నిర్దిష్టమైన ప్లానింగ్ తరువాత ఆపరేషన్ సిందూర్ జరిగింది.
ఆలస్యమైందని కొంతమంది ఆక్రోశించారు. కానీ, ఇటువంటి చర్యలకు ముందు చాలా ప్లానింగ్ అవసరమౌతుంది. దౌత్యపరంగా ముందు పాకిస్తాన్ ను దిగ్బంధం చేయాలి. అందుకే ఈ ఆలస్యం. నిజానికి ఇది ఆలస్యం కాదు, అవసరం.
ఉత్తరభారతంలో, సిందూరమంటే పాపటి కుంకుమ. పెళ్ళైన ఆడవాళ్లు ధరిస్తారు. మొన్న జరిగిన పహల్ గావ్ దాడిలో ఎంతోమంది సిందూరాలు చెరిగిపోయాయి. అందుకే ఈ పేరును పెట్టారులాగుంది. సరైన పేరు !
విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు ఇచ్చిన ప్రెస్ మీట్ కూడా చాలా బాగుంది. ఇద్దరు మహిళలు రక్షణదళాల ఆఫీసర్స్. విక్రమ్ మిశ్రీ యేమో కాశ్మీర్ పండితుల వంశానికి చెందినవాడు. ఆడవాళ్లకు కాశ్మీర్ గడ్డపైన జరిగిన అన్యాయానికి ప్రతీకారచర్యగా ఈ ముగ్గురితో ప్రెస్ మీట్ పెట్టించడం పాకిస్తాన్ ను చెప్పుతో కొట్టినట్లుగా ఉంది.
అంతేకాదు. షరియా అమలులో ఉన్న పాకిస్తాన్ వంటి ఉగ్రవాద ఇస్లామిక్ దేశాలలో ఆడవాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు. బురఖా తీసి కాలేజీకి వెళ్లే ధైర్యం ఎవరికీ లేదు. ఆడపిల్లలకు ప్రాధమిక స్కూల్ కూడా అందుబాటులో ఉండదు. అలాంటిది మనదేశంలో ముస్లిం మహిళలు ఎంతగా ఎదగగలరు అనడానికి కల్నల్ సోఫియా ఖురేషి ఒక ఋజువు. 'ఇండియాలో ముస్లిములకు భద్రత లేదు' అని వాదించే కుహనా వాదులు ఈమెను చూచి బుద్ధితెచ్చుకోవాలి.
మొన్న వాఘా బార్డర్ దగ్గర పాకిస్తాన్ కు పంపించబడుతున్న పాక్ పౌరులైన ఆడవాళ్ళు గోడుగోడున ఏడుస్తున్నారు. ఎందుకు? ఇండియాలో ముస్లిములకు రక్షణ లేదుకదా? మరి మీ దేశమైన పాకిస్తాన్ కు వెళ్ళడానికి అంత ఏడుపెందుకు? ఇవన్నీ దొంగనాటకాలు కావా?
అదలా ఉంటే, పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ తీవ్రవాదుల శిబిరాలున్నాయో మన ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా సరిగ్గా కనిపెట్టి వాటిని బ్లాస్ట్ చేశాయి. మంచిదే. కానీ మన దేశంలోనే ఉన్న అంతర్గత శత్రువులను కూడా అదేపని చేస్తే బాగుంటుంది. మొన్న కాశ్మీరులో జరిగింది ఏమిటి? యాపిల్ అమ్ముకునేవాడినుంచి, గుర్రాలు నడుపుకుంటూ బ్రతికేవాడివరకూ అందరూ పాకిస్తాన్ కు (OGW) ఓవర్ గ్రౌండ్ వర్కర్సే. అసలైన ప్రమాదం వీళ్ళతో ఉన్నది.
మనదేశంలో పాకిస్తానీయులు బంగ్లాదేశీయులు లక్షల్లో కాదు. కోట్లల్లో ఉన్నారని ఒక అంచనా. ముందు వీళ్ళను ఏరిపారేసే పనిని ప్రభుత్వం చేపట్టాలి. వీరెవరికీ దేశభక్తి ఉండదు. ఏ దేశం తిండి తింటున్నారో ఆ దేశానికే వెన్నుపోటు పొడిచే ఇలాంటి విశ్వాసం లేనివాళ్లను ముందుగా గుర్తించి వారి పని పట్టాలి. అప్పుడే ముందుముందు దేశానికి, దేశప్రజలకు రక్షణ ఉంటుంది.
ఆపరేషన్ సిందూర్ తో వ్యవహారం అయిపోదు. ఇప్పుడే మొదలైంది. టర్కీ, చైనాల సహాయంతో పాకిస్తాన్ తప్పకుండా తిరుగుదాడి చేస్తుంది. ఈ యుద్ధంలో మన దేశం గెలవాలని ప్రార్ధిద్దాం.
మోదీగారి ప్రభుత్వాన్ని నూటికి సూరు శాతం బలపరుద్దాం. అప్పుడే ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుంది.