Pages - Menu

Pages

29, జనవరి 2024, సోమవారం

రెండవ స్పిరిట్యువల్ రిట్రీట్ విజయవంతం అయింది








ముందుగా ప్లాన్ చేసినట్లు, ఈ నెల 26, 27, 28 తేదీలలో మా ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మిక సాధనా సమ్మేళనం విజయవంతం అయింది.

పాతవారితో బాటుగా, చాలామంది క్రొత్తవాళ్ళు కూడా ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. మా సాధనామార్గాన్ని వారికి వివరించడం జరిగింది. మళ్ళీ ఏప్రియల్ లో జరుగబోయే రిట్రీట్ లో వారు డైరెక్ట్ గా పాల్గొనవచ్చు. ఈ లోపల వారు ఈ క్రింది పుస్తకాలు చదివి, అర్ధం చేసుకుని, ఆ తరువాత ఏప్రియల్ రిట్రీట్ కు రావలసి ఉంటుంది.

అదే విధంగా, మమ్మల్ని సంప్రదిస్తున్న క్రొత్తవారందరికీ కూడా ఇదే సూచన చేస్తున్నాము.  ఇప్పటివరకూ నేను వ్రాసినవి 63 పుస్తకాలున్నాయి. వాటినుంచి కనీసం ఈ నాలుగు పుస్తకాలను చదవండి. మా మార్గం స్పష్టంగా అర్ధమౌతుంది. ఆ తరువాత మీరు రిట్రీట్స్ కు రావచ్చు. దీక్షాస్వీకారం చెయ్యవచ్చు. మా సాధనామార్గంలో నడవవచ్చు. ధన్యత్వాన్ని మీకు మీరే రుచి చూడవచ్చు.

1. Musings లేదా వెలుగు దారులు

2. శ్రీవిద్యా రహస్యం

3. లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక

4. తారాస్తోత్రం

మా జ్యోతిష్యవిధానాన్ని క్రొత్తవారికి పరిచయం చేయడం జరిగింది. కానీ, 'డబ్బు సంపాదనకు దీనిని వాడకూడదు' అని స్పష్టంగా వారికి చెప్పడం కూడా జరిగింది.

గమనించండి.

22, జనవరి 2024, సోమవారం

500 ఏళ్ల బానిసత్వం నుండి విముక్తి


ఈరోజు

- భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు

 - 500 ఏళ్ల బానిసత్వం నుండి విముక్తి  లభించిన రోజు

- దౌర్జన్యపు దందా అంతమైన రోజు

- రాక్షసత్వం అంతరించిన రోజు

- దైవత్వం కళ్ళు తెరిచినరోజు

- అయోధ్యలో రామాలయం ద్వారాలు తెరుచుకున్న రోజు

- శ్రీరాముడు మళ్ళీ అయోధ్యా ప్రవేశం చేసిన రోజు

- ఎందరో దేశభక్తుల, దైవభక్తుల కలలు పండిన రోజు

- తమ ప్రాణాలను బలిచ్చిన ఎందరో కరసేవకుల కలలు నిజమైన రోజు

- దేశానికంతటికీ పండుగరోజు

---------------------------------------

మనం ఎవరినీ  మతాలు మార్చం. కానీ మన మతం జోలికొస్తే ఊరుకోము.

మనం ఎవరినీ విమర్శించము. కానీ మనల్ని విమర్శిస్తే ఊరుకోము.

ఇతర దేశాలలో మనం జోక్యం చేసుకోము.

మన దేశంలో ఇతరులు జోక్యం చేసుకుంటే సహించం.

-------------------------------------

హిందువులు సంఘటితం అయినప్పుడే భారతదేశం శాంతిగా ఉంటుంది.  

భారతదేశం హిందూదేశం అయినప్పుడే ప్రపంచం శాంతిగా ఉంటుంది.

-----------------------------------

ఈ రోజున మొదలైన చైతన్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి.

అయోధ్యలో ఈనాడు వెలిగిన దివ్యజ్యోతి ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉండాలి.

లోకానికి వెలుగును వెదజల్లుతూనే ఉండాలి.

ఆ వెలుగులో మానవజాతి దివ్యత్వంవైపు ప్రయాణించాలి.

భారతదేశం ప్రపంచానికే ఆచార్యత్వం వహించాలి.

-----------------------------------
కోట్లాది హిందువుల కలలు నిజం కావాలి.

సనాతనధర్మ మార్గంలో మానవజాతి తనను తాను దిద్దుకోవాలి

దరిద్రం, రోగం, బాధ, అణచివేత, దౌర్జన్యం, అసహనం, భూమినుంచి మాయం కావాలి.

ఈ భూమి స్వర్గం కావాలి.

వేదఋషుల స్వప్నం సాకారం కావాలి.

-----------------------------------
ఈ సంకల్పాలకు అందరం కట్టుబడి ఉందాం.

వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులేద్దాం.

----------------------------------

ఈ శుభసందర్భంలో, సనాతనధర్మానికి మేము చేస్తున్న చిన్నసేవగా, అధర్వణ వేదాంతర్గతమైన 'రామతాపిని ఉపనిషత్' కు నా తెలుగు వ్యాఖ్యానమును ఉచిత 'ఈ-బుక్'  గా విడుదల చేస్తున్నాము. త్వరలోనే దీని ఇంగ్లిష్ తర్జుమా మరియు ప్రింట్ పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి.

శ్రీరామతత్త్వాన్ని, రామనామ మహిమను, రామభక్తి విశిష్టతను విపులముగా వివరించిన గ్రంధం ఇది.

ఇది నా కలం నుండి వెలువడుతున్న 63 వ పుస్తకం. 

డౌన్లోడ్ చేసుకోండి. చదవండి. శ్రీరాముని తత్త్వాన్ని అర్ధం చేసుకోండి. ఆయనకు భక్తితో మ్రొక్కండి, పూజించండి, ధ్యానించండి. ధన్యత్వాన్ని అందుకోండి.

ఈ లింక్ లో పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.


జై శ్రీరామ్ ! జై భరతమాత ! జై సనాతన ధర్మ !

18, జనవరి 2024, గురువారం

జనవరి 22 న నూతన శకం ప్రారంభం - అందరూ పాలు పంచుకోండి

మానవచరిత్రలో మహత్తరమైన సంఘటనలు  అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి. అటువంటి వాటిలో ఒకటి శ్రీరామజననం. సృష్టి-స్థితి-లయకారకుడు, సాక్షాత్తు పరబ్రహ్మము అయిన మహావిష్ణువే శ్రీరామునిగా జన్మించాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కోట్లాది హిందువుల నమ్మకం కూడా అదే.

ఆయన రఘువంశంలో దశరధ మహారాజు కుమారునిగా జన్మించడము, తండ్రికిచ్చిన మాటప్రకారం వనవాసం చేయడము, సీతాదేవిని అపహరించిన రావణుని వానరసైన్యం సాయంతో వధించి, తిరిగి అయోధ్యా నగరానికి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై రాజ్యం చేయడము, అవతార పరిసమాప్తి చేసి తిరిగి తన ధామానికి చేరుకోవడము ఇదంతా రామాయణంలో ఉన్నది, మనకందరికీ ఇది తెలుసు.

రామాయణంలో వాల్మీకిమహర్షి వర్ణించిన కొన్ని విషయాలను బట్టి కనీసం లక్ష సంవత్సరాల క్రితం రామాయణం జరిగి ఉండాలి. వాటిలో ఒకటి, రావణుని భవనానికి నాలుగు దంతాల ఏనుగులు కాపలా కాస్తున్నాయని ఆయన వ్రాయడం. అటువంటి ఏనుగులు లక్ష సంవత్సరాల క్రితం ఉండేవని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇదే విధంగా రామాయణం నిండా ఇటువంటి ఎన్నో రుజువులు లభిస్తున్నాయి. వాటిపైన ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని త్వరలో విడుదల చేయబోతున్నాను.

నేటికి 6000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ ను పాలించిన ఫారో రాజులలో 'రామా' అనే పేరు సర్వసామాన్యంగా ఉండేది. థాయ్ ల్యాండ్, ఇండోనేషియా, మొదలైన దేశాలలో శ్రీరాముని నేటికీ పూజిస్తారు. ఇండోనేషియా రాజవంశానికి పూర్వీకులు రఘువంశపు రాజులే. వారి చరిత్ర ఈ విషయాన్ని చెబుతున్నది. లాటిన్ అమెరికా లోని హొండురాస్ దేశాన్ని (పాతాళ లోకాన్ని) ఆంజనేయుడు చేరుకొని అక్కడ భీభత్సం సృష్టించినట్లు ఈనాటికీ అక్కడ గాధలున్నాయి. మహిరావణ చరిత్రలో దీనికి ఆధారాలున్నాయి.

శ్రీరాముడు జన్మించిన భవ్యమందిరం, మహారాజ ప్రాసాదంగా 1660 CE వరకూ అయోధ్యలో ఉండేది. ఆ సంవత్సరంలో, ఆ ప్రాంతానికి గవర్నరు, ఔరంగజేబు అనుచరుడైన ఫిదాయ్  ఖాన్ అనే నీచుడు ఆ రాజభవనాన్ని అందులోని మందిరాన్ని కూలగొట్టి, 1528 CE లో బాబర్ సైన్యాధిపతి అయిన మీర్ బాకీ అనే ఇంకొక నీచుడిచే కట్టబడిన మసీదును పెద్దదిగా నిర్మించి, దానికి బాబరీ మసీద్ అని పేరు పెట్టాడు.

గాంధీ నెహ్రూల కుట్రలు + సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ పాలనల పుణ్యమా అని హిందువులు తమ దేశంలో సెకండ్ గ్రేడ్ పౌరులయ్యారు. వారి ఆలయాలు, చారిత్రక స్థలాలు దిక్కులేని వయ్యాయి. దేశచరిత్ర మొత్తం వక్రీకరించబడింది. హిందూమతాన్ని ఒక ప్లాన్ ప్రకారం చాప క్రింద నీరులాగా నిర్మూలించే కుట్ర అమలుచేయడం మొదలైంది. కులాలను రెచ్చగొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టి, ఓట్లు దండుకుని అధికారం చేజిక్కించుకుని తమ తమ ఎజెండాలు అమలు చెయ్యడం మొదలైంది. 

ఈ క్రమంలో అనర్హులు అందలాలు ఎక్కారు. నీతి అనేది సమాజం నుంచి మాయమైంది. అడుగడుగునా అవినీతి మయమైంది. దేశం పరాయి దేశాల తొత్తుగా మారింది. దేశసంపద ఇతర దేశాలకు తరలిపోయింది. ఎడారి మతాల ప్రాబల్యం పెరిగింది. టెర్రరిజం పెరిగింది. స్వతంత్రం వచ్చాక భరతమాత మళ్ళీ బందీ అయింది. అంతర్జాతీయ వేదికల పైన నవ్వుల పాలైంది. అన్నిరకాలుగా పతనమై పోయింది.

6 డిసెంబర్ 1992 న, దౌర్జన్యానికి, బానిసత్వానికి ప్రతీక అయిన బాబరీ మసీదు రామభక్తుల చేత కూలగొట్టబడింది. ఆ చైతన్యాన్ని వారిలో రగిల్చింది, లాల్ కృష్ణ అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, ఇంకా అనేకులు ఏళ్ల తరబడి చేసిన నిరంతర కృషి. ఆ క్రమంలో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం జరిపిన పోలీసు కాల్పులలో అనేకమంది కరసేవకులు, రామభక్తులు చనిపోయారు.  అయినా సరే వెనుకకు తిరుగకుండా, ఆ అక్రమ కట్టడాన్ని కూలగొట్టి తమ దేశభక్తిని, దైవభక్తిని చాటుకున్నారు. చరిత్రలో నిలిచిపోయారు. భగవంతుని పాదాల చెంతకు చేరుకున్నారు. మనం వారిని మర్చిపోయినా, దైవదృష్టిలో వారు ఉత్తములే అని నా నమ్మకం.

ఆ రోజు నుంచి హిందువులలో చైతన్యం రావడం మొదలైంది.

అప్పటినుంచీ బీజేపీ పార్టీ, విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్ లు చేసిన సమిష్టి న్యాయపోరాట ఫలితంగా  విజయాన్ని సాధించి, అయోధ్యలో శ్రీరాముని భవ్య మందిరాన్ని నిర్మించి, ఈ నెల 22 న బాలరాముని విగ్రహాన్ని ఆ ఆలయంలో ప్రతిష్ట చేయబోతున్నారు.

కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వచ్చాక భారతదేశ పునరుజ్జీవనం మొదలైంది. కోల్పోయిన గత వైభవాన్ని మన దేశం తిరిగి పొందటం మొదలైంది. ప్రపంచదేశాలు మనల్ని ఒక కలోనియల్ బానిసలా చూడటం మానేసి, తిరిగి గౌరవించడం మొదలు పెట్టాయి.

మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి నేత అయి ఉండికూడా, ఊపిరి సలపనంత బిజీ పనులలో ఉంటూ కూడా, 22 న రామ్ లాలా విగ్రహ ప్రాణప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక సామాన్యుడిలాగా పది రోజుల ఉపవాసదీక్షను చేస్తున్నారు. నేలపైన నిద్రపోతూ నిరంతరం రామనామాన్ని జపిస్తున్నారు. ఆయనకిప్పుడు 73 ఏళ్లు.  దేశంకోసం ధర్మంకోసం కుటుంబాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. వివేకానందస్వామి అనుచరుడు. ఇటువంటి దైవత్వం ఉన్న మనీషి మన ప్రధానమంత్రి కావడం మన అందరి అదృష్టం. అటువంటి ఉత్తముడు అసలు రాజకీయాలలో ఉండటమే ఒక అద్భుతం !

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి యోగి అదిత్యనాధ్ ఇంకొక కారణజన్ముడు. కళంకం లేని దేశభక్తుడు. మహాయోగి గోరఖ్ నాథ్  స్థాపించిన యోగసంప్రదాయానికి చెందిన నేటి జగద్గురువు ఈయన. అటువంటి నిస్వార్థపరుడు,  బ్రహ్మచారి, నిజమైన సన్యాసి, సాధువు, ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ, టెర్రరిజాన్ని అణచి పారేసి, రామరాజ్యాన్ని అక్కడ నడిపిస్తున్నాడు. 'సన్యాసి రాజ్యం ఏలుతాడు' అని వీరబ్రహ్మేంద్ర స్వామి  తన కాలజ్ఞానంలో వ్రాసినది యోగి అదిత్యనాథ్ గురించే గాని, కొందరు పిచ్చివాళ్ళు అనుకున్నట్లు ఎన్టీఆర్ గురించి కానే కాదు. రంగుగుడ్డలు వేసుకున్నంత మాత్రాన, రంగులు పూసుకుని నటించినంత మాత్రాన, నలభై రోజుల పార్ట్ టైమ్ దీక్షలు చేసినంత మాత్రాన, ఎవరూ గురుస్వాములు, సన్యాసులు, స్వామీజీలు అయిపోరు. వారి జీవితచరిత్రలు, దినచర్యలు అందుకు అనుగుణంగా, మచ్చ లేనివిగా ఉండాలి.

యోగి అదిత్యనాథ్ వంటి మరొక్క మహనీయుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న సమయంలో పుట్టడం మనందరి అదృష్టం.

రామ్ లాలా విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్, తన కుటుంబానికి దూరంగా ఉంటూ, ఆరు నెలలు మౌనదీక్షలో ఉండి, ఆ విగ్రహాన్ని కర్ణాటకలో దొరికే నల్లరాతి ఏకశిల నుండి చెక్కాడు. అతని జన్మ ధన్యమైంది !  అతని తపస్సు ఫలించింది. ఆ విగ్రహాన్ని కోట్లాదిమంది యుగయుగాలపాటు పూజించబోతున్నారు. దానిలో శ్రీరామచంద్రుని దివ్యమూర్తిని దర్శించ బోతున్నారు. ఎంతటి ధన్యాత్ముడో ఈ శిల్పి! ఈ పుణ్యబలం వల్ల, అరుణ్ యోగిరాజ్ పూర్వీకులందరూ ఉత్తమలోకాలను పొందారని నా నమ్మకం !

అయోధ్య కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో గొప్ప ఐకమత్యం., సోదరభావం, దేశభక్తులు వెల్లివిరుస్తున్నాయి. కులాలకు అతీతంగా వారిలో ఐక్యతాభావం పెల్లుబుకుతోంది. శ్రీరాముని పాదపద్మాల చెంత అందరూ ఒక్కటౌతున్నారు.

ఈ సమయం భారతదేశ చరిత్రలో ఒక మహోన్నత ఘట్టం. ఇటువంటి సమయంలో మనం పుట్టి, ఈ ఉత్సవాన్ని చూస్తూ ఉండటం గొప్ప అదృష్టం.

ఇది సాంస్కృతిక ధార్మిక పునరుజ్జీవన యుగం.  జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఇటువంటి మరపురాని ఘట్టాన్ని ఆసాంతం ఆస్వాదించండి. ఉప్పొంగిన హృదయాలతో శ్రీరామ నామగానం చేయండి. హిందువులుగా పుట్టినందుకు, ప్రపంచంలో ఎక్కడా లేని మహోన్నతమైన ఆధ్యాత్మిక సంస్కృతికి వారసులైనందుకు గర్వించండి.

పంచవటి తరఫు నుండి మేము కూడా రేపటినుంచి మూడు రోజుల దీక్ష చేస్తున్నాం. దీనిలో ఉపవాసము, మౌనం, నిరంతర రామనామ జపం భాగాలుగా ఉంటాయి. 22 వ తేదీన, 'రామ తాపినీ ఉపనిషత్' కు నా వ్యాఖ్యానమును ఉచిత 'ఈ-బుక్' గా విడుదల చేస్తున్నాము. ఇది శ్రీరాముని పాదపద్మముల చెంత మేము ఉడతాభక్తిగా చేస్తున్న సేవ.

హిందువులందరూ మీకు చేతనైన రీతిలో కనీసం ఈ మూడు రోజులైనా దీక్షలు చెయ్యండి. 22 వ తేదీన జరిగే బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టా మహోత్సవాన్ని మీ మీ కుటుంబాలలో ఒక పండుగగా జరుపుకొండి. 

మీ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇటువంటి అవకాశం వస్తుంది.

మరువకండి !

రామభక్తులుగా జీవించండి. రావణ సైన్యంలో చేరకండి

జై శ్రీ రామ్ ! జై శ్రీ రామ్ ! జై శ్రీ రామ్ !

2, జనవరి 2024, మంగళవారం

రెండవ స్పిరిట్యువల్ రిట్రీట్ + క్రొత్తవారికి అవగాహనా సమ్మేళనం

జనవరి 26, 27, 28 తేదీలలో మా ఆశ్రమంలో రెండవ ఆధ్యాత్మిక సమ్మేళనం (స్పిరిట్యువల్ రిట్రీట్) జరుగుతుంది. అదే సమయంలో, మా మార్గంలోకి అడుగుపెట్టాలనుకునే క్రొత్తవారికోసం జనవరి 26 న ఫౌండేషన్ రిట్రీట్ (అవగాహనా సమ్మేళనం) ఉంటుంది.

దీనిలో, పంచవటి సాధనామార్గం, దాని విధానాలు, లోతుపాతులు మొదలైన విషయాలపైన మీకున్న అపోహలను, అనుమానాలను తొలగిస్తూ, ఒక అవగాహనా సమ్మేళనం ఉంటుంది. దీనిని మా మార్గంలోకి ఆహ్వానించే 'ఫౌండేషన్ మీటింగ్' గా అనుకోవచ్చు.

ఈ రిట్రీట్ కు హాజరైనవారు, ఇతర సీనియర్ మెంబర్స్ తో, మాతో, ఒకరోజు పాటు ఆశ్రమ వాతావరణంలో ఉండి, డైరెక్ట్ గా మాతో మాట్లాడి, మీ మీ సందేహాలను తీర్చుకోగలుగుతారు. సీనియర్ మెంబర్స్ తో కలసి ఇకనుంచి రెగ్యులర్ గా జరిగే రిట్రీట్లకు కూడా హాజరయ్యే అవకాశాన్ని పొందుతారు.

ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నవారు, మిగతా వివరాలకోసం 98493-89249 అనే మొబైల్ లో పంచవటి ఫౌండేషన్ సెక్రటరీ శ్రీరామమూర్తిని సంప్రదించండి.

ఆహ్వాన వీడియోను ఇక్కడ చూడండి.

https://youtu.be/AdBLdPwq9Jc?si=Bg1tBqqfbYFSBId0

1, జనవరి 2024, సోమవారం

ఆనందపు జాతర

 



పాత జీవితానికి పాతర
క్రొత్త జీవితానికి లేచిన తెర 
ఊడిపోయిన తలవాకిలి మర
ఇకపై ఆనందపు జాతర