జూన్ 21 2024 న వేసవి అయనాంతపు రోజు. ఆ రోజున ప్రపంచమంతా యోగదినోత్సవాన్ని జరుపుకుంది. పంచవటి సాధనామార్గాన్ని అనుసరించేవారందరూ, ఆనాడు మా శైలిలో యోగవ్యాయామాన్ని చేసి ఈ పర్వదినాన్ని జరుపుకున్నారు.
మాకిది ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే చేసే మొక్కుబడి తంతు కాదు. ఇది మా రోజువారీ దినచర్యలో భాగం.
యోగసాధనలో ఆసనాలు, ప్రాణాయామాలు మొదటిమెట్లు మాత్రమే. కనీసం వీటి విలువనైనా ప్రపంచం నేడు గుర్తిస్తోంది. రోగాలకు భయపడి కొందరైనా యోగాన్ని చేస్తున్నారు. కొంతలోకొంత నయం.
మన ప్రధానమంత్రి మోదీగారు మన దేశానికి చేసిన గొప్ప మేళ్లలో ఇదీ ఒకటి. మనం మర్చిపోతున్న మన విజ్ఞానాన్ని మనకు, ప్రపంచానికి గుర్తుచేసిన ఈ మహానుభావుడికి దేశం మొత్తం ఋణపడి ఉంది. కానీ ఆయనకు మనం ఓట్లు వెయ్యం. మెజారిటీ ఇవ్వం. మనకు మేలు చేసేవాడు మనకు అక్కర్లేదు. మనల్ని నాశనం చేసేవాళ్ళే మనకు కావాలి. వాళ్లనే గెలిపించుకుంటాం. నాశనమౌతూనే ఉంటాం. ఇది మెజారిటీ ఇండియన్స్ పరిస్థితి.
అదలా ఉంచితే, పంచవటి సభ్యులందరూ ఎవరి ఇళ్లలో వారు చేస్తున్న యోగసాధనా కొలేజ్ ను ఇక్కడ చూడవచ్చు.