నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, మార్చి 2023, ఆదివారం

సాధనా ఫారెస్ట్ సందర్శన

ఆరోవిల్ కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సాధనాఫారెస్ట్ ను ఈ రోజు సందర్శించాం.


కొంతమంది ఒక గుంపుగా అక్కడొక అడవిలో ఉంటూ, ప్రకృతిజీవనం మీద ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళ జీవనవిధానం గురించి ఛార్మి అని ఒక బ్రిటిష్ వనిత మాకు వివరించింది. దానిని నడుపుతున్న శేఖర్ అనే అతను మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి రాత్రి భోజనానికి ఉండమన్నాడు. ఉడకబెట్టిన కూరగాయలు, ఆకులు, గింజలు, దుంపలు వాళ్ళ ఆహారం. ప్రకృతిని గౌరవిస్తూ, నీటిని అతి తక్కువగా వాడుకుంటూ, వెదురు పందిళ్లలాంటి ఇళ్లలో ఉంటూ, వీగన్లుగా తింటూ, అడవిలో ఎలా బ్రతకాలో వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ జీవనవిధానాన్ని ఇష్టపడే కొందరు విదేశీయులు కూడా వచ్చి వీళ్ళను అనుసరిస్తున్నారు.


పంచవటి సాధనామార్గాన్ని గురించి, మా జీవనవిధానాన్ని గురించి వాళ్లకు వివరించి, మా వెబ్ సైట్ చూడమని,  నా పుస్తకాలు చదవమని చెప్పాను.











 వీగనిజాలు ప్రకృతి జీవనాలు 
వాటికవి కావు పరమార్ధాలు 
మొలకలు తింటూ మొద్దులా బ్రతికితే 
ఆరోగ్యాన్నైతే అందుకోవచ్చు
ఆ తరువాత ఏంటనే  ప్రశ్నకు
వీళ్లకు దొరకవు సమాధానాలు

త్యం ఎదురైనపుడు
సత్యాన్వేషణ చతికిలబడితే
ఫలితమేముంటుంది

ఆధ్యాత్మికమనేది
గౌరవప్రదమైన జీవనాధారమైతే
పరిణతెలా వస్తుంది?