నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

17, జులై 2023, సోమవారం

జీసస్ పేరుతో రోగాలు నయం చేసే John of God కు 370 ఏళ్ళు జైలు శిక్ష

ఈ మధ్యనే బ్రెజిల్ లో ఒక సంఘటన జరిగింది. ఇది బ్రెజిల్ చరిత్రలోనే అతి పెద్ద మతపరమైన నేరం.

అదేంటంటే, జో టెక్సీరా డిఫారియా అనే బ్రెజిలియన్, జీసస్ పేరుతో రోగాలు నయం చేస్తానని ప్రచారం చేసుకుంటూ అందుకోసం తనదగ్గరకు వచ్చిన దాదాపు 600 అమ్మాయిలను రేప్ చేశాడు. కంగారు పడకండి. ఒక్కరోజులో కాదు. ఇదంతా 1986 నుండి 2017 లోపు జరిగింది. అంటే 30 ఏళ్ల ప్రణాళికన్నమాట. వాళ్ళు పెట్టిన కేసుల విచారణ ఇప్పటికి తేలింది. జూలై 10 న తీర్పు వచ్చింది. ఇతనికి ప్రస్తుతం 81 ఏళ్ళు. అంటే వీడు చనిపోయేదాకా జైల్లోనే ఉండాలి. అంతేకాదు, ఇంకొక అయిదు జన్మలపాటు పుట్టగానే పాక్కుంటూ జైలుకొచ్చి చచ్చేదాకా అందులోనే ఉండి చావాలి.

ఈయనగారు జీసస్ క్రీస్ట్ కు ఘనత వహించిన అంతర్జాతీయ సేవకుడు.

ఇతని దందా 1970 లలోనే మొదలైంది.  అప్పట్లో బ్రెజిల్లోని ఒక చిన్న టౌన్ లో ఫెయిత్ క్లినిక్ మొదలుపెట్టాడు. మెడికల్ లైసెన్స్ లేకపోయినా చిన్న చిన్న ఆపరేషన్లు, కంటిశుక్లాలు తొలగించడం, మొదలైనవి చేసేవాడు. అంటే మన RMP టైపు వైద్యమన్నమాట. అది లాభసాటిగా లేదని 'జీసస్ వ్యాపారం' మొదలుపెట్టాడు. పోర్చుగల్ లోని మధ్యయుగాల నాటి సెయింట్ జాన్ అనేవాడి పేరును పెట్టుకుని షాపు తెరిచాడు.

అప్పటినుంచి పరిశుద్ధజలం అని, మూలికా మందులని ఏవేవో పిచ్చి ప్రాడక్ట్స్ ని జనానికి అమ్మేవాడు. ప్రార్థనలతో రోగాలు తగ్గిస్తానని ప్రచారం చేసుకున్నాడు.

బ్రెజిల్ కూడా మన ఇండియా లాంటిదే. అక్కడ కూడా మనలాగే పిచ్చిగొర్రె జనం ఎక్కువ. ఏది చేసినా చెల్లుబాటై పోతుంది. ఇంకేముంది? గొర్రెలు మూకుమ్మడిగా ఎగబడ్డాయి. అతివేగంగా అనూహ్యంగా ఎదిగాడు. కుప్పలు తెప్పలుగా  డబ్బులొచ్చి పడ్డాయి. ఊరూరా తిరుగుతూ RMP వైద్యం చేసుకుంటూ, తిండికి గతిలేక బ్రతికే ఇతను ఏకంగా వెయ్యి ఎకరాల ఎస్టేట్ కు యజమాని అయ్యాడు.

శారీరక మానసిక బాధలు తగ్గించుకోవడానికి తన దగ్గరకు వచ్చే అమ్మాయిలను తన వికృత సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి వాడుకునేవాడు. ఆ విధంగా తమను వాడుకున్నాడని ఇప్పటికి  దాదాపు 600 మంది అఫిషియల్ గా బయటపడి కంప్లెయింట్ చేశారు. బయటకు రాని కేసులెన్ని ఉన్నాయో ఆ జీసస్ కే తెలిసి ఉండాలి. అసలు, ఇలాంటి నీచులను ఈ విధంగా దాచిపెట్టి పోషించే జీసస్ ఓపికకు మెచ్చుకోవాలి.

ఈ విధమైన  సెక్స్ నేరాలే గాక, చిన్నపిల్లల స్మగ్లింగ్ కూడా ఇతను చేసేవాడు. పిల్లల్ని కని ఇవ్వడానికి  ఒక అమ్మాయిల గ్రూపును మెయింటైన్ చేసేవాడు. ఆ పిల్లల్ని, పిల్లలను కనలేని దంపతులకు వేలంపాటలో అమ్మేసేవాడు. ఇక పిల్లలను కనలేరు అనుకున్న అమ్మాయిలను చంపేసేవాడు. అంటే కోళ్లఫారం లాగా పిల్లల ఫారం నడిపేవాడన్నమాట. దీనిపైన చాలా సంపాదించాడు.

చివరకు తనను కూడా రేప్ చేశాడని సొంత కూతురే ఇతనిమీద కంప్లెయింట్ చేసింది.  తన తండ్రి ఒక రాక్షసుడని, 14 ఏళ్ల వయసులో తనను బంధించి కొట్టి రేప్ చేస్తుంటే, భరించలేక ఇంటినుంచి పారిపోయానని ఆ అమ్మాయి కోర్టులో చెప్పింది.

ఈ నేరాలన్నీ 'జీసస్ సేవ', 'పరిశుద్ధాత్మ స్వస్థత' అనే ముసుగుల వెనుక దాక్కుని ఇతను చేశాడు. ఇంతమందికి ఇన్ని రోగాలను తగ్గించానని ప్రచారం  చేసుకున్న ఇతను 2018 లో అరెస్ట్ అయిన  మరుసటి రోజునుంచి, తనకు అనేక రోగాలున్నాయని, కాబట్టి జైల్లో కాకుండా ఆస్పత్రిలో ఉంచి చికిత్స ఇప్పించాలని బ్రెజిల్ ప్రభుత్వాన్ని అనేకసార్లు అభ్యర్దించాడు.

అసలు 2015 లోనే ఇతనికి పొట్ట కేన్సర్ వచ్చింది. రహస్యంగా ట్రీట్మెంట్ తీసుకున్నాడు. న్యూస్ బయటకు పొక్కకుండా చూసుకుంటూ, తన ప్రార్ధనా వ్యాపారాన్ని యధావిధిగా కొనసాగించాడు.

ఓప్రా వింఫ్రె షోతో ఇతను చాలా పాపులర్ అయ్యాడు. అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు కూడా ఇతను ప్రార్ధనా ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఒబామా ఎలాంటివాడో మొన్న ఇండియా మీద అతను చేసిన వ్యాఖ్యలతోనే బయటపడింది. ఒబామా కూడా ఇతన్ని ప్రోమోట్ చేశాడు. అయితే జేమ్స్ రాండి మొదలైన వాళ్ళు ఇతని మోసాలను బయటపెట్టారు. బాధితులు వందల సంఖ్యలో కంప్లెయింట్లు చేశారు. సబ్రినా బీటెన్ కోర్ట్ అనే బ్రెజిల్ వనిత  ప్రాణాలకు తెగించి మరీ పరిశోధన చేసి ఇతని నేరాలన్నీ బయట పెట్టింది. వాటిమీద విచారణ జరిగింది. ఇన్నేళ్ల తర్వాత నేరాలు రుజువయ్యాయి, బ్రెజిల్ కాబట్టి (ఇండియా కాదు గాబట్టి) శిక్షలు పడ్డాయి.

ఇదంతా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే, ఇండియాలో కూడా ఇలాంటి క్రైస్తవ మోసగాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. చర్చిల పేరుతో అనేక నేరాలు ఘోరాలు చేస్తున్నారు.  ప్రార్ధనల పేరుతో, కూటముల పేరుతో, కొబ్బరినూనె మొదలైన జిమ్మిక్కులతో రోగాలు నయం చేస్తామని చెబుతూ కోట్లాది మంది అమాయకులను మోసం చేస్తున్నారు. మతం మారుస్తున్నారు. హిందూమతం అంటే ద్వేషం నూరి పోస్తున్నారు. దేశ మౌలిక స్వరూపాన్ని మారుస్తున్నారు. సంక్షోభం దిశగా తీసుకుపోతున్నారు. కానీ వాళ్ళపైన కేసులు పెట్టే ప్రయత్నాలు, కోర్టుకు ఈడ్చే ప్రయత్నాలు ఇండియాలో ఎక్కడా జరగడం లేదు. బ్రెజిల్ కంటే ఇండియా ఇంకా వెనుకబడిన దేశమన్న మాట ఈ విషయంలో !

ప్రార్థనలకు రోగాలు తగ్గడం అనేది ఒక పెద్ద బూటకం. అది ఎప్పటికీ జరిగే పని కాదు. కానీ ప్రతి చర్చిలోనూ ఇదే ఊదర కొడుతూ అమాయకులను మోసం చేస్తున్నారు క్రైస్తవ పాస్టర్లు. నమ్మే గొర్రెలు నమ్ముతున్నారు.

తనను తానే రక్షించుకోలేక సైనికుల చేతిలో చంపబడ్డాడు జీసస్. అలాంటివాడు ప్రార్థనలతో ఇతరులకు రోగాలు తగ్గిస్తాడా? అబద్ధాలు చెప్పటానికైనా ఒక అర్ధం పర్ధం ఉండాలి. నాలుగు డబ్బుల కోసం మతాలు మారేవారికి పరిశుద్ధత ఎలా వస్తుందసలు? 

తనపేరుతో ఇంత జరుగుతుంటే, 50 ఏళ్లుగా జీసస్ ఎందుకు ఆపకుండా చూస్తూ ఊరుకున్నాడో, ఎక్కడ నిద్రపోతున్నాడో, అసలున్నాడో లేడో, దేవుడికే తెలియాలి.

బయటకు రాని ఇలాంటి సెక్స్ నేరాలు, మోసాలు  ఇండియా చర్చిలలో కూడా లక్షలాదిగా జరుగుతున్నాయి. కానీ ఎటువంటి చర్యలు  ఎక్కడా ఉండటం లేదు. చర్చి మైకుల సౌండ్ పొల్యూషన్ తో పల్లెలు దద్దరిల్లుతున్నాయి.  ఆంధ్రాలాంటి రాష్ట్రాలలో అయితే  మతమార్పిడులు మహాజోరుగా జరుగుతున్నాయి. అయినా  ఎవడూ పట్టించుకోడం లేదు. యోగి ఆదిత్యనాథ్, హిమంత్ బిశ్వాస్ శర్మ వంటి కొద్దిమంది ముఖ్యమంత్రులు మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళకు దేశం కంటే స్వార్థమే ముఖ్యమై కూచుంది. 

ఈ విషయంలో బ్రెజిల్ మనకంటే ముందున్నదనడం స్పష్టం. కనీసం వాళ్ళలో కొంత కామన్ సెన్స్ ఉంది. మనకదే లేదు. భారతదేశంలో జరుగుతున్న క్రైస్తవ మోసాలకు నేరాలకు చరమగీతం పాడే రోజు ఎప్పుడొస్తుందో? భారతీయులలో దేశభక్తి ఎప్పుడు మొలకెత్తుతుందో?

ఇలాంటి న్యూసులను మెయిన్ స్ట్రీమ్ మీడియా చక్కగా కప్పి పెడుతోంది.  ఈ వార్తలు పేపర్లలో, చానల్స్ లో ఎక్కడా కనిపించవు. మన మీడియా చాలావరకు అమ్ముడు పోయిందనే మాట, పోలరైజ్  అయిందనే మాట నిజం. అది డబ్బుకు కావచ్చు, కులానికి కావచ్చు. భావజాలానికి కావచ్చు. కానీ, వాస్తవాలు, అసలైన వార్తలు ప్రజలకు చేరడం లేదు. టైలర్డ్ న్యూస్ మాత్రమే బయట లభిస్తోంది.

మతమార్పిడి ముఠాలు చేస్తున్న ఇలాంటి నేరాలను, మోసాలను గట్టిగా శిక్షించవలసిన అవసరం ఉంది. కూచున్న కొమ్మనే నరుక్కునే మన గొర్రెప్రజలలో, నాయకులలో చైతన్యం ఎప్పటికీ వస్తుందో మరి?