Pages - Menu

Pages

4, మార్చి 2023, శనివారం

సత్యోదయం

 




ప్రాణపు అలల పైన

పయనిస్తున్న పసిడి వెలుగు

ప్రాక్తన జగతినంత 

పరికిస్తున్న ప్రభుని చూపు

క్షణికపు లోయలోకి 

దిగి వస్తున్న నిత్యాత్మక ఎరుక 

మరణపు ఛాయనంత

మారుస్తున్న సత్యోదయ కాంతి