నిన్న పంకజ్ ఉదాస్ చనిపోయాడు. ఈయన 72 ఏళ్ళు బ్రతికాడు. కొద్ది నెలలుగా పాంక్రియాస్ కేన్సర్ తో బాధపడుతున్నాడు.
ఘజల్స్ పాడటంలో ఈయనదొక ప్రత్యేకశైలి. ఈయన తండ్రిగారు, ఇద్దరు అన్నలు ఆందరూ గాయకులే. వీరిది గుజరాత్ లోని రాజకోట్ దగ్గరలో ఒక జమీందారీ కుటుంబం. ఫరీదా అనే పార్శీ వనితను ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఈయన మే 17, 1954 న గుజరాత్ లో పుట్టాడు. ఈయన జనన, మరణ జాతకాలను ప్రక్కన చూడవచ్చు.
ఈయన గాయకుడే గాక, తబలా, వయోలిన్, పియానో, గిటార్ లను వాయించడంలో ప్రావీణ్యం ఉన్న బహుముఖ కళాకారుడు.
ఈయన పౌర్ణమినాడు పుట్టాడు. రాహుకేతువులు నీచ స్థితులలో ఉన్నారు. వేరే కులం, వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వివాహజీవితం బాగానే నడిచింది.
ఈ రెండు చార్ట్ ల పరిశీలన కొన్ని జ్యోతిష్య రహస్యాలను తెలియజేస్తుంది.
ఈయన వివాహజీవితం, కెరీర్, చివరకు పాంక్రియాస్ కేన్సర్ ఇవన్నీ ఈ చార్ట్ లు స్పష్టంగా చూపిస్తున్నాయి.