమే ఇది.

నేడు నిశ్శబ్దంగా ఇండియాకు ముంచుకొస్తున్న అతి పెద్ద ప్రమాదాలు మూడే.

1. క్రైస్తవ మతప్రచారం. మతమార్పిళ్లు.

2. ఇస్లామిక్ తీవ్రవాదం

3. పెరుగుతున్న ముస్లిముల జనాభా.

ఈ మూడింటినీ చూస్తూ ఊరుకుంటే, వచ్చే 50 ఏళ్లలో ఇండియా సివిల్ వార్ కు ఖచ్చితంగా లోనౌతుంది. అంటే, రోడ్లమీద జనం కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే వచ్చింది. చాలామందికి కన్పించడం లేదు. ప్రతిరాష్ట్రమూ కాశ్మీర్ అయ్యే ప్రమాదం ఇండియాలో  చాలా త్వరలో పొంచి ఉంది. అప్పుడు ఇంటింటికీ వచ్చి ఆధార్ కార్డు అడిగి మరీ చంపుతారు. అప్పుడు కూడా 'నా ఇల్లు బాగుంటే చాలు, నా కులం బాగుంటే చాలు' అనుకుంటూ కూచోండి. సరిపోతుంది. లేదా క్రైస్తవపార్టీలను, ఇస్లామిక్ పార్టీలను ఎన్నుకొని, అధికారాన్ని కట్టబెట్టండి. మీకు సరియైన వాత పెడతారు. మీరు గుళ్ళకిచ్చే డబ్బులన్నీ వాళ్ళు వాడుకుని చర్చిలు, మసీదులు కట్టుకుంటారు. సరిపోతుంది.

రాజౌరీ సంఘటనలో మొగవాళ్లందరూ హత్యకు గురయ్యారు. ఆడవాళ్లు మిగిలారు. ఇప్పుడు వాళ్ళేం చెయ్యాలి? ఆ ఊళ్ళో అందరూ ముస్లిములే. ఆ ఇల్లు  కొనడానికి ఎవరూ ముందుకు రారు. కట్టుబట్టలతో వాళ్ళు ఇంటిని వదిలేసి ఢిల్లీకి వచ్చి రోడ్లమీద అడుక్కుంటూ బ్రతకాలి. లేదా పార్లమెంటు ముందర ఆత్మహత్య చేసుకోవాలి. ఆ ఇంటిని ఎవడో హంతకుడు ఆక్రమిస్తాడు.

సెక్యులరిస్టులు, అంబేడ్కర్ వాదులు, కమ్యూనిస్టులు, శాంతియుత ఇస్లాంవాదులు ఇప్పుడు నోరు తెరవరేమిటి? చంపబడినవాళ్లు మనుషులు కారా? మీరు చెప్పే నీతులన్నీ ఇప్పుడేమైపోయాయి? ఎప్పుడో వేలాది సంవత్సరాల క్రితం అంటరానితం పాటించారని ఇప్పటికీ రోడ్లెక్కి గోల చేస్తున్నారు, అదికూడా అన్ని రాజ్యాంగరాయితీలు అనుభవిస్తూ. మరి ఇదేంటి? ఇప్పుడు ఎవరు ఎవరిని చంపారు? ఆ బ్రాహ్మణులు చేసిన తప్పేంటి?  ఇందులో అంటరానితనం ఎక్కడుంది? చంపిన ఇస్లాం శాంతిమతమా? చంపబడిన బ్రాహ్మిన్, అతని చిన్నపిల్లలు దుర్మార్గులా? ఎవరు కసాయివాళ్ళు? ఎవరు మంచివాళ్ళు? ఎవరు దేవదూతలు? ఎవరు దేశద్రోహులు? మానవహక్కులు ఇప్పుడు లేవా? గుర్తుకు రావా? మీ దుష్ప్రచారాలతో ఇంకా ఎన్నాళ్ళు లోకాన్ని మభ్యపెడతారు?

ఇండియా నుండి నా శిష్యుడొకడు ఫోన్ చేసి 'గురువుగారు, ఇండియా పరిస్థితి ఏమిటి?' అనడిగాడు.

ఇలా చెప్పాను.

'చూడు,  భవిష్యత్తేమీ ఆశాజనకంగా లేదు. మీ హిందువులు ఇద్దర్ని కంటారు. అబ్బాయేమో అమెరికాలో సెటిలై US సిటిజెన్ అవుతాడు.  ఇక ఇండియాకు రాడు. అమ్మాయేమో లవ్ జిహాద్ కు గురై, ముస్లిం కుర్రాడి వలలో పడి ఇల్లొదిలి వెళ్ళిపోతుంది. తరువాత ఆమె అడ్రస్ ఏమైందో నీకు తెలియదు. వాడే ఆమెను ముక్కలుగా నరికి చంపుతాడు. లేదా ఆమె తానే సూయిసైడ్ చేసుకుంటుంది. లేదా, ఖర్మకాలి బ్రతికుంటే, ఆమెకు పుట్టే పిల్లలు ముస్లిములౌతారు. కొన్నాళ్ళకు నువ్వు, నీ భార్యా పెద్దవాళ్ళై ఇండియాలోనే వృద్ధాశ్రమంలో చనిపోతారు. నీ ఇంటిని ఏ ముస్లిమో కొనేసి మసీదుగా మారుస్తాడు. నీ కుటుంబచరిత్ర అంతటితో అంతమౌతుంది. కానీ అదేసమయంలో ముస్లిం జనాభా పదిరెట్లు పెరుగుతుంది. కొన్నాళ్ళకు పాకిస్తాన్ మీ దేశాన్ని హాయిగా ఆక్రమిస్తుంది. అప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఈలోపల మీలోమీరు కులాలని, ప్రాంతాలని, కులపార్టీలని కొట్టుకుంటూ ఉండండి. సరిపోతుంది' అన్నాను.

అతనికి నా మాటలు కొంచం కటువుగా అనిపించాయి. కానీ నేను చెబుతున్నది నిజం. ఇవాళ కాకపోతే రేపు ఇది నిజమౌతుంది.

ఈ విధంగా ఎన్ని చెప్పుకున్నా, చివరకు ఈ సమస్యలకన్నింటికీ ఒకటే పరిష్కారం.

1. భారతదేశం హిందూదేశంగా ప్రకటింపబడాలి. ఎప్పటినుంచో ఇండియా హిందూదేశమే. నేడు బురదగుంటగా మారింది. మళ్ళీ అది అధికారికంగా హిందూదేశం అవ్వాలి.

2. ఇండియాలో మిలటరీ రూల్ రావాలి. అతిస్వేచ్ఛను, అరాచకాలను, పొలిటికల్ కుట్రలను, అవినీతిని ఎక్కడికక్కడ అణిచివేయాలి. 

3. ఆస్తులను ధ్వంసం చేసేవారిపైనా, క్రైమ్ చేసేవారిపైనా, తక్షణ శిక్షలు అమలు కావాలి. కోర్టులు, దశాబ్దాల తరబడి కేసులు తేలకుండా ఉండటాలు, ఇవన్నీ పోవాలి. నేరస్తులకు ఆన్ ద స్పాట్ శిక్షలు పడాలి. 

ఇవి జరిగినప్పుడే ఇండియాలో శాంతి నెలకొంటుంది. అప్పుడే ఇండియా ప్రపంచదేశాలలో అన్నిరంగాలలోనూ నెంబర్ 1 అవుతుంది.

లేదంటే రాబోయే 50 ఏళ్లలో ఇండియా ఏమౌతుందో చెప్పడం నా ఊహకు అందటం లేదు.

3, జనవరి 2023, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 78 (ఇస్లాం ఒక్కటే ప్రపంచాన్ని ఏకం చేయగలదు)

ఇస్లాం ఒక్కటే ప్రపంచాన్ని ఏకం చేయగలదని ఆ మతాన్ని అనుసరించే వారంతా నమ్ముతూ ఉంటారు. అది నిజమేనని నేనూ ఒప్పుకుంటాను నేనేకాదు, ఇప్పుడు అమెరికా కూడా ఒప్పుకుంటోంది. ఎలాగో చివర్లో చెబుతా.

అమెరికాలో మైన్ అని ఒక రాష్ట్రం ఉంది. ఇది నార్త్ ఈస్ట్ లో పైకి, ఒక మూలగా ఉంటుంది. విపరీతమైన చలివల్ల, ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువ. మన ఇండియాలో మిజోరాం, మణిపూర్ లాగా ఇది ఉంటుంది.

డిసెంబర్ 31 శనివారం రాత్రి ఒక 19 ఏళ్ల అబ్బాయి ఈ రాష్ట్రం నుంచి న్యూయార్క్ టైం స్క్వేర్ కి వచ్చాడు. అతని పేరు ట్రెవర్ బిక్ ఫోర్డ్. స్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం, టైమ్ స్క్వేర్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీడు ఒక మేచట్ (కొబ్బరిబోండాల కత్తి) తో పోలీసులమీద దాడిచేసి ముగ్గురిని తీవ్రంగా గాయపరిచాడు. అయితే అతని భుజం మీద షూట్ చేసిన పోలీసులు అతన్ని వెంటనే పట్టుకున్నారు.

ఎందుకురా ఇలా చేశావంటే, ఇస్లామిక్ తీవ్రవాద నినాదాలు చేశాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ టైములో ఇస్లామంటే ఏమిటో అమెరికాకు చూపిద్దామని కంకణం కట్టుకున్నాడట. అందుకని ఒక కొబ్బరి బొండాల కత్తి పట్టుకుని అమెరికన్ పోలీసులను నిష్కారణంగా ఎటాక్ చేశాడు. సెలబ్రేషన్ జరుగుతున్న స్థలంలోకి వెళ్లి, అక్కడి జనాన్ని దొరికినంతమందిని చంపుదామని అతని ప్లాన్. కానీ వీలుకాలేదు. ఏమంటే, పోలీసు కాపలా ఉంది. అందుకని పోలీసులను ఎటాక్ చేశాడు. అతన్ని కాల్చి, హాస్పటల్లో పడేసి, అతని చరిత్ర తవ్వితీశారు. సోషల్ మీడియాలో తీవ్రవాద ఇస్లామిక్ భావాలను చాలాసార్లు వెలిబుచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి అక్కడి తాలిబాన్ లో చేరడం ఇతని జీవితాశయమట. అమెరికాలో ఇటుపక్క, గన్స్ అంత తేలికగా దొరకవు. టెక్సాస్ వైపైతే వేరుశెనగ పప్పులమాదిరి దొరుకుతాయి. సరే, అతనికి గన్ దొరకలేదు గనుక సరిపోయింది. అదే గన్ షూటింగ్ అయినట్లయితే చాలామంది చనిపోయి ఉండేవారు.  

అయితే అతని తల్లి, అక్క ఇంతకు ముందే పోలీసులకు కంప్లెయింట్ చేసి ఉన్నారు. వీడు ఇస్లామిక్ తీవ్రవాదానికి లోనౌతున్నాడు, అని. అంతవరకూ వాళ్ళు మంచివాళ్ళే అనుకోవాలి. వాళ్ళలా ఎందుకు కంప్లెయింట్ఇచ్చారంటే,  వాళ్ళు  అమెరికన్స్ కాబట్టి. అదే ముస్లిమ్స్ అయితే ఇవ్వరు. దాచిపెడతారు. మన ఇండియాలోని ముస్లిం నేరస్తుల కుటుంబసభ్యులెవరూ కూడా ఇలా పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వరు. నేరం జరిగిన తర్వాత కూడా ఒప్పుకోరు. 'మావాడు చాలామంచివాడు. ఇండియా ప్రభుత్వమే అసలైన టెర్రరిస్టు ప్రభుత్వం, మావాడేదో సరదాకి అలా చేస్తే దాన్ని మీరంతా వక్రీకరిస్తున్నారు. పాపం చిన్నపిల్లాడు. వాడికేం తెలుసు? చూసీ చూడనట్టు పోవాలి. వదిలెయ్యాలి.' అని వాళ్ళు ప్రెస్సులో మాట్లాడతారు. వేదికలెక్కి కూడా మాట్లాడతారు. అదేమంటే మైనారిటీ హక్కులంటారు. మానవహక్కులంటారు. అంతటి స్వేచ్ఛను మన రాజ్యాంగం వాళ్లకు కల్పించింది మరి !

ఇంకొక వింతేమిటంటే, మన పార్టీలు, మన మేధావులు, మన లీడర్లే వాళ్ళను సపోర్ట్ చేస్తారు.అసలిదేంటో ఎప్పటికీ అర్ధం కాదు.

ఇప్పుడు అమెరికాలో చర్చ మొదలైంది. 'ఇస్లామిక్ తీవ్రవాదం అమెరికాలో కూడా పాకుతోందేంటి? 19 ఏళ్ల కుర్రాడికి ఇంతటి ఉన్మాదం ఎలా ఎక్కింది?' అని. మరి పాకకుండా, ఎక్కకుండా ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్య దేశం కదా? వస్తారు. పెరుగుతారు. ఆ తర్వాత ఇదే జరుగుతుంది. ఇన్నాళ్లూ ఇండియాలో జరుగుతుంటే, అమెరికన్లు ఎగతాళిగా కామెంట్లు చేసేవాళ్ళు.  ఇప్పుడు అమెరికాలో కూడా మొదలైంది. ఏదైనా తనదాకా వస్తేనేగాని తెలీదు కదా !

ఇప్పుడు సోకాల్డ్ ఇస్లామిక్ స్కాలర్లు వస్తారు. 'ఛీ ఛీ ఇస్లాం అలాంటిది కాదు. అదేమీ అలా చెయ్యమని చెప్పలేదు. అది శాంతిమతం. ఎవడో ఒకడు చేశాడని మొత్తం అందర్నీ అనకూడదు' అంటారు. ఒకపక్కన ఇలాంటి చిన్నపిల్లలకు తీవ్రవాదాన్ని నూరిపోస్తూనే ఉంటారు. మరొపక్కన ఇలాంటి శాంతికబుర్లు చెబుతూనే ఉంటారు. ఇదేమీ కొత్త స్ట్రాటజీ కాదుకదా ! గత వెయ్యేళ్ళ నుంచీ ఇదే కదా వాళ్ళు చేస్తున్నది !

అసలు 'తీవ్రవాద ఇస్లాం' అనే మాటకే నాకు నవ్వొస్తుంది. అదికాకుండా వేరేది అందులో ఏముందసలు? ఆ మధ్యన ఇండియాలో కూడా ఇలాగే ఒకడు ఇలాంటి మేచట్ తోనే పోలీసులను దాడిచేశాడు.  వాడూ ఇస్లామిక్ గూండానే.

అమెరికాలో మైన్ అనే ఒక రాష్ట్రం ఉందని అమెరికన్స్ కే చాలామందికి తెలీదు. అంతటి మారుమూల రాష్ట్రంలో కూడా ఇస్లామిక్ తీవ్రవాదం పెరుగుతోంది. భలేగా ఉంది కదూ !

ఇలాంటివి మరిన్ని జరిగితే కదా అమెరికన్స్ కళ్ళు తెరిచేది? బుద్ధితెచ్చుకునేది? అన్ని దేశాలలో ఇదే జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ కూడా మొదలైంది.

నిజమే ! ఇస్లాం అంటే శాంతి మాత్రమే. నేను నమ్ముతున్నాను. మీరూ నమ్మండి. నేను ఖురాన్ చదివాను. ఒకసారి కాదు. చాలాసార్లు చదివాను. 'శాంతి' అనే పదం ఎక్కడైనా కన్పిస్తుందా అని వెదుకుతూ చదివాను. అంతా హింస తప్ప అందులో 'శాంతి' అనే మాటే ఎక్కడా కన్పించలేదు. కావాలంటే మీరూ చదివి చూడండి. నా మాటను ఒప్పుకుంటారు.

కానీ ఒక్కటి మాత్రం నిజం.

ఇస్లాం ఒక్కటే ప్రపంచాన్ని ఏకం చేయగలదు - ఇస్లాంకు వ్యతిరేకంగా !

ఇంకే మతమూ అలా చెయ్యలేదు. అదే ఇస్లాం గొప్పదనం మరి !

2, జనవరి 2023, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 77 (హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ ఫోటోలు)

జనవరి 1 వ తేదీతో ముగిసిన  హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' స్టాల్ ను పదిరోజులపాటు నడపడం జరిగింది. వందలాదిమందికి మా పుస్తకాలను భావజాలాన్ని పరిచయం చేయడం జరిగింది. మా స్టాల్ దగ్గరకు  వెతుక్కుంటూ వచ్చి 'పంచవటి' గురించి అడిగి తెలుసుకున్నవారికి, మా గ్రంధాలను  కొనుక్కున్నవారికి, వారివారి విజ్ఞానప్రదర్శన చేసినవారికి, మా గ్రంధాలను రికమెండ్ చేసినవారికి, అందరికీ  మా కృతజ్ఞతలు.

ఆ సందర్భంగా ప్రతిరోజూ తీస్తూ వచ్చిన ఫోటోల కొలేజ్ ఇక్కడ మీకోసం.