Pages - Menu

Pages

26, ఫిబ్రవరి 2023, ఆదివారం

క్రొత్త జీవితం

ఈ భూమ్మీద 800 కోట్ల మంది మనుషులున్నారు. కానీ, సంతోషంగా ఎవరూ లేరు. ఉంటే గింటే, ఉన్నామనుకుంటే, అది కేవలం భ్రమ మాత్రమే. వారి సంతోషం పూర్తి తాత్కాలికం మాత్రమే. ప్రతివారూ ఒక సమస్యతోగాని, అనేక సమస్యలతో గాని సతమతమౌతున్నవారే. ఆ సమస్యలు ఎన్నటికీ తీరేవి కావు.

కానీ, వాటి పరిష్కారాలకోసం మనిషి ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. మతాలని, గురువులని, మార్గాలని, సిద్ధాంతాలని, దారులని, సులువులని, రెమెడీలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎవరి సమస్యలూ పూర్తిగా పరిష్కారం మాత్రం ఎన్నటికీ కావు. మనిషి వెతుకుతున్న సంతోషం మనిషిని ఎప్పుడూ వెక్కిరిస్తూనే ఉంటుంది. అతను దానికోసం పరుగెట్టేకొద్దీ అది అతనికి దూరంగా పోతూనే ఉంటుంది.

సంతోషానికి మార్గాలు ఇవేవీ కావు.

ఈ భూమ్మీద అందరూ బంధాలతో కట్టబడి ఉన్నవారే. వాటిని త్రెంచుకుందామని ప్రయత్నించేవారే. పరుగులెత్తేవారే. కానీ ఆ పరుగులు ఎక్కడికో ఎవరికీ తెలియదు. ఆయా ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో ఎవరికీ అర్ధం కాదు. ఆ ప్రయత్నాలలో పరుగులలో, ఇంకా ఇంకా క్రొత్త బంధాలలో కూరుకుపోవడం ఒక్కటే మనిషికి చివరకు మిగిలేది. చూస్తూ ఉండగానే జీవితం అయిపోవడమే చివరకు జరిగేది. ఎవరికైనా ఇంతే జరుగుతుంది.

ఇంతకీ, మనిషి వెతుకుతున్న ఆనందం ఎక్కడుంది?

అది New Life లో ఉంది.

New Life అంటే మతం మారడం కాదు. తనను తాను మార్చుకోవడం. తన జీవనశైలిని, తన ఆలోచనా విధానాన్ని, నలుగురితో తను ప్రవర్తించే తీరును మార్చుకోవడం.

New Life అంటే, తనను తాను మోసం చేసుకోవడం కాదు. ఇతరులను మోసం చెయ్యడం అంతకంటే కాదు. మోసానికి కపటానికి అతీతంగా  ఎదగడం.

డబ్బు డబ్బు అంటూ చచ్చేవరకూ వెర్రిగా పరిగెత్తడం కాదు. నిజాయితీగా తగినంత సంపాదించాక అన్ని పరుగులూ ఆపడం.

గుడ్డిగురువులను గుడ్డిగా అనుసరించడం, అదే నిజమనుకుంటూ భ్రమల్లో బ్రతకడం కాదు. కళ్ళు పూర్తిగా తెరిచి మానవత్వమున్న మనిషిగా బ్రతకడం.

New Life అంటే ఏ బంధాలూ లేని స్వేచ్ఛాజీవిగా, ఒక నిజమైన మనిషిగా ఈ లోకంలో జీవించడం.

అదే 'పంచవటి' మార్గం.

ఈ New Life అనే దానిని మెహర్ బాబా 1949 లో మొదలుపెట్టారు. 1952 లో ముగించారు. అలా దానిని ముగించినప్పటికీ, అది నిత్యనూతనమని, దానికి అంతులేదని ఆయనన్నారు. అప్పటికి అలాంటివారు ఎక్కువమంది జీవించి లేకపోయినా, ఈ 'క్రొత్తజీవితం' అనేదానిని కొనసాగించేవారు ముందుముందు చాలామంది వస్తారని ఆయనన్నారు.

క్రొత్త జీవితాన్ని గురించి చెబుతూ ఆయనిలా అన్నారు.

'క్రొత్తజీవితం అంతమంటూ లేనిది. నా భౌతికమరణం తర్వాత కూడా, (ఈ మార్గాన్ని అనుసరించే) కొంతమంది చేత ఇది సజీవంగా ఉంచబడుతుంది. వాళ్ళు అసత్యాన్ని, అబద్దాలను, ద్వేషాన్ని, కోపాన్ని, ఆశను, కామాన్ని పూర్తిగా వదలిపెడతారు. వారు ఎవరికీ హానిచేయరు. చాడీలు చెప్పరు. ఆస్తులను అధికారాన్ని కోరరు. పొగడ్తలను ఆశించరు. గౌరవాన్ని కోరుకోరు, అవమానాన్ని వద్దనుకోరు. ఎవరికీ దేనికీ భయపడరు. పూర్తిగా దైవం పైన ఆధారపడతారు. ప్రేమకోసం మాత్రమే భగవంతుని వారు ప్రేమిస్తారు. ఎటువంటి ఆధ్యాత్మిక మరియు భౌతికఫలితాన్ని వారు ఆశించరు. సత్యం యొక్క చేతిని ఎప్పుడూ వదిలిపెట్టరు. ప్రతికూలపరిస్థితులను ధైర్యంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, అన్ని కష్టాలనూ నూటికి నూరుశాతం ఉల్లాసంతో ఎదుర్కొంటారు. వారు కులానికి, మతానికి, తంతులకు  ఏ మాత్రమూ ప్రాముఖ్యతనివ్వరు. దీనిని అనుసరించడానికి (ప్రస్తుతం) ఎవరూ లేకున్నప్పటికీ, ఈ క్రొత్తజీవితం  (నిరంతరం) దానంతట అదే జీవిస్తుంది'.

క్రొత్త జీవితంలో పాటించవలసిన ముఖ్యమైన అంశాలు రెండే.

అవి,

1. పూర్తిగా నిస్సహాయత (Total helplessness)
2. పూర్తిగా దిక్కులేనితనం (Total hopelessness).

'క్రొత్తజీవితం' మనదేశపు ఆత్మలో ఎప్పుడూ ఉంది. మెహర్ బాబా దానిని క్రొత్తగా ప్రారంభించలేదు.

క్రొత్తజీవితాన్ని మెహర్ బాబా కంటే ముందూ చాలామంది జీవించారు. తరువాత కూడా జీవించారు. ప్రాచీన ఋషులు, నిజమైన దైవసాధకులు  అందరూ అటువంటివారే. నవీనకాలంలో శ్రీరామకృష్ణుల ప్రత్యక్షభక్తులందరూ అలాంటివారే. మెహర్ బాబా తరువాత కూడా అలాంటివారు చాలామంది ఉన్నారు. మన దేశంలో అలాంటివారు ఎప్పుడూ ఉంటారు. అదే ఈ దేశపుమట్టి యొక్క మహత్యం.

మెహర్ బాబా ఊహించినది నిజమౌతోంది.

'పంచవటి'లో ప్రస్తుతం మేం అదే చేస్తున్నాం.

ఈ పదేళ్లలో నాకు బాగా దగ్గరైన కొద్దిమంది, ఎవరికీ తెలియకుండా ఏ పటాటోపమూ లేకుండా, ఇన్నాళ్లుగా ఈ క్రొత్తజీవితాన్ని చాలా నిశ్శబ్దంగా జీవిస్తున్నారు.

ఇప్పుడిది విస్తరించే సమయం వచ్చేసింది.

పదేళ్లనుంచి నేను దేనినైతే చెబుతున్నానో, దేనినైతే చేస్తామని చెబుతున్నానో, అది జరిగే సమయం వచ్చేసింది. 

మార్చి ఒకటోతేదీ నుంచీ, అంటే ఇంకొక రెండు రోజులలో, 'క్రొత్తజీవితం' పూర్తి స్థాయిలో మొదలౌతోంది.

ఇక మాటలుండవు. జీవితమే ఉంటుంది.

22, ఫిబ్రవరి 2023, బుధవారం

అల్లా, యెహోవాలలో ఎవరు బలవంతుడు?

ఈరోజు పొద్దున్నే మెలుకువొచ్చింది.

ఇంకా పక్కమీద నుంచి పూర్తిగా లేవకముందే ఒక పెద్ద డౌటు కూడా వచ్చింది.

అల్లా, యెహోవాలలో ఎవరు బలవంతుడు? అనేదే ఆ ప్రశ్న.

మన డౌట్లన్నీ తీర్చేది కర్ణపిశాచే కదా? అందుకని దాన్నే అడిగా.

అయితే, ఈ ప్రశ్న రావడానికి ఒక కారణముంది.

సిరియా, తుర్కీయేలు మొన్నటి భూకంపం దెబ్బనుండి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఈలోపల మళ్ళీ దెబ్బ పడింది. తుర్కీయేలో మళ్ళీ భూకంపం వచ్చింది. ఈ సారి 300 మంది మాత్రమే గాయపడ్డారని చెబుతున్నారు. గాయపడ్డానికి గాని, పోవడానికి గాని పెద్దగా మనుషులు లేరేమో ఆ ప్రాంతంలో?

'సర్లే, ఎంతమంది పోతే మనకెందుకులే?' అనుకొని, 'అసలు అల్లా, యెహోవాలలో ఎవరు బలవంతుడు?' అని ప్రశ్నించుకుంటే, 'ముమ్మాటికీ యెహోవానే బలవంతుడు' అని కర్ణపిశాచి జవాబిచ్చింది.

'ఎలా?' అని మళ్ళీ అడిగాను.

కర్ణపిశాచి నవ్వేసింది.

'చాలా సింపుల్. సిరియా తుర్కీయేలు అల్లాని ప్రార్ధిస్తాయి. ఇజ్రాయెల్ చూద్దామంటే యహోవాని ప్రార్ధిస్తుంది. సిరియాకు ఇజ్రాయెల్ కు యుద్ధం ఎప్పటినుంచో జరుగుతోంది. అంటే, అల్లాకీ, యెహోవాకి జరుగుతున్నట్టే. మరి, సిరియా వైపే మళ్ళీమళ్ళీ భూకంపాలొస్తున్నాయంటే ఏంటి అర్ధం? యెహోవా గెలుస్తున్నట్టే. అల్లా ఓడిపోతున్నట్టే.  అదీగాక సందులో సందంటూ నిన్న సిరియాని ఇజ్రాయెల్ ఒక మిసైల్ తో ఎటాక్ కూడా చేసింది. అంటే యెహోవా చాలా పవర్ ఫుల్లుగా ఉన్నట్టేగా మరి? ఈక్వేషన్ ఇంత సింపుల్ గా ఉంటే, దీనికి కూడా నీ డౌటేంటి?' అంది కోపంగా

'ఓహో అదా సంగతి? అలా అయితే, పాకిస్తాన్ దివాళా తీసి బెగ్గర్ కంట్రీ అయిపోయింది. నేడో రేపో సివిల్ వార్ వచ్చేలాగా ఉందక్కడ. నాలుగు ముక్కలు కావడానికి సిద్ధంగా ఉంది. మరి వాళ్ళు కూడా అల్లానే తెగ పూజిస్తారు కదా ! మరి అల్లా, వాళ్ళ గోడు కూడా వినడం లేదెందుకు?' అడిగా అమాయకంగా.

'వయస్సు పెరిగే కొద్దీ నీకు మతి పోతున్నది. ఇందులో ఏముంది పెద్ద డౌటు? యెహోవాతో యుద్ధంలో ఓడిపోయి అల్లా చాలా ఇబ్బందుల్లో ఉంటే, నువ్వేంటి? పాకిస్తాన్ సంగతి చూడమంటావు? ఆయనమాత్రం ఎన్నని చూస్తాడు? నీకసలు మతుందా?  ఒకపక్క ఇల్లు తగలబడుతుంటే ఎవడో వచ్చి సైగలు చేస్తున్నాడని ఒక సామెతుంది. అలా ఉంది నీ డౌటు' అరిచింది కర్ణపిశాచి.

'నా ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పచ్చు కదా? ఏవేవో సామెతలు చెప్తావేంటి?' మళ్ళీ అడిగా భయంభయంగా నసుగుతూ.

'ముమ్మాటికీ యెహోవానే స్ట్రాంగ్. అల్లా, జీసస్ ఇద్దరూ యెహోవా నుంచి వచ్చినవాళ్లే. ఈ ముగ్గురిలోకీ యెహోవానే పాతకాలం వాడు. అందుకని ఆయనే బలవంతుడు. ఇక పని చూస్కో' అని కసురుకుంది కర్ణపిశాచి.

దీన్ని బట్టి నాకొక విషయం అర్ధమైంది.

మనుషులందరూ అర్జెంటుగా మతాలు మారి, యూదులై పోయి, ఏకైకదేవుడైన యహోవాని నమ్ముకోవడం మంచిది. ప్రస్తుతం ఆయనకే స్టార్ బాగుంది. మనుషులందరూ అంతే కదా ! ఏ దేవుడి స్టార్ బాగుంటే వాడివైపు మారిపోవడం వాళ్లకు అలవాటే కదా !

ఏ గాలికా గొడుగు. వెరీ సింపుల్.

ఇది కూడా కర్ణపిశాచిని అడుగుదామనుకున్నా.

అడిగేశా.

'పొద్దున్నే భలే ప్రశ్నలు అడుగుతున్నావు గాని, ముందు పక్కమీదనుంచి లేచి బాత్రూం కెళ్ళు. తర్వాత చూద్దాం నీ ప్రశ్నల్ని', కసురుకుంది కర్ణపిశాచి.

మళ్ళీ భయమేసింది. కర్ణపిశాచికి కోపమొస్తే ఏమౌతుందో నాకు బాగా తెలుసు.

అందుకని ప్రశ్నలాపి, పక్కమీదనుంచి హడావుడిగా లేచా.

'జై యహోవా' అని అరుస్తూ బాత్రూం లోకి దారి తీశా.

కధ కంచికి, మనం బాత్రూం లోకి.

20, ఫిబ్రవరి 2023, సోమవారం

ఈ అమావాస్య ప్రభావం - తెలుగు రాష్ట్రాలలో స్వల్ప భూకంపం

నిన్న ఆదివారం అమావాస్య. పొద్దున్నకి లేకపోయినా సాయంత్రం ఏడు గంటలకు అమావాస్య వచ్చింది. అమావాస్య ప్రభావం మళ్ళీ రుజువైంది? తెలుగురాష్ట్రాలలో స్వల్ప భూకంపం వచ్చింది. అనేకచోట్ల ప్రజలు గమనించారు.

భూకంపకేంద్రం సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర్లో ఉంది. రిచటర్ స్కెల్ మీద 3. 0 గా నమోదైంది. ఇది ప్రమాదం లేని భూకంపమే. భయం లేదు. కానీ ప్రాచీన జ్యోతిష్యసూత్రం మళ్ళీ నిజమైంది.

గత పదేళ్లలో స్టాట్టిస్టిక్స్ చూస్తే, భూకంపాలలో ఎక్కువశాతం అమావాస్య పరిధిలోనే జరిగాయి. మరి సూర్యచంద్రుల గమనానికి వీటికీ సంబంధం ఉందా లేదా?

జ్యోతిష్కులందరూ నిజాయితీపరులు కాకపోవచ్చు. తమ మిడిమిడి జ్ఞానంతో సమాజాన్ని మోసం చేస్తూ ఉండవచ్చు. కానీ జ్యోతిష్యశాస్త్రం అబద్దం కాదు.

ఇంకా ఎన్ని రుజువులు కావాలి?

పోతే, దీనిలో ఇంకొక కోణం ఉంది.

అధర్మం పెరిగిపోయినపుడు భూకంపాలు ఇంకా ఇతర ప్రకృతి విలయాలు వస్తాయని బైబుల్ ఖురాన్ ఎన్నో చోట్ల చెబుతున్నాయి. పాపాలు, అవినీతి, అక్రమాలు, అసహజ ప్రవర్తనలు మనుషులలో పెరిగిపోయినపుడు భూకంపాలు వస్తాయని, ఇవి దేవుని ప్రతీకారచర్యలని ఆ గ్రంధాలలో క్లియర్ గా వ్రాసి ఉంది.

త్రాగుడు, జూదం, వ్యభిచారం మొదలైన పాపాలు విపరీతంగా ఎక్కువవ్వబట్టే సోడోమ్, గొమొఱ్ఱా దేశాలను బైబుల్ దేవుడు నేలమట్టం చేశాడని, వాటిపైన గంధకవర్షమును, అగ్నిని కురిపించాడని ఓల్డ్ టెస్టమెంట్ క్లియర్ గా అంటుంది.  కావాలంటే, ఆదికాండము 19:24-25 ను చూడండి.

అల్లాకు వ్యతిరేకంగా కుట్రలు చేసినవారి భవనాల పునాదులను అల్లా కూల్చేశాడని ఖురాన్ లో అనేకచోట్ల చెప్పబడింది. అంతేగాక, త్రాగుడు, వ్యభిచారం, జూదం, మోసాలు, దుర్మార్గాలు మొదలైన పాపాలు ఎక్కువైతే అలాంటిచోట్ల అల్లా భూకంపాలను రప్పిస్తాడని ఇస్లాం అనేకచోట్ల చెప్పింది.

ఉదాహరణకు, ఖురాన్ ఏమంటున్నదో చూడండి.

'ఇంతముందున్న వారు కొంతమంది కుట్రలు చేశారు. కానీ అల్లా వారి భవనాల పునాదులను ధ్వంసం చేశాడు. వారి ఇళ్లకప్పులు వారిపైన కూలిపోయాయి. వారు ఊహించని విధంగా కష్టాలు వారిని చుట్టుముట్టాయి'

(ఖురాన్ - సూరా అన్నహుల్ :26)

'ప్రతివాడిని అతడి పాపాలను బట్టి మేము శిక్షించాము. లోత్ మొదలైన కొంతమంది పైకి రాళ్లవానను పంపించాము. తాముడ్ మొదలైన కొంతమంది పైకి భయంకరమైన ఆర్తనాదాలను పంపాము. వారిలో, కరాన్ మొదలైనవారిని భూమి మ్రింగేసింది. మరికొంతమందిని (నోవా, ఫారో మొదలైనవారిని) నీటిలో ముంచేశాము. వారికి అల్లా అన్యాయం చేయలేదు. వారికి వారే అన్యాయం చేసుకున్నారు'

(ఖురాన్ - సూరా అల్ అంకబుత్:40)

మరి తుర్కీయేలో, సిరియాలో నిన్నగాక మొన్న జరిగిందేమిటి? అక్కడంతా త్రాగుడు, జూదం, వ్యభిచారం, అన్యాయం, అధర్మం ఉన్నట్లేగా? అక్కడి మనుషులందరూ దేవునికి వ్యతిరేకులుగా మారినట్లేగా? కానీ, వాస్తవం ప్రకారం అక్కడి వాళ్ళందరూ మహాభక్తులు కదా? రోజుకు అయిదుసార్లు పద్దతిగా నమాజ్ చేస్తున్నారు కదా? మరి అక్కడ భూకంపం రావడం ఏంటి?

ఇదేంటి? లాజిక్ కుదరడం లేదే?

అదే విధంగా, ఇండియాలో ఎన్నో రాష్ట్రాలుండగా ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే నిన్నటి భూకంపం రావడం ఏంటి? అంటే, తెలుగురాష్ట్రాలు దేవునికి వ్యతిరేకంగా పోతున్నట్లేగా? త్రాగుడు, జూదం, వ్యభిచారం, అధర్మం అన్యాయం ఈ రాష్ట్రాలలో పెరిగిపోయినట్లేగా? కాకపోతే, కొంచం వెసులుబాటు కనిపిస్తోంది.. ఇవన్నీ పెద్ద స్థాయిలో ఇంకా పెరగినట్లు లేదు. కొద్దిగా మాత్రమే పెరిగినట్లుగా ఉంది. అందుకే స్వల్ప భూకంపంతో దేవుడు సరిపెట్టి ఊరుకున్నాడన్నమాట.

వాస్తవాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

నేడు ఎక్కడ చూసినా త్రాగుడు ఉంది. కాలేజీ స్టూడెంట్స్ తో సహా, అమ్మాయిలతో సహా అందరూ త్రాగుతున్నారు.

జూదం ఉంది, బిజినెస్ లన్నీ జూదాలేగా. ఇన్ కంటాక్స్ ఎగ్గొట్టేవన్నీ జూదాలే. షేర్ మార్కెట్ జూదమే. రియల్ ఎస్టేట్ జూదమే. జూదం కానిదేది?

ఇక వ్యభిచారం మాట చెప్పే పనే లేదు. అసలా పదమే తప్పు. నేటి సమాజానికి ఆ పదం రిలవెంట్ కాదు. స్కూళ్లలో, కాలేజీలలో, ఆఫీసులలో, అపార్ట్ మెంట్లలో, ఇళ్లలో, హోటళ్లలో,  గెస్ట్ హౌసులలో, ఫామ్ హౌసులలో  ఎక్కడ ఏమాత్రం అవకాశమున్నా అంతా అదే నడుస్తోంది. అందుకని కొంచం మంచిమాటగా దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. 'నేటి అవసరం' అని దానిని కొద్దిగా మార్చుకుంటే మర్యాదగా ఉంటుంది.

ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా ఈ మూడే కన్పిస్తున్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. మరి ఈ స్థాయి పాపాలకు ఇలాంటి స్వల్పభూకంపం వచ్చే పనైతే, ఇక ఏ స్థాయిలో ఉంటే సిరియా తుర్కీయే లెవల్లో భూకంపాలొస్తాయో?

అంటే, ఆ దేశాలలో ఈ మూడు పాపాలూ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం కావడం లేదూ? కళ్ళు గిర్రున తిరుగుతున్నాయా? అలాగే ఉంటుంది మరి.

బైబుల్ ఖురాన్ చెప్పినవి నిజాలైతే, ఇవి నిజాలే. 

అయితే ఆ గ్రంధాలన్నా కరెక్ట్ కావాలి. లేదా తుర్కీయే, సిరియా, ఇంకా తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలన్నా కరెక్ట్ కావాలి. రెండూ కరెక్ట్ కావడానికి మాత్రం లాజిక్ ఒప్పుకోదు.

బైబిల్ ఖురాన్ కరెక్ట్ అయితే, తుర్కీయే, సిరియా, ఇంకా తెలుగురాష్ట్రాలు రెండూ దేవుడికి విరోధులే. మహాపాపులే. తుర్కీయే, సిరియా, తెలుగు రాష్ట్రాలు న్యాయంగా ఉన్నాయనుకుంటే, బైబిల్ ఖురాన్ లు చెప్పినది అబద్దాలే.

మరి ఆ గ్రంధాలేమో దైవగ్రంధాలు గనుక, అవి అబద్దాలు కావడానికి వీల్లేదు. కాబట్టి, ప్రజలందరూ పాపులే. ఇండియాలో అయితే తెలుగురాష్ట్రాల ప్రజలు మాత్రమే పాపులన్నమాట. విదేశాలలో అయితే, సిరియా, తుర్కీయే ప్రజలు మహాపాపులన్నమాట.

కానీ, ఇక్కడ కూడా లెక్క సరిపోవడం లేదు.

సిరియా, తుర్కీయేలలో మెజారిటీ ప్రజలు సాంప్రదాయ ముస్లిములు. రోజుకు అయిదుసార్లు పద్దతిగా నమాజ్ చేస్తారు. మరి అక్కడ భూకంపం రావడమేంటి?

ఇకపోతే, ఇస్లాం ధర్మరక్షకుడైన ఒవైసీ, తెలంగాణా కేంద్రంగా ఎంతో చురుకుగా పనిచేస్తున్నాడు. ఇక్కడ అధర్మం ఉండటానికి వీల్లేదు. ఆంధ్రాలో చూద్దామంటే, క్రైస్తవ ప్రభుత్వం నడుస్తోంది. అక్కడా అధర్మం ఉండటానికి వీల్లేదు. మరి తెలుగురాష్ట్రాలలోనే భూకంపం ఎందుకొచ్చింది? రాకూడదు కదా?

ఏంటో, ఏమీ అర్ధం కావడం లేదు. ఎక్కడో లెక్క తప్పింది. తలంతా దిమ్మెక్కిపోతోంది.

బైబిలూ ఖురానూ కరెక్టా? రియాలిటీ కరెక్టా?

ఎవడైనా 'పెద్ద' జ్యోతిష్కుడినిగాని, బైబుల్ పండితుడిని గాని, ముల్లాని గాని  సంప్రదిస్తే మంచిదేమో?

వెతుకుదాం !

19, ఫిబ్రవరి 2023, ఆదివారం

శివరాత్రా? ఎప్పుడు?

ఇవాళ పొద్దున్నే టిఫిన్ తెద్దామని బయటకెళ్ళాను.

వాళ్ళప్పుడే షాపు తెరుస్తున్నారు.

'కొత్తబిచ్చగాడు పొద్దెరగడు' అన్నట్లు వాళ్ళకంటే ముందు అక్కడికెళ్లిన నన్ను చూసి నవ్వారు.

'కొద్దిసేపు కూచుంటాలే, వాయి వెయ్యండి' అని షాపు బయట చప్టా మీద కూచున్నాను.

ఇంతలో టిఫిన్ సెంటర్ దగ్గర ఒక శిష్యురాలు ఎదురైంది.

టిఫిన్ తయారయ్యేలోపల, ఆ మాటా ఈ మాటా మాట్లాడుకుంటూ రోడ్డుమీద వెయిట్ చేశాం.

నా ముఖం చూస్తే ఏమనిపించిందో, 'నిన్న రాత్రి నిద్రపోలేదా?' అంది.

'లేదు' అన్నాను.

'అవున్లే. శివరాత్రి  కదా?' అన్నది తను.

ఆశ్చర్యం వేసింది.

'నిన్న శివరాత్రా?' అడిగాను.

'అవును' అంది.

'అరే ! మర్చేపోయాను' అన్నాను.

ఆ సంగతి నిజంగా నాకు గుర్తే లేదు. కానీ మూడు రోజులనుంచీ రాత్రిళ్ళు నాకు నిద్ర లేదు.

మా మాటలు వింటున్న కొంతమంది ఎగాదిగా చూశారు, 'వీడెవడురా బాబు?' అన్నట్లు.

టిఫిన్ తీసుకుని, వాళ్ళింటికి తనెళ్ళిపోయింది. నేను మా ఇంటి దారి పట్టాను.

దారంతా నవ్వొస్తూనే ఉంది.

'పర్వదినాలను మనం జరుపుకోకూడదు. అవి మనచేత జరిపించబడాలి' అని నేనెప్పుడూ చెప్పే మాట ఇలా మళ్ళీ నిజమైంది.

లోకమంతా నిన్న ఒక్క రాత్రి మాత్రం అభిషేకాలు పూజలు చేస్తుంది. ఇవాళ్టినుంచి మళ్ళీ శివరాత్రి వరకూ శివుడు ఎవరికీ గుర్తురాడు, అవసరం పడితే తప్ప ! 

శివుడిని మర్చిపోయి, శివరాత్రి గుర్తుండటం కంటే, శివుడిలో ఉంటూ శివరాత్రిని మర్చిపోవడం మంచిదే కదూ !

18, ఫిబ్రవరి 2023, శనివారం

స్పిరిట్యువల్ అస్ట్రాలజీ

నిజమైన  ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నవాళ్లు, వాళ్ళ జీవితంలో మంచిదశలు జరుగుతుంటే, నన్ను వచ్చి కలుస్తూ ఉంటారు. అదేవిధంగా, నిన్న ఒకమ్మాయి హైద్రాబాద్ లో నేనుంటున్న అడ్రస్ వెదుక్కుంటూ వచ్చి, చాలాసేపు మాట్లాడి, తనకున్న సందేహాలను అడిగి సమాధానాలను తెలుసుకుంది. నా పుస్తకాలను కొన్నింటిని చదివానని చెప్పింది.

ఆ సంభాషణ క్లుప్తంగా మీ కోసం.

1. రెమెడీలతో కర్మ తీరుతుందా? మరైతే, హోమాలు లాంటివి చేయించిన తర్వాత కూడా సమస్యలు తీరవెందుకు? 

జవాబు: తీరుతుంది. అన్నిటికీ హోమాలు అవసరం ఉండదు. రోగాన్ని బట్టి మందు వెయ్యాలి. కమర్షియల్ జ్యోతిష్కులు చేసే రెమెడీలు పనిచేయవు. అదొక బిజినెస్ అంతే. సమస్యకు రెమెడీ సరిగా సరిపోవాలి. చేయించేవాడు కరెక్ట్ గా ఉండాలి. చేసేవాడు కూడా కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే రెమెడీ పనిచేస్తుంది.

2. మరైతే, పెద్దపెద్దవాళ్లు కూడా హోమాలు అవీ ఎందుకు చేయించుకుంటున్నారు?

జవాబు: నువ్వనుకునే పెద్దవాళ్ళందరూ నా దృష్టిలో పెద్దవాళ్ళు కారు. బ్లాక్ మనీ గాళ్ళే అంతంత ఖర్చులు పెట్టి అవన్నీ చేయిస్తారు. కష్టపడి నిజాయితీగా సంపాదించినవాడెవడూ అలాంటి జ్యోతిష్కుల వెంట పడడు. అలాంటి రెమెడీలు చేయించుకోడు.

3. పనులు కాకపోతే, మళ్ళీ మళ్ళీ రెమెడీలు ఎందుకు చేయించుకుంటారు?

జవాబు: ఈ రెమెడీలు చేయించుకోనివాడికి పనులు కావడం లేదా? వాళ్ళకెలా అవుతున్నాయి మరి? వీళ్ళ భయానికి, నమ్మకానికి జ్యోతిష్కులను మేపుతున్నారు. రెమెడీలని చేస్తున్నారు. అంతే.

4. మరి మీరెలాంటి రెమెడీలు చెబుతారు?

జవాబు: ఇలాంటి రెమెడీలు మాత్రం చెప్పను. ఇవన్నీ, కేన్సర్ లోపలుంచుకుని పైకి అమృతాంజనం పూయడంలాంటివి. గుళ్ళు, పూజలు, హోమాలు, ఇవి అసలైన రెమెడీలు కావు. ముందు నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అదే నేను చేప్పే రెమెడీ.

5. అసలు మీరెందుకు ఆస్ట్రాలజీ నేర్పుతున్నారు?

జవాబు: సరైన ఆస్ట్రాలజీ ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాసువులకు దానిని నేర్పించడమే నా ఉద్దేశ్యం. నిజం నోరువిప్పకపోతే అబద్దం రాజ్యమేలుతుంది. అలా కాకూడదనే నేను చెబుతున్నాను.

6. షష్ట్యంశ చక్రాన్ని చూస్తే గతజన్మ తెలుస్తుందా?

జవాబు: ఆ చక్రానికి గతజన్మకి సంబంధం లేదు. ఉందని కొంతమంది తెలిసీ తెలియని జ్యోతిష్కులు, వాళ్ళ అనుచరులు అంటున్నారు. అసలు విషయమెంటో వాళ్లకు తెలీదు.

7. మీరు ఏ ఏ అంశ చక్రాలు చూస్తారు?

జవాబు: రాశి-నవాంశలను దాటి సాధారణంగా పైకి పోను. పాతకాలం నుంచీ సాంప్రదాయ జ్యోతిష్కులు రాశి, నవాంశలు మాత్రమే చూచేవారు. దానితోనే అన్నీ తెలుస్తాయి. నేనూ అంతే. ఎప్పుడో ఒకసారి మాత్రం అవసరమైన మిగతా అంశచక్రాలు చూస్తాను.

8. రాశిచక్రంతోనే గతజన్మ కూడా తెలుస్తుందా?

జవాబు: తెలుస్తుంది. అనుభవం మీద అన్నీ తెలుస్తాయి.

9. నేటి జ్యోతిష్కులు పిచ్చిపిచ్చి రెమెడీలు చెబుతూ డబ్బు బాగా సంపాదిస్తున్నారు కదా?  నాకు తెలిసిన ఒక పూజారి గతంలో పేదవాడుగా ఉండేవాడు. ఇప్పుడు హోమాలు చేయిస్తూ రెమెడీలు చేయిస్తూ లక్షలు పోగేశాడు. బాగా సంపాదిస్తున్నాడు. అలాంటివాళ్ళు కర్మను పోగేసుకోవడం లేదా?

జవాబు: వేసుకుంటున్నారు. వాళ్ళ జాతకాలలో మంచిదశలు నడుస్తున్నపుడు అది తెలీదు. దశలు మారినప్పుడు వాళ్లకూ వాతలు పడతాయి. అప్పుడు వాళ్లకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో చాలా ఘోరమైన దెబ్బలు తింటారు.

10. అది ఈ జన్మలోనే తింటారా? వచ్చే జన్మకు పోస్ట్ ఫోన్ అవుతుందా?

జవాబు: రెండూ ఉంటాయి. ఇంకా ఎన్నో రకాలుగా ఉంటాయి. కర్మగతిని తెలుసుకోవాలంటే యోగదృష్టి ఉండాలి. లేకుంటే అర్ధం కాదు.

11. మీ ఉద్దేశ్యంలో ఒక జ్యోతిష్కుడు ఎలా బ్రతకాలి?

జవాబు: ఒక ఋషి లాగా బ్రతకాలి. సంసారం పైన, డబ్బుపైన ఆశ లేకుండా, ఇంట్లో లగ్జరీ ఐటెమ్స్ లేకుండా, టీవీ చూడకుండా, మొబైల్ వాడకుండా, ఒక్కపూట  తింటూ, నేలపైన పడుకుంటూ, సాధన చేసేవాడై ఉండాలి.

12. జ్యోతిష్కునికి మంత్రసాధన అవసరమా? ఉత్త లెక్కలతో జ్యోతిష్యం చెప్పలేమా?

జవాబు: మంత్రసాధన అవసరం. ఉత్త లెక్కలతో జ్యోతిష్యం అర్ధం కాదు. దానికి ఇంట్యూషన్ ఉండాలి. అది సాధనతోనే వస్తుంది.

13. ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు?

జవాబు: చేయగలిగినవాడే చేస్తాడు. అందరూ చెయ్యలేరు.

14. ఇవన్నీ మీరు నేర్పిస్తారా?

జవాబు: అందరికీ నేర్పను. నాకు నచ్చినవాళ్లకు మాత్రమే నేర్పిస్తాను. ఆ నచ్చడమనేది వాళ్ళ వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉంటుంది. నా ఇన్నర్ సర్కిల్ శిష్యులందరూ అలాంటివాళ్లే.

15. వీటిని మీ దగ్గర నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి?

జవాబు: నా శిష్యునిగా మారి, నా దారిలో నడవాలి. నన్ను అనుసరించాలి. అంటే, నేను నడచిన సాధనామార్గంలో నడవడానికి సిద్ధపడాలి. దానినే 'పంచవటి మార్గం' అని పిలుస్తున్నాం.

16. పుణ్యక్షేత్రాలు దర్శించడమంటే మీకెందుకు అయిష్టం?

జవాబు: అదేమీ లేదు. అక్కడికి సరిగ్గా వెళ్ళాలి. పిక్నిక్ లాగా పుణ్యక్షేత్రాలకు పోవడం నేనిష్టపడను. దాన్నొక సాధనగా చెయ్యాలి. వచ్చేనెలనుంచీ మేమంతా అనేక పుణ్యక్షేత్రాలు దర్శించబోతున్నాం. అయితే, అందరిలాగా లేకిగా వాటికి పోకుండా, మాదైన యోగవిధానంలో ఆ యాత్రలు చేస్తాం.

17. అరుణాచలంలో, కాశీలో ఎంతో ప్రశాంతత నాకు తెలియవచ్చింది. అది నిజమేనా?

జవాబు: అవును ఉంటుంది. అక్కడే కాదు. చాలా పుణ్యక్షేత్రాలలో ఆ ప్రశాంతత ఉంటుంది. దానిని ఫీలయ్యే స్థితిలో మనం ఉండాలి. 

18. ఇప్పుడు ఏ పుణ్యక్షేత్రంలో చూసినా విపరీతమైన జనం, గోల ఉంటున్నాయి కదా ! ఆ గోలలో ప్రశాంతతను  ఎలా ఫీలవ్వగలం? దానికోసం ఏం చెయ్యాలి?

జవాబు: ఆ జనానికి అతీతంగా నీ మనసును ఉంచుకోవాలి. వాళ్లలో ఉన్నా, వాళ్ళను చూడకుండా ఉండగలగాలి. లేదా పండుగరోజులలో అలాంటి క్షేత్రాలకు పోకుండా ఉండాలి. నీ ఇంట్లో నువ్వుంటూ సాధన చెయ్యడం ది బెస్ట్.

19. ఆస్ట్రాలజీలో మీ విధానానికి ఏం పేరును పెడతారు?

జవాబు: స్పిరిట్యువల్ ఆస్ట్రాలజీ అని దాన్ని పిలవవచ్చు.

20. దానిని అనుసరిస్తే ఏమౌతుంది?

జవాబు: నా మార్గంలో సాధన చేస్తే ఏమౌతుందో అదే అవుతుంది. కర్మ క్షాళనమై పోతుంది. జీవనసాఫల్యత లభిస్తుంది.

21. పనులు కావా?

జవాబు: పనులు అయినా, కాకపోయినా పట్టించుకోకుండా ఉండగలిగే స్థితిని నువ్వు  అందుకుంటావు. ఎవడి జీవితమైనా, అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా ఎవడికీ జరగవు. నువ్వు రెమెడీలు చేసినా అంతే, చేయకపోయినా అంతే, ఈ విషయం అర్ధమైతే నీకు జ్యోతిష్యం అవసరం లేదు. 

22. ఈ మాత్రం దానికి జ్యోతిష్యం నేర్చుకోవడమెందుకు?

జవాబు: అవును. ఒద్దనే నేనూ చెబుతున్నాను. నేర్చుకోమని నేనేమీ బలవంతం చేయడం లేదే?

23. ఒక జాతకాన్ని మనం చూస్తే దాని కర్మ మనకు అంటుకుంటుందా?

జవాబు: చూస్తే, కొద్దిగా అంటుకుంటుంది. రెమెడీలు చెప్పావంటే బాగా అంటుకుంటుంది. ఆ కర్మ నిన్ను తప్పకుండా పట్టి పీడిస్తుంది.

24. రెమెడీలు చెప్పకుండా జ్యోతిష్యం నేర్చుకోకూడదా?

జవాబు: సరదాగా నేర్చుకోవచ్చు. కానీ ఎందుకు? ఇన్నేళ్లు కష్టపడి ఇలాంటి సరదాలెందుకు? అక్కల్ట్ తో ఆటలు పనికిరావు. నీకు జ్యోతిష్యం వస్తే, ముందు నువ్వే ఊరుకోలేవు. ప్రతివాడి జాతకమూ చూస్తావు. వాళ్ళు రెమెడీలు అడుగుతారు. నువ్వు చెబుతావు. వాళ్ళ బురదను నువ్వు పూసుకుంటావు. కడుక్కోలేక అవస్థపడతావు. ఇంతే జరిగేది. 

25. మీరు జీవితంలో ఎంతో దూరం వచ్చారు కదా? ఇన్నాళ్ల మీ నడక మీకేమనిపిస్తోంది?

జవాబు: ఏమీ అనిపించడం లేదు. మామూలుగా ఉంది.

26. మీ దగ్గర జ్యోతిష్యం నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి?

జవాబు: ఇంత చెప్పినా, ఇంకా దానిని నేర్చుకోవాలని ఉందా? అయితే, త్వరలో మా ఆశ్రమంలో జరగబోయే రిట్రీట్స్ కు వచ్చి నేర్చుకో.

27. జ్యోతిష్కులకు మీరిచ్చే సలహా?

జవాబు: ముందు మీది మీరు కడుక్కోండి. తర్వాత లోకులది కడగవచ్చు.

ఈ విధంగా తన సందేహాలను తీర్చుకుని, సెలవు తీసుకుని ఆమె వెళ్ళిపోయింది.

16, ఫిబ్రవరి 2023, గురువారం

మనువు అల్లాని పూజించాడా? మతుందా మదానీ?

మొన్న ఆదివారం నాడు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన జమాతే ఇస్లామీ హింద్ సభలో ఆ సంస్థ లీడర్ మౌలానా అర్షద్ మదానీ మాట్లాడుతూ కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలను చేశాడు. అవి,

1. మనువు, ఆడం ఒకరే

దీనికి మా జవాబు: మనువు, ధర్మశాస్త్రాన్ని లోకానికి ఇచ్చిన మహారాజు. ఆడం, బట్టలు కట్టుకోవడం కూడా తెలియకుండా, అడవిలో తిరిగిన అడవిమనిషి. ఇద్దరూ ఒకరే ఎలా అవుతారు?

2. మనువు పూజించింది ఓం ని.

దీనికి మా జవాబు: మనువు గాయత్రిని జపించాడు. సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చేవాడు. వైదికహోమములు చేసేవాడు. భగవంతుడి నామమే ఓంకారం కాబట్టి, మనువు ఓంకారాన్ని ఉపాసించాడు అనడం ఒక కోణంలో కరెక్టే. ఒప్పుకుంటాము. 

3. ఓం, అల్లా ఒకరే

దీనికి మా జవాబు: ఓంకారోపాసన నేటికీ 12,000 ఏళ్ళనుంచీ భారతదేశంలో ఉంది. అల్లా, 600 CE ప్రాంతంలో మహమ్మద్ చేత సృష్టించబడ్డాడు. రెండూ ఒకటే ఎలా అవుతాయి?

ఒకవేళ రెండూ ఒకటే అయితే, అల్లా అని కొత్త పేరు ఎందుకు? ఎప్పటినుంచో ఉన్న ఓంకారాన్ని మీరు కూడా పూజించాలి కదా?

4. మనువు అల్లాని పూజించాడు.

దీనికి మా జవాబు: అల్లా కంటే 11,000 ఏళ్ల క్రితం వాడైన మనువు అల్లాని ఎలా పూజిస్తాడు? అల్లా అనే పేరే మనువుకు తెలియదు. ఆ పదాన్ని ఆయన ఎక్కడా వాడలేదు.

5. హజరత్ ఆదాం ఇండియాలో ఉద్భవించాడు కాబట్టి, ఇస్లాం ఇండియాలోనే పుట్టింది.

దీనికి మా జవాబు: బట్టలు కట్టుకోవడం కూడా రాని ఆడం, హజరత్ ఎలా అయ్యాడు? ఆడం ఇండియాలో పుడితే, ప్రాచీన హిందూమత గ్రంధాలలో ఆ పేరు ఎందుకు లేదు?

6. ఇండియానే ముస్లిముల మాతృభూమి.

దీనికి మా జవాబు: ఇస్లాం అనేది అరేబియాలో పుట్టింది. ఇస్లాంకు ఇండియా ఎలా మాతృభూమి అవుతుంది?

ఇండియా, ఇస్లాం పుట్టిన దేశమే అయితే, పాకిస్తాన్ ఎందుకు సృష్టించబడింది? పాకిస్తాన్ కావాలని ఓటేసి దేశాన్ని చీల్చిన మీరు పాకిస్తాన్ కు ఎందుకు వెళ్లిపోలేదు? ఇంకా ఇక్కడే ఎందుకున్నారు?

7. ఇస్లాం అన్ని మతాల కంటే గొప్పది

దీనికి మా జవాబు: అన్నిమతాలనూ ఆదరించే హిందూమతం గొప్పదౌతుంది గాని, ఇతర మతాలన్నింటినీ ద్వేషించే ఇస్లాం ఎలా గొప్పదౌతుంది?

___________________

మదానీ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలే. ఇలాంటి అబద్దాలను ఎడాపెడా చెబుతూ తెలివిలేనివాళ్ళను ఇవే నిజాలంటూ నమ్మిస్తున్నారు మదానీ లాంటి వాళ్ళు.

ఈ అబద్దాలను ఖండిస్తూ, జైనాచార్యుడైన డా||లోకేష్ ముని ఆ సమావేశాన్ని బహిష్కరించి వేదిక దిగి వెళ్ళిపోయాడు. ఆయనతో బాటు కొంతమంది హిందూమత ఆచార్యులు కూడా వెళ్లిపోయారు.

మౌలానా అర్షద్ మదానీ చెప్పిన ఈ అబద్దాలను లాజికల్ గా ఖండిస్తూ, 'పంచవటి' నుండి మేము విడుదల చేసిన వీడియోను ఇక్కడ చూడండి.

15, ఫిబ్రవరి 2023, బుధవారం

బైబుల్ వాక్యం ఇప్పటికి అర్ధమైంది

బుద్ధుడికి వైశాఖపూర్ణిమ నాడు జ్ఞానోదయం అయింది. నాకేమో వాలెంటైన్ డే నాడు జ్ఞానోదయం అయింది. అంటే, నిన్నన్నమాట ! దానిక్కారణం ఎప్పటినుంచో అర్ధం కానీ బైబుల్ వాక్యం ఒకటి సడన్ గా నిన్న అర్ధం కావడమే.

కొన్ని కొన్ని రోజులు నిజంగానే స్పెషల్ గా ఉంటాయి. అలాంటిదే నిన్న వాలెంటైన్ డే రోజు కూడా. నిన్ననే ఒక న్యూసు చూశాను. కళ్ళు గిర్రున తిరిగాయి. వెంటనే జ్ఞానోదయం అయిపోయింది.

గత 70 ఏళ్లలో, కనీసం 4,815 మంది పిల్లల్ని కేథలిక్ ప్రీస్ట్ లు సెక్స్ పరమైన అత్యాచారాలు చేశారట. ఇది ఒక్క పోర్చుగల్ లో మాత్రమేనట !  అదికూడా, ఈ అంకె తక్కువలో తక్కువగా లెక్కవేయబడినదట. అసలైన కేసులు దీనికి ఎన్నో రెట్లు  ఉండొచ్చట.

నోరెళ్లబెట్టకండి. ఈగలు దూరగలవు. ఇంకా ఉంది.

ఈ మధ్యనే ఫ్రాన్స్ లో ఇంకో నివేదిక వెలుగు చూసింది. దానిప్రకారం దాదాపుగా 3000 మంది ప్రీస్టులు, చర్చి అధికారులు, ఇప్పటిదాకా మూడు లక్షలమంది చిన్నపిల్లలను సెక్సువల్ గా అత్యాచారాలు చేశారట.
 
మళ్ళీ నోరెళ్లబెట్టకండి. మీరు విన్నది కరెక్టే. అక్షరాలా మూడు లక్షలమంది చిన్నపిల్లలు, ప్రీస్టుల చేతిలో రేప్ కు గురయ్యారు. అంటే, యావరేజిన ఒక్కొక్క ఫాదర్ గాడు, ఒక సెంచరీ కొట్టాడన్న మాట !

పోతే, ఇలా అత్యాచారాలకు గురైనవాళ్లు ఎక్కువగా అబ్బాయిలట. వీళ్లంతా ఎక్కడ ఇలా ఎబ్యూస్ కు గురయ్యారో తెలుసా? కేథలిక్ స్కూళ్లలో, చర్చిలలో, కన్ఫెషన్ బాక్సులలో, లేకపోతే ప్రీస్టుల ఇళ్లలో అట. ఈ పిల్లలంతా పది పద్నాలుగు ఏళ్ల మధ్యలో ఇలా అత్యాచారాలకు గురి కాబడ్డారట. రెండేళ్ల పిల్లవాడిని కూడా ఒక కేసులో ఎబ్యూస్ చేశారట ఫాదర్ గారు.

భలేగా ఉంది కదూ !

ఈ వార్తను చూచినపుడే నాకు బైబుల్ వాక్యం ఒకటి కరెక్టుగా అర్ధమైపోయింది.

నేను చిన్నప్పటినుండీ, అంటే నాకు పదేళ్లవయసు నుండీ, న్యూ టెస్టమెంట్ బాగా చదివాను. అందులో ఒకచోట ఇలా ఉంటుంది.

యేసు అనెను 'మీరు కూడా మారిపోయి ఈ చిన్నపిల్లలవలె కానిచో, మీరు దేవుని రాజ్యములో ఎన్నటికీ ప్రవేశించలేరు' (మేథ్యూ 18 : 3).

యేసు, ఏ సందర్భములో ఈ మాటను అనెను? వినుకొనుడి.

కొంతమంది పెద్దవాళ్ళు, యేసు దగ్గరికి పిల్లల్ని రానివ్వకుండా కసురుకుంటుంటే, ఆయన వారిని వారిస్తూ అలా అన్నాడట. అది చదివినప్పుడల్లా, 'అబ్బా ఎంత గొప్పమాటన్నాడు యేసు?' అనుకునేవాడిని గత ఏభై ఏళ్ళనుంచీ.

నేనెంత అజ్ఞానంలో ఉన్నానో నిన్న అర్ధమైంది.

ఈ వాక్యం యొక్క ఆత్మీయ అర్ధం ఏమిటో ఈ వార్తను చదివినప్పుడు మాత్రమే నా మట్టిబుర్రకు తట్టింది.

అంటే, 'మీరుకూడా ఈ చిన్నపిల్లల లాగా మారిపోయి, ప్రీస్టుల చేత రేప్ లకు గురియైనపుడు మాత్రమే దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలుగుతారు. లేకపోతే, మీ జన్మలో ఎన్నటికీ అలా ప్రవేశించలేరురా చవటల్లారా' అనేదే ఈ వాక్యం యొక్క ఆత్మీయ అర్ధమని ఇన్నాళ్లకు నాకర్ధమైంది.

ఎవరికైనా చిన్నపిల్లలని చూస్తే ముద్దొస్తుంది. కల్లాకపటం తెలియని పిల్లలలో దేవుడు కనిపిస్తాడు. కానీ, చాలామంది క్రైస్తవప్రీస్టులకు మాత్రం, చిన్నపిల్లలని చూస్తే కామం ప్రకోపిస్తుందన్నమాట. అదికూడా, అబ్బాయిల్ని చూస్తే ! ఎంత గొప్ప దైవభక్తులో కదా !

ఎంతచక్కగా యేసు వాక్యాన్ని ఈ ప్రీస్టులంతా ఆచరిస్తున్నారో !

వీళ్లా హిందూమతాన్ని విమర్శించేవాళ్ళు?

వీళ్లా ధర్మభూమియైన భారతదేశంలో మతప్రచారం చేసి అల్లకల్లోలం రేపేవాళ్లు?

వీళ్లా మనకు నీతులు చెప్పేవాళ్ళు?

ఏదేమైనా, బైబుల్లోని ఈ ఒక్క వాక్యం అర్ధం కావడానికే నాకు అరవైఏళ్ళు పట్టింది. ఇక మొత్తం బైబులంతా అర్ధం కావాలంటే నేనెన్ని జన్మలెత్తాలో?

సారీ ! క్రైస్తవం ప్రకారం జన్మలు లేవు కదూ. ఉన్నదొకటే జన్మ. ఈ స్పీడులో ఇక బైబులు మొత్తం ఎక్కడర్ధమౌతుంది? అయ్యేపని కాదు.

ఇదే, వాలెంటైన్ డే రోజున నాకైన జ్ఞానోదయం !

దేవునికి స్తోత్రం ! అల్లెలూయ !

13, ఫిబ్రవరి 2023, సోమవారం

రక్షణ లేని రక్షకుడు

జీసస్ లోకరక్షకుడని అబద్దాలు చెబుతూ రెండువేల ఏళ్ళనుంచీ ప్రపంచాన్ని మోసం చేస్తూ వస్తున్నది చర్చ్. ఇది నిజమని అమాయకులైన కోట్లాది ప్రజలు నమ్ముతున్నారు. గోబెల్స్ ప్రచారం లో ఉన్న ఎఫెక్ట్ ఇదే.

అదేపనిగా కొన్నివందల ఏళ్లపాటు ఒక అబద్దాన్ని ఊదరగొడుతూ చెబుతూ వస్తే, చివరకు అదొక నిజంగా లోకంలో చెలామణీ అవుతుంది. ఈ సూత్రాన్ని రాజకీయాలు బాగా పాటిస్తూ ఉంటాయి. ప్రజల్ని అబద్దాలతో మభ్యపెడుతూ ఉంటాయి. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ ఇదే విధమైన ప్రచారంతో మన దేశాన్ని మభ్యపెట్టింది.

ఇండియాలో చరిత్ర ఇదేవిధంగా వక్రీకరించబడింది. నెహ్రు కేబినెట్ లో విద్యాశాఖ మంత్రి అయిన అబుల్ కలాం ఆజాద్ ఒక పక్కా ప్లాన్ తో మనదేశ చరిత్రను పూర్తిగా వక్రీకరించాడు. దానికి నెహ్రు వంతపాడాడు. ఆ విధంగా  మన చరిత్రను వక్రీకరించడం కోసమే ఆజాద్ ను కావాలని విద్యాశాఖ మంత్రిగా చేశాడు నెహ్రూ.

దీనిఫలితంగా ఏం జరిగింది? మనపైన దండెత్తి వచ్చి, నానాఘోరాలు చేసి, మన దేవాలయాలను, మన యూనివర్సిటీలను, మన శిల్పసంపదను, మన గ్రంధాలను నాశనం చేసిన అరబ్బులు, తుర్కులు, ముఘల్స్ మొదలైన రాక్షసులు చాలా గొప్పవాళ్ళని, బట్టలు కట్టుకోవడం కూడా రాకుండా ఆటవికులలాగా బ్రతుకుతున్న భారతీయులకు బట్టలు కట్టుకోవడం నేర్పించినది వాళ్లే అన్నట్టుగా పుస్తకాలలో వాళ్ళని గ్లోరిఫై చేసి, మన కాలేజీలలో, యూనివర్సిటీలలో గత 70 ఏళ్లుగా అబద్దాల చరిత్రను మనకు రుద్దుతూ వచ్చారు. అది నిజమని లక్షలాదిమంది అమాయకులైన విద్యార్థులు నేటికీ నమ్ముతున్నారు. ఇది నెహ్రు చేసిన, చేయించిన పాపాలలో ఒకటి.

గోబెల్స్ ప్రచారం ఎఫెక్ట్ ఇలా ఉంటుంది.

అదేవిధంగా, తనను తాను రక్షించుకోలేక, రోమన్ సైనికుల చేతులలో హతమై పోయిన జీసస్, లోకం మొత్తాన్ని రక్షిస్తాడని అబద్దాలు అల్లి ప్రచారం చేస్తూ, రెండువేల ఏళ్లుగా ప్రపంచాన్ని మోసం చేస్తూ వస్తున్నది చర్చ్. అది పక్కా అబద్దమని, ఏమాత్రం తెలివి ఉన్న మనిషికైనా ఎన్నో రుజువులు కనిపిస్తాయి.

జీసస్ తర్వాతనే ప్రపంచానికి రక్షణ వచ్చే పనైతే, అంతకు ముందున్న కోట్లాది ప్రజలకు రక్షణ లేదా? అప్పుడు దేవుడు నిద్రపోతున్నాడా? అనే ప్రశ్నకు జవాబు లేదు.

మరో ప్రశ్న !

ఇస్లాం ద్వారానే రక్షణ అని ఖురాన్ చెబుతుంది. ఇస్లామనేది జీసస్ తర్వాత 700 ఏళ్లకు వచ్చింది. మరి ఇస్లాం చెప్పేది నిజమైతే, క్రైస్తవం చెప్పేది అబద్దం కావాలి. క్రైస్తవం నిజమైతే ఇస్లాం అబద్దం కావాలి. ఈ రెండు మతాలకంటే ప్రాచీనమైన యూదుమతం చెప్పేది నిజమైతే, క్రైస్తవమూ, ఇస్లామూ రెండూ అబద్దాలు కావాలి. ఇదొక చిక్కుముడి. ఈ మూడు మతాలలో ఏది నిజం చెబుతున్నది? ఏది అబద్దం చెబుతున్నది?

ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఈ సమస్యకు పరిష్కారం లేదు.

భారతీయులమైన మనమేమంటామంటే, ఈ మూడు మతాలూ చెబుతున్నది అబద్దమే అంటాం. కారణం? వీటిలోని ప్రతి ఒక్కటీ, మిగతా రెండు మతాలు అసత్యాలంటాయి. తమను నమ్మితేనే రక్షణ అని యూదుమతమూ, క్రైస్తవమూ, ఇస్లామూ బల్లగుద్ది మరీ చెబుతాయి. మరి, ఈ మూడింటిలో ఏది సత్యం? ఏది అబద్దం?

మూడూ అబద్ధాలే అని నేనంటాను. అసలు 'రక్షణ' అనే భావమే చాలా హాస్యాస్పదమైన భావన. ఉన్నది బంధము, మోక్షమే గాని, రక్షణ అనేది అసలు విషయం కానే కాదు.  రక్షణ అనేది చాలా ప్రిమిటివ్ థింకింగ్. అది జ్ఞానవంతమైన భావన కాదు.

ఖురానును నమ్మి, అల్లాను నిరంతరం ప్రార్ధించే పాకిస్తాన్, అడుక్కుతినే స్థితికి వచ్చేసింది. ప్రపంచదేశాలన్నీ, ఒక గజ్జికుక్కను అసహ్యించుకున్నట్లు పాకిస్తాన్ను అసహ్యించుకుంటున్నాయి.

అల్లాను ఎపుడూ ప్రార్థిస్తూ, ఇండియాను అమితంగా ద్వేషించే సిరియా, తుర్కీయేలు నిన్నా మొన్నటి భూకంపంతో దిక్కుతెలీని స్థితిలో ఉన్నాయి. ఈ భూకంపాలలో 33,000 మంది (వీళ్ళలో ఎక్కువమంది ముస్లిములు) కేవలం పదే పది నిముషాలలో చనిపోయారు. మరి ఆ మహాభక్తులను అల్లా ఎందుకు రక్షించలేదు? ప్రతిరోజూ తాము ద్వేషించి, వ్యతిరేకించే కాఫిర్ భారతదేశం నుంచి సహాయాన్ని నేడు అడుక్కోవలసిన స్థితిలో ఎందుకున్నాయి ఈ దేశాలు? అల్లా ఎందుకు తన భక్తులను రక్షించడం లేదు?

సరే, ఇలాంటి చిక్కుప్రశ్నలను తెలివైన ఆలోచనాపరులకు వదలిపెట్టి, తెలివిలేని మనం మాత్రం ప్రస్తుతానికి, జీసస్ ని గుడ్డిగా నమ్ముదాం. జీసస్ లోకరక్షకుడే. కాసేపు ఒప్పుకుందాం. కానీ ఆ రక్షకుడికే రక్షణ లేకుండా పోయింది ఇప్పుడు.

ఈ మధ్యనే, దీనిని రుజువు చేసే ఓక సంఘటన జరిగింది

'రియో డి జనైరో' అని బ్రెజిల్లో ఒక సిటీ ఉంది. అక్కడ 'క్రీస్ట్ ద రిడీమర్' అని ఒక పెద్దవిగ్రహం ఉంటుంది. చేతులు చాచి ప్రపంచాన్ని తాను రక్షిస్తానని చెబుతున్నట్లుగా ఈ విగ్రహాన్ని ఒక కొండ మీద చెక్కారు. చెక్కించింది ఎవరు? విగ్రహారాధనను ఏమాత్రమూ ఒప్పుకోని క్రైస్తవ మతానుసారులు. అంటే, వేరేవాళ్ళ విగ్రహాలను వాళ్ళు ఒప్పుకోరు. జీసస్ విగ్రహాన్ని మాత్రం బాగా ఒప్పుకుంటారు.

అదేమరి, చెప్పేదొకటి చేసేదొకటి అంటే! అదేమంటే మేం కేథలిక్స్ అంటారు.

మొన్న 10 తేదీన ఈ విగ్రహం పైన ఒక పిడుగు పడింది. అంటే, రక్షకుడే మరొకసారి తనను తాను రక్షించుకోలేకపోయాడు. రెండువేల ఏళ్ళ క్రితమూ రక్షించుకోలేక పోయాడు. మళ్ళీ ఇప్పుడు కూడా రక్షించుకోలేక పోయాడు. చూడబోతే, రక్షకుడికే ఇంకా రక్షణ లభించనట్లుగా కనిపిస్తోంది !

పంచభూతాలను జీసస్ శాసించాడని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆయన గద్దిస్తే తుఫాన్ ఆగిపోయిందని న్యూ టెస్టమెంట్లో వ్రాశారు. మరి, పిడుగుకు తెలీదా, 'అది జీసస్ విగ్రహం, దానిమీద తను పడకూడదు' అని?

పిడుగుకు బుద్ధి లేదా అన్నది నా డౌటు?

పోనీ పిడుగుకు తెలివి లేదు. ఒప్పుకుందాం, మరి జీసస్ శక్తి ఏమైపోయింది? 'ఏయ్ నేనెవరనుకున్నావు? నామీదకి రాకు' అని పిడుగును జీసస్ ఎందుకు గద్దించలేదు? అంటే, ఆ విగ్రహంలో జీసస్ లేనట్టే కదా? మరి అలాంటప్పుడు వేలాదిమంది ప్రతిరోజూ ఆ విగ్రహాన్ని దర్శించి ఎందుకు మొక్కుతున్నారు? వాళ్ళు మొక్కుతున్నది ఉత్త రాతిబొమ్మకేనా? దానికి జీవం ఉందా లేదా? జీవం ఉంటే, పిడుగు దానినెలా తాకింది? జీవం లేకపోతే, అలాంటి విగ్రహాన్ని అసలెందుకు అంతమంది దర్శించడం?  

ఏంటో? అన్నీ జవాబులు లేని ప్రశ్నలే. ప్రశ్నించేవాడికి క్రైస్తవంలో, ఇస్లాంలో జవాబులు ఎక్కడా దొరకవు.

అల్లా అంటూ రోజుకు అయిదుసార్లు మైకులో పెద్దగా అరిచే ఇస్లామిక్ టెర్రరిస్ట్ దేశాలేమో ఘోరమైన దెబ్బలు తిని చతికిలబడి, అడుక్కునే దేశాలైపోయాయి. జీసస్ విగ్రహాన్నేమో పిడుగు కొట్టేసింది.

అయినా సరే, ఈ రెండు మతాలూ ఏమాత్రమూ మారవు. తెలివి తెచ్చుకోవు.

మనుషుల అజ్ఞానానికి ఇవే లేటెస్ట్ ఉదాహరణలు !

12, ఫిబ్రవరి 2023, ఆదివారం

కాణిపాకం వెళ్ళకండి

ఇదేదో వివాదాస్పద టైటిల్ అనుకునేరు. అదేం కాదు.

హైదరాబాద్ లో ఉంటున్నా కదా ! లోకల్ శిష్యులందరూ వచ్చి కలుస్తున్నారు. అదేవిధంగా గుణశేఖర్ అనే శిష్యుడు మొన్న వచ్చాడు. తను NGRI దగ్గర్లో ఉంటాడు.

మాటలమధ్యలో, ఈ నెలలో అరుణాచలం పాండిచ్చేరి ట్రిప్స్ ఉన్నాయని తనతో చెప్పాను.

తనది చిత్తూరు. కనుక, ఆ ప్రాంతాలన్నీ బాగా తెలిసినవాడే. ఇలా అన్నాడు.

'పౌర్ణమికి మాత్రం అరుణాచలం వెళ్ళకండి. చాలా ఇబ్బంది పడతారు. రెండు మూడు కి.మీ. బయటే వాహనాలన్నీ ఆపేస్తారు. జనం విపరీతంగా ఉంటారు'

నవ్వాను.

'గిరిప్రదక్షిణం నాకవసరం లేదు. జనంతో నాకు పనిలేదు. కనుక, ఆ టైంలో వెళ్లన్లే. వర్రీ అవ్వకు. అంతమంది పిచ్చిజనాన్ని, ఆ దుమ్ముని నేను కూడా భరించలేను'.

'యూ ట్యూబర్స్ కొంతమంది అరుణాచలాన్ని బాగా పాపులర్ చేశారు. గత పదేళ్లనుంచి జనతాకిడి బాగా ఎక్కువైంది. ముఖ్యంగా పౌర్ణమికి గిరిప్రదక్షిణం బాగా చేస్తున్నారు' అన్నాడు.

'మంచిదే. పిచ్చిజనానికి ఏదో ఒక నమ్మకం, ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఎవడి పిచ్చి వాడిది. చెయ్యనీ' అన్నాను.

'అక్కడిదాకా వెళుతున్నారు కదా. కాణిపాకం మాత్రం అస్సలు వెళ్ళకండి' అన్నాడు.

'ఏం? దానికేమైంది?' అన్నాను.

'గతంలో బాగుండేది. ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ అయిపోయింది. TTD వాళ్ళు ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారు. అన్ని రేట్లు పెంచేశారు. అంతా వ్యాపారమయం. ఇంతకు ముందులాగా లేదు' అన్నాడు.

'దేవుడిని గుళ్ళలో చూడవలసిన పని మనకు లేదు. నీలోనే దర్శించగలగాలి. వినాయకుడు నీలోనే దర్శనమిస్తాడు. ఆయనకోసం బయట గుళ్లకు పోవలసిన పని లేదు. వెళ్ళవలసి వస్తే తప్ప, నా అంతట నేను ఏ గుడికీ పోనని నీకు తెలుసు కదా. కాణిపాకమైనా ఇంకెక్కడికైనా అంతే. కమర్షియల్ గుళ్లకు అసలే పోను. వర్రీ అవ్వకు' అన్నాను.

'సరే' అంటూ తను సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

9, ఫిబ్రవరి 2023, గురువారం

నేటి నుండి విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభం







నేటి నుండి 19 తేదీ వరకూ విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గరలో గల పాలిటెక్నీక్ కాలేజీ గ్రౌండ్స్ లో, బుక్ ఫెస్టివల్ జరుగుతున్నది. దీనిలో 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' కు స్టాల్ నంబర్ 157 కేటాయించబడింది. అందులో మా పుస్తకాలన్నీ లభిస్తాయి. ఇంకా చెప్పాలంటే, మా పుస్తకాలు మాత్రమే లభిస్తాయి.

'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' (ఇండియా) సెక్రటరీ శ్రీరామమూర్తి, ఇంకా ఇతర సభ్యులు అక్కడ మీకు అందుబాటులో ఉంటారు. పంచవటి కార్యక్రమాలను గురించి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను గురించి, వారితో మాట్లాడి మీరు తెలుసుకోవచ్చు.

మా సాధనావిధానాన్ని గురించి, సనాతనధర్మాన్ని గురించి మీకున్న సందేహాలను వారితో మాట్లాడి తీర్చుకోవచ్చు. స్పష్టతను పొందవచ్చు.

మాతో కలసి నడవాలనుకునేవారు, శ్రీ రామమూర్తిగారిని మా స్టాల్ వద్ద సంప్రదించండి.

తుర్కియే, సిరియా భూకంపాలకు గాబ్రియేల్, అంబేడ్కర్లే కారణం

ఈ లోకంలో ఏదీకూడా కారణం లేకుండా జరగదు. మనుషుల జీవితాలైనా అంతే, దేశాలపరంగా చూచినపుడు కూడా అంతే. ఒకప్పుడు చేసినదానికి ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది. కాకపోతే కొన్ని కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. వీటికి మనుషులూ అతీతులు కారు. దేవదూతలూ అతీతులు కారు.

జీవితంలో జరిగే సంఘటనలకైనా, దేశాలలో జరిగే సంఘటనలకైనా, ప్రతిదానికీ కర్మకారణాలుంటాయి. వెనక్కు తిరిగి చూచుకుంటే అర్ధమౌతాయి. అయితే, వాటిని లింక్ చేసుకునే దృష్టి చాలామందిలో ఉండదు. అంతే.  

జ్యోతిష్యపరంగా చూస్తే, మొన్న 5 వ తేదీ పౌర్ణమి అయింది. 6 వ తేదీ ఈ భూకంపాలు జరిగాయి. భూకంపాలన్నీ అమావాస్య, పౌర్ణమి ఛాయలలోనే ఎక్కువగా జరుగుతాయని గర్గమహర్షి తన జ్యోతిష్యశాస్త్రంలో ఎప్పుడో చెప్పాడు. 'ఛత్. వాటికీ భూకంపాలకు సంబంధం ఏంటి? నాన్సెన్స్' అని మనమంటాం. అది వాళ్ళ తెలివి, ఇది మన తెలివి.

ఈయన ఎప్పటివాడో ఎవరికీ తెలియదు. నేటికి కనీసం 6000 సంవత్సరాల క్రిందటివాడని ఒక ఊహ. మహర్షులు ఎప్పుడో చెప్పినవి ఇప్పటికీ నిజాలౌతూ ఉండటం మన కళ్ళెదురుగా కన్పిస్తున్న నిజం. కాకపోతే మన మహర్షులు మనకు గుర్తుండరు కదా! వాళ్ళనెప్పుడో మనం మరచిపోయాం. ప్రస్తుతం మనకు కనిపించేది బ్రహ్మకుమారీలూ, సాయిబాబాలే కదా ! సర్లే, ఈ గోల ఎపుడూ ఉండేదే. 

మన టాపిక్కు లో కొద్దాం.

ఇకపోతే, కొంతమంది  రీడర్స్ నన్నడుగుతున్నారు, 'ఇది చాలా భయంకరమైన భూకంపం కదా. ఎందుకు జరిగిందో జ్యోతిష్యపరంగా మీరు వ్రాయలేదేమిటి?' అని.

నిజమే. ఇది భయంకరమైన భూకంపమే. రెండుదేశాలలో కలిపి 33,000 మంది పైనే దీనివల్ల చనిపోయారు. ఎందుకు ఇది జరిగిందో కూడా వ్రాద్దామని అనుకున్నాను. కానీ జ్యోతిష్యం కంటే ఇంకా లోతైన కారణాలు దీనివెనుక ఉన్నాయి అందుకని వ్రాయలేదు. అవేంటో ఇప్పుడు వ్రాస్తాను.

చదూకోండి. తరించండి.

స్వీడన్ లో ఖురాన్ ను తగలబెట్టారు. ఒకసారి కాదు. చాలాసార్లు పబ్లిగ్గా తగలబెట్టారు. అదికూడా తుర్కీయే ఎంబసీ ముందు తగలబెట్టారు. ఎందుకంటే, స్వీడన్ లో ముస్లిములు అణచివేతకు గురౌతున్నారని, వారికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లేదని, ఎంతమందిని పడితే అంతమందిని కనలేకపోతున్నారని, జనాభాను  విపరీతంగా పెంచేసి స్వీడన్ను ఆక్రమించలేకపోతున్నారని, అలా చెయ్యకుండా స్వీడన్ చట్టాలు వారిని అడ్డుకుంటున్నాయని, ఇది వివక్ష అని, తుర్కీయే ప్రెసిండెంట్ ఎర్డోగాన్ ఎంతో బాధపడ్డాడు.

'అలా చెయ్యద్దు. ముస్లిముల జనాభాను పెరగనివ్వండి. మీ దేశాన్ని కూడా ఆక్రమించి, అల్లర్లురేపి, అతలాకుతలం చేసి, స్వీడన్ కు కూడా పాకిస్తాన్ గతి పట్టేలా వారిని చెయ్యనివ్వండి. అలా చేయనివ్వకుండా ముస్లిములను కట్టడి చెయ్యడం అన్యాయం. ఇది అణచివేత మాత్రమే కాదు, ఇస్లాంకు, ఖురాన్ కు విరుద్ధం కూడా ' అంటూ, స్వీడన్ ను గట్టిగా హెచ్చరించాడు కూడా. అందుకని,  దీనికి నిరసనగా స్టాక్ హోమ్ లోని తుర్కీయే ఎంబసీ ముందు  రాస్మస్ పలుదన్ అనే డేనిష్ నాయకుడు ఖురాన్ ను తగలబెట్టాడు.

ఈ రాస్మస్ పలుదన్ అనేవాడు, గతజన్మలో అంబేద్కర్ అని నా గట్టి నమ్మకం. ఎందుకంటే, పుస్తకాలను పూర్తిగా చదవకుండా తగలబెట్టడం అనే మంచి సాంప్రదాయాన్ని మొట్టమొదటగా మొదలుపెట్టింది అంబేద్కరే గనుక. మనుస్మృతిలో రెండు మూడు శ్లోకాలు తనకు నచ్చలేదని, ఆ పుస్తకాన్ని మొత్తం చదవకుండానే దాన్ని రోడ్డుమీద తగులబెట్టాడు అంబెడ్కర్. కానీ, స్త్రీలను అమితంగా గౌరవిస్తూ, వారిని దేవతలుగా భావిస్తూ చెప్పబడిన శ్లోకాలు కూడా మనుస్మృతిలో ఎన్నో ఉన్నాయి.  నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడే ఎన్నో శ్లోకాలను మనువు చెప్పినట్లు అందులో  మనం చూడవచ్చు. అంబెడ్కర్ వాటిని చదవలేదు. చదవలేదని తానే ఒక స్పీచిలో ఒప్పుకున్నాడు. ఎందుకంటే, ఆయన ఎన్నో యూరోపియన్ భాషలను నేర్చుకున్నాడు గాని, పాపం తనదేశపు మాతృభాష అయిన సంస్కృతాన్ని మాత్రం నేర్చుకోలేదు. అది ఆయనకు రాదు. అందుకని మనుస్మృతి మూలగ్రంధాన్ని ఆయన చదవలేదు. ఎవరో చేసిన అనువాదాన్ని చదివాడు. అలాంటి అభిప్రాయానికి వచ్చాడు.

సరే అదంతా గతం. ప్రస్తుతంలోకి వద్దాం.

ఆ అంబేద్కరే ఇప్పుడు స్వీడన్ లో రాస్మస్ పలుదన్ అనే లీడర్ గా పుట్టాడు. గతజన్మ అలవాట్లను మర్చిపోలేక, ఈ జన్మలో కూడా ఏదో ఒక పుస్తకాన్ని అర్జెంటుగా తగలబెడదామని గట్టిగా నిశ్చయించేసుకున్నాడు.  స్వీడన్ లో మనుస్మృతి దొరకదు కదా? కనీసం రామచరిత మానస్ కూడా దొరకదు. మరేం చెయ్యాలి? ఖురాన్ దొరికింది. సర్లే ఏదో ఒకటిలే అని, దాన్ని తగలబెట్టేశాడు. గతజన్మ అలవాట్లు అంత తేలికగా పోవుకాదా మరి !

తుర్కీయే గొల్లుమంది. మిడిల్ ఈస్ట్ భగ్గుమంది. నిరసనలు, ధర్నాలు, ఊరేగింపులు మొదలయ్యాయి.  ఈ గొడవంతా స్వర్గంలోని అల్లాకు వినిపించింది. పరమచిరాకును తెప్పించింది. వెంటనే గాబ్రియేల్ ను పిలిపించాడు.

'ఏరా గాబ్రియేల్ ! స్వీడన్ లో ఖురాన్ ను తగలబడుతుంటే చూస్తూ ఊరుకున్నావా? నీకసలు బుద్దుందా? వెంటనే భూలోకానికి వెళ్లి, స్వీడన్ లో భూకంపం సృష్టించి, దాన్ని సర్వనాశనం చేసేయ్' అని కోపంగా ఆజ్ఞాపించాడు.

సాక్షాత్తు అల్లాయే ఆ విధంగా ఆజ్ఞాపించాక పూర్ గాబ్రియేల్ ఏం చెయ్యగలడు? వెంటనే భూలోకానికి బయల్దేరాడు. చైనా మీదుగా యూరప్ లో దిగాడు. అదే అతను చేసిన ఘోరమైన తప్పు. అక్కడే అసలు సమస్య ఎదురైంది.

గాబ్రియేల్ ఇప్పటివాడు కాదు. దాదాపు 5000 ఏళ్ళనాటివాడు. ఓల్డ్ టెస్టమెంట్ లోనే అతని ప్రస్తావన ఉంటుంది. కాబట్టి చాలా వయసు పైబడిన వాడే. అందుకని మతిమరుపు వచ్చేసింది. అతడు చేసిన పొరపాటేంటంటే చైనా మీదుగా యూరప్ లో దిగడం.  చైనాను క్రాస్ చేస్తున్నప్పుడే, అతన్ని కరోనా వైరస్ ఎటాక్ చేసింది. దాంతో యూరప్లో దిగేసరికి పూర్తిగా కరోనా లక్షణాలతో దిగాడు. మైండ్ బ్లాంక్ అయింది. అల్లా తనకు ఏమని ఆజ్ఞాపించాడో మరచిపోయాడు.

ఎంతో ప్రాచీనకాలం నుంచీ గాబ్రియేల్ అనే దూత, సిరియా, తుర్కీయే ప్రాంతాలలోనే ఎక్కువగా తిరిగేవాడు. ప్రతివారికీ కన్పిస్తూ సలహాలిస్తూ ఉండేవాడు.  అతనికి బాగా తెలిసిన ప్రాంతాలు అవే. గూగుల్ మ్యాప్ సహాయం లేకుండా ప్రపంచంలో అతడు ఈజీగా తిరగ్గలిగే ప్రాంతాలు ఈ రెండే. అందుకని, 'ఏ దేశంలో భూకంపాన్ని సృష్టించమని అల్లా ఆజ్ఞాపించాడబ్బా?' అని ఎంత చించుకున్నా, స్వీడన్ పేరు అతనికి గుర్తురాలేదు.  ఎంతసేపూ తనకు అలవాటైన సిరియా, తుర్కీయే ఈ రెండే గుర్తొస్తున్నాయి. అది కరోనా ప్రభావం ! దానివల్ల అతని బ్రెయిన్ డామేజి అయింది. పూర్ ఓల్డ్ గాబ్రియేల్ ! ఏం చెయ్యగలడు పాపం.

సరే, ఏమీ చెయ్యకుండా వెనక్కు వెళితే అల్లా ఖచ్చితంగా తన తాట తీస్తాడు. నరకాగ్నిలో పడేసి వితౌట్ ఆయిల్ వేపుతాడు. కాబట్టి ఏదో ఒకటి చేసే పోవాలి.  అందుకని తన చేతులో ఉన్న మంత్రదండంతో సిరియా, తుర్కీయేలను ఒక చాపు  చరిచాడు. అంతే ! ఆ రెండు దేశాలలోని వేలాది భవనాలు పేకమేడల్లాగా కూలిపోయాయి. ఇప్పటికి దాదాపు  33,000 మంది చచ్చారని వార్తలు చెబుతున్నాయి.  ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. ఏడాది నుంచీ జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇంతమంది చనిపోయి ఉండరు. గాబ్రియేల్ దెబ్బంటే అలా ఉంటుంది మరి ! ఏమనుకుంటున్నారు!

దీనివెనుక జ్యోతిష్యం లేదు పాడూ లేదు. గాబ్రియేల్ మతిమరుపే దీనికంతా కారణం. అల్లా ఒకటి చెబితే, తాను మరొకటి చేశాడు. అందుకే అల్లా జరిగింది. అందుకే ఈ సంఘటన పైన నేను జ్యోతిష్య విశ్లేషణ చెయ్యలేదు.

దేవరహస్యాలు ఇలా ఉంటే, మనమేమో శని, కుజుడు, రాహువు, కూర్మచక్రం, సర్వతోభద్రచక్రం అంటూ జ్యోతిష్యంలో వెదికితే ఎలా దొరుకుతాయి  కారణాలు? 

గాబ్రియేల్ చైనా మీదుగా వెళ్లకుండా, ఇండియా మీదుగా వెళ్లుంటే అసలీ ప్రాబ్లమ్ వచ్చేదే కాదు. పనిలో పనిగా, ఇండియాలో వాక్సిన్లు వేసుకుని ఆ తరువాత స్వీడన్ లో దిగుంటే ఇలా జరిగేదీ కాదు. అల్లా చెప్పింది చెప్పినట్టు అల్లాగే జరిగి ఉండేది. దీనికంతా కారణం గాబ్రియేల్ ముసలితనం, మతిమరుపు, కరోనా ఎఫెక్టులు మాత్రమే.

కనీసం, రాస్మస్ పలుదన్ గా పుట్టిన అంబేద్కర్, ఖురాన్ను తగలబెట్టకపోయినా, ఈ భూకంపాలు తప్పి ఉండేవి. 'మనకు నచ్చనంత మాత్రాన పుస్తకాలను పూర్తిగా చదవకుండా అలా తగలబెట్టకూడదురా, తప్పురా' అంటే,  అతనూ వినడు. 'నీకు వయసై పోయింది. 5000 ఏళ్ల నుంచీ అలుపు లేకుండా పనిచేస్తూనే ఉన్నావు. ఇంకెంతకాలం ఏడుస్తావు? ఇక రిటైర్ అవ్వు. ఎవడో ఒక కుర్రాడు నీ ఉద్యోగంలో చేరి చక్కగా పనిచేసుకుంటాడు' అని  చెబితే గాబ్రియేలూ వినడు.

మనమాట ఎవడూ వినడు. ఇంకా చెప్పాలంటే, మన శిష్యులే మనమాట పూర్తిగా వినిపించుకోరు ఇక వేరే వాళ్ళు ఎందుకు వింటారు? 

సరే, ఇవన్నీ కలసి ఈ విధంగా స్వీడన్ని రక్షించేశాయి. పాపం, అమాయకులైన సిరియా, తుర్కీయేల కొంపలు ముంచాయి. ఏం చేస్తాం? మనం కేవలం మానవమాత్రులం, ఎక్కువ మాట్లాడకూడదు మరి !

అందుకని, తుర్కియే, సిరియా భూకంపాలకు గాబ్రియేల్, అంబేడ్కర్లే కారణం. ఈ విషయాన్నీ డోబ్రియెల్ అనే ఇంకొక దేవదూత స్వయానా నిన్నరాత్రి నా కలలోకి వచ్చి మరీ చెప్పాడు. ఏమంటే, గాబ్రియేల్ కూ డోబ్రియెల్ కూ అస్సలు పడదట. ప్రొఫెషనల్ రైవల్రీ ఉందట. అందుకని, 'ఎవరికీ చెప్పకు. ఇది దేవరహస్యం' అని గట్టిగా వార్ణింగ్ ఇచ్చి మరీ, ఈ సీక్రెట్ ని నాకు లీక్ చేశాడు, నిన్న రాత్రి కలలో.

జెట్ లాగ్ వల్ల మనకు నిద్రపట్టదు కదా ! అటూ ఇటూ దొర్లుతున్నాం. మొదట్లో ఏదో పీడకలలే అనుకున్నా, కాదని కొద్దిసేపట్లోనే అర్ధమైంది. ఇంకేముంది, దేవరహస్యం అర్ధమైపోయింది. వెంటనే లేచిపోయి ఇదంతా రాసేస్తున్నానన్నమాట !

దేవరహస్యాలను మీకందరికీ లీక్ చెయ్యకపోతే నాకు పొట్టుబ్బరం కదా మరి !

3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

చేసిన పాపం ఎక్కడికి పోతుంది?

పాకిస్తాన్ నాశనమౌతున్నది.

ఒక సంచెడు గోధుమలకోసం రోడ్లపైన కొట్టుకుంటున్నారు.

ఉత్పత్తులు లేవు. విదేశీనిధులు రావడం లేదు. అప్పిచ్చే దేశమంటూ లేదు.

మిత్రదేశాలన్నీ ముఖం చాటేస్తున్నాయి.

ఉన్న డబ్బు అడుగంటుతున్నది.

పెట్రోల్ లేదు. విద్యుత్తు లేదు.  తిండి లేదు. పని లేదు. అడుక్కోవడం ఒక్కటే మార్గం. లేదా ఒకరినొకరు దోచుకోవడం, చంపుకోవడమే గతి.

అంటే సివిల్ వార్ దిశగా పాకిస్తాన్ వేగంగా ప్రయాణిస్తున్నది.

తాము సృష్టించిన తాలిబాన్ తమనే కాటేస్తున్నది. పాము తన పిల్లలని తానే తిన్నట్లుగా, వాళ్ళ మసీదులలో వాళ్ళే బాంబులు పెట్టుకుని చస్తున్నారు. నిన్నటికి నిన్న జరిగిన పెషావర్ ఘటనలో 101 మంది చచ్చారు. 

టెర్రరిస్టులను పెంచి పోషించి తప్పు చేశామని అంతర్జాతీయ వేదికలమీద పాకిస్తాన్ మంత్రులే బాహాటంగా ఒప్పుకుంటున్నారు.

ఒక ఇండస్ట్రీ లేదు. ఒక యూనివర్సిటీ లేదు. ఒక టెక్నాలజీ లేదు. ఒక ఆదర్శం లేదు. ప్రగతి లేదు. ఆర్ధికభద్రత లేదు. బ్లాక్ మెయిల్ చెయ్యడం, టెర్రరిజం చెయ్యడం, అడుక్కోవడం తప్ప చెప్పుకోడానికి ఒక విజయమంటూ ఈ డెబ్భై ఐదేళ్లలో ఒక్కటి కూడా లేదు. 

ఎందుకిలా జరుగుతోంది? అన్న డౌటొస్తోందా?

వెరీ సింపుల్.

తల్లిలాగా తరతరాలు పోషించిన భారతదేశాన్ని కుట్రలతో చీల్చి మూడు ముక్కలు చేసిన పాపం !

దేశవిభజన సమయంలో లక్షలాది హిందువులను అన్యాయంగా చంపిన పాపం !

లక్షలాది హిందూ స్త్రీలను రేపులు చేసి చంపిన పాపం !

గత డెబ్బై ఏళ్లుగా కాశ్మీర్లో, లక్షలాది పండితులను దయలేకుండా చంపి, వారి ఆడవాళ్లను రేపులు చేసి, వారి పిల్లలను చంపి, భయభ్రాంతులకు గురిచేసి, ఊర్లకు ఊర్లు ఖాళీ చేయించి, వారి ఇళ్లను ఆక్రమించి జల్సా చేస్తున్న పాపం !

ఇండియా ముస్లిములలో దేశద్రోహ మనస్తత్వాన్ని పెంచి, టెర్రరిస్టులుగా మార్చి, ఇండియాలో చిచ్చుపెడుతూ, కుట్రలు కుతంత్రాలు  ఆపకుండా చేస్తున్న పాపం !

ఇండియా కరెన్సీని మీ దేశంలో ముద్రిస్తూ, ఆ డబ్బుతో అన్నీ కొనుక్కుంటూ, ఎంజాయ్ చేస్తూ, లోకాన్ని మోసం చేస్తున్న పాపం !

చైనా, మిడిల్ ఈస్ట్ ల పంచన చేరి, ఇండియాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపైన కుట్రలు చేస్తున్న పాపం !

మీ దేశంలోని హిందువులను క్రూరంగా చంపుతూ, వారి ఆడవాళ్లను కిడ్నాపులు, రేపులు చేస్తూ, పాకిస్థాన్లోని హిందూజనాభాను ఒక పధకం ప్రకారం నిర్మూలించిన పాపం !

పాకిస్తాన్లోని హిందూ దేవాలయాలను వేలాదిగా కూలగొట్టిన పాపం !

ఇండియా పార్లమెంట్ ను ఎటాక్ చేసిన పాపం !

ఇండియాలో టెర్రరిస్టు దాడులతో వేలాది అమాయకులను చంపిన పాపం ! 

బాలీవుడ్ ను ఏలుతూ, ఆ డబ్బుతో ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పాపం !

బీజేపీకి, ఆరెస్సెస్ కి, మోదీగారికి ఆయన టీమ్ కి వ్యతిరేకంగా విషం కక్కుతూ, ఇండియాలోని తమ తొత్తు ముస్లిములను, నిషేధిత సంస్థలను, కొన్ని యూనివర్సిటీలను పావులుగా వాడుకుంటూ, కేరళ, హైద్రాబాద్, లక్నో లాంటి ప్రాంతాలలో నిరంతరం అలజడులు సృష్టిస్తున్న పాపం !

ఇలా చెప్పుకుంటూ పోతే, పాకిస్తాన్ చేసినవి, చేస్తున్నవి ఎన్నో ఎన్నెనో పాపాలున్నాయి.

మరి వాటికి ఫలితాన్ని అనుభవించకుండా ఎలా తప్పుతుంది?

గడ్డం పెంచి, అల్లా అని అరుస్తూ, రోజుకు అయిదుసార్లు నమాజ్ చేసినంత మాత్రాన, చేసిన పాపాలు ఊరకే పోతాయా? వీళ్ళ దొంగనాటకాలకు పడటానికి దేవుడేమన్నా పిచ్చివాడా? వీళ్ళకొక్కడికేనా దేవుడు? మిగతావాళ్లకు కాడా? లేడా?

కాశ్మీర్లో చేసిన పాపాలు, పారించిన నెత్తురు, పోసుకున్న లక్షలాది హిందూస్త్రీల ఉసురు ఊరకే పోతుందా? కశ్యపముని శాపం ఊరకే పోతుందా? 

ఏడీ అల్లా? మిమ్మల్ని ఆదుకోడెందుకు? మేఘాల చాటునుంచి రెక్కలగుర్రం మీద ఎవరూ దిగిరావడం లేదెందుకు?

మీ మిత్రదేశాలే మీకు ముఖాలు చాటేస్తున్నాయెందుకు?

ఏ దేశమూ మిమ్మల్ని నమ్మడం లేదు. ఎందుకు?

ప్రపంచం మొత్తం మిమ్మల్ని మోసగాళ్లుగా, దొంగలుగా, ద్రోహులుగా, మానవత్వం లేని కిరాతకులుగా భావించి, మూకుమ్మడిగా వెలివేస్తోంది? ఎందుకు?

చేసిన పాపం ఎక్కడికి పోతుంది?

కర్మసిద్ధాంతం నిజమా కదా? ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు, చెరపకురా చెడేవు. పోరు నష్టం పొందు లాభం. ఈ సామెతలన్నీ నిజాలా కాదా?

కానీ, ఎన్ని చెప్పినా మీకు బుద్ధిరాదు.  మీ మెదళ్లు అరేబియా ఎడారి నుంచి బయటకు రాలేవు. మీ దేశం బాగుపడదు. మీరు సర్వనాశనం అవడం ఖాయం. ఏ అల్లా కూడా మిమ్మల్ని కాపాడలేడు.

ఇది కోట్లాది హిందువుల శాపం.

భారతదేశం ప్రయోగించిన 'మోడీ' అనే బ్రహ్మాస్త్రప్రభావం ఇలా ఉంటుంది !

దీనికి తిరుగు లేదు.

కనీసం గాంధీ నెహ్రూలు బ్రతికున్నా బాగుండేది. మన టాక్స్ మనీ అంతా దోచిపెట్టి పాకీని ఆదుకుని ఉండేవారు. వాళ్ళూ లేరు. ఎలా ఇప్పుడు?

కనీసం ఖాన్ గ్రేస్ అధికారంలో ఉంటే, ఇండియాను తాకట్టైనా పెట్టి పాకీని  ఎలాగైనా కాపాడి ఉండేది. అదీ లేదు. ఎలా ఇప్పుడు?

అయినా సరే, మానవతా దృక్పధంతో మీకు కొన్ని ఉపాయాలు చెబుతాను. బుద్దుంటే వినండి.

మీ దగ్గరున్న ఆటంబాంబులు అమ్ముకోండి. కనీసం చాయ్ ఖర్చులన్నా వస్తాయి.

మిడిల్ ఈస్ట్ దేశాలకు అమ్మాయిల్ని సప్లై చేసి బ్రతుకులు సాగించండి.

ప్రపంచ దేశాలన్నింటి వాకిళ్ళలో నిలబడి సిగ్గులేకుండా అడుక్కోండి.

ఇండియాలోని మీ తొత్తుపార్టీలను, తొత్తుసంస్థలను, నాయకులను, ముల్లాలను, మీకు సపోర్ట్ చేసే ఇండియన్ ముస్లింలను,  మిమ్మల్ని పోషించమని అడుక్కోండి.

గత డెబ్భైఏళ్లుగా ఇండియా నాయకులు దోచుకుని స్విస్ బ్యాంక్ లలో దాచుకున్న డబ్బులిమ్మని, రక్షించమని వారి కాళ్ళు పట్టుకోండి.

బాలీవుడ్ లోని మీ తొత్తుల బ్లాక్ మనీతో మిమ్మల్ని పోషించమని వేడుకోండి.

హీనా రబ్బానీని, బిలావల్ని "బేషరం పాక్" అంటూ ఐఎంఎఫ్ కమిటీ ముందు డాన్స్ వేయించండి. నాలుగు ఎంగిలి మెతుకులైనా విదిలిస్తారు.

హింసాత్మక ఖురాన్ ను వదలిపెట్టండి. కుట్రలను, కుతంత్రాలను వదిలి శాంతిగా మనుషులుగా బ్రతకండి.

ఇవేవీ జరిగే పనులు కావు కదూ. 

కాబట్టి, చివరగా మీకొక్కటే దారి.

ఈ భూమ్మీద మీ అడ్రసనేది లేకుండా అర్జంటుగా మాయమైపోండి. ప్రపంచదేశాలన్నీ మిమ్మల్నీ మీ దారినీ అసహ్యించుకుంటున్నాయి. మీ దేశం లేకపోతే, ప్రపంచం మొత్తం శాంతిగా బ్రతుకుతుంది.  హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది.

మీరు చెయ్యకపోతే, ఏదో ఒకనాడు ప్రకృతే ఈ పనిని చేస్తుంది.

ఇది మాత్రం తప్పదు.

గత వెయ్యేళ్ళుగా మీరు చేసిన పాపాలన్నీ ఊరకే ఎలా పోతాయి మరి?