Pages - Menu

Pages

23, అక్టోబర్ 2023, సోమవారం

RIP Samantha Woll

శుక్రవారం నాడు, డెట్రాయిట్ డౌన్ టౌన్ లో, సమంతా ఓల్ అనే యూదు వనిత హత్య చేయబడింది. ఆమె ఉంటున్న ఇంటిలోనే ఈ సంఘటన జరిగింది. చాలా కత్తిపోట్లు ఈమె ఒంటిమీద కనిపించాయి. ఈమెకు 40 ఏళ్ళు. ఈమె డెట్రాయిట్ సినగాగ్ కు ప్రెసిడెంట్ గా పని చేస్తోంది. ముస్లిం జ్యూవిష్ కౌన్సిల్ అనేదానిని డెట్రాయిట్లో స్థాపించి ఇస్లాంకు జుడాయిజంకు మధ్యన స్నేహాన్ని పెంచాలని ఈమె చాలా ప్రయత్నించింది.  సోషల్  ఇష్యూల మీద చురుకుగా పనిచేసే వ్యక్తి. చిన్నవయసులోనే డెట్రాయిట్ డౌన్ టౌన్ ప్రాంతాలలో రాజకీయంగా ఎదుగుతున్న ఒక సెలబ్రిటీ యూదుమహిళ. అర్ధాంతరంగా ఈమె జీవితం ఇలా ముగిసింది.

ప్రస్తుతం జరుగుతున్న హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం చీకటినీడలు అమెరికాకు కూడా పాకాయని చెప్పడానికి ఈ దురదృష్ట సంఘటన ఒక ఉదాహరణ.

అమెరికాలోని  న్యూయార్క్ లో ఇంకా ఇతర ప్రాంతాలలో, పాలస్తీనాకు సపోర్ట్ గా, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా, చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాలలో వేలాదిమంది పాలస్తీనా సపోర్టర్స్ ఉన్నారు. ధర్నాలు, శాంతియుత ఆందోళనలు జరగవచ్చు. తప్పులేదు. కానీ ఈ విధంగా మనుషులను టార్గెట్ చేసి చంపడం మాత్రం చాలా దారుణం. ఇలాంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలు డెట్రాయిట్ కు కూడా పాకడం దురదృష్టకరం.

ఈ హత్య వెనుక ఇతర కారణాలు కూడా ఉండి ఉండవచ్చు. కానీ, ఈమె యూదు వనిత కావడం మాత్రం, అనుమానాన్ని మతకోణం వైపే చూపిస్తోంది.

ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు 24 గంటల లోపే కేసును ఛేదించే అమెరికా పోలీసులు కూడా ఆధారాలు దొరకలేదని అంటున్నారంటే అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి.

ఈ పోకడలు డెట్రాయిట్ లో  అతిత్వరలో రాబోతున్నాయని నేను గత ఏడాది అక్కడున్నపుడే ఊహించాను. అక్కడ డియర్ బార్న్ అనే సిటీలో ముస్లిం జనాభా చాలా ఎక్కువ. మనం అక్కడకెళితే హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఉన్నట్లు అనిపిస్తుంది.

అమెరికాలో అతి ఎక్కువ ముస్లిం జనాభా డెట్రాయిట్ లోనే ఉంది. ఇస్లామిక్ తీవ్రవాదం కూడా ఇక్కడే పాకుతోంది. దీనికి లేటెస్ట్ రుజువే సమంతా వోల్ హత్య.  

2022 లో నేను అమెరికాలో ఉన్నపుడు ఒక ఇంటర్ ఫెయిత్ మీటింగ్ కు వెళ్ళాను. అది 'షారె జెడెక్' అనే డెట్రాయిట్ జ్యూవిష్ సెంటర్ లో జరిగింది. దాని వివరాలు ఇక్కడ చూడండి.

డెట్రాయిట్ లో పద్మా కుప్పా అని ఒక తెలుగు మహిళ రాజకీయాలలో ఉన్నారు.. ఈమె 41 హౌస్ డిస్ట్రిక్ట్ నుండి Michigan House of Representatives లో మెంబర్ గా ఉన్నారు. ఈమె ఎన్నికలలో పోటీ చేసినపుడు సమంతా కూడా ఈమెకు మద్దతుగా ప్రచారం చేసింది. పద్మా కుప్పా గారికి డెట్రాయిట్ లోని యూదులతో మంచి రిలేషన్ ఉంది. 

నేను వెళ్ళిన ఇంటర్ ఫెయిత్ మీటింగ్ కు పద్మా కుప్పా కూడా వచ్చారు. సమంతా కూడా వచ్చి ఉండవచ్చు. ఆ మీటింగ్ కు నన్ను ఆహ్వానించిన నారాయణస్వామి గారు, కొంతమంది యూదు ప్రముఖులను నాకు పరిచయం చేశారు. వారిలో సమంతా కూడా ఉన్నదేమో నాకు ప్రస్తుతం గుర్తులేదు.

హిందువులకు యూదులకు స్నేహం బాగానే కుదురుతుంది. కానీ యూదులకు ముస్లిములకు కుదరదు. ఆ మాటకొస్తే ముస్లిములకు ఎవరితోనూ స్నేహం కుదరదు. మతం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. ఆ రోజున లోకల్ ముస్లిం లీడర్స్ ను కొంతమందిని కూడా స్నేహపూర్వకంగా ఆ మీటింగ్ కు యూదులు ఆహ్వానించారు. ఆ రోజున ఆ హడావుడీ అదీ చూస్తుంటే, 'వీళ్ళమధ్య స్నేహం నిజంగా కుదురుతుందా? ఇదంతా ఉత్త ప్రచారపు ఆర్భాటమేనా లేక ఈ రెండు మతాల మధ్యన ఎప్పటికైనా అసలైన సయోధ్య ఏర్పడుతుందా?' అన్న అనుమానం నాలో ఆరోజునే తల ఎత్తింది. మౌనంగా ఆ మీటింగ్ ను, వాళ్ళ ఉపన్యాసాలను గమనిస్తూ ఉండిపోయాను. అప్పుడు నాకేమనిపించిందో ఆ పోస్ట్ లోనే వ్రాశాను చదవండి.

ఈరోజున ఇలాంటి న్యూస్ వినవలసి రావడం చాలా బాధాకరంగా ఉంది. ఆ రోజున నాలో తలెత్తిన భావాలు, ఏడాది తిరగకుండా నేడు నిజం కావడం గమనించవచ్చు.

ఇస్లామిక్ తీవ్రవాదం ఇంకా ఎన్ని దేశాలలో పాకుతుందో, ఎంతమంది అమాయకులను మంచి మనుషులను హతమారుస్తుందో, అసలు ఈ వైరస్ భూమిపైన ఎందుకు పుట్టిందో ఆ దేవుడికే తెలియాలి.

ఎప్పటినుంచో భారతదేశం ఈ సమస్యను ఎదుర్కుంటోంది. ఇప్పుడు యూరప్, అమెరికాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. పరిష్కారం ఎప్పుడో?

సమంతా వోల్ ఆత్మకు శాంతి కలగాలని ఈశ్వరుడిని ప్రార్ధిస్తున్నాను.