Pages - Menu

Pages

4, ఆగస్టు 2023, శుక్రవారం

దేశంలో సివిల్ వార్ తప్పదా?

అది 1988 మే నెల. నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ చేసి AP ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ నుంచి వెనక్కు వస్తున్నాను. నాతోబాటు కొంతమంది యువకులు అదే కోచ్ లో వస్తున్నారు. మాటల్లో, వారంతా IAS ట్రైనింగ్ పూర్తి చేసుకుని, AP కేడర్ అలాట్ అయి, హైద్రాబాద్ లో రిపోర్ట్ చెయ్యడానికి వెళుతున్నారని తెలిసింది. నేను ఇంటర్వ్యూ అటెండ్ అయి వెనక్కు వెళుతున్నానని చెప్పాను. హైద్రాబాద్ దాకా కలిసి ప్రయాణం చేశాం గనుక, ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి. దేశ రాజకీయాలు మాట్లాడుకుంటున్నపుడు, వాళ్ళ లీడర్ లాగా కనిపిస్తున్న ఒకాయన ఇలా అన్నాడు, 'మన దేశంలో ఎప్పటికైనా సివిల్ వార్ తప్పదు. జనం రోడ్లమీద కొట్టుకునే పరిస్థితి ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా వస్తుంది. మన రాజకీయ నాయకులు దేశాన్ని అటువైపు తీసుకుపోతున్నారు '.

నేనప్పటికే LLB పూర్తి చేసి ఉన్నాను. లా లో Indian Constitutional Law నా ఫెవరెట్ సబ్జెక్ట్. ఆయనతో నేనిలా అన్నాను. 

' నేటి రాజకీయ నాయకుల సంగతి అలా ఉంచండి. అసలు మన రాజ్యాంగ రూపకర్తలు ఏం చేశారో చెప్పండి. సివిల్ వార్ వైపు దారితీసే విధంగానే మన రాజ్యాంగాన్ని రచించారని నా ఉద్దేశ్యం. నేటి రాజకీయ నాయకులు దానికి ఆజ్యం పోస్తున్నారంతే. కనుక వీళ్ళను అనుకోవడం దండగ. అసలు మూలాలు రాజ్యాంగంలోనే ఉన్నాయి. ఆర్టికల్ 370 కంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదనుకుంటాను. మనం కట్టే టాక్స్ తో బడ్జెట్ సపోర్ట్ తీసుకుంటూ, పాకిస్తాన్ ను సపోర్ట్ చేస్తోంది జమ్ము కాశ్మీర్ రాష్ట్రం. అయినా మనం దానికి కోటానుకోట్లు ప్రతి ఏడాదీ సరఫరా చేస్తూనే ఉన్నాం. ఏంటిది? ఇలాంటివి రాజ్యాంగంలో ఎన్నో లొసుగులున్నాయి.  రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే దేశభక్తి ఉన్న నాయకులు వస్తే తప్ప సివిల్ వార్ దిశగా దేశం ప్రయాణించడం ఆగదు. అప్పటిదాకా ఆ లొసుగులను వాడుకునే దుష్టశక్తులు ఉంటూనే ఉంటాయి'

నేను చెబుతున్న వాస్తవం ఆయనకు అర్థమైనా, IAS కదా, వాదన కోసం ఏవేవో పాయింట్స్ లేవనెత్తి వాదన పెట్టుకున్నాడాయన. ఆర్గ్యుమెంట్ అనేది ఎటూ తేలదు గనుక ఇద్దరమూ ఎవరి లాజిక్ వారిదే అన్నట్లుగా మాట్లాడుకున్నాము. హైదరాబాద్ వచ్చింది. ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోయాము. ఈ బ్యాచ్ అందరూ అప్పటి CM, NTR ను కలిసి దిగిన ఫోటోను మర్నాడు పేపర్లో చూచాను. ఆరోజు నాతో మాట్లాడిన వ్యక్తి 30 ఏళ్ల తర్వాత చీఫ్ సెక్రటరీ గా రిటైర్ అయ్యాడు. పేరు చెప్పను. ఈపాటికి మీకే అర్ధమై ఉంటుంది.

ఆరోజు నేను లేవనెత్తిన పాయింట్స్ తర్వాతి కాలంలో అక్షరాలా నిజాలయ్యాయి. కాలక్రమంలో ఆర్టికల్ 370 ప్రక్కకు తప్పుకుంది. కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగమైంది. కానీ మిగతా ఎన్నో చిచ్చులు ఎన్నో రాష్ట్రాలలో రగులుకుంటూనే ఉన్నాయి. మణిపూర్ లో నిన్నగాక మొన్నటిదాకా జరిగిన దౌర్జన్యకాండ, నాలుగు రోజులనాడు హర్యానాలోని నూహ్ లో హిందువుల జలాభిషేక యాత్రపైన ముస్లిములు చేసిన దాడి, మారణకాండలు నా మాటలకు నిదర్శనాలు. ఆరోజున ఆ IAS చెప్పినది కూడా నిజమే. దేశం సివిల్ వార్ వైపే ప్రయాణిస్తోంది. అది కూడా బీజేపీ లాంటి దేశభక్త ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇలా జరుగుతోంది. ఇక హిందూ వ్యతిరేక పార్టీలు అధికారంలో కొస్తే దేశం పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత వేగంగా దేశం నాశనం వైపు దూసుకు పోతుందో  తేలికగా ఊహించవచ్చు.

మణిపూర్ లో హిందువులు 45 శాతం ఉంటే, క్రైస్తవులు 45 శాతం ఉన్నారు. నూహ్ లో ముస్లిములు 80 శాతం ఉంటే, హిందువులు 20 శాతమే ఉన్నారు.  మరి హిందువుల అణచివేత జరగక ఏం జరుగుతుంది? మణిపూర్లో అయితే ఇది హిందూ క్రిష్టియన్ సమస్య మాత్రమే కాదు. మైతీ, కుకీ తెగల మధ్యన జరుగుతున్న యుద్ధం అది. బర్మాతో మనకున్న ఓపెన్ బార్డర్ లోనుంచి జొరబడుతున్న విదేశీ శక్తుల అరాచకాలతో అక్కడ అలా ఉంది. నూహ్ లో అయితే, బాంగ్లాదేశ్ రోహింగ్యాల గుంపులు రాజ్యమేలుతున్నాయి. దానికి మినీ పాకిస్తాన్ అని పేరుంది. మొన్న జరిగిన దౌర్జన్యకాండలో బజరంగ్ దల్ కార్యకర్తలను, హోమ్ గార్డ్స్ ను దారుణంగా చంపేశారు. మేజిస్ట్రేట్ ను ఎటాక్ చేశారు. పోలీసులను ఎటాక్ చేసి గాయపరిచారు. పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేశారు. కార్లు, ద్విచక్రవాహనాలు ఎన్నో తగలబెట్టారు. శివాలయాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేయబోయారు. ఇదంతా ఇండియాలో  హర్యానా రాష్ట్రంలో నిన్నగాక మొన్న జరిగింది.  ముస్లిములు 80% కు చేరుకున్నప్పుడు, అందులోను రోహింగ్యాలు తండోపతండాలుగా సెటిల్ అయ్యి ఉన్నచోట, లా అండ్ ఆర్డర్ లేనిచోట హిందువులకు అలా జరగక ఇంకెలా జరుగుతుంది?  అసలు, పరిస్థితి ఇంతవరకూ వస్తుంటే, చూస్తూ ఊరుకున్న ప్రభుత్వాలది తప్పు. చేతులు కాలాక, చేతులు దాటిపోయాక, లబోదిబో అంటే ఉపయోగమేముంటుంది?

ఇండియాను విచ్ఛిన్నం చేయాలని పాకిస్తాన్, చైనాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 2024 లో ఎలక్షన్లు వస్తున్నాయి. అందుకని నానా రకాలుగా కుట్రలు కుతంత్రాలతో దేశంలో అల్లకల్లోలం రేపాలని ప్రయత్నిస్తున్నాయి. సెక్యులర్ వాదులు మనదేశం తిండి తింటూ పరాయిదేశాలకు వంత పాడుతున్నారు. అందుకే ప్రతిచోటా ఈ ఘోరాలు.

కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని, ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ, ఈ నాలుగు పనులపైన దృష్టి పెట్టకపోతే, దేశంలో సివిల్ వార్ తప్పకుండా వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు. అంతే.

అవి, 

1. జనాభా పెరుగుదలను ఆపాలి.

2. మత మార్పిళ్లను ఆపాలి.

3. సరిహద్దుల నుంచి విదేశీ చొరబాట్లను ఆపాలి.

4. లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలు చెయ్యాలి.

ఇది జరగక పోతే మాత్రం ఏదో ఒకరోజున దేశంలో సివిల్ వార్ తప్పదు. మొన్నటి దాకా మణిపూర్లో, నిన్న హర్యానాలో జరిగింది అదే. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆర్మీని దించవలసిన పరిస్థితి వచ్చింది.  బెంగాల్, కేరళ, కర్ణాటక వంటి మిగతా చాలా రాష్ట్రాలు అదే దిశగా పోతున్నాయి.

ఇది నేను చెప్పడం లేదు. మేధావులందరూ ఇదే అనుకుంటున్నారు. వాస్తవం కూడా ఇదే.